Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్ తప్పతాగి రోడ్డుపై గొడవ.. లోపలేసిన అరుణ్.. జాడలేని రోహిణి.. బాలు మరో ప్లాన్

Gunde Ninda Gudi Gantalu Serial August 7th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 7 ఎపిసోడ్ లో రోహిణి అబద్ధం చెప్పిన బాధలో మనోజ్ పీకలదాకా తాగుతాడు. రోడ్డుపై న్యూసెన్స్ చేయడంతో అరుణ్ అతన్ని లోపలేస్తాడు. అటు బాలు మరో మాస్టర్ ప్లాన్ వేస్తుంటాడు.

Published on: Aug 7, 2026, 07:34:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో రోహిణి చేసిన పని వల్ల సత్యం ఫ్యామిలీ చిన్నాభిన్నమవుతుంది. మనోజ్ తప్పతాగడం, అటు కామాక్షి ఇంట్లో ప్రభావతి సెటిలైపోవడం, రోహిణి జాడలేకపోవడంలాంటి సీన్లతో తాజా ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది.

Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్ తప్పతాగి రోడ్డుపై గొడవ.. లోపలేసిన అరుణ్.. జాడలేని రోహిణి.. బాలు మరో ప్లాన్
Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్ తప్పతాగి రోడ్డుపై గొడవ.. లోపలేసిన అరుణ్.. జాడలేని రోహిణి.. బాలు మరో ప్లాన్

రోహిణిపై కామాక్షి దగ్గర ప్రభావతి ఏడుపు

రోహిణి చేసిన పనిని పదే పదే చెబుతూ కామాక్షి దగ్గర ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది. దీనికంతటికీ కారణం నువ్వే.. ఆ రోహిణిని నువ్వే పరిచయం చేశావ్ అని కామాక్షిని నిందిస్తుంది. అది ఇంత పని చేస్తుందని అనుకోలేదు.. దానిని సొంత కూతురిలా చూసుకున్నాను.. ముగ్గురు కోడళ్లలో దానికే ఎక్కువ విలువ ఇచ్చాను.. మలేషియా అబద్ధం ఆడి మోసం చేసింది అని ప్రభావతి తన బాధ చెప్పుకుంటుంది.

ముగ్గురు కోడళ్లను సమానంగా చూసుకోవాల్సింది పోయి.. రోహిణికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు.. ఇప్పుడు అనుభవిస్తున్నావని కామాక్షి అంటుంది. అయినా తాను చెప్పినందుకు రోహిణిని మనోజ్ కి ఇచ్చి పెళ్లి చేయలేదు.. ఆమె దగ్గర కోట్ల ఆస్తి ఉందని చేసుకున్నావని నిందిస్తుంది. రోహిణి తప్పు చేసినా ఇంట్లో నుంచి వెళ్లగొట్టాల్సింది కాదని, ఇప్పుడు మనోజ్ పరిస్థితి ఏంటని అడుగుతుంది.

మనోజ్ ను చిన్నప్పటి నుంచి గుండెల్లో పెట్టుకొని పెంచాను.. వాడిని నేను చూసుకుంటానని ప్రభావతి అంటుంది. రోహిణిపై ఆవేశంతో రగిలిపోతే తిండి కూడా తినదు.. తన ఇంటికీ వెళ్లదు.

బాధ పడుతూ కూర్చున్న మీనా.. రోహిణిదే తప్పన్న బాలు

అటు ఇంట్లో మీనా బాధపడుతూ కూర్చుంటుంది. అసలు ఆ మాణిక్యాన్ని ఇంటికి తీసుకురాకుండా ఉండాల్సిందని బాలుతో అంటుంది. ఇందులో మనం చేసిందేమీ లేదు.. ఆ రోహిణి అబద్ధాలు చెప్పి అమ్మను మోసం చేసింది.. ఏదో ఒక రోజు ఆ అబద్ధాలు బయటపడాల్సిందే కదా అని అంటాడు. రోజూ ఎలా ఉన్నా ఇల్లంతా కళకళలాడుతూ ఉండేది.. అత్తయ్య లేకపోతే ఉసూరుమన్నట్లు ఉంది అని మీనా అంటుంది.

అప్పుడే రవి, శృతి కూడా వస్తారు. అందరూ అదే విషయం గురించి చర్చిస్తారు. రోహిణికి మాట్లాడే అవకాశం అయినా ఇవ్వాల్సిందని మీనా అంటుంది. అలా చేస్తే ఆమె మరో అబద్ధం చెప్పి బుట్టలో వేసుకుంటుందని అమ్మ అనుకొని ఉంటుంది.. అందుకే ఆమె ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది అని బాలు అంటాడు. రోహిణి ఎక్కడుందో అని రవి అంటే.. విద్య దగ్గరే ఉంటుందిలే అని బాలు చెబుతాడు. మరి మనోజ్ సంగతేంటని అడిగితే.. ఏ బార్ లోనూ కూర్చొని తాగుతూ ఉంటాడని అంటాడు.

పీకలదాకా తాగిన మనోజ్.. మణికంఠకు టార్చర్

అటు నిజంగానే మనోజ్ బార్ లో ఎత్తిన బాటిల్ దించకుండా తాగుతుంటాడు. అతన్ని బార్ కు తీసుకెళ్లిన మణికంఠకు చుక్కలు చూపిస్తాడు. పదే పదే తన భార్య అబద్ధం చెప్పిందంటూ చెప్పిందే చెబుతుంటాడు. మనోజ్ తాగుడు, అతని మాటలు విని బార్ లో అందరూ నవ్వుకుంటారు. మణికంఠను టార్చర్ చేస్తాడు.

బార్ లోని భార్యా బాధితుల సంఘంతో మనోజ్ మాట్లాడతాడు. దీనికి లీడర్ తానేనని అంటాడు. తన భార్య ఇంత అబద్ధం చెబుతుందని ఊహించలేదని మళ్లీ అంటాడు. ఇంతకీ ఏం చేసిందని వాళ్లు అడిగితే.. అది మాత్రం చెప్పను.. సీక్రెట్ అని అంటాడు. దీంతో లాభం లేదని మణికంఠ అతన్ని బలవంతంగా బయటకు లాక్కెళ్తాడు.

మీనాకు ఫోన్ చేసి బాధ చెప్పుకున్న కామాక్షి

అటు మీనాకు కామాక్షి ఫోన్ చేస్తుంది. ప్రభావతి పరిస్థితి గురించి చెబుతుంది. ఆ రోహిణిని మళ్లీ కోడలిగా అంగీకరిస్తుందని తాను అనుకోవడం లేదని అంటుంది. కనీసం ఏమైనా తిన్నదా అని మీనా అడుగుతుంది. వచ్చినప్పటి నుంచి కాఫీ తప్ప ఏమీ తినలేదని, రోహిణి గురించి చెబుతోందని అంటుంది.

దీనికంతటికీ కారణం నేనే అని నన్ను నిందిస్తోందనీ మీనాకు చెప్పి కామాక్షి బాధపడుతుంది. ఆమె తిరిగి ఇంటికి రావాలంటే సత్యం అన్నయ్యను ఓసారి ఫోన్ చేయమని చెప్పు మీనా అని అంటుంది. మామయ్యను అడిగి చూశాం.. కానీ వచ్చినప్పుడు వస్తుందిలే అని వదిలేశారు అని మీనా చెబుతుంది.

శీలా డార్లింగ్‌ను రంగంలోకి దించడానికి బాలు ప్లాన్

అప్పుడే బాలు వస్తాడు. ఎవరితో మాట్లాడావ్ అని మీనాను అడిగితే కామాక్షి పిన్ని చేసిందని చెబుతుంది. ప్రభావతి గురించి చెప్పి బాధపడుతుంది. మామయ్యను ఫోన్ చేయమని చెప్పండని అడుగుతుంది. ఇప్పుడే నాన్నతో మాట్లాడి వచ్చాను.. తనకు చెప్పింది వెళ్లలేదు కదా.. వచ్చినప్పుడు తానే వస్తుందిలే అని అంటున్నారని బాలు చెబుతాడు. మరేం చేద్దామని మీనా అంటే.. ఇలాంటి విషయాలు పెద్ద వాళ్లే పరిష్కరిస్తారు.. శీలా డార్లింగ్ కు ఫోన్ చేస్తానని బాలు అంటాడు. ఇదంతా జరిగిందని చెబితే అమ్మమ్మ బాధ పడుతుందేమో అని మీనా అంటే.. తప్పదు కదా అని బాలు అంటాడు.

పోలీసులకు దొరికిపోయిన మనోజ్, మణికంఠ

అటు బార్ నుంచి బైక్ పై వస్తున్న సమయంలోనూ మణికంఠకు మనోజ్ టార్చర్ చూపిస్తాడు. చెప్పిందే చెబుతుంటాడు. అదే సమయంలో ట్రాఫిక్ పోలీసులు వాళ్ల బండిని ఆపుతారు. మణికంఠ తాగకపోవడంతో బ్రీత్ అనలైజర్ టెస్టులో ఏమీ దొరకదు. దీంతో పోలీసులు వాళ్లను వెళ్లిపోమంటారు. కానీ మనోజ్ మాత్రం కానిస్టేబుల్ తో గొడవ పెట్టుకుంటాడు. తాగింది నేనైతే మా ఫ్రెండ్ ను ఎందుకు ఊదమన్నారు.. సారీ చెప్పమంటూ నానా రచ్చ చేస్తాడు. మణికంఠ చెప్పినా వినడు.

అరుణ్‌తో గొడవ పడిన మనోజ్

అక్కడే ఉన్న అరుణ్ ఈ గొడవ చూస్తాడు. ఏమైందని అక్కడికి వస్తాడు. అరుణ్ తోనూ మనోజ్ గొడవకు దిగుతాడు. తన భార్య మోసం చేసిందని, ఇన్ని డిగ్రీలు చేసిన తనకే అబద్ధం చెప్పిందని తన బాధ చెప్పుకుంటాడు. సరే వదిలెయ్.. ఇతన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లు మణికంఠతో అంటాడు అరుణ్. కానీ మనోజ్ మాత్రం వినడు. తన గోడు చెప్పుకుంటూనే ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్ రోహిణిని మరో కానిస్టేబుల్ పిలుస్తాడు.

కానిస్టేబుల్ రోహిణితో తిట్లు.. లోపలేసిన అరుణ్

రోహిణి అనే పేరు వినిపించగానే మనోజ్ మళ్లీ మొదలు పెడతాడు. ఆమె దగ్గరికి వెళ్లి నన్ను ఇంత మోసం చేస్తావా.. నిన్ను ఎంత నమ్మాను.. ఎంత ప్రేమించాను అని అంటాడు. ఆమె షాకై మనోజ్ ను తిడుతుంది. ఎవడ్రా నువ్వు.. నేనేం చేశానని అడుగుతుంది. వీడెవడో నాకు తెలియదు సార్ అని అరుణ్ కు చెబుతుంది.

మనోజ్ మాత్రం ఆమెను అలాగే వేధిస్తుండటంతో ఇక లాభం లేదనుకొని మనోజ్ ను లోపలేయాలని కానిస్టేబుల్ కు చెబుతాడు అరుణ్. మణికంఠ వద్దని బతిమాలినా వినడు. ఓ ఆటోలో మనోజ్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More