Gunde Ninda Gudi Gantalu Today Episode: తల్లి ఇంట్లో మనోజ్‌కు అడ్డంగా దొరికిన రోహిణి- లవ్ టాటూతో ఏమార్చిన పార్లరమ్మా!
Gunde Ninda Gudi Gantalu Serial July 28th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 28వ ఎపిసోడ్‌లో రోహిణి పార్లర్‌లో ఉన్నానని అబద్ధం చెప్పిందని తెలియడంతో సుగుణ ఇంటికి వెళ్తాడు మనోజ్. అక్కడ రోహిణిని చూసి కోప్పడుతాడు. మరోవైపు బాలు దగ్గరికి డ్రైవింగ్ నేర్చుకునేందుకు చింతామణి వెళ్తుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు కోసం రాజేష్ ఇంటికి వస్తాడు. మీనా డ్రైవింగ్ స్కూల్ గురించి అడుగుతాడు రాజేష్. మీరు బోనీ చేశారుగా, చాలా బాగా నడుస్తుందని రాజేష్ అంటాడు. రాజేష్‌ను పొగుడుతుంటే బాలు కోపంగా ఉంటాడు.

టాటూ ఆర్టిస్ట్‌ను పిలిపించిన రోహిణి
ఆయన మొహం చూడండి ఎలా వాడిపోయిందని మీనా అంటుంది. మీనా, రాజేష్ ఇద్దరు నవ్వుతారు. పెద్ద పార్టీ నుంచి ఫోన్ వచ్చింది, డ్రైవింగ్ నేర్చుకోవాలట. ఎంత ఖర్చు అయిన సరే బాగా, త్వరగా డ్రైవింగ్ నేర్పించాలని అంటుంది అని రాజేష్ అంటాడు. బాగా అంటే ఓకే త్వరగా అంటే ఎలా నేర్పిస్తారు అని బాలు అంటాడు. మరోవైపు టాటూ ఆర్టిస్ట్‌ను రోహిణి సుగుణ ఇంటికి పిలిపిస్తుంది.
పెళ్లి అయినదానివి పచ్చబొట్టు అవసరమా అని సుగుణ అంటుంది. నా భర్త పేరే వేయించుకుంటున్నా అని రోహిణి చెబుతుంది. పర్మనెంటా, టెంపరరీ అని ఆర్టిస్ట్ అడిగితే.. పర్మనెంటే అని చెబుతుంది రోహిణి. ఇప్పుడు పర్మినెంట్ టాటూ అవసరమా అని విద్య అడుగుతుంది. లైఫ్‌లాంగ్ నా భర్త మనోజే కదా. తనపై ఉన్న ప్రేమను ఇలా చూపించి బర్త్ డే గిఫ్ట్‌గా ఇస్తాను అని రోహిణి అంటుంది.
తల్లి సుగుణ తన తప్పుల గురించి క్లాస్ పీకుతుంది. మనం చెబితే తప్పా నా గురించి ఎవరికి తెలుస్తుంది. అలా తెలిసే ఛాన్సే లేదు అని రోహిణి అంటుంది. రోహిణి టాటూ వేయించుకుంటుంది. మనోజ్ కాల్ చేస్తాడు. కానీ, కట్ చేస్తుంది. మళ్లీ మనోజ్ కాల్ చేస్తాడు. ఎక్కడ ఉన్నావని మనోజ్ అడిగితే.. పార్లర్‌లో ఉన్నా రోహిణి అంటుంది.
మనోజ్‌తో రోహిణి అబద్దం
భోజనానికి, మీనా నాకు వడ్డించదు.. నువ్వు రావా అని మనోజ్ అంటాడు. అదా సంగతి. మీనా వడ్డించదు కాబట్టే రమ్మంటున్నావ్. పార్లర్‌లో పొద్దున్నుంచి చాలా బిజీగా ఉన్నా. ఇప్పుడు దీనికోసం రాలేను. బద్ధకం వదిలేసి నువ్వే వడ్డించుకో మనోజ్ అని రోహిణి అంటుంది. ఇంతలో టాటూ నొప్పితో అరుస్తుంది. మనోజ్ అడిగితే.. ఏం లేదని కాల్ కట్ చేస్తుంది రోహిణి.
ఇంతలో మనోజ్‌కి బాలాజీ అనే వ్యక్తి కాల్ చేసి లాంగ్ షీట్ చెక్ చేస్తానన్నారు. ఎప్పటికప్పుడు రెడీగా ఉంచమన్నారు. రాసి ఉంచాను. మేడమ్ ఇంట్లో ఉన్నారా అని అడుగుతాడు. అదేం అంత అర్జంట్‌గా చూడాల్సిందేం కాదులే, మేడమ్ పార్లర్‌కి వెళ్లిందని మనోజ్ అంటాడు. పార్లర్‌కి తీసుకెళ్లి చూపిద్దామనుకుంటే అక్కడ లేరని బాలాజీ చెబుతాడు.
పొద్దున నాకు వినాయక్ నగర్‌లో ఓ ఇంట్లోకి వెళ్తూ కనిపించారు అని ఎగ్జాక్ట్ టైమ్, అడ్రస్ చెబుతాడు. రోహిణి నాకు అబద్ధం ఎందుకు చెప్పింది, పైగా చిరాకుగా ఉంది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మనోజ్ బయలుదేరుతాడు. మరోవైపు రాజేష్ చెప్పిన డ్రైవింగ్ నేర్చుకునే వ్యక్తి ఎవరో కాదు చింతామణి. బాలు గురించి చాలా గొప్పగా చెబుతాడు రాజేష్. అలా చింతామణికి రాజేష్ బాలు డ్రైవింగ్ స్కూల్ గురించి చెప్పి సాయం చేస్తాడు.
బాలుకు స్టూడెంట్‌గా చింతామణి
కారులో ఉన్న చింతామణిని చూసి బాలు షాక్ అవుతాడు. ఈ ఫ్రాడ్‌కి డ్రైవింగ్ నేర్పించాలా అని బాలు అనుకుని మీనాకు కాల్ చేసి బయటకు రమ్మంటాడు. మన డ్రైవింగ్ స్కూల్‌కు డ్రైవింగ్ నేర్చుకునేందుకు వచ్చిన ముఖ్యమైన కస్టమర్‌ని చూడు అని చింతామణిని చూపిస్తాడు బాలు. మీనా షాక్ అవుతుంది. చింతామణి దగ్గరికి బాలు, మీనా వెళ్తారు.
ఇది మీ ఇల్లా అని చింతామణి అంటే.. అవును, నీకు భరతనాట్యం నేర్పిస్తున్న గురువు గారి ఇల్లు కూడా ఇదే అని మీనా, నీకు పోటీ వస్తుందని పది లక్షలు మోసం చేయాలని చూశారుగా, ఆ పోటీ ఆవిడ ఇల్లు కూడా ఇదే అని బాలు అంటాడు. ఇప్పటికీ అత్త దగ్గరికి నాట్యానికి వెళ్తున్నారు అని మీనా అంటుంది. అలా వెళ్లిన ఏం చేయలేదు. మన దగ్గర వీడియో ఉందిగా అని బాలు అంటాడు.
నేనెప్పుడు మిమ్మల్ని శత్రువులా చూశాను. నేను నా బతుకు బతుకుంటే ఓర్వలేకపోతున్నావ్ అని మీనా అంటుంది. డ్రైవింగ్ నేర్చుకుని సంపాదిద్దామనుకుంటున్నారా అని బాలు అంటే.. మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారని చింతామణి అంటుంది. చింతామణికి నిలువెల్లా విషం ఉంటుందని తక్కువ అంచనా వేస్తామా, మీ బుద్ధి తెలుసుగా అని మీనా అంటుంది.
చింతామణికి అవమానం
పోయి పోయి మీ దగ్గరికే రావాలా అని చింతామణి అంటుంది. నా మీద కోపంతో నా భర్త దగ్గర డ్రైవింగ్ నేర్చుకోకపోవడం ఏంటీ అని మీనా అంటుంది. మీరు నాకు చేసినదానికి ఎక్కువ అనుభవిస్తారు అని చింతామణి వెళ్తుంటే.. కారు కీస్ తీసుకుని నా పర్మిషన్ లేకుండా వెళ్లలేవని మీనా అంటుంది. చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదే. ఇంకా నన్ను ఏదో చేస్తానని అంటున్నావ్. ఇప్పటికైనా మానుకో వెళ్లు అని అవమానించి పంపిస్తుంది మీనా.
అంతా చూస్తారు. కోపంగా చింతామణి వెళ్తుంది. మీనాను మోసం చేసింది ఈ మహాతల్లేనా అని రాజేష్ అంటే.. పొద్దున్నే భలే బేరం తీసుకొచ్చావురా బాబు అని బాలు అంటాడు. మరోవైపు మనోజ్ పేరు, పక్కన లవ్ సింబల్‌లో రోహిణి టాటూ వేయించుకుంటుంది. చాలా బాగా వచ్చిందని రోహిణి చెబుతుంది. టాటూ ఆర్టిస్ట్ వెళ్లిపోతాడు.
రోహిణి ఇంటికి మనోజ్ వెళ్తాడు. అప్పుడే రోహిణి, విద్య బయటకు వెళ్తుంటారు. మనోజ్ డోర్ కొట్టబోతుంటే రోహిణి తలుపు తీస్తుంది. సుగుణను విద్య వెనక్కి వెళ్లమంటుంది. రోహిణిని చూసి మనోజ్ షాక్ అవుతాడు. మనోజ్‌ను చూసి రోహిణి షాక్ అవుతుంది. తర్వాత తేరుకుని మనోజ్ ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది.
తల్లి ఇంట్లో దొరికిన రోహిణి
బాలాజీ ఇక్కడ ఉన్నావని చెప్పాడు. నువ్వు పార్లర్‌లో ఉన్నావని అన్నావ్. ఏది నిజమో కనుక్కుందామని వచ్చానని మనోజ్ అంటాడు. అంటే అనుమానించి వచ్చావా అని రోహిణి అంటే.. నిజం తెలుసుకుందామని వచ్చానని, అసలు ఈ ఇల్లు ఎవరిది అని అడుగుతాడు మనోజ్. నువ్వు అడగడానికి ఇదేం తప్పు చేయలేదు. కావాలంటే లోపలికి వచ్చి చెక్ చేసుకో అని విద్య అంటుంది.
మనోజ్ లోపలికి వస్తుంటే.. ఇంటికెళ్లాక చెబుతా పదా అని మనోజ్‌ను లాక్కెళ్తుంది రోహిణి. మనోజ్, రోహిణి కారులో వెళ్తారు. ఏదో ఒక రోజు ఇలా దొరికిపోవడం ఖాయం అని విద్యతో సుగుణ అంటుంది. ఇద్దరు ఇంటికెళ్తారు. ఇప్పుడు చెప్పమని మనోజ్ అడిగితే.. అది నా ఫ్రెండ్ ఇల్లు, తను టాటూ ఆర్టిస్ట్, టాటూ వేస్తుందని రోహిణి అంటుంది.
అయినా నాకు అబద్ధం చెప్పడం దేనికి అని మనోజ్ అంటే.. కావాలనే చెప్పలేదు. నీకు సర్‌ప్రైజ్ ఇద్దామని, టాటూ వేయించుకున్నాను అని రోహిణి అంటుంది. ఇప్పుడెందుకు వేయించుకున్నావ్ అని కోప్పడతాడు. ఎవరి టాటూ వేయించుకున్నావ్ అని ఒక్కొక్కరి పేరు చెబుతాడు మనోజ్. తర్వాత రోహిణి చేతి చూసి తన పేరును చూసి మనోజ్ చాలా ఎమోషనల్ అవుతాడు.
పర్మనెంట్ టాటూ చూపించిన రోహిణి
నేను ఇచ్చిన తాయిత్తు పోయిందని చాలా ఫీల్ అయ్యావ్. నేను ఇచ్చే గిఫ్ట్ ఎప్పటికి పోకూడదన్నావ్‌గా. ఇది ఎప్పటికీ పోదు. జీవితాంతం ఉంటుంది అని పర్మనెంట్ టాటూ గురించి చెబుతుంది రోహిణి. నా గుండె ఆగిపోయినా నీ పేరు నాతోనే ఉంటుందని రోహిణి అంటుంది. ఇలాంటివి మాట్లాడకని మనోజ్ చాలా ఎమోషనల్ అవుతాడు.
ఇది బాలు, మీనా ఇంట్లో అందరికి తెలియాలని బయటకు తీసుకొస్తాడు మనోజ్. ఇవాళ రోహిణి ఏం చేసిందో తెలుసా అని మనోజ్ అంటాడు. రోహిణికి నా మీద ఉన్న ఎనలేని ప్రేమ కోసం ఏం చేసిందో చూడండి అని టాటూ చూపిస్తాడు మనోజ్. మనోజ్ గొప్పగా చెబితే.. పిండి బాగా కలుపు అని ఇన్‌డైరెక్ట్‌గా అంటాడు సెటైర్లు వేస్తాడు.
మనోజ్, రోహిణి తమ ప్రేమ గురించి గొప్పగా చెప్పుకుంటే బాగా కలుపు అని బాలు అంటాడు. నిజమైన ప్రేమ సమయం, అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇలా పచ్చబొట్టు పొడిపించుకుంటే కాదని బాలు అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


