ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 12 ఎపిసోడ్: చందు అడిగిన ఆ ప్రశ్నకు శ్రీవల్లి ఫ్యూజులు ఔట్-అడ్డంగా బుక్కైపోయిన బల్లక్కాయ్!

Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 12 ఎపిసోడ్ లో భాగ్యం గ్యాంగ్ రిక్వెస్ట్ తో ఇడ్లీ బాబాయ్ ను రైస్ మిల్ కు తీసుకెళ్లేందుకు చందు ఒప్పుకొంటాడు. ప్రేమ పోరాటాన్ని ధీరజ్ కు నర్మద వివరిస్తుంది. చందు అడిగిన ఒక్క ప్రశ్నతో వల్లి ఫ్యూజులు ఔట్ అవుతాయి.

Published on: Jun 12, 2026, 08:26:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రోజురోజుకూ ఆసక్తికరమైన ట్విస్ట్‌లతో సాగుతోంది. టుడే జూన్ 12 ఎపిసోడ్‌లో చందు అడిగిన ఓ ప్రశ్న శ్రీవల్లిని వణికించింది. అసలు ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే జూన్ 12 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలైట్స్ మీకోసం.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

ప్లాన్ ఫెయిల్

తమ ప్లాన్ ఫెయిల్ అయినందుకు శ్రీవల్లి, భాగ్యం అండ్ గ్యాంగ్ కూర్చుని తెగ ఆలోచిస్తుంటారు. ధీరజ్ జైలుకు వెళ్లిపోయాడు, ప్రేమ ఏడుస్తుంది. నర్మద వేరు కాపురం పెట్టింది. ఇక నా గురించి పట్టించుకోరని కలలు కన్నానని శ్రీవల్లి అంటుంది.

భాగ్యంపై ఫైర్

రౌడీని పట్టుకునేందుకు వెళ్లమని చెప్పింది నువ్వే, ఇప్పుడు క్రెడిట్ నర్మద, ప్రేమకు వెళ్లిందని సుక్కుపై భాగ్యం సీరియస్ అవుతుంది. కానీ రౌడీని పట్టుకోకుండా చేసేందుకు కదా వెళ్లిందని ఇడ్లీ బాబాయ్ అసలు విషయం చెప్పేస్తాడు. మీరు ఈగోకు పోయి సర్వనాశనం చేస్తారని నాకు తెలుసని సుక్కు అంటుంది. నీతో పాటు నీ బుర్ర కూడా ముసలిది అయిపోయిందని అమ్మపై శ్రీవల్లి ఫైర్ అవుతుంది.

మురిసిపోయిన వల్లి

అప్పుడే చందు వస్తాడు. కొంపలు కూల్చడమే తెలుసనుకున్నా. ఇన్నాళ్లకు ఓ మంచి పని చేశారు. ఆ దొంగను పట్టుకోవడంలో మీరు కూడా హెల్ప్ చేశారంట కదా అని చందు అనడంతో భాగ్యం బ్యాచ్ తెగ మురిసిపోతుంది. వీళ్లు కూడా మారిపోయారు. వీళ్లను క్షమించు బ్రో అని చందుకు సుక్కు చెప్తుంది. రౌడీతో చేసిన భీకర పోరాటంలో మా అత్తకు నడుం, మా మామకు మోకాళ్లు పడిపోయాయని సుక్కు డ్రామా చేస్తుంది.

రైస్ మిల్ కు ఓకే

శ్రీవల్లి ఆ డ్రామాను మరింత ఎక్కువ చేస్తుంది. మా నాన్నను రైస్ మిల్ కు తీసుకెళ్లాలని చందును అడుగుతుంది శ్రీవల్లి. భాగ్యం కూడా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. అందరూ కలిసి బతిమిలాడేసరికి చందు సరేనంటాడు. ఆకలికి ఇబ్బంది పడుతున్నారని జాలి పడి ఒప్పుకొంటున్నా. బుద్ధిగా ఉండాలి. రేపటి నుంచి మిల్లుకు రండని చెప్పి చందు వెళ్లిపోతాడు.

నర్మద వార్నింగ్

అప్పుడే వచ్చిన నర్మద మీరు కరెక్ట్ టైమ్ కు అక్కడికి ఎలా వచ్చారు? ఏం సుక్కు ఇలాంటి ఏజెంట్ వ్యవహారాలు కూడా చూసుకుంటున్నావా? అని నర్మద అడుగుతుంది. ఇడ్లీ బాబాయ్ ను రైస్ మిల్ కు పంపించడం వెనుక ఏదో కారణం ఉందని నాకు అనిపిస్తోంది. మీరు ఎన్ని డ్రామాలు వేసినా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టనని నర్మద వార్నింగ్ ఇస్తుంది.

భద్రావతి కొత్త కుట్ర

మరోవైపు ఇంట్లో వస్తువులన్నింటినీ భద్రావతి విసిరేస్తుంది. పిల్లా బచ్చాగాడు ధీరజ్ నాకు వార్నింగ్ ఇస్తాడా? అని మండిపోతుంది. దీనంతటికీ కారణం ప్రేమనే అని సేనాపతి అంటాడు. సిగ్గుగా ఉంది సేనా, అవమానంగా ఉంది. కూలోడి కుటుంబం మీద పగ తీర్చుకోలేకపోతున్నామని భద్రావతి అంటుంది. ఆ రోజు రామరాజుకు వేదవతి, ఇప్పుడు ధీరజ్ కు ప్రేమ రక్షణ కవచంలా ఉన్నారని సేనాపతి ఊగిపోతాడు.

ఫస్ట్ మనం గురిపెట్టాల్సింది ధీరజ్ మీదే. అరెస్టు కేసులు కాకుండా మరోలా టార్గెట్ చేద్దాం. ధీరజ్ ను కొట్టబోయే దెబ్బకు వాడి కుటుంబం ఎలా కాపాడుకుంటుందో చూద్దాం అని భద్రావతి కొత్త కుట్ర కోసం ఆలోచిస్తుంది.

ధీరజ్, ప్రేమ లవ్

సీన్ రామరాజు ఇంటికి మారుతుంది. ధీరజ్ కు వేడి నీళ్లతో ప్రేమ కాపడం పెడుతానంటుంది. నువ్వు ఇలా సేవలు చేస్తానంటే ఇంకా ఎక్కువ దెబ్బలు తినేవాడిని కదా అని ధీరజ్ అంటాడు. ప్రేమ చేతికి తగిలిన దెబ్బలను చూసి ఫీల్ అవుతాడు. యువరాణిలా పెరిగావు, చిన్న దెబ్బలు కూడా ఓర్చుకోలేవని భార్య దెబ్బలకు ఆయింట్మెంట్ పెడతాడు ధీరజ్.

నర్మద డ్యుయల్ రోల్

అప్పుడే నర్మద వస్తుంది. ప్రేమ వాళ్ల పుట్టింటికి వెళ్లి చేసిన బీభత్సం తెలిస్తే ఏమైపోతావో అని ప్రేమ చేసినట్లు నర్మద చేసి చూపిస్తుంది. భద్రావతి, ప్రేమలా డ్యుయల్ రోల్ ప్లే చేస్తుంది. ఏమో రాక్షసి, నా కోసం మీ వాళ్లను కొట్టడానికి వెళ్లావా? అని ప్రేమను ధీరజ్ అడుగుతాడు. అవసరమైతే దేవుడినైనా ఎదురిస్తానని ప్రేమ అనగానే.. ధీరజ్ ప్రేమగా చేతులకు ముద్దులు పెడతాడు. ప్రేమను హగ్ చేసుకుంటాడు.

హార్ట్ బీట్ వినాలని

ఉదయం చందు రెడీ అవుతుంటే శ్రీవల్లి వచ్చి తల దువ్వుతుంది. చందుపై తెగ ప్రేమ కురిపించేస్తుంది. మా నాన్నను రైస్ మిల్ కు తీసుకెళ్తున్నావ్ కదా, అందుకే గౌరవంతో కూడిన ప్రేమ పెరిగిందని వల్లి అంటుంది. నాకు మన బిడ్డ హార్ట్ బీట్ వినాలని ఉందని చందు అనడంతో వల్లి ఫ్యూజులు ఔట్ అయిపోతాయి. ఇప్పుడు ఎందుకు బా అని తడబడుతూ అంటుంది.

బిడ్డ ఇప్పుడు నిద్ర పోతూ ఉంటుంది అని వల్లి ఎస్కేప్ అవాలని చూస్తుంది. కానీ చందు వదలడు. వల్లి కడుపుపై చెవి పెడతాడు. ఇక్కడితో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. మరి చందుకి శ్రీవల్లి అబద్ధం తెలిసిపోతుందా? భద్రావతి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది రేపటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే!

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More