Illu Illalu Pillalu July 8 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. రామరాజు హార్ట్ బ్రేక్- భర్తకు నిజం చెప్పొద్దని వేదవతికి మాట

Illu Illalu Pillalu July 8 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 8 ఎపిసోడ్ లో కథ ఇంట్రెస్టింగ్ మలుపు తిరిగింది. వల్లికి వేదవతి మరో ఛాన్స్ ఇస్తుంది. అంతే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ప్రామిస్ తీసుకుంటుంది. మరి నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో పూర్తి వివరాలు మీ కోసం. 

Published on: Jul 8, 2026, 07:58:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu July 8 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 8 ఎపిసోడ్ లో శ్రీవల్లికి వేదవతి మరో ఛాన్స్ ఇస్తుంది. ఆమె చేసిన మోసం గురించి రామరాజుకు తెలియొద్దని అందరితో ప్రామిస్ చేయించుకుంటుంది. ఇంకా ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

చందు నో

శ్రీవల్లి డ్రామా గురించి తెలిసిన వేదవతి అండ్ ఫ్యామిలీ ఆమెను తన పుట్టింట్లో వదిలేస్తారు. దీంతో వల్లి బావిలో దూకుతుంది. ధీరజ్ వెంటనే తనను కాపాడతాడు. బా లేకపోతే చచ్చిపోతానని వల్లి ఏడుస్తుంది. దీంతో వేదవతి కరుగుతుంది. కానీ వల్లిని ఇంటికి తీసుకొస్తానంటే ఒప్పుకోనని తల్లికి చందు చెప్తాడు.

మామయ్య చూసుకుంటారని

అది చేసింది మోసమే. కానీ ప్రాణాలు తీసుకోబోయింది. మనం వెళ్లిన తర్వాత ప్రాణాలు తీసుకుంటానంటుంది. చూస్తూ చూస్తూ ప్రాణాలు పణంగా పెట్టమంటావా? అని చందును వేదవతి అడుగుతుంది. ఈ సంబంధం చూసింది మామయ్యనే కదా, ఆయనే చూసుకుంటారని నర్మద చెప్తుంది. కానీ నమ్మించి మోసం చేశారనే బాధను ఆయన తట్టుకోలేరని వేదవతి అంటుంది.

వల్లికి ఒక్క ఛాన్స్

మామయ్యకు వల్లి వాళ్ల గురించి చెప్తే ఇంటికి రానివ్వడు. వీళ్లను క్షమించడని ప్రేమ చెప్తుంది. చావు వరకు వెళ్లి వచ్చింది కాబట్టి క్షమించి ఒక్క అవకాశం ఇద్దామని వేదవతి అంటుంది. కానీ చందు అందుకు ఒప్పుకోడు. పొరపాటును ఏదైనా చేసుకుంటే అందుకు కారణం మనమే అవుతామని వేదవతి అంటుంది. అందుకు కారణం నేను కాను, తాను ఇంటికి రావడానికి కారణం కూడా నేను అవ్వను అని చందు తెగేసి చెప్పి వెళ్లిపోతాడు.

రామరాజు కంగారు

వాళ్ల అమ్మ చేసిన తప్పునకు వల్లిని బలి చేయడం సరికాదనిపిస్తోంది. పైగా ప్రాణాలు కూడా తీసుకోబోయింది. ఈ ఒక్కసారికి క్షమిస్తే ఏమవుతుంది? చివరి అవకాశం ఇస్తే కాపురాన్ని చక్కదిద్దుకుంటుంది కదా అని వేదవతి అంటుంది. మీ ఇష్టం అత్తయ్య అని నర్మద చెప్తుంది. అప్పుడే రామరాజు వస్తాడు. ఏమైంది? మీరందరూ ఇక్కడ ఎందుకు ఉన్నారు? వల్లి గురించి చెప్పాల్సిన విషయాలు ఏంటీ? అని ప్రభాకర్ గట్టిగా అడుగుతాడు.

వల్లి బావిలోకి దూకిందని

వల్లి బావిలోకి దూకేసిందని సుక్కు చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. రామరాజు హార్ట్ బ్రేక్ అవుతుంది. బుజ్జమ్మా.. కోడలు బావిలో దూకడం ఏంటీ? ప్రాణాలు తీసుకునేంత కష్టం తనకు ఎందుకు వచ్చింది? వల్లి గురించి మీరు ఏదో దాస్తున్నారని రామరాజు అడుగుతాడు. కడుపు పోయిందనే బాధలో మా అమ్మడు ప్రాణాలు తీసుకోబోయింది అన్నయ్య అని భాగ్యం అబద్ధం చెప్తుంది.

వల్లిని ఇంటికి

బిడ్డ పోయిందనే బాధను భరించడం కష్టమే. కానీ ప్రాణాలు తీసుకుంటావా? నీకు ఏమైనా అయితే మేం తట్టుకుని బతకగలమా? బుజ్జమ్మా ఈ టైమ్ లో మీరు ఏం చేస్తున్నారు? మీరు ఓదార్చితే ఈ ఆలోచన వచ్చేదే కాదని రామరాజు ఫీల్ అవుతాడు. తండ్రిలాంటి నేను నీకున్నా, నిన్ను కళ్లలో పెట్టి చూసుకుంటా. నా చేతులతో పెళ్లి చేశా. నీ కళ్లలో నీళ్లు రానిస్తానా. పదమ్మా బయల్దేరుదాం అని రామరాజు ఎమోషనల్ అవుతాడు. మీరు ఇంకోసారి మా గుమ్మం తొక్కితే చంపేస్తానని భాగ్యం, ఇడ్లీ బాబాయ్ కు వేదవతి వార్నింగ్ ఇస్తుంది.

నాన్నకు చెప్తానన్న చందు

మరోవైపు ఇంట్లో చందు బాధపడుతూ ఉంటాడు. మనల్ని అంత మోసం చేసింది నాకు అక్కర్లేదని చందు అంటాడు. ఓ ఆడపిల్ల ప్రాణాలు తీసుకుందంటే ఆ ఉసురు మన కుటుంబానికే తగులుతుంది. నువ్వు వదిలేస్తానంటే అది ప్రాణాలు తీసుకుంటుంది. ఒక్క అవకాశం ఇద్దాం. కచ్చితంగా మారుతుందనే నమ్మకం ఉంది. అమ్మ మాట వినరా అని వేదవతి అడుగుతుంది. ఈ విషయాలు నాన్నకు చెప్తా. నాన్నను మోసం చేసిన కొడుకులా ఉండలేనని చందు అంటాడు.

మాట తీసుకున్న వేదవతి

ఈ విషయాలు చెప్తే మీ నాన్న ప్రాణాలు పోతాయి. కోడలు ప్రాణాలు తీసుకోబోయిందని తెలిస్తేనే ప్రాణం పోతున్నట్లుగా విలవిలలాడిపోతున్నాడు. మరి నిజం తెలిస్తే మీ నాన్న తట్టుకోగలడా? మీ నాన్న కోసం జరిగిన మోసాన్ని భరిద్దాం. నిజాన్ని మనలోనే సమాధి చేద్దాం. ఈ విషయాన్ని మీ నాన్నకు చెప్పనని చందుతో మాట తీసుకుంటుంది వేదవతి. అందరితో కూడా మాట తీసుకుంటుంది వేదవతి.

భార్యపై కోపం

ఇటు రామరాజుకు వల్లి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. బుజ్జమ్మా అని రామరాజు కేకలు వేస్తాడు. కోడలి ఆరోగ్య పరిస్థితి నీకు తెలుసు కదా, మరి ఎందుకు పనులు చేయిస్తున్నారని రామరాజు సీరియస్ అవుతాడు. ఓ మూలకు కూర్చోమంటే ఎందుకు పనులు చేస్తున్నావని వల్లిని వేదవతి అంటుంది. కోడలిని ఎందుకు తిడుతున్నావని భార్యపై అరుస్తాడు రామరాజు.

అప్పుడే అమూల్య, సాగర్ వస్తారు. రేపు కోర్టులో కేసు విచారణ ఉంది. నువ్వు ధైర్యంగా ఉండు అని అమూల్యకు చెప్తాడు రామరాజు.

నర్మద అలక

రాత్రి నర్మద వంట చేస్తుంటుంది. కోపంలో చెంప పగలగొట్టాను, నాతో మాట్లాడుతుందో లేదో అనుకుంటూ నర్మద దగ్గరకు వెళ్తుంది వేదవతి. గుడ్ ఈవ్ నింగ్ గవర్నమెంట్ కోడలా అని వేదవతి పలకరిస్తే నర్మద కోపంగా గిన్నెలతో మ్యూజిక్ వాయిస్తుంది. ఇంతకీ ఏం కూర వండుతుందో మా ముద్దుల కోడలు అని ప్రేమ ఒలకబోస్తుంది వేదవతి.

నర్మదతో వేదవతి మాట్లాడుతుంది. నిన్ను కొట్టినందుకు చాలా ఫీల్ అయ్యానే. వల్లి కడుపు నిజంగానే నువ్వు పోగొట్టావని అనుకున్నా. నాతో మాట్లాడే గవర్నమెంట్ కోడలా అని అడుగుతుంది వేదవతి. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More