Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనాపై అత్త ప్రేమ సినిమా- మేక మామను చూసిన మీనా- విద్యను రాకుండా ఆపిన బాలు ఐడియా!
Gunde Ninda Gudi Gantalu Serial August 3rd Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 3వ తేది ఎపిసోడ్‌లో రోహిణి, శ్రుతితో ప్రేమగా ఉన్న ప్రభావతి మీనాపై అరుస్తుంది. ఈరోజంతా మీనాపై ప్రభావతి ప్రేమగా ఉండేలా బాలు ముంబై ముఖేష్ ద్వారా ప్లాన్ చేస్తాడు బాలు. పెళ్లికి విద్య వస్తుంటే బాలు ఐడియా ఆపుతుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ముంబై ముఖేష్‌ను సుందరి పెళ్లికి ఆహ్వానిస్తాడు బాలు. మరోవైపు తమకు ఆకలేయట్లేదని, మీరు వెళ్లి టిఫిన్ చేయండని ప్రభావతి వాళ్లను దొంగ జంట పద్మావతి, పురుషోత్తం పంపిస్తారు.

ప్రభావతి అందంపై పొగడ్తలు
రోహిణికి ఏదో చెప్పాలనుకున్న అనే మీనా గుర్తు చేసుకుంటుంది. ప్రభావతి చీరలో చాలా బాగుందని, అందరికంటే ఎక్కువ మెరిసిపోతుందని శ్రుతి మెచ్చుకుంటుంది. రోహిణితో ఫొటో దిగుతుంది ప్రభావతి. ప్రభావతి అందాన్ని రోహిణి పొగుడుతుంది. శ్రుతి, ప్రభావతి, రోహిణి సెల్ఫీ దిగుతారు. ఇంతలో మీనా వస్తే.. నీ డెకరేషన్ చాలా బాగుందని అంటుంది శ్రుతి.
మాతో సెల్ఫీ దిగుదువుదా అని శ్రుతి అంటే.. ఇప్పుడు నాకు ఫొటోలు దిగాలని లేదని రోహిణి, శ్రుతిని తీసుకెళ్లిపోతుంది. దాంతో మీనా బాధపడుతుంది. బాలు వచ్చి ఏమైందని అడిగితే.. జరిగింది మీనా చెప్పుకుంటూ బాధపడుతుంది. అత్త ప్రేమ కోసం ఆరాటపడుతున్నట్లు చెబుతుంది. అత్త ఒక్కరోజైన నా మీద ప్రేమ చూపిస్తే బాగుంటుందనిపిస్తుందని మీనా అంటుంది.
అయితే, ఇవాళ రోజంతా మా అమ్మ నీతో ప్రేమగా ఉండేలా చేస్తానని బాలు అంటాడు. అది జరగదని మీనా వెళ్లిపోతుంది. ఇంతలో ముంబై ముఖేష్ వస్తాడు. బాలు రిసీవ్ చేసుకుంటాడు. డెకరేషన్ గురించి ముంబై ముఖేష్ అడిగితే.. మీనా అని, తన సక్సెస్ గురించి చెబుతాడు బాలు. మనోజ్ వచ్చి పలకరిస్తాడు. ప్రభావతితో ఒకావిడ మీ కోడలు చాలా బాగా చేసిందని పొగుడుతుంది.
ముంబై ముఖేష్‌కు డౌట్
రోహిణిని పిలిచి నా కోడలు మేకప్ వేస్తే అలాగే ఉంటుందని ప్రభావతి అంటుంది. నేను చెప్పింది ఈ డెకరేషన్ చేసిన మీనా గురించి. మీరు చెబితే మాకు కొంచెం తక్కువకు డెకరేషన్ చేస్తుందని ఆవిడ అడుగుతుంది. దాంతో నిరాశపడిన ప్రభావతి అది వెళ్లి దాన్నే అడుక్కోండి. పో అని దురుసుగా అంటుంది. అదంతా ముంబై ముఖేష్ చూస్తాడు.
ఆప్యాయతలు, అనురాగాలు అంటే ఇదేనా. మీ వైఫ్ అంటే మీ అమ్మగారికి ఇష్టంలేనట్టుంది. ఎందుకు, ఏమైంది అని ముంబై ముఖేష్ అడుగుతాడు. అదేం లేదు. మా ఆవిడ అంటే ఎనలేని ప్రేమ అని బాలు అంటాడు. నేను మీది గొప్ప ఫ్యామిలీ అనుకుని మీకు బిజినెస్ ఇచ్చాను అని ముఖేష్ అంటాడు. ఇలా అంటాడేంటని కంగారుపడిన మనోజ్ అదేం లేదు సర్, కోడళ్లని మా అమ్మ కూతుళ్లుగా చూస్తుందని అంటాడు.
ఉండండి ఒక్క నిమిషం అని మనోజ్ కంగారుగా తల్లి ప్రభావతి దగ్గరికి వెళ్తాడు. ముంబై ముఖేష్ వచ్చింది చెప్పి, మీనాను తక్కువ చేసింది విన్నాడు. తేడా జరిగితే డీలర్‌షిప్ క్యాన్సిల్ చేస్తాడు. నీకు మీనా అంటే చాలా ప్రేమ అని బాలుగాడు చెప్పాడు. అలాగే నటించు అని మనోజ్ అంటాడు. మరోవైపు రోహిణికి మీనా విషయం చెప్పిందా లేదా అని విద్య కంగారుపడుతుంది.
మీనాపై ప్రభావతి ప్రేమ గురించి
ముఖేష్‌ను ప్రభావతి కలుస్తుంది. మీనా అంటే పంచ ప్రాణాలు అని చెబుతుంది. అది విని సత్యం షాక్ అవుతాడు. మరి ఇందాక మీనా గురించి కసిరినట్లు మాట్లాడారు అని ముఖేష్ అడుగుతాడు. వాళ్లు అడిగారని తక్కువకు చేసి పెడితే లాస్ వస్తుందిగా అని కవర్ చేస్తుంది ప్రభావతి. తర్వాత రోహిణి, శ్రుతి వస్తే తమను తను ఎంత ప్రేమగా చూసుకుంటుందో చెప్పమంటుంది.
కన్నకూతురులా చూసుకుంటుందని రోహిణి చెబుతుంది. శ్రుతి డౌట్‌గా చూస్తే బాలు సైగ చేసి ముంబై ముఖేష్‌ను చూపిస్తాడు. దాంతో శ్రుతి కూడా అలాగే చెబుతుంది. ఇదే మాట మీనా కూడా చెబుతుందని బాలు మీనాను పిలుస్తాడు. మీనా మీరు చెప్పండి నిజంగానే మీ అత్త మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారా అని ముఖేష్ అడుగుతాడు.
నేను నిన్ను ఎంత బాగా చూసుకుంటానో చెప్పమ్మ అని ప్రభావతి అంటుంది. మా అమ్మ మీనా లేకుండా ఒక్క నిమిషం ఉండలేదు, 24 గంటలు మీనా అని కలవరిస్తూనే ఉంటుందని, ఆ ప్రేమ తట్టుకోలేక నాతో చెప్పుకుని ఎంత ఫీల్ అవుతుందో. కావాలంటే ఈరోజు చూడండి. మీనాతో ఎంత ప్రేమగా ఉంటుందో అని బాలు అంటాడు.
అత్త ప్రేమ సినిమా
సరేనని ముఖేష్ అంటాడు. అయితే, ఈ రోజంతా నాకు తప్పదా అని ప్రభావతి అనుకుంటుంది. అలా ముంబై ముఖేష్ ద్వారా మీనాతో ప్రభావతి ప్రేమగా ఉండేలా బాలు ప్లాన్ చేస్తాడు. ఏం జరుగుతుందిరా అని సత్యం అడిగితే.. అత్త ప్రేమ అనే సినిమా. చూసి తరించండి, మీ అభిమాన మండపంలో అని బాలు అంటాడు. కామాక్షి చుట్టు దొంగ జంట తిరుగుతుంటుంది.
కామాక్షి ఒకతనితో ఏర్పాట్ల గురించి మాట్లాడుతుంటే పద్మావతి మెల్లిగా మెడలో నగ కొట్టేయాలని ప్రయత్నిస్తుంది. అది బాలు చూసి ఓయ్.. అని అరుస్తాడు. వెళ్లి ఎవరు మీరు ఏం చేస్తున్నారు అని బాలు అంటే.. నగలు సర్దుతున్నాం అని పద్మావతి అంటుంది. వాళ్లు దూరపు బంధువులు అని కామాక్షి చెబుతుంది. బాలును తీసుకెళ్లి మీనా అత్త గురించి అడుగుతుంది
ముంబై ముఖేష్‌ను రెచ్చగొట్టా. మా అమ్మ ప్రేమను తట్టుకోలేవు అని బాలు అంటాడు. విద్య ఎన్నిసార్లు కాల్ చేసిన రోహిణి లిఫ్ట్ చేయదు. కనీసం మాణిక్యంకు కాల్ చేసి చెబితే ఈ సమస్య నుంచి బయటపడుతుందని కాల్ చేస్తుంది. మాణిక్యం కూడా కాల్ లిఫ్ట్ చేయడు. ఇక నేనే రంగంలోకి దిగాలి అని స్కూటీపై వెళ్తుంది విద్య. ఇంతలో విద్యకు మురళి ఫోన్ నుంచి కాల్ వస్తుంది.
విద్యను ఆపేసిన బాలు ఐడియా
మురళికి యాక్సిడెంట్ అయిందని ఒకావిడ చెబుతుంది. దాంతో కంగారుగా విద్య వెళ్తుంది. కానీ, మురళి యాక్సిడెంట్ అయిందని తన ఫ్రెండ్‌తో నాటకం ఆడిస్తాడు. ఈ ఐడియా నా లవ్ గురు బాలు ఇచ్చాడని, ఇప్పుడు విద్య వస్తే నా మీద ప్రేమ ఉందని తెలుస్తుందని మురళి అంటాడు. బాలు మురళికి ఇచ్చిన ఐడియానే రోహిణి దగ్గరికి విద్య రాకుండా ఆపుతుంది.
ముఖేష్ ముందు మీనాపై ఎక్కువ ప్రేమ చూపిస్తుంటుంది ప్రభావతి. మనోజ్ దాన్ని ఇంకాస్తా ఎక్కువగా చెబుతాడు. వంటలు అదిరిపోయాయని రంగాతో సత్యం చెబుతాడు. ఆ వంట మనిషి కళ్లు తిరిగిపడిపోయాడు. హాస్పిటల్‌కు పంపించాం. వెజ్ బిర్యానీ తక్కువ పడింది. పెళ్లి కొడుకు మేనమామే చేస్తున్నాడు. అది అయ్యాక వచ్చి నిన్ను కలుస్తానన్నాడని రంగా చెబుతాడు.
అంతా అయ్యాక కలుసుకుంటాం అని సత్యం అంటాడు. నాన్న ట్యాబ్లెట్స్ వేసుకోమ్మని, వేడి నీళ్లు తీసుకొస్తానని వంట గదిలోకి బాలు వెళ్తాడు. మేక మామ కూరగాయలు కట్ చేస్తుంటాడు. ఇంతలో బాలుకు కాల్ వచ్చి మాట్లాడుతాడు. ఒక అబ్బాయిని వేడి నీళ్లు తీసుకురమ్మంటే వచ్చి తీసుకొచ్చి ఇస్తాడు. అలా మేక మామను బాలు చూడడు.
బాలు చేతిలో మందు బాటిల్
బాలు తిరిగి వెళ్తుంటే.. ఇద్దరి నుంచి మందు బాటిల్ కింద పడుతుంది. కానీ, దాన్ని బాలు పట్టుకుంటాడు. బాలు చేతిలో మందు బాటిల్, గ్లాస్ చూసి బాలు తాగుతున్నాడని మనోజ్ అనుకుంటాడు. ప్రభావతికి చెప్పాలని వెళ్తాడు మనోజ్. ఇక్కడి నుంచి వెళ్దామని, బాలు మందు కొడుతున్నాడని మనోజ్ అంటాడు. వాడి చేతిలో మందు బాటిల్, గ్లాస్ కూడా చూశానని మనోజ్ అంటాడు.
దాంతో వెళ్లి సత్యంతో చెప్పాలని ప్రభావతి అంటుంది. బాలు తాగుతున్నాడని సత్యంతో ప్రభావతి, మనోజ్ చెబుతారు. సుందరి పెళ్లి సెట్ చేసిందే వాడు. వాడు ఎందుకు ఇలా చేస్తాడని సత్యం అంటాడు. మీనాను పిలిచి బాలు తాగుతున్నాడని ప్రభావతి అంటుంది. ఏ సన్నాసి చెప్పాడని మీనా అంటే మనోజ్ చూసినట్లు చెబుతాడు.
ముఖేష్ ముందు పరువు పోతుంది. సుందరి పెళ్లి ఆగిపోతుందని ప్రభావతి అంటుంది. ఆయన ఎక్కడున్నా తాగలేదని నిరూపిస్తానని మీనా అంటుంది. మరోవైపు నీతూతో ఫోన్‌లో రవి మాట్లాడుతాడు. శ్రుతి వచ్చి కావాలనే నీతు గురించి డ్రాకులా, రాక్షసి అని మాట్లాడుతుంది. ఫోన్ కట్ చేసి శ్రుతిపై రాయి విసురుతాడు.
మేక మామను చూసిన మీనా
కానీ, అది పక్కనున్న ఆంటీకి తగులుతుంది. భయంతో శ్రుతికి దగ్గరిగా ఉంటాడు రవి. ముద్దు ఇవ్వమని శ్రుతి అంటుంది. రవి ఇవ్వబోతుంటే మీనా వచ్చి బాలు గురించి అడుగుతుంది. తెలియదంటారు. దాంతో వంటగదివైపు మీనా వెళ్తుంది. అక్కడ మేక మామ ఉంటాడు. మేక మామను మీనా చూసినట్లు చూపిస్తారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


