Gunde Ninda Gudi Gantalu Today Episode: కూలనున్న రోహిణి అబద్ధాల గోడ- వణికిపోయిన విద్య- కామాక్షి నగలపై దొంగల జంట కన్ను
Gunde Ninda Gudi Gantalu Serial July 31st Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 31వ ఎపిసోడ్‌లో రోహిణి తను ఉన్న పెళ్లి మండపం పేరు చెప్పి సుందరికి మేకప్ వేసేందుకు వెళ్తుంది. మాణిక్యం ఉన్నది అదే మండపం అని తెలిసి విద్య వణికిపోతుంది. పోలీసు తరమడంతో పెళ్లిలోకి దొంగల జంట వస్తుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సుందరి పెళ్లిలో మాణిక్యం గురించి అంతా మాట్లాడుకుంటారు. రెండు వైపుల నుంచి ఆయనే పెద్ద, అన్ని చూసుకుంటున్నారు అని రంగా అంటాడు. అందరం కలిసి గ్రూప్ ఫొటో దిగుదామని రవి అంటాడు.

కూతుర్లలాంటి వాళ్లం అన్నాడు
దాంతో అంతా కలిసి దిగుతారు. వాళ్ల వెనుకాలే మటన్ కొట్టు మాణిక్యం వస్తాడు. రోహిణికి విద్య కాల్ చేస్తుంది. ఎన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయవేంటని విద్య అడిగితే.. మాణిక్యం పదే పదే కాల్ చేస్తున్నాడు. ఎందుకు లిఫ్ట్ చేయడం అని సైలెంట్‌లో పెట్టానని రోహిణి చెబుతుంది. కచ్చితంగా రమ్మంటున్నాడు పాపం. మనం కూతుర్లలాంటి వాళ్లం పదే పదే రమ్మంటున్నాడే. నేను వెళ్లనా అని విద్య అంటుంది.
వద్దని, కొత్త సమస్యలు వస్తాయని రోహిణి అంటుంది. సరే నువ్వు వెళ్లిన కల్యాణ మండపం ఏంటీ అని విద్య అడుగుతుంది. అదేనే మధుర కల్యాణ మండపం అని రోహిణి చెబుతుంది. అదెక్కడ ఉంది అని విద్య అనుకుంటుంది. ఇంతలో రోహిణిని మేకప్ వేయాలని ఒకరు వచ్చి అడగడంతో కాల్ కట్ చేసి వెళ్తుంది. విద్యకు డౌట్ వచ్చి మాణిక్యం ఇచ్చిన పెళ్లి కార్డ్ చూస్తుంది.
అందులో కూడా మధుర కల్యాణ మండపం అని ఉంటుంది. రోహిణి వెళ్లింది, మాణిక్యం చెప్పింది రెండు ఒక్కటేనా. దేవుడా అయిపోయింది. కొంపలు మునిగిపోతాయి అని రోహిణికి కాల్ చేస్తుంది విద్య. మరోవైపు నగలు వేసుకుని కామాక్షి మురిసిపోతుంది. ఇంతలో రోహిణి వచ్చి సుందరికి మేకప్ వేస్తానంటుంది. ప్రభావతి, కోడళ్లు వస్తారు.
మీనాకు అవమానం
పెళ్లి కూతురుకంటే ఎక్కువ రెడీ అవుతున్నావని కామాక్షిని ప్రభావతి అంటుంది. పెళ్లి కూతురు రెడీ అవ్వకపోయిన అందరి కళ్లు తనపైనే ఉంటుంది. నన్ను ఎవరు చేస్తారు. మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ లేవు. ఎప్పటినుంచో ఇలా రెడీ అవ్వాలనేది కోరిక అని కామాక్షి అంటుంది. నగలు పెట్టుకున్నట్లు ఉండాలి, దిగేసుకున్నట్లు కాదు పిన్ని అని మీనా అంటుంది.
నీకు ఎలాగు లేవు, ఉన్నోళ్లయినా వేసుకోవద్దా అని మీనాను అవమానిస్తుంది అత్త ప్రభావతి. సుందరికి రోహిణి మేకప్ స్టార్ట్ చేస్తుంది. పెళ్లి కూతురుకు మాణిక్యం కాఫీ తీసుకెళ్తుంటాడు. డోర్ కొడతాడు. వేరే అమ్మాయి తలుపు తీస్తుంది. ఆమెకు మేకమామ కాఫీ ఇచ్చి వెళ్లిపోతాడు. ఇన్ని నగలు వేసుకుంటే దొంగలతో ప్రాబ్లమ్ కదు అని శ్రుతి అంటుంది.
అవును బ్యాగ్‌లు కూడా ఎత్తుకెళ్తుంటారు అని ఇన్‌డైరెక్ట్‌గా మీనా తమ్ముడిని అంటుంది ప్రభావతి. దాంతో అత్తపై అరుస్తుంది శ్రుతి. విషయం ఎక్కడికో వెళ్తుంది. నా నుంచి ఎవరు నగలు కొట్టేయలేరులే. ఇక్కడ ఉన్నది అంత మనవాళ్లేగా అని కామాక్షి అంటుంది. మరోవైపు ఓ జంటను పోలీసు తరుముతాడు. వాళ్లు దొంగతన చేసి పారిపోతుంటారు.
సుందరి పెళ్లిలోకి దొంగ జంట
పక్కనే ఉన్న సుందరి పెళ్లిలోకి ఆ దొంగ జంట వెళ్తుంది. ఇవాళ ఇక్కడే తలదాచుకుందామని భర్త అంటే.. మరి బస్టాండ్‌లో ఇంకా చాలా మంది దగ్గర దొంగతనం చేద్దామనుకున్నాం కదా అని భార్య అంటుంది. అక్కడ అవకాశం పోతే మరో అవకాశం ఉంటుందే అని భర్త అంటాడు. ఆ దొంగ జంట కంటికి కామాక్షి నిండు నగలతో కనిపిస్తుంది.
ఎవరండి ఈవిడ నన్ను దోచుకోండి దోచుకోండి అన్నట్లు ఉందని భార్య అంటుంది. మనం ఇవాళ ఇక్కడ పని మొదలుపెట్టాలి. ఇక్కడ ఎవరినో పరిచయం పెంచుకుని కలిసిపోవాలని అనుకుంటారు. కామాక్షిని పలకరిస్తారు. పెళ్లి తాలూకు వాళ్లు అంటుంది. నేను పెళ్లి కూతురు పెద్దమ్మని మీరెవరు అని డౌట్ పడుతుంది కామాక్షి. ఇంతలో ఒకరు కామాక్షిని పిలుస్తారు.
ఈవిడ పేరు కామాక్షినా అని భార్య అనుకుంటుంది. అదేంటీ కామాక్షి గుర్తుపట్టలేదా. నేను పద్మావతిని, ఈయన మీ పురుషోత్తం అన్నయ్య అని పరిచయం చేసుకుంటారు దొంగలు. మీ పెళ్లికి వచ్చాం. చాలా ఏళ్లు అయింది. మేము దుబాయ్‌లో ఉంటాం అని వాళ్లు అంటారు. కామాక్షిని నగలు, చీరలు బాగున్నాయని, నీకోసమే అవి డిజైన్ చేసినట్లున్నారు అని పొగుడుతారు.
కామాక్షిపై పొగడ్తలు
నువ్వే పెళ్లికూతురులా ఉన్నావ్. పెళ్లికొడుకు కచ్చితంగా కన్‌ఫ్యూజ్ అవుతాడు అని వాళ్లు మోసేస్తారు. దాంతో కామాక్షి పడిపోతుంది. టిఫిన్స్ తినమని వెళ్తుంది. వర్కౌట్ అయిందని ఆ దొంగ జంట అనుకుంటుంది. రంగాను ఇంకా పనిలేమైనా ఉంటే చెప్పండి అని సత్యం ఫ్యామిలీ అంటుంది. ముందు టిఫిన్ చేయమని రంగా అంటాడు.
సరేనని సత్యం, బాలు, రవి వెళ్తారు. అప్పడికే మనోజ్ టిఫిన్ తింటుంటాడు. వాడి కడుపు నిండితే చాలు ఎవరి గురించి ఆలోచించండు అని సత్యం అంటాడు. మనోజ్ దగ్గరికి వెళ్లి ఏంట్రా ఈ తినడం అని సత్యం అంటాడు. అన్ని చాలా బాగున్నాయని, మీరు తినండి అని తన తిండి గోల చెబుతాడు మనోజ్. బాలు, రవి సెటైర్లు వేస్తారు.
నీకు తిండి కనిపిస్తే చాలురా ఆకలేస్తుంది. నువ్వు ఒక వింత జీవిరా అని బాలు అంటాడు. బాలు, సత్యం, రవి వెళ్లి టిఫిన్స్ వేసుకుంటారు. మనోజ్ దగ్గర కూర్చుని తింటుంటారు. మాణిక్యం అందరితో మాట్లాడుతుంటాడు. సత్యం ఫ్యామిలీ దగ్గరికి వెళ్లేటప్పటికి ఫోన్ రావడంతో వెళ్లిపోతాడు. మరోవైపు రోహిణికి విద్య కాల్ చేస్తూనే ఉంటుంది.
రోహిణిని కాపాడేందుకు విద్య ఆరాటం
దీన్ని ఎలా కాపాడాలో అర్థం కావట్లేదని విద్య తెగ వణికిపోతుంది. రోహిణి కాల్ లిఫ్ట్ చేయదు. ఇక నీ చావు నువ్వు చావు. ఎవరు చేయలేరు. పాపం ఇన్నాళ్లు అబద్ధాల గోడ కట్టుకుంటూ వచ్చింది. ఈరోజు ఆ గోడ కూలిపోతుందేమో. ఎంతకాదన్న నా ఫ్రెండ్ ఏదోటి చేసి కాపాడాలని మనోజ్‌కు కాల్ చేస్తుంది విద్య. తినేటప్పుడు ఈ గోల ఎందుకు అని మనోజ్ కట్ చేస్తాడు.
మళ్లీ విద్య కాల్ చేస్తే మనోజ్ లిఫ్ట్ చేస్తాడు. రోహిణికి ఫోన్ ఇవ్వమంటుంది విద్య. తనెక్కడో ఉంది. పెళ్లి కూతురుకు మేకప్ వేస్తున్నట్లుందని, శ్రుతి, మీనా అక్కడే ఉన్నారు వాళ్లకే చేయమని మనోజ్ అంటాడు. దాంతో మీనాకు విద్య కాల్ చేసి రోహిణికి పోన్ ఇవ్వమంటుంది. తను దూరంగా ఉన్నాను నేను కలిసినప్పుడు చెబుతానంటుంది మీనా.
పార్లర్ గురించి తను కలిసినప్పుడు నాకు కాల్ చేయమని, అర్జంట్ అని చెప్పండని విద్య అంటుంది. సరేనని మీనా అంటుంది. కామాక్షి చుట్టే దొంగ జంట తిరుగుతూనే ఉంటుంది. పెళ్లికూతురు గదిలోకి వెళ్తారు. వాళ్లు ఎవరని రంగా అడుగుతాడు. కామాక్షి చెబితే నాకు ఎవరు గుర్తు రావట్లేదని రంగా అంటాడు. ప్రభావతి మెడలో నెక్లెస్ చాలా రిచ్‌గా ఉందని పొగుడుతుంది పద్మావతి.
దొంగ జంటపై మీనా డౌట్
రోహిణి, శ్రుతి గురించి గొప్పగా చెబుతుంది ప్రభావతి. ఇంతలో మీనా వస్తుంది. మూడో కోడలు గురించి చెప్పుకునేంత హోదా ఉండాలిగా అని ప్రభావతి అంటుంది. మీనా గురించి తప్పుగా మాట్లాడకండని శ్రుతి అంటుంది. పిన్ని వీళ్లు ఎవరని మీనా అడిగితే దూరపు చుట్టం అని కామాక్షి చెబుతుంది. వీళ్లని ఎక్కడో చూసినట్లుందని మీనా అంటుంది.
లేదు మేము చాలా దూరం అని దొంగలు అంటారు. లేదు వీళ్లను పేపర్‌లో ఫొటో వచ్చినట్లుంది. ఎక్కడ చూశానో గుర్తు రావట్లేదు. వీళ్లతో జాగ్రత్తగా ఉండాలని మీనా డౌట్ పడుతుంది. సుందరితో ఉంటానని కామాక్షి చెప్పి అందరిని తినేందుకు పంపిస్తుంది. మరోవైపు మనోజ్‌కి ముఖేష్ కాల్ చేసి మీ ఊరు వచ్చానని, హోటల్‌కి వెళ్తున్నాని చెబుతాడు.
సరే ఇప్పుడే వచ్చి కలుస్తానని మనోజ్ కాల్ కట్ చేస్తాడు. అదే విషయం సత్యంకు చెబుతాడు. ఇక్కడ పెళ్లి పెట్టుకుని ఎక్కడికి వెళ్తావని సత్యం అంటాడు. ఆయన నాకోసం వెయిట్ చేస్తున్నారు. ఫీల్ అవుతారు అని మనోజ్ అంటాడు. మనోజ్ ఫోన్ నుంచి ముఖేష్‌కు కాల్ చేసి పెళ్లి గురించి చెబుతాడు బాలు.
పెళ్లికి ముంబై ముఖేష్
ఈ విషయం మనోజ్ చెప్పలేదు. పర్లేదు ఇంకెప్పుడైనా మీట్ అవుతాం అని ముఖేష్ అంటాడు. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ సర్. కానీ మీరు మా పెళ్లికి రండి. మీ మీటింగ్ తర్వాత పెట్టుకోండి. బాగా చూసుకుంటాం, ఇక్కడికి రండి అని బాలు అంటాడు. దాంతో ముఖేష్ సరేనంటాడు. పెళ్లికి వస్తాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


