Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ట్విస్ట్.. ఈ ప్రేమ ఏంటీ ఇంత కఠినంగా మారిపోయింది? పాపం ధీరజ్

Illu Illalu Pillalu: బుల్లితెరపై విశేష ఆదరణ పొందుతున్న 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగింది. భర్త ధీరజ్‌పై ఎంతో ప్రేమానురాగాలు చూపిస్తూ వచ్చిన ప్రేమ, ఒక్కసారిగా అతని పట్ల దారుణమైన కఠినత్వంతో ప్రవర్తించడం సీరియల్ ఫ్యాన్స్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

Published on: Aug 11, 2026, 12:54:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu: స్టార్ మాలో ప్రసారమవుతున్న పాపులర్ డైలీ సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu) రోజురోజుకూ సరికొత్త ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కుటుంబ బంధాలు, ఎత్తులు పైఎత్తుల నడుమ సాగుతున్న ఈ సీరియల్‌లో ప్రస్తుతం ప్రేమ ప్రవర్తన సీరియల్ వీక్షకులకు పెద్ద షాక్‌గా మారింది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ట్విస్ట్.. ఈ ప్రేమ ఏంటీ ఇంత కఠినంగా మారిపోయింది? పాపం ధీరజ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ట్విస్ట్.. ఈ ప్రేమ ఏంటీ ఇంత కఠినంగా మారిపోయింది? పాపం ధీరజ్ (jiohotstar)

కఠినంగా ప్రేమ

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో మొన్నటివరకూ ధీరజ్ పై అమితమైన ప్రేమను చూపించింది ప్రేమ. కానీ ఇప్పుడు అత్యంత కఠినంగా మారిపోయింది. ధీరజ్ పట్ల అత్యంత పరుషంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. శ్రీవల్లి, భద్రావతిలు పన్నిన కుట్రల వల్ల ప్రేమ మనసు మారి.. ధీరజ్‌ను దూరం పెడుతుండటం కథలో అసలైన నిప్పు రాజేసింది.

కుంకుమ వద్దంటూ

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమ క్యారెక్టర్ మామూలు గా మారలేదు. గుడిలో జరిగిన ప్రత్యేక కుంకుమార్చన పూజ సందర్భంలో ప్రేమ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. భర్త పేరిట అర్చన చేయించాలని పూజారి ఎంత చెప్పినా, ధీరజ్ పేరును ఉచ్ఛరించడానికి ప్రేమ ఏమాత్రం ఒప్పుకోలేదు.

భర్త పేరు చెప్పకపోతే అరిష్టమని భద్రావతి రెచ్చగొట్టినప్పటికీ, ప్రేమ మాత్రం తన పంతాన్ని వీడలేదు. ఇక సౌభాగ్యానికి ప్రతీకగా ధీరజ్ తన చేతితో ప్రేమ నుదుటన కుంకుమ తిలకం దిద్దుతానంటే.. ప్రేమ వద్దంటే వద్దని నిష్కర్షగా తిరస్కరించింది.

అందరూ షాక్

ధీరజ్‌తో ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా, అసలు అతను తనకు తెలియదన్నట్లుగా ప్రేమ ప్రవర్తిస్తున్న తీరు చూసి రామరాజు కుటుంబాల సభ్యులు, పూజారి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు నిజం తెలుసుకోకుండా, కేవలం అపార్థంతో ఈ స్థాయిలో ప్రవర్తించడం సరికాదని ప్రేమతో అంటున్నారు.

ముక్కలైన ధీరజ్ గుండె

మరోవైపు ప్రేమను ప్రాణంగా ప్రేమించే ధీరజ్‌కు ఈ పరిణామాలు గుండెకోతను మిగిల్చాయి. తనను ప్రాణంగా భావించిన భార్యే తన పట్ల ఇంతటి ద్వేషం చూపిస్తుంటే ధీరజ్ తట్టుకోలేక విలవిలలాడుతున్నాడు.

ఇల్లు ఇల్లాలు సీరియల్ తాజా ప్రోమోలో ఒక వ్యక్తిని కాపాడబోయి ధీరజ్ తలకు గాయమవుతుంది. రక్తం కూడా కారుతుంది. ఫ్యామిలీ అంతా టెన్షన్ పడుతుంటారు. కానీ ప్రేమ మాత్రం దూరం నుంచి చూస్తూ, అక్కడే ఆగిపోతుంది.

నెటిజన్ల రియాక్షన్

సీరియల్ లో ధీరజ్ పడుతున్న వేదన, అతని నిస్సహాయతను చూసి సోషల్ మీడియాలో సీరియల్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. "అంతగా ప్రేమించే ధీరజ్ మనసును ప్రేమ ఇలా ముక్కలు చేయడం అన్యాయం" అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రావతి, శ్రీవల్లి కుట్రలు ఎప్పుడు బయటపడతాయో, ధీరజ్ బాధ ఎప్పుడు తీరుతుందో అని బుల్లితెర వీక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More