Illu Illalu Pillalu July 30 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. వెక్కి వెక్కి ఏడ్చిన వేదవతి-ప్రేమ బాధ-సైకో ఫ్యామిలీ సంబరాలు

Illu Illalu Pillalu July 30 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 30 ఎపిసోడ్ ఎమోషనల్ సాగుతుంది. విడిపోయిన బాధతో ప్రేమ, ధీరజ్ కుమిలిపోతారు. వేదవతి వెక్కి వెక్కి ఏడుస్తుంది. శ్రీవల్లికి భాగ్యం ఇంట్లో ఘన స్వాగతం పలుకుతారు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందనే వివరాలు మీ కోసం.

Published on: Jul 30, 2026, 07:48:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu July 30 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ప్రేమను మరింత రెచ్చగొట్టేలా భద్రావతి మాట్లాడుతుంది. ఇక అన్నింటికీ కారణం తానే అని ధీరజ్ ను పట్టుకొని ఏడుస్తుంది వేదవతి. ఏదో సాధించిన దానిలా వల్లికి పుట్టింట్లో ఘన సన్మానం చేస్తారు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

శారదాంబ ఎమోషనల్

ప్రేమ, ధీరజ్ విడిపోవడంతో సీరియల్ కథ మలుపు తిరుగుతుంది. పుట్టింట్లో కూర్చుని ప్రేమ బాధ పడుతుంది. ఆ రోజు నా చెల్లెలిని ఇలాగే తీసుకొచ్చి ఉంటే ఈ పాతికేళ్ల కథ వేరేలా ఉండేదని భద్రావతి అంటుంది. పుట్టిన రోజు చేయమని అడిగి చాలా పెద్ద తప్పు చేశా. నా మనవడు, మనవరాలు విడిపోవడానికి కారణం నేనే అని శారదాంబ ఏడ్చేస్తుంది.

ప్రేమ తప్పు చేశావని

ఆ రాక్షసుల కుటుంబం నుంచి నీ మనవరాలు ఇంటికి వచ్చింది. ఎందుకమ్మా బాధ పడతావ్? సంతోషంగా ఉండమని తల్లికి భద్రావతి చెప్తుంది. ప్రేమ తప్పు చేశావని విశ్వక్ అంటాడు. మతి ఉండే మాట్లాడుతున్నావా? మీ నాన్నను ధీరజ్ కొడుతుంటే చూస్తూ ఊరుకున్నావ్. కానీ ప్రేమ తన తండ్రిని కొడితే చూస్తూ ఉండలేకపోయిందని భద్రావతి అంటుంది.

రెచ్చగొట్టేలా భద్రావతి

ప్రేమ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? అని మధ్యలో రేవతి అడుగుతుంది. ప్రేమ ఆ ఇంట్లో ఉండటం ధీరజ్ కు ఇష్టం లేదని భద్రావతి, సేనాపతి లేనిపోనివి చెప్తూ ప్రేమకు నూరిపోస్తారు. ప్రేమ మన ఇంటికి వచ్చేస్తున్నా ధీరజ్ ముఖంలో బాధ కూడా కనిపించలేదని భద్రావతి అంటుంది. నచ్చిచెప్పి పంపించాలి కానీ ప్రేమకు కోపం పోగొట్టేలా ఎందుకు రెచ్చగొడుతున్నారని రేవతి అడుగుతుంది.

ఎవరైనా వచ్చారా?

ప్రేమ వచ్చి ఇంతసేపైనా తీసుకెళ్లడానికి ఎవరైనా వచ్చారా? దాని మేనత్త అయినా వచ్చిందా? నా మొగుడు, అత్తారిల్లు అని ఇది ఆరాటపడింది తప్పా, వాళ్లకు ప్రేమ లేదని అర్థమైందా? అని భద్రావతి కావాలనే మాట్లాడుతుంది. ఆ మాటలు విని ఏడుస్తూ బాల్కనీలోకి వెళ్లిన ప్రేమ తన అత్తారిల్లు వైపు చూస్తుంది. ధీరజ్ మాటలను గుర్తు చేసుకుని బాధ పడుతుంది. నా కోసం ధీరజ్ కానీ, అత్త కానీ రావడం లేదని అనుకుంటుంది.

క్షమించమన్న వేదవతి

అటు ప్రేమ, ఇటు ధీరజ్ రాత్రి ఏడుస్తూ కూర్చుంటారు. తమ జ్ణాపకాలను గుర్తు చేసుకుంటూ కుమిలిపోతారు. అప్పుడే వేదవతి వచ్చి క్షమించమని ధీరజ్ ను అడుగుతుంది. మన నిర్ణయాలు ఎదుటి వాళ్ల జీవితాల్లో ఎలాంటి సమస్యలో తెస్తాయో ఇప్పుడు అర్థమైంది. నీకు ఇష్టం లేకపోయినా ప్రేమ మెడలో తాళి కట్టమన్నా. కానీ నా నిర్ణయం ఈ రెండు కుటుంబాల మధ్య మరో పాతికేళ్ల పగను తీసుకొచ్చిందని వేదవతి ఫీల్ అవుతుంది.

వేదవతి కన్నీళ్లు

ప్రేమ ప్రాణాలు పోగొట్టకూడదని అలా చేశావ్. నువ్వు మంచే చేశావమ్మా అని ధీరజ్ అంటాడు. పాతికేళ్లుగా కూలోడితో వెళ్లిపోయానని అన్నారు. కానీ నేనెప్పుడూ వాళ్ల మీద పగ తీర్చుకోవాలని అనుకోలేదు. కానీ ప్రేమకు కావాలనే తాళి కట్టించానని అనడంతో తట్టుకోలేకపోతున్నా. మీ నాన్న మోసం చేశారని అంటుంటే ప్రాణం పోతున్నట్లు ఉందిరా అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది.

మీ నాన్నది చిన్నపిల్లాడి మనస్తత్వం. అయినవాళ్లు ఏమైనా చేస్తే తట్టుకోలేరు. ఆ బాధలో నాన్న ఎక్కడికి వెళ్లాడో అని భయంగా ఉందిరా అని వేదవతి వెక్కి వెక్కి ఏడుస్తుంది. నాన్నను తీసుకొస్తానని ధీరజ్ బయటకు వెళ్తాడు.

మహారాణిలా శ్రీవల్లి

మరోవైపు భాగ్యం ఇంట్లో శ్రీవల్లికి మహారాణిలా స్వాగతం పలుకుతూ తెగ బిల్డప్ కొడతారు. వల్లి తన తండ్రి తలపై కాలు పెట్టి కుర్చీలో రాణిలా కూర్చుంటుంది. శభాష్ అమ్మడూ, నిన్ను కన్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇడ్లీ కడుపున ఇడ్లీ పుడుతుందని నిరూపించావని ఇడ్లీ బాబాయ్ అంటాడు. పులి కడుపున పులే పుట్టింది. పాము పుట్ట నుంచి పాము బయటకు వచ్చిందని నిరూపించావ్. ఎలాంటి కాపురాన్ని అయినా కూలగొట్టేస్తావని కూతురిని పొగిడేస్తుంది భాగ్యం.

ఈ హీరో హీరోయిన్ కాపురంలో మంట పెట్టి విడగొట్టామంటూ ధీరజ్, ప్రేమ ఫొటోలను మంటల్లో వేస్తుంది వల్లి. ఇక ఈ మెయిన్ క్యారెక్టర్ కాపురం కూడా కూల్చేస్తే నేనే తిరుగులేని శక్తిని అని నర్మద, సాగర్ ఫొటోను కూడా మంటల్లో వేస్తుంది. ఆ మంట చుట్టూ ఊగిపోతూ డ్యాన్స్ చేస్తుంది సైకో ఫ్యామిలీ.

నర్మదపై సాగర్ కోపం

ఇక ప్రేమ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిందని కోపంతో సాగర్ కు చెప్తుంది నర్మద. వాడు అవమానించాడు. ధీరజ్ ఏ కాదు నువ్వు చేసింది కూడా తప్పే. నేను ఏదైనా తప్పు చేస్తే బూతద్దంలో చూస్తావ్. కానీ ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచావని సాగర్ అంటాడు. ఈ విషయాన్ని చెప్పొద్దని మీ తమ్ముడు నా దగ్గర మాట తీసుకున్నాడు. సాటి అమ్మాయి ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు నిజం చెప్పలేదని నర్మద అంటుంది. అన్ని సార్లు నువ్వు రైట్ కాదని భార్యపై కోప్పడతాడు సాగర్.

ఇటు రామరాజు, తిరుపతి మందు కొడతారు. నా బుజ్జమ్మ కోసం ఎన్ని మాటలు పడ్డారా? కానీ నా బుజ్జమ్మ నన్ను మోసం చేసిందిరా అని మందు తాగుతాడు రామరాజు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More