Gunde Ninda Gudi Gantalu Today Episode: ఇక మనోజ్ నీ భర్త కాదు, రోహిణిని గెంటేసిన ప్రభావతి- విద్య పీక పట్టుకున్న ఫ్రెండ్!

Gunde Ninda Gudi Gantalu Serial August 6th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 6వ తేది ఎపిసోడ్‌లో మోసం చేసిన రోహిణిని ఇంట్లోంచి గెంటేస్తుంది ప్రభావతి. విద్య ఇంటికి వెళ్లిన రోహిణి ఏమాత్రం మారదు. అత్తింట్లో అడుగుపెడతానంటుంది. పిచ్చోడిలా మనోజ్ ప్రవర్తిస్తాడు. కామాక్షిని ప్రభావతి తరుముతుంది.

Published on: Aug 6, 2026, 07:56:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో తను చేసిన తప్పేంటని రివర్స్‌లో వాదించిన రోహిణిని అత్త ప్రభావతి ఎడాపెడా కొడుతుంది. నువ్వు ప్రశ్నిస్తున్నావా. అసలు ఏం పుట్టుకే నీది, అడుగడుగునా మోసం చేస్తూ భ్రమలో పెట్టి ఇంతకాలం నా ఇంట్లో ఎలా ఉన్నావే ముదనష్టపుదానా అని రోహిణి పీక పట్టుకుంటుంది ప్రభావతి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 6 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 6 ఎపిసోడ్

దేవుడిలాంటి భర్త చెప్పిన వినలేదు

నోరు తెరిస్తే అబద్ధం, ఆస్తులు అబద్ధం, నాన్న అబద్ధం, మేనమామ అబద్ధం. నీ మొహం చూడాలంటేనే అసహ్యమేస్తుందని మరోసారి పీక పట్టుకుంటుంది. శ్రుతి అడ్డుకుంటే తోసిపడేస్తుంది ప్రభావతి. నిన్ను చంపి జైలుకు వెళ్తే కుటుంబ పరువుపోతుందని ఆగాను. నిన్ను నమ్మి దేవుడిలాంటి నా భర్త చెప్పిన మంచి చెడు కూడా వినలేదు అని ప్రభావతి అంటుంది.

వీడు నిన్ను ఎంత ప్రేమించాడు. కనీసం కట్టుకున్న భర్తకైనా నిజం చెప్పాలనిపించలేదా అని ప్రభావతి అంటుంది. మీనా అడ్డు వస్తే తోసేస్తుంది. నీ ఆవేశంలో అర్థముంది. కానీ, కొట్టడం కరెక్ట్ కాదని బాలు అంటాడు. ఎంతైనా రోహిణి ఇంటి కోడలని మీనా అంటుంది. ఏయ్.. నేను ప్రభావతిని. మోసపోయినా నాదే పైచేయి ఉండాలి. నువ్వు చెబితే నేను వినాలా అని మీనా విషయంలో ప్రభావతి ఏమాత్రం మారదు.

చాలు నువ్వు చేసింది చాలు. కోట్లు పోయాయని చెప్పిన నేను ఇంత బాధపడేదాన్ని కాదు. కానీ, తల్లికన్నా ఎక్కువగా చూసుకున్నా కదే. మిగతా కోడళ్లను కూడా అసలు పట్టించుకోలేదు కదే. నీలాంటి మోసగత్తెకు సేవలు చేయనందుకు దాన్ని (మీనా) రాచిరంపానా పెట్టానుకదే. నీకోసమే కదే ఇదంతా చేసింది. మా ఆయన డబ్బు విషయంలో మోసం చేసిన కూడా ఇంట్లో పెట్టుకున్నా కదే అని ప్రభావతి అంటుంది.

మాయలాడితో పెళ్లి చేశాను

తప్పు చేశాను. నా కొడుకుకి నీలాంటి మాయలాడిని పెళ్లి చేసి వాడి జీవితాన్నే ప్రశ్నార్థకంగా మార్చేశాను. ఇక నీకు ఇంట్లో స్థానం లేదు. నడవ్వే బయటకు అని గెంటేస్తుంది ప్రభావతి. అత్తయ్య నేను చెప్పేది వినండని రోహిణి అంటుంది. ఇంకా నువ్వు చెప్పేది నేను వింటానన్నుకున్నావా. నీ నీడ కూడా ఇంటి మీద పడకూడదు. జన్మలో ఈ ఇంటి గడపలో నువ్వు కాలుపెట్టకూడదు. ఇక నీకు మాకు ఎలాంటి సంబంధము లేదు అని ప్రభావతి అంటుంది.

మనోజ్ సైలెంట్‌గా ఉంటాడు. ఆ అమ్మాయి ఏదో చెబుతానంటుంది. అవకాశం ఇవ్వు అని సత్యం అంటాడు. అవకాశం ఇస్తే మరో అబద్ధాలు చెప్పి మాయచేస్తుంది. అన్ని తప్పుల్ని మాయచేస్తుంది. వద్దు.. ఇకనుంచి ఇది ఈ ఇంటి కోడలు కాదు, మనోజ్ భార్య కాదు అని ప్రభావతి అంటుంది. ఆ మాట ఆమె భర్త చెప్పాలని సత్యం అంటాడు.

మోసపోయింది అమ్మ మాత్రమేనా, నేను కాదా. ఇంకా తనతో కలిసి ఎలా కాపురం చేయాలి నాన్న అని మనోజ్ అంటాడు. దాంతో రోహిణి మెడపట్టి ఇంట్లోంచి గెంటేస్తుంది. మీనా, శ్రుతి అడ్డుకోవడానికి వస్తే చూపుతో ఆపేస్తుంది ప్రభావతి. రోహిణి నడిరోడ్డుమీదకు వచ్చేస్తుంది. మనోజ్‌కు దూరం అవుతుంది.

నిజమైన బాలు రెండో శాపం

అయితే, సుందరి పెళ్లిలో దమ్ముంటే నన్ను, నా భర్తను విడదీయ్ అని అహంకారంగా మాట్లాడిన రోహిణికి అలా నేను అనను. కానీ, నీ అహంకారినికి తగినట్లు త్వరలో గట్టి గుణపాఠం తింటావ్ అని బాలు పెట్టిన శాపం నిజమవుతుంది. మనోజ్, తర్వాత రోహిణి ద్వారా బాలు శాపం రెండోసారి నిజమవుతుంది.

మనోజ్‌తో ఉన్నది తలుచుకుంటూ వెనక్కి చూసుకుంటూ వెళ్లిపోతుంది రోహిణి. కానీ, మనోజ్ మాత్రం చూడడు. అలాగే బాధతో ఉండిపోతాడు. మనోజ్‌ను చూసి సత్యం గుండె తరుక్కుపోయినట్లు ఉంటాడు. నడిరోడ్డుమీద చెప్పులు లేకుండా కట్టుబట్టలతో నడుస్తుంది రోహిణి. మరోవైపు విద్య టెన్షన్ పడుతుంటుంది. రోహిణి పరిస్థితి ఎలా ఉందో అనుకుంటుంది.

ఇంతలో విద్య ఇంటికి రోహిణి వస్తుంది. నీకు నూరేళ్లే అని విద్య అంటే.. చంపేయవే.. చంపేయవే.. ఒక్కరోజు కూడా బతకనివ్వకు అని రోహిణి కోపంగా అరుస్తుంది. నువ్వు వెళ్లిన పెళ్లి మాణిక్యం వాళ్లదే. అది చెప్పాలని ఎంతో ట్రై చేశాను కానీ, నువ్వు ఫోన్ తీయలేదు. అక్కడ ఏం జరిగింది అని విద్య అడుగుతుంది. మాణిక్యం నాటకానికి తెర పడిందే. అంతా తెలిసిపోయింది. జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి బయటకు గెంటేసిందే మా అత్త అని రోహిణి జరిగింది చెబుతుంది.

విద్య పీక పట్టుకున్న రోహిణి

మాణిక్యం అయినా ఎంతైనా దాస్తాడు. తేలు కుట్టిన దొంగ అయిన ప్రాణాలకోసం అరవాల్సిందే. తనదాక వస్తే నీ గురించి ఎందుకు ఆలోచిస్తాడు. ఆ ఇంట్లో వాళ్లు మంచోళ్లు మోసం చేయకే అని చెప్పాను. దేవుడైనా ఎన్ని ఛాన్సులు ఇస్తాడు అని విద్య అంటుంది. దాంతో విద్య పీక పట్టుకుంటుంది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని కోపంగా అంటుంది రోహిణి.

అత్త మీద కోపం దుత్త మీద చూపించడం ఏంటీ. నిన్ను చాలా సార్లు హెచ్చరించాను అని విద్య అంటుంది. చచ్చిన పాముకు ఇంకా చంపకు అని రోహిణి అంటుంది. ఇంతకీ మనోజ్ ఏమన్నాడు అని విద్య అడిగితే.. సైలెంట్‌గా ఉన్నాడు. చిన్న చలనం కూడా లేదని రోహిణి అంటుంది. భార్య మోసం చేశాక ఎవరి గుండైనా ముక్కలవుతుంది. ఇంకా నయం లాగి చెంప మీద కొట్టలేదని విద్య అంటుంది.

ఇదొక్కటే తెలిసిందా. కొడుకు ఉన్న విషయం కూడా తెలిసిందా అని విద్య అడిగితే.. అది తెలిస్తే నేను కాదు నా పెద్దకర్మకు ఇన్విటేషన్ వచ్చేదని రోహిణి అంటుంది. ఇప్పుడు ఏంటీ పరిస్థితి అని విద్య అడిగితే.. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్లలేను. పైగా డబ్బులేదని మా అత్త చిన్నచూపు చూస్తుంది. జీవితంలో ఇక ఆ ఇంటికి వెళ్లలేనా. ఆ ఇంటి పెద్ద కొడుకు భార్యను. అత్త తర్వాత స్థానం నాదే అని రోహిణి ఇంకా పొగరుగా మాట్లాడుతుంది.

ఏమాత్రం మారని రోహిణి

ఇప్పుడు కోడలిని గెంటేశానన్న అపవాదు మా అత్తకు వస్తుంది. అదంతా మా మావయ్య బాగా గుర్తు పెట్టుకుంటారు. కచ్చితంగా ఇంటి పరువు కోసమైనా ఇంటికి రప్పిస్తారు. ఇంటికెళ్లాక మూలన కూర్చునే టైపు కాదు. నా కష్టాల నుంచి నేను గట్టెక్కాలని, నేను కోరుకున్న జీవితం ఎవరికోసం వదులుకోను. ఇష్టపడిన మనోజ్‌ను వదులుకోను అని రోహిణి చాలా నమ్మకంగా అంటుంది.

ఇంత కాన్ఫిడెంట్ ఏంటే.. ఇదొక్కటే అయితే నువ్వు అనుకుంది జరగొచ్చు. కానీ, చింటు అనే పెద్ద సీక్రెట్ ఉందని విద్య అంటుంది. తెలుసు. నేను అమ్మ దగ్గరికి వెళ్లను. అమ్మ, చింటును నా మాత్రమే వినేలా మార్చుకుంటాను. అప్పుడు ఏం జరగాలో చూస్తాను. ముందు కాఫీ తీసుకురా అని రోహిణి ఇంకా ఏమాత్రం మారదు. మరోవైపు రోహిణి గురించి బాలు, మీనా మాట్లాడుకుంటారు.

అంతా మనోజ్ గాడే చేశాడు. డబ్బున్న అమ్మాయి అని తెలియగానే వెనుకముందు ఏం చూడలేదు. ఇప్పుడు మతిస్థిమితం తప్పి, వెర్రి చూపులు చూస్తున్నాడని బాలు అంటాడు. అప్పుడు అలాగే మనోజ్ కిందకు వస్తాడు. గ్లాస్‌లో నీళ్లు పోసి వాటర్ బాటిల్‌తో నీళ్లు తాగుతాడు. తర్వాత చల్లగా ఉండు అని బాటిల్‌కు చెప్పి వెళ్తాడు. బాలు, మీనాకు హాయి చెప్పి బాగున్నారా అని అడుగుతాడు.

పిచ్చోడిలా మనోజ్

బొమ్మలు, కిటికీలను పలకరిస్తూ పిచ్చోడిలా చేస్తాడు మనోజ్. మళ్లీ వాటర్ బాటిల్ క్యాప్ తీసి గ్లాస్‌లో పోసిన నీళ్లు తాగుతాడు. అదంతా చూసిన మీనా షాక్ అయి ఈయన పరిస్థితి మీకు వస్తే 3, 4 మందు బాటిళ్లు తాగేవారని మీనా అంటుంది. తర్వాత అన్నా.. ఏం అనుకోకురా అని మనోజ్‌ను లాగిపెట్టి కొడతాడు. మనోజ్ పిచ్చితనానికి బాలు చెంపదెబ్బతో ట్రీట్‌మెంట్ ఇస్తాడు.

సత్యం వస్తాడు. ఒక్కొక్కరు ఎవరు అని బాలు అడిగితే మనోజ్ కరెక్టుగానే చెబుతాడు. పార్లరమ్మా ఏదని అడిగితే మోసం చేసి పోయిందని మనోజ్ అంటాడు. తప్పు ఎక్కడ జరిగిందో మాట్లాడితేగా తెలిసేదని సత్యం అంటే.. తప్పు చేసే పోయిందని మనోజ్ అంటాడు. వెళ్లగొట్టబడిందని బాలు అంటాడు. ఇంకోసారి ఇలా చేయొద్దని రోహిణిని తీసుకురావచ్చుగా అని మీనా అంటుంది.

మోసం చేసింది కదా ఎలా తీసుకురావాలని మనోజ్ అంటాడు. నీ కాపురం ముక్కలవడం నాకిష్టం లేదు. రోహిణి నిన్ను చాలా భరించింది అని సత్యం అంటే.. చెంచాడు అమృతం ఇచ్చి సీసాడు విషం ఇచ్చింది, చాంతాడంతా మోసం చేసి మొలతాడంతా మంచి చేస్తే ఏం లాభం నాన్న అని మనోజ్ అంటాడు. పార్లరమ్మా ఆడిన అబద్ధాలన్నీ ఇంట్లో పిశాచాల్లా తిరుగుతున్నట్లుందని మనోజ్ అంటాడు.

బాలును నిందించిన మనోజ్

ఇంటి కోడలు గడప దాటి బయటకెళ్లింది. ఇంటి పరువు ఇంకొకరి ఇంట్లో పెట్టకూడదు. ఎవరికి తెలియకముందే తీసుకురావాలని మీనా అంటుంది. బాలు కూడా అంటాడు. నువ్వు వెలు పెట్టకురా. అసలు నీ వల్లే ఇదంతా జరిగింది. మా తప్పులను బయటపెట్టాలని చూస్తావ్. చివరికి నువ్వు అనుకుందే జరిగిందని మనోజ్ అంటాడు.

ఇలా అంటేనే సర్రున కోపవస్తుంది. చేసిన తప్పులను బయటపెట్టకూడదంటే మిమ్మల్ని ఎవరు బాగుపర్చలేరని బాలు అంటాడు. రోహిణిని వెనక్కి తీసుకురాను. జీవితంలో రోహిణి మొహం చూడను అని మనోజ్ వెళ్లిపోతాడు. నేను చూసుకుంటాను నాన్న అని సత్యంకు భరోసా ఇస్తాడు బాలు. ఇలాంటప్పుడే తల్లిలా ఆలోచించాలి. తప్పులను క్షమించాలని సత్యం అంటాడు.

చేతులతో దండం పెట్టి నాకు అంత గొప్ప గుణం లేదండి. క్షమించండి అని ప్రభావతి అంటుంది. రోహిణి చెప్పేది ఓసారి వింటే బాగుండేదని నా అభిప్రాయం అని సత్యం అంటాడు. దాని మాట, ఇప్పుడు మీ మాట వినాలని లేదని ప్రభావతి అంటుంది. రోహిణి చేసిన ఒక్కో మోసాన్ని గుర్తు చేస్తూ రోహిణిని తిడుతుంది ప్రభావతి.

కామాక్షిని తరిమిన ప్రభావతి

గుడ్డిగా నమ్మడం తప్పు నీదే. అయినా ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఎలా నమ్ముతావ్ అని సత్యం అంటాడు. నేను ఎంతగానో నమ్మే కామాక్షి పరిచయం చేసిందిగా. అందుకే నమ్మాను. అయినా దాన్ని అనడం కాదు ఆ ఉంగరాల జుట్టుదాన్ని అనాలి. నీ చెల్లి కామాక్షి. దాని సంగతి చెబుతాను అని ప్రభావతి అంటుంది. సరే పొద్దున్న చూసుకుందాం పడుకో అని సత్యం అంటాడు.

నాకు నిద్రరావట్లేదు అని ప్రభావతి అంటుంది. మరుసటి రోజు ఉదయం కామాక్షిని కొట్టేందుకు గొడుకు పట్టుకుని తరుముతుంది ప్రభావతి. ఈరోజు నిన్ను చంపేస్తానని అంటుంది. తర్వాత ఆయాసం వచ్చి సోఫాలో కూర్చుంటుంది ప్రభావతి. దగ్గరికి వచ్చి ఫ్యాన్ స్పీడ్ పెంచనా అని కామాక్షి అంటే వెంటనే కామాక్షి పీక పట్టుకుని చంపేస్తానని, అంతా నీవల్లే అని ప్రభావతి అంటుంది.

నువ్వే పరిచయం చేసుకున్నావ్

నువ్వు పరిచయం చేయడం వల్లే అది వచ్చిందని ప్రభావతి అంటే.. నువ్వు పరిచయం చేసుకోవడం వల్లే పరిచయం అయింది. గుర్తు చేసుకో. ఎవరు తనను కోడలిని చేసుకున్నారు అని కామాక్షి అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More