Illu Illalu Pillalu July 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. తండ్రికి వెన్నుపోటు- లంచానికి సాగర్ అలవాటు- ప్రేమకు షాక్
Illu Illalu Pillalu July 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 15 ఎపిసోడ్ లో రెండు అదిరే ట్విస్ట్ లో చోటు చేసుకున్నాయి. తండ్రి మాటలను గంగలో వదిలేసిన సాగర్ లంచం తీసుకుంటాడు. మరోవైపు మోపిదేవి ఎస్ఐ నుంచి కాల్ రావడంతో ప్రేమ వణికిపోతుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోండి.
Illu Illalu Pillalu July 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 15 ఎపిసోడ్ లో సాగర్ లంచం తీసుకోవడం హైలైట్ గా నిలిచింది. అంతే కాకుండా మోపిదేవి పోలీస్ స్టేషన్ నుంచి ప్రేమకు కాల్ రావడం కథను మలుపు తిప్పింది. ఫుల్ ఎపిసోడ్ చూసేయండి.

ఎస్ఐ కోచింగ్ కు ప్రేమ
ప్రేమను ఎస్ఐ కోచింగ్ కు తీసుకెళ్తాడు ధీరజ్. డబ్బులు బాగా కట్టించుకున్నారు, గిట్టుబాటు అయ్యేలా బాగా చదువు అని ప్రేమకు చెప్తాడు ధీరజ్. డబ్బులు తక్కువ కట్టు, తక్కువ చదువుతా అని ప్రేమ కౌంటర్ వేస్తుంది. క్లాస్ లోకి వెళ్లేందుకు ప్రేమ భయపడుతుంది. ఈ ఒక్క రోజుకు నాతో పాటు క్లాసులో కూర్చోమ్మని ధీరజ్ ను అడుగుతుంది.
భార్య కోసం
ధీరజ్ ను క్లాస్ లో కూర్చోబెట్టి కాసేపు ఇక్కడే ఉందామని ధీరజ్ బయట వెయిట్ చేస్తాడు. కిటికీలో నుంచి ప్రేమ ఏం చేస్తుందోనని చూస్తాడు. నా బంగారం ఎస్ఐ పోస్టు ష్యూర్ గా కొట్టేస్తుందని అనుకుంటాడు. కానీ ప్రేమ హాయిగా పడుకుంటుంది. ధీరజ్ కాఫీ తీసుకొని వస్తాడు. అందరూ నవ్వుకుంటారు. ధీరజ్ మధ్యలో ఏదో ఒకటి తినడానికి తెస్తూ క్లాస్ డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. నీకు దండం పెడతానని ప్రేమ అంటే ధీరజ్ వెళ్లిపోతాడు.
సాగర్ లంచం
మరోవైపు ఆఫీస్ లో సాగర్ బిజీగా వర్క్ చేస్తుంటాడు. అప్పుడే ఓ కాంట్రాక్టర్ వస్తాడు. రోడ్డు కాంట్రాక్ట్ బిల్ మీద సంతకం చేసేందుకు స్మాల్ గిఫ్ట్ అని టేబుల్ మీద లంచంగా డబ్బు పెడతాడు. ఎవరైనా చూస్తారని సాగర్ కంగారు పడతాడు. ఆఫీస్ బాయ్ ను పిలుస్తాడు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఏం కాదు సార్ సంతకం పెట్టేయండని ఆఫీస్ బాయ్ చెప్తాడు.
కానీ నిజాయతీ తప్పకూడదని తండ్రి చెప్పిన మాటలు సాగర్ కు గుర్తుకొస్తాయి. చచ్చిపోయిన పర్వాలేదు కానీ విలువలను తప్పకూడదని రామరాజు చెప్పిన మాటలను తలుచుకుంటాడు సాగర్. కానీ సంతకం మాత్రం పెట్టేస్తాడు. దీంతో తండ్రి మాటలను పట్టించుకోకుండా లంచానికి అలవాటై వెన్నుపోటు పొడిచాడు.
పానకంలో పుడకలా
ఇంట్లో రామరాజుకు వేదవతి స్పీడ్ గా సేవలు చేస్తుంటుంది. కా అనేసరికే కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. ఇన్నేళ్లుగా కాపురం చేస్తున్నా. మీకు ఏం కావాలో నాకు తెలియదా అని కాఫీ ఇస్తుంది బుజ్జమ్మా. ఇవాళ కాఫీ ఎందుకు ఇంత బాగుందని రామరాజు అడుగుతాడు. అప్పుడే నర్మద వస్తుంది. పానకంలో పుడకలా వచ్చావేంటే అని వేదవతి అడుగుతుంది.
రొమాన్స్ కు అడ్డుగా
మీ రొమాన్స్ కు అడ్డుపడ్డానా అని అత్తతో నర్మద కొంటెగా అంటుంది. అత్తతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి?, అత్త అంటే భయపడాలే అని వేదవతి చెప్తుంది. ఏంటీ ఆ గుసగుసలు అని రామరాజు అడుగుతాడు. ప్రేమను ఎస్ఐ కోచింగ్ కు పంపించేందుకు మామయ్య ఒప్పుకొన్నారంటే కచ్చితంగా భూకంపమో, సునామీనే వస్తుందంటుందని నర్మదను ఇరికిస్తుంది వేదవతి.
వేదవతి కోరిక
నీకోసమే ఒప్పుకొన్నా బుజ్జమ్మా. ఈ పాతికేళ్లలో నువ్వు ఏదీ అడగలేదు. ప్రేమ చదువు గురించి నువ్వు బతిమిలాడుతుంటే చూడలేకపోయానని రామరాజు చెప్తాడు. అయితే నాదో చిన్న ఇష్టం ఉంది తీరుస్తారా? అని వేదవతి అడుగుతుంది. ఈ సారి మా అమ్మ పుట్టిన రోజును మన ఇంట్లో చేయాలని ఉందని అడుగుతుంది. కానీ మీ వాళ్లు ఒప్పుకొంటారా? నెరవేరని ఆశలు పెట్టుకోకు. ఎంత ఎక్కువగా అనుకుంటే, అంత ఎక్కువగా బాధ పడాల్సి ఉంటుందని చెప్పి రామరాజు లోపలికి వెళ్లిపోతాడు.
ఇటు అత్తాకోడలు వేదవతి, నర్మద ఫన్నీగా కౌంటర్లు వేసుకుంటారు. ఎంతసేపు భర్తతో రొమాన్స్ కాదు కోడలికి కాఫీ ఇవ్వాలని లేదా? అని నర్మద అడుగుతుంది. ఇది నాకు కోడలు కాదు, అత్తగా మారిందని వేదవతి అనుకుంటుంది.
ప్రేమ టెన్షన్
క్లాస్ కంప్లీట్ అయిన ప్రేమ బయటకు వస్తుంది. అప్పుడే మోపిదేవి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రేమకు కాల్ చేస్తాడు. ఎనిమిది నెలల క్రితం మీరు మోపిదేవికి వచ్చారు కదా. గుడి దగ్గర లాడ్జీలో స్టే చేశారా లేదా? అయితే వెంటనే ఆ లాడ్జీ దగ్గరకు రండని ఎస్ఐ చెప్తాడు. ఎందుకు అని ప్రేమ టెన్షన్ తో అడుగుతుంది. మీరు స్టే చేసిన రోజే ఆ లాడ్జీలో ఒక నేరం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ఎంక్వైరీ చేయాలని ప్రేమను త్వరగా రమ్మంటాడు ఎస్ఐ.
వేదవతి కంగారు
కేసు ఏంటీ అని ప్రేమ అడిగితే ఆ ఎస్ఐ చెప్పడు. సహకరించకపోతే అరెస్ట్ చేస్తానని భయపెడతాడు. ఈ విషయాన్ని ధీరజ్ కు చెప్తుంది ప్రేమ. భయపడాల్సిన పని లేదు, ధైర్యంగా వెళ్దామని ప్రేమను తీసుకెళ్తాడు ధీరజ్. నర్మదకు కాల్ చేసి మోపిదేవికి వెళ్తున్న విషయాన్ని చెప్తుంది ప్రేమ. నేను కూడా వచ్చేదాన్ని అని నర్మద చెప్తుంది. అంత టైమ్ లేదని ప్రేమ అంటుంది.
ఈ విషయాన్ని వేదవతికి చెప్తుంది నర్మద. దీంతో వేదవతి కంగారు పడుతుంది. ఇల్లు అంతా ప్రశాంతంగా ఉందనుకుంటే ఇంత పెద్ద ప్రమాదం వచ్చిందేంటీ అని టెన్షన్ పడుతుంది. ఇది ఏదో పెద్ద సమస్యే అయి ఉంటుందని భయపడుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


