Gunde Ninda Gudi Gantalu Today Episode: స్వామిజీతో అంజనం వేయించిన మనోజ్- నీళ్లతో బాలు శాపం- అరుణ్‌తో పట్టుబడిన సుమతి!
Gunde Ninda Gudi Gantalu Serial July 30th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 30వ ఎపిసోడ్‌లో సుమతిని ఇంటి దగ్గర అరుణ్ డ్రాప్ చేసి మాట్లాడుతుంటాడు. అది చూసి బాలు వెళ్తాడు. విల్లా విజయ్ కోసం స్వామిజీతో అంజనం వేయిస్తాడు మనోజ్. బాలు మరో శాపం పెడతాడు. సుందరి పెళ్లికి సత్యం వాళ్లు వెళ్తారు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విల్లా విజయ్ తప్పించుకోవడం గురించి మనోజ్, రోహిణి ఫీల్ అవుతారు. వాడు ఈ ఊరిలో ఎక్కడో ఉంటున్నాడు, పోలీసులు సరిగా వెతకడం లేదు. మనమే సరిగ్గా వెతకాలి. ఒకవేళ బాలుకు కనిపించి వాడు పట్టుకుంటే, వాడి వల్లే డబ్బు వచ్చిందంటాడు. ఆ క్రెడిట్ వాడికి పోకూడదు అని మనోజ్ అంటాడు.

మనోజ్ ఐడియా
ముందుగా డబ్బులు వాడికి వెళ్తే వాడు ఇస్తాడని గ్యారెంటీ లేదు. వాడు దొరకాలంటే నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది. మనం వెళ్లి స్వామిజీని కలుద్దాం. అతను ఏదో దారి చూపిస్తాడని మనోజ్ అంటాడు. అదంతా అవసరమా అని ముందుగా వాదించిన రోహిణి.. మనోజ్ చెప్పడంతో ఒప్పుకుంటుంది. మరోవైపు సుమతి బస్ కోసం ఎదురుచూస్తుంటుంది.
అక్కడికే ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ వస్తాడు. సుమతిని చూసి కాల్ చేస్తాడు. కాల్ చేసి డ్రాప్ చేస్తాను రండి అని పిలుస్తాడు అరుణ్. సుమతి వద్దంటుంది. సరే నమ్మకం లేకుంటే వద్దులెండి అని అరుణ్ వెళ్లిపోతాడు. తర్వాత మళ్లీ సుమతి దగ్గరికే రౌండ్ కొడతాడు అరుణ్. బైక్ ఆపుతాడు అరుణ్. సుమతి వెళ్లి కూర్చుంటుంది. మరోవైపు బాలును మురళి కలుస్తాడు.
నీ ప్రేమ ఎక్కడి వరకు వచ్చిందని బాలు అడిగితే.. ఎంత అడిగినా కొంచెం వెయిట్ చేయమంటుంది. కానీ, ప్రేమిస్తున్నట్లు చెప్పట్లేదని మురళి అంటాడు. నీ ప్రేమ చివరి స్టేజ్ వరకు వచ్చింది. నేను ఓ ఐడియా చెబుతాను అని బాలు చెబుతాడు. ఐడియా సూపర్ ఉందని థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతాడు మురళి. బాలు ఉన్నచోటే సుమతిని అరుణ్ డ్రాప్ చేస్తాడు.
పుట్టినరోజున చెప్పండి
పెళ్లి ప్రపోజ్ గురించి ఏం చేశారని అరుణ్ అడిగితే.. నా తమ్ముడు, తల్లి గురించి ఆలోచిస్తున్నా. అందుకే నిర్ణయం తీసుకోలేకపోతున్నా అని సుమతి చెబుతుంది. వచ్చే శనివారం నా పుట్టినరోజు ఆరోజు మీ నిర్ణయం చెప్పండి. అదే పెద్ద గిఫ్ట్ అని అరుణ్ అంటాడు. ఇంతలో సుమతిని బాలు చూస్తాడు. బాలు చూసి షాక్ అవుతాడు. సుమతిని పిలుస్తాడు.
దాంతో అరుణ్‌ను సుమతి వెళ్లమంటుంది. అరుణ్ వెళ్తాడు. బాలు వెళ్లి సుమతితో మాట్లాడుతాడు. అతను మా హాస్పిటల్‌లో పని చేస్తున్నాడు. కనిపిస్తే మాట్లాడుతున్నాను అని సుమతి అబద్ధం చెబుతుంది. కనిపించాడా లేదా వెంటపడుతున్నాడా అని బాలు అంటాడు. అయ్యే లేదు బావ అని కవర్ చేస్తుంది సుమతి. సరేనని బాలు వెళ్తాడు. అలా బాలును ఏమారుస్తుంది సుమతి.
మరోవైపు ఇంటికి స్వామిజీని మనోజ్ తీసుకొస్తాడు. విల్లా విజయ్ ఎక్కడున్నాడో అంజనం వేస్తాను అని స్వామిజీ అంటాడు. బాలు సెటైర్లు వేస్తాడు. స్వామిజీకి కోపం తెప్పిస్తాడు బాలు. తర్వాత ఓ ముగ్గు వేసి.. తూర్పు దిక్కు మనోజ్, రోహిణిని కూర్చోమంటాడు. గవ్వలు వేస్తాడు స్వామిజీ. ఓ తమలపాకులో అంజనం రాసి ఏం కావాలో కోరుకోమంటాడు పంతులు.
విల్లా విజయ్ కోసం అంజనం
దాంతో మనోజ్ విల్లా విజయ్ ఎక్కడున్నాడో కోరుకుని అంజనంలో చూస్తాడు. కానీ, ఏం కనిపించట్లేదని మనోజ్ అంటాడు. మర్చిపోయాను రూ. 3 వేలు పెడితేనే ఫలితం ఉంటుందని స్వామిజీ అంటాడు. దాంతో మనోజ్ పాకెట్‌లో ఉన్న డబ్బు తీసి స్వామిజీకి కోపం ఇస్తుంది రోహిణి. మనోజ్ అంజనంలో చూసి కనిపించట్లేదంటాడు.
ఆ దొంగ డబ్బులన్నీ ఖర్చు పెట్టినట్లున్నాడు అని పంతులు అంటాడు. ఆ ఆకు తీసుకుని శ్రుతి చూస్తుంది. నాకు కనిపిస్తుంది.. అని శ్రుతి చెబితే అంతా ఆశ్చర్యపోతారు. ఏం కనిపిస్తుందని అడిగితే.. ఆకుపై వేసిన నల్లటి ఆకారం పెద్దగా కనిపిస్తుందని శ్రుతి పంచ్ ఇస్తుంది. దాంతో అంతా నవ్వుతారు. పంతులు కోపంగా లేచి అందరూ నన్ను అపహాస్యం చేస్తున్నారు, జోకులు వేస్తున్నారు. నమ్మకం లేని చోట మంత్రం పనిచేయదని పంతులు అంటాడు.
మా మూడు వేలు ఇచ్చి వెళ్లు అని బాలు అంటాడు. దాంతో చేసేది లేక పంతులు మూడు వేలు ఇచ్చి పంతులు వెళ్లిపోతాడు. అందరికి శాస్త్రం తెలియాలని లేదు. ఎరిని పడితే వారిని నమ్మకురా అని మనోజ్‌కు సలహా ఇస్తాడు సత్యం. తర్వాత మీనా అందరికి కాఫీ ఇస్తుంది. విల్లా విజయ్ ఎక్కడో కనిపించాడో అక్కడ వెతకాల్సింది పోయి అంజనం వేయడమేంటని బాలు అంటాడు.
డబ్బంతా హారతి కర్పూరం
సీసీ కెమెరాలు ఉంటాయిగా అని శ్రుతి అంటుంది. ఈపాటికి ఆ భార్యాభర్తలు ఆ డబ్బంతా హారతి కర్పూరం చేసే ఉంటారు అని మీనా అంటుంది. వాడు దొరికినా డబ్బు లేదంటే జైలుకు వెళ్లి ఏం లాభం. డబ్బు రికవరీ కావాలిగా అని సత్యం అంటాడు. నాకు డబ్బు దొరికితే వీడు కుళ్లుకుంటాడు. అందుకే అంజనం వేసేంతసేపు వీడు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు అని బాలును నిందిస్తాడు మనోజ్.
తాయిత్తులను, స్వామిజీలను నమ్మడం మానేస్తే బాగుపడతావ్ అని బాలు అంటాడు. మా సంగతి మేము చూసుకుంటాం అని రోహిణి అంటే.. ఇలాంటి భార్యల మాటలు వినే అప్పులపాలు అవుతున్నాడు. అదే డబ్బు మాకిస్తే అందరం బాగుపడేవాళ్లం అని బాలు అంటాడు. ఇలా కుళ్లుకోవడం మానకుంటే ఎప్పటికీ బాగుపడవని బాలును అంటాడు మనోజ్.
చాలు ఆపు.. నా గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడే నీ నోరు.. లేదు.. నీ జీవితం అల్లకల్లోలం మారుగా అని నీళ్లు చల్లి శాపం పెడతాడు బాలు. దాంతో భయంతో మనోజ్, రోహిణి వెళ్తారు. ఏంట్రా అంత మాట అన్నావని సత్యం అంటే.. నా కడుపులో నుంచి కాలి వచ్చింది అని బాలు వెళ్లిపోతాడు. మరోవైపు సుందరి పెళ్లిలే పెళ్లికొడుకు మేనమామ మేకమామ, మటన్ కొట్టు మాణిక్యం హడావిడి చేస్తుంటాడు.
సుందరి పెళ్లిలో సత్యం కుటుంబం
రంగా వచ్చి ఏర్పాట్లు చాలా బాగున్నాయని చెబుతాడు. మగ పెళ్లి వాళ్లు అయిండి అన్నీ బాగా చూసుకుంటున్నారని మాణిక్యంను మెచ్చుకుంటాడు రంగా. మీ వాళ్లను రిసీవ్ చేసుకోండని మాణిక్యం వెళ్లిపోతాడు. ఇంతలో సత్యం వాళ్లు వస్తారు. పరిచయం చేద్దామని మాణిక్యంను రంగా పిలిస్తే వినపడదు. మేకమామ వెళ్లిపోతాడు. సత్యం వాళ్లు వస్తే రంగా రిసీవ్ చేసుకుంటాడు.
రోహిణి మేకమామ గురించి రంగాతో చెబుతాడు బాలు. కామాక్షి గురించి అడిగితే.. ఉదయం నుంచి రెడీ అవుతుందని రంగా చెబుతాడు. మా ఫ్రెండ్ వాళ్లు వచ్చారు. డెకరేషన్, మేకప్ వాడి కోడళ్లు చూసుకుంటారని మాణిక్యంతో రంగా చెప్పి వెళ్తాడు. మేకప్ అంటే గుర్తుకు వచ్చింది రోహిణి వస్తుందో లేదో అని రోహిణికి కాల్ చేస్తాడు మాణిక్యం.
కానీ, రోహిణి కాల్ కట్ చేస్తుంది. విద్యకు కాల్ చేస్తాడు మాణిక్యం. పెళ్లికి రాలేదేంటని అడిగితే.. సారీ మర్చిపోయాను అని విద్య చెబుతుంది. ఇప్పుడు రమ్మంటాడు మాణిక్యం. రోహిణి చెప్పిన విషయం గుర్తుతెచ్చుకుని వేరే వర్క్‌లో బిజీగా ఉన్నాను. రాలేను అని విద్య అంటుంది. రోహిణినికి అయినా చెప్పమ్మా. మధుర కల్యాణ మండపం దగ్గరే దూరం కూడా కాదు అని మాణిక్యం అంటాడు.
రోహిణి నాటకం బయటకు
సరేనని విద్య అంటుంది. సత్యం కుటుంబానికి సుందరి తండ్రిని పరిచయం చేస్తాడు రంగా. సుందరిని పెళ్లి చేసుకునే అబ్బాయి తల్లిదండ్రులను పరిచయం చేస్తాడు. వాళ్లు బాలు, మీనా గురించి గొప్పగా చెబుతారు. మాణిక్యం గురించి రంగా గొప్పగా చెబుతాడు. దాంతో రోహిణి మలేషియా మామ నాటకం బయటపడి ముగింపునకు వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


