Illu Illalu Pillalu:ఇల్లు ఇల్లాలు పిల్లలు-ప్రేమ కాపురం కూల్చిన సైకో శ్రీవల్లి-ఇక నర్మదనే టార్గెట్-బల్లక్కాయ్ ఏం చేయనుంది
Illu Illalu Pillalu: కొన్నిరోజులుగా శ్రీవల్లి కడుపు డ్రామాతో చప్పగా సాగిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఇప్పుడు స్పీడ్ అందుకుంది. పగతో రగలిపోతున్న శ్రీవల్లి తన కుట్రలతో తోడి కోడళ్ల జీవితాలతో ఆడుకుంటుంది. ప్రేమను పుట్టింటికి వెళ్లేలా చేసిన బల్లక్కాయ్.. ఇప్పుడు నర్మదను టార్గెట్ చేయనుంది.
Illu Illalu Pillalu: స్టార్ మాలో ప్రసారమయ్యే టాప్ సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. రామరాజు కుటుంబం వర్సెస్ భద్రావతి ఫ్యామిలీ అనే కథతో సాగే ఈ సీరియల్ లో కొత్త ట్విస్ట్ లు ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా పగతో రగిలిపోతున్న శ్రీవల్లి కుట్రలతో రామరాజు కుటుంబం తలకిందులవుతోంది. ఇప్పటికే ప్రేమపై పగ తీర్చుకున్న బల్లక్కాయ్.. ఇప్పుడు నర్మదను టార్గెట్ చేయనుంది.

బల్లక్కాయ్ రివేంజ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు పెద్ద కోడలు శ్రీవల్లి కుట్ర కుతంత్రాలు మామూలుగా లేవు. అబద్ధాలు చెప్తూ, కన్నింగ్ ప్లాన్ లు వేస్తూ బల్లక్కాయ్ సైకోలా ప్రవర్తిస్తోంది. కడుపు డ్రామాను బయటపెట్టారనే కక్షతో తన తోడికోడళ్లు ప్రేమ, నర్మదపై రివేంజ్ కోసం దారుణమైన కుట్రలు పన్నుతోంది.
పుట్టింటికి ప్రేమ
శ్రీవల్లి కుట్రకు బలైన ప్రేమ ఇప్పటికే పుట్టింటికి వెళ్లిపోయింది. చిలకా గోరింకల్లా ఉండే ధీరజ్, ప్రేమ జంటను బల్లక్కాయ్ విడదీసింది. ప్రేమ గతాన్ని ఆయుధంగా వాడుకుని భద్రావతిని రెచ్చగొట్టింది శ్రీవల్లి. తీరా చూస్తే భద్రావతి, సేనాపతి కలిసి రామరాజు ఇంటికి వచ్చి మరీ తమ కన్నింగ్ ప్లాన్ ను అమలు చేశారు. ధీరజ్, ప్రేమ విడిపోయేలా చేశారు.
కుమిలిపోతున్న వేదవతి
కడుపు డ్రామా తెలిసినప్పటి నుంచి శ్రీవల్లిని అత్త వేదవతి అసహ్యించుకుంటుంది. భర్త చందు ఏమో తన దగ్గరకు కూడా రానివ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో బల్లక్కాయ్ సైకోలా మారిపోయింది. ప్రేమ కాపురాన్ని కూల్చేసింది. దీంతో చిన్న కొడుకు ధీరజ్ బాధ చూడలేక వేదవతి కుమిలిపోతుంది. ఇదంతా చూస్తూ శ్రీవల్లి సైకో ఆనందాన్ని పొందుతోంది.
నర్మద టార్గెట్
ప్రేమ, ధీరజ్ ను విడగొట్టిన శ్రీవల్లి ఇప్పుడు నర్మద కాపురంపై కన్నేసింది. ఇప్పటికే రామరాజు ఇంట్లోనే నర్మద, సాగర్ వేరు కాపురం పెట్టేలా తల్లి భాగ్యంతో కలిసి వల్లి కుట్ర పన్నింది. ఇక ఇప్పుడేమో ప్రేమలాగే నర్మదను కూడా రామరాజు ఇంటి నుంచి పంపించేసి, తానే సోలోగా చక్రం తిప్పాలని శ్రీవల్లి అనుకుంటుంది.
కుట్ర ఏంటీ?
ప్రేమ విషయంలో ఆమె గతాన్ని తన ఆయుధంగా వాడుకుంది వల్లి. మరి ఇప్పుడు నర్మదను ఎలా బయటకు పంపిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. నర్మద భర్త సాగర్ ఇప్పటికే తండ్రి విలువలకు వెన్నుపోటు పొడిచి లంచానికి అలవాటు పడ్డాడు. మరోవైపు నర్మద తండ్రి ప్రసాద్ రావు కూడా అల్లుడు, కూతురిని రామరాజు ఇంట్లో నుంచి బయటకు రప్పించేందుకు ఎదురు చూస్తున్నాడు.
మరి భాగ్యం, శ్రీవల్లి కలిసి మళ్లీ ఏ కుట్ర పన్నుతారో? నర్మదపై వల్లి ఎలా పగ తీర్చుకుంటుందో? అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ప్రేమలా నర్మద సాఫ్ట్ ఏం కాదు. తేడా వచ్చిందో వల్లి భరతం పట్టేదాకా నర్మద వదలిపెట్టదు. మరి ఈ ఇద్దరి పోరు ఎలా ఉండబోతుందో రాబోయే ఎపిసోడ్లలో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


