ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 11 ఎపిసోడ్: ధీరజ్ విడుదల.. మేనత్త భద్రావతికి ప్రేమ ఊహించని షాక్! ధీరజ్ 'మడత కాజా' వార్నింగ్!

Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 11 ఎపిసోడ్ లో హై డ్రామా చోటు చేసుకుంది. వీడియో చూపించినా ఎస్సై వినకపోవడంతో నర్మద రంగంలోకి దిగుతుంది. ఎస్పీ దగ్గరకు వెళ్తామని చెప్పడంతో ధీరజ్ ను వదిలేస్తారు. ప్రేమ, ధీరజ్ కలిసి భద్రావతికి గట్టి వార్నింగ్ ఇస్తారు.

Published on: Jun 11, 2026, 07:42:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu June 11 Episode: టీవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ టుడే జూన్ 11 ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ధీరజ్ కోసం భార్య ప్రేమ, తోటికోడలు నర్మద చేసిన వీరోచిత పోరాటం ఈరోజు ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచింది. మరి ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే జూన్ 11 పూర్తి ఎపిసోడ్ ను ఓ సారి చదివేయండి.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

పోలీస్ స్టేషన్‌లో హై-వోల్టేజ్ డ్రామా

ధీరజ్ కార్లో రౌడీ డ్రగ్స్ పెట్టిన వీడియోను ప్రేమ చూపించడంతో ఎస్సై షాక్ అవుతాడు. అయితే లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయని, ఎంక్వైరీ తర్వాత చూస్తామని ఎస్సై నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తాడు.

కానీ చదువుకున్న నర్మద రంగంలోకి దిగి.. "నేను సివిల్ సర్వెంట్‌ని, నాకు రూల్స్ తెలుసు. ఇప్పుడు ధీరజ్‌ను రిలీజ్ చేయకపోతే ఎస్పీ దగ్గరకు వెళ్తాం, అప్పుడు మీ గుట్టు రట్టవుతుంది" అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. దీంతో భయపడిన ఎస్సై.. ధీరజ్‌ను వదిలేస్తాడు. బయటకు రాగానే ధీరజ్-ప్రేమ ఎమోషనల్‌గా హగ్ చేసుకుంటారు. కోడళ్ల ధైర్యాన్ని చూసి మామ రామరాజు గర్వంతో పొంగిపోతాడు.

ఇంటికి ధీరజ్

మరోవైపు ఇంట్లో ధీరజ్ కోసం వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంటే.. శ్రీవల్లి, సుక్కు వెటకారంగా మాట్లాడుకుంటారు. అంతలోనే ధీరజ్ క్షేమంగా ఇంటికి రావడంతో వేదవతి ఎమోషనల్ అవుతుంది. అది చూసి శ్రీవల్లికి కళ్లు తిరుగుతాయి. అయితే ఆ వెంటనే ధీరజ్‌ను తీసుకుని ప్రేమ తన పుట్టింటికి వెళ్తుంది. భద్రావతి అని అరుస్తుంది.

భద్రావతికి ప్రేమ, ధీరజ్ కౌంటర్లు

బయటకు వచ్చిన మేనత్త భద్రావతి, సేనాపతి.. ధీరజ్ ను చూసి షాక్ అవుతారు. "భర్తతో బంధం తెంచుకుంటేనే బయటకు తెస్తానన్నారు కదా.. మీ కుట్రలు తిప్పికొట్టడం నాకు తెలుసు. మా బంధాన్ని ఎవరూ విడదీయలేరు" అని ప్రేమ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.

దీనికి తోడు ధీరజ్ కూడా ఎంటర్ అయి.. "భద్రం, కొంపలు కూల్చే కుంపటి కార్యక్రమానికి కథానాయిక నువ్వేనన్నమాట.. మా మామ చిడతల బ్యాచ్ అన్నమాట" అంటూ సెటైర్లు వేస్తాడు. అంతేకాదు, "నన్ను గెలికారు కదా, రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. మీ ఇద్దరికీ 'మడత కాజా' తినిపిస్తా.. వెయిట్ అండ్ సీ" అంటూ ధీరజ్ మాస్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

కోడళ్లు బంగారాలు

ధీరజ్ కు దిష్టి తీయమని శ్రీవల్లిని వేదవతి తిడుతుంది. ఇక ధీరజ్‌ను కాపాడింది ప్రేమ, నర్మద అని భాగ్యం, ఇడ్లీ బాబాయ్ వచ్చి ఇంట్లో వాళ్లకు జరిగింది చెప్తారు. ఆ ఇద్దరు కోడళ్లు రౌడీని ఎలా చితక్కొట్టారో, కరాటే ఫైట్స్ ఎలా చేశారో కళ్లకు కట్టినట్టు వివరించడంతో.. "నా కోడళ్లు బంగారాలు" అని వేదవతి మెచ్చుకుంటుంది. ఇది చూసి శ్రీవల్లి కుళ్లుతో రగిలిపోతుంది.

సాగర్ అసూయ.. రామరాజు క్లారిటీ!

చివర్లో ధీరజ్ తన అన్న సాగర్‌ను చూసి.. "నా కోసం పోలీస్ స్టేషన్‌కు ఎందుకు రాలేదు?" అని అడుగుతాడు. దానికి సాగర్ ఎప్పటిలాగే కుళ్లుబుద్ధితో.. "నా మీద నాకే జాలిగా ఉంది. నా జాబ్ విషయంలో ఎప్పుడూ గొడవ చేసే నాన్న, నువ్వు ఇంత పెద్ద నేరంలో అరెస్ట్ అయినా నమ్మాడు. నీ ప్లేస్‌లో నేను ఉంటే నన్ను ఇల్లు దాటించేవాడు" అంటూ సాగర్ నానా మాటలు అంటాడు.

దానికి రామరాజు స్పందిస్తూ.. "తప్పు చేసిన కొడుకును దండించడమే కాదు, కష్టపడే కొడుకుకు అండగా ఉండటమూ తండ్రి బాధ్యతే" అని సాగర్ నోరు మూయిస్తాడు. ఇక్కడితో ఈ రోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More