Gunde Ninda Gudi Gantalu: సత్యం ఇంట్లో రోహిణి మలేషియా నాటకం బయటపెట్టిన మేకమామ- చితకబాదిన ప్రభావతి- రివర్స్ అయిన రోహిణి!
Gunde Ninda Gudi Gantalu Serial August 5th Episode Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 5వ తేది ఎపిసోడ్ ప్రోమోలో సత్యం ఇంటికి మటన్ కొట్టు మాణిక్యంను బాలు ప్రవేశపెడతాడు. ప్రభావతి నిలదీయడంతో అదంతా రోహిణి నాటకం అని చెప్పేస్తాడు మాణిక్యం. దాంతో రోహిణిని చితకబాదుతుంది ప్రభావతి.
Gunde Ninda Gudi Gantalu Serial Episode Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సుందరి పెళ్లిలో నగలు ఎత్తుకెళ్లిన దొంగ జంటను బాలు, మీనా పట్టుకుంటారు. ఈ గొడవలో మీనాకు కత్తి గాయం అవుతుంది. సుందరి నగలను బాలు, మీనా కాపాడినట్లు, వారికి ఇవ్వడానికి స్వీట్స్ ఉన్నాయా అని మాణిక్యంను అడుగుతాడు రంగా.

ఏర్పాట్లు నేను చేస్తానుగా
ఇంతపెద్ద సహాయం చేసిన వాళ్లకు కేవలం స్వీట్స్ మాత్రమే ఇస్తామా. నేను ఏర్పాట్లు చేస్తానుగా అని మాణిక్యం అంటాడు. అక్కడితో ఆగస్ట్ 4 తేది ఎపిసోడ్ ముగుస్తుంది. తాజాగా గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 5వ తేది ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.
ఆ ప్రోమోలో స్వీట్స్ పంచడమే కాదు వారికి ఘనంగా సన్మానం చేయాలని, ఆ ఏర్పాట్లన్నీ తానే చూసుకుంటానని మేకమామ రంగాతో అంటాడు. మా మేనల్లుడు కిశోర్ పెళ్లి సంబంధం నుంచి, డెకరేషన్ వరకు, ఇప్పుడు నగలు దొంగలించకుండా అడ్డుకోవడం వంటి ఎన్నో గొప్ప పనులు చేశారు. అలాంటి వాళ్లకోసం కాస్తా సన్మానం అయినా చేయకుంటే ఎలా ఉంటుందని మాణిక్యం అంటాడు.
దానికి సరే మీ ఇష్టం అని రంగా అంటాడు. తర్వాత మీనా చేతికి కట్టు కడతారు. బాలు, మీనాల దగ్గరికి వెళ్లిన రంగా వారికి థ్యాంక్స్ చెబుతాడు. అన్ని దగ్గరుండి చూసుకున్నారు, చాలా విషయాల్లో హెల్ప్ చేశారని కృతజ్ఞతలు చెబుతాడు రంగా. ఇదంతా మనది అని, సుందరి పెళ్లిలో ఎలాంటి సమస్యలు రాకూడదు కదా అని బాలు అంటాడు.
బాలు మీనాలను చూసి షాక్
అప్పుడే డోలు సన్నాయి సౌండ్ వస్తుంది. పెళ్లి అయిపోయిందిగా, ఈ సౌండ్ ఏంటని బాలు అడుగుతాడు. నువ్వు చేసిన సహాయం గురించి పెళ్లికొడుకు మేనమామకు చెప్పానురా. నిన్ను సన్మాంచుకోవాలని ఎలా వస్తున్నాడో చూడు అని రంగా అంటాడు. అప్పుడే దండ పట్టుకుని డ్యాన్స్ చేస్తూ మటన్ కొట్టు మాణిక్యం అలియాస్ రోహిణి మేనమామ వస్తాడు.
మాణిక్యంను చూసి బాలు, మీనా షాక్ అవుతారు. దగ్గరికి వచ్చేవరకు బాలు, మీనాలను మాణిక్యం చూడడు. బాలుకు దండ వేయబోతూ మాణిక్యం చూస్తాడు. బాలును చూసి ఒక్కసారిగా ఖంగుతింటాడు మాణిక్యం. ఇతను అని బాలు అడిగితే.. పెళ్లి కొడుకు మేనమామ మాణిక్యం అని రంగా చెబుతాడు. ఇతను పెళ్లి కొడుకు మేనమామ అయితే మరి పార్లరమ్మకు ఏమవుతాడు. తనకు కూడా మేనమామ అని చెప్పాడని బాలు అంటాడు.
రోహిణికి మేనమామ ఏంటని రంగా అడుగుతాడు. అప్పుడు ఇతను మలేషియాలో ఉంటాడని, రోహిణి మేనమామ అని జరిగిందంతా బాలు చెబుతాడు. మాణిక్యంను నిజం చెప్పమని గట్టిగా నిలదీస్తాడు. లేకుండా కొడతానని బెదిరిస్తాడు బాలు. దాంతో అదంతా రోహిణి వేయించిన నాటకం అని, తనకు రోహిణి ఎలాంటి సంబంధం లేదని నిజం చెప్పేస్తాడు మాణిక్యం.
రోహిణి వెటకారం
దానికి బాలు, మీనాలు అవాక్కవుతారు. ఇదే విషయం ఇంట్లో అందరిముందు చెప్పాలని బాలు అంటాడు. దానికి మాణిక్యం సరేనంటాడు. బాలు, మీనా ఇంటికి వెళ్తారు. ఇంట్లో అందరిని పిలుస్తాడు బాలు. అంతా వస్తారు. అమ్మ ముందు ఓ వాటర్ బాటిల్ పెట్టమని మీనాకు చెబుతాడు బాలు. అంబులెన్స్‌ను కూడా రెడీగా ఉంచమని ఫ్రెండ్ హాస్పిటల్‌కు కాల్ చేసి చెప్పానని బాలు అంటాడు.
అంతగా ఏమైంది. కోట్ల ఆస్తి ఏమైనా కలిసి వచ్చిందా అని మనోజ్ అడుగుతాడు. పూలమ్ముకునే ఆ మీనా వాళ్లమ్మా నోట్ల దండలు గుచ్చి పంపించుంటుంది అని రోహిణి వెటకారంగా మాట్లాడుతుంది. నీ మొహానికి అంత సీన్ లేదు. నీ నోరు మూతపడే రోజు వచ్చిందని మీనా అంటుంది. దానికి రోహిణి షాక్ అవుతుంది.
మలేషియా మాణిక్యం గారు విచ్చేయండహో అని బాలు అంటాడు. మెడలో దండలతో మాణిక్యం సత్యం ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. మాణిక్యంను చూసి అంతా షాక్ అవుతారు. ఇతను ఎక్కడ కలిశాడురా, ఆ దండలు ఏంటీ, ఏమైందని సత్యం అడుగుతాడు. సుందరిని పెళ్లి చేసుకున్న కిశోర్ ఉన్నాడు. ఈ కిశోర్ మేనమామ అని అసలు మాణిక్యం ఎవరో చెబుతాడు బాలు.
రోహిణి నాటకం బయటపెట్టిన మేకమామ
అది విని అంతా అవాక్కవుతారు. మా రోహిణికి మేనమామ కాదా అని కోపంగా అడుగుతుంది ప్రభావతి. కాదండి. మొత్తం చేసిందంతా మీ కోడలు రోహిణియే అని మాణిక్యం చెబుతాడు. అంతా షాక్ అవుతారు. దాంతో కోపంతో మాణిక్యం మెడలో దండలు పడేసి, కాలర్ పట్టుకుని ఇంత మోసం చేస్తావా అని మనోజ్ అంటాడు.
ఈ మాట నీ పెళ్లాన్ని అడగవయ్యా అని మాణిక్యం అంటాడు. ఏంటీ నేను చేసిన తప్పు అని రోహిణి రివర్స్‌లో దబాయిస్తుంది. నోర్మూయ్ అని గట్టిగా అరిచిన అత్త ప్రభావతి రోహిణిని లాగిపెట్టి కొడుతుంది. అటు ఇటు గుంజుతూ చితకబాదుతుంది.
ఏంటే నువ్వు ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నావా.. అసలు నిన్ను.. అంటూ రోహిణి పీక పట్టుకుంటుంది ప్రభావతి. మీనా ఆపాలని చూస్తే ప్రభావతి గద్దిస్తుంది. అంతా ఆపేందుకు ప్రయత్నిస్తారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


