ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 3 ఎపిసోడ్: ధీరజ్ దెబ్బకు వల్లి మొసలి కన్నీరు లీక్.. నర్మద ఉప్మా రచ్చ.. భద్రావతి డ్రగ్స్ కుట్ర

Illu Illalu Pillalu June 3 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 3 ఎపిసోడ్ లో ధీరజ్ మధ్యలో వచ్చి వల్లి డ్రామాను బయట పెట్టేస్తాడు. మరోవైపు ఉప్మా చేయడం కోసం నానా తిప్పలు పడ్డ నర్మద, దాన్ని మాడిపోయేలా చేస్తుంది. ధీరజ్ ను అరెస్టు చేయించేలా భద్రావతి ప్లాన్ స్టార్ట్ చేస్తుంది.

Published on: Jun 3, 2026, 07:58:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu June 3 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 3 ఎపిసోడ్ లో.. ఇడ్లీ బాబాయ్ ను రైస్ మిల్ లో కూర్చోబెట్టాలనే వల్లి ప్లాన్ ను ధీరజ్ అడ్డుకుంటాడు. నర్మద మాడిపోయిన ఉప్మాతో రచ్చ చేస్తుంది. భద్రావతి తన కుట్ర అమలు చేస్తుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

వల్లి మొసలి కన్నీరు

నాన్నకు వడదెబ్బ తగిలి కింద పడిపోయాడంటా అని చందు ముందు శ్రీవల్లి తెగ డ్రామా ఆడుతుంది. మా అమ్మానాన్న తెలిసో తెలియకో తప్పు చేశారు. సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు బావ. నువ్వు పెద్ద మనసు చేసుకుని మా నాన్నను రైస్ మిల్ కు తీసుకెళ్లు బావ అని అసలు విషయాన్ని మెల్లగా బయటపెడుతుంది వల్లి. తెగ మొసలి కన్నీరు కారుస్తుంది. చందు సరేనంటాడు.

షాకిచ్చిన ధీరజ్

అప్పుడే టిఫిన్ పొట్లాలతో ధీరజ్ ఎంట్రీ ఇస్తాడు. వదినను టిఫిన్ చేయమంటాడు. కడుపుతో ఉన్నారని టైమ్ కు తినమంటాడు. చందు కూడా తినమని చెప్తాడు. దీంతో పార్శిల్ తెచ్చిన టిఫిన్ ను వల్లి తింటుంది. ఈ ఇడ్లీ, చట్నీ మా నాన్న చేసినట్లే ఉన్నాయి, ఎవరో కాపీ కొట్టారని వల్లి అంటుంది. ఈ టిఫిన్ మీ నాన్న దగ్గరే తీసుకొచ్చా. పాట పాడుతూ ఫుల్ జోష్ లో ఉన్నాడు మీ నాన్న అని ధీరజ్ షాకిస్తాడు.

వదిన డ్రామాలు

మీ నాన్నకు వడదెబ్బ తగిలిందని చెప్పావని వల్లిపై చందు ఫైర్ అవుతాడు. రగులుతుంది మొగలి పొద అని స్టెప్పులు వేస్తున్నాడు. వదిన వాళ్ల నాన్నను రైస్ మిల్ లో ల్యాండ్ చేసేందుకు డ్రామాలు ఆడుతుంది, జాగ్రత్త అన్నయ్య అని ధీరజ్ అంటాడు. నువ్వు ఇక జన్మలో మారవని తిట్టి చందు వెళ్లిపోతాడు.

నర్మద ఉప్మా కష్టాలు

సీన్ కట్ చేస్తే కిచెన్ లో నర్మద తెగ కష్టపడుతుంది. పెద్ద పొగ వస్తుందని కిచెన్ లోకి వేదవతి పరుగెత్తుకుంటూ వస్తుంది. ఉప్మా మొత్తం మాడిపోయిందని అత్తయ్య అడుగుతుంది. మంట ఎంత పెట్టాలో తెలియలేదని నర్మద చెప్తుంది. ఉప్మా ఎలా వండాలో తెలియదా అని వేదవతి అడుగుతుంది. వంట సరిగా రాదని నర్మద చెప్పేసరికి వేదవతి కంగుతింటుంది.

సాగర్ బిల్డప్

మీ కొడుక్కి వంట నేర్పించకుండా ఏం చేస్తున్నారు? మగపిల్లలను పెంచే పద్ధతి ఇదేనా? అని అత్తపై సెటైర్లు వేస్తుంది నర్మద. వెంటనే నర్మద చెవి పిండేస్తుంది వేదవతి. అప్పుడే సాగర్ సరుకులు తెచ్చి నర్మద అని పిలుస్తాడు. కొంతమంది ఎగతాళిగా మాట్లాడారు. అందుకే రెండు నెలలకు సరిపడా సరుకులు తెచ్చానని సాగర్ బిల్డప్ గా చెప్తాడు.

వదినకు వంట రాదని

నువ్వు ఎన్ని వస్తువులు తెస్తే ఏంటి వేరు కాపురం అన్నాయ్. వదినకు వంట రావాలి కదా అని ధీరజ్ చెప్తాడు. నాకెందుకు వంట రాదు? ఇప్పుడే ఉప్మా చేశానని టిఫిన్ తీసుకొని వస్తుంది నర్మద. ఉప్మా అంటే తెల్లగా ఉండాలి కదా. నల్ల ఉప్మాలు కూడా వచ్చాయా? అని సాగర్ అమాయకంగా అడుగుతాడు. అది మాడిపోయిన సంగతి కూడా తెలియడం లేదని ధీరజ్ నవ్వుతాడు.

రెచ్చగొట్టేలా

అప్పుడే ప్రేమ తెచ్చిన ఉప్మాను ధీరజ్ తెగ పొగిడేస్తాడు. మంచు కంటే తెల్లగా, నేతి వాసన ముక్కుకు తాకుతుందని సాగర్ ను ఊరిస్తాడు ధీరజ్. మీ అమ్మ చేశారు కాబట్టి అదిరిపోతుందని నర్మద అంటుంది. ఓ ముద్ద నోట్లో పెట్టుకుని అద్భుతమని ధీరజ్ పొగిడేస్తాడు. అమ్మ చేతి వంట తినాలంటే లక్ ఉండాలంటాడు. వేరు కాపురం పెట్టకపోతే తినేవాడు కదా అని ధీరజ్ అంటాడు.

నడిపోడా బాక్స్ లో పెట్టిస్తా, ఆఫీస్ కు వెళ్లి తినమంటుంది వేదవతి. అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది నర్మద. మా ఆయనకు సిగ్గు, రోషం, పౌరుషం లేదనుకుంటున్నారు. అవసరమైతే రెండు మూడు రోజులు పస్తులుంటామని నర్మద సెటైరికల్ గా అంటుంది. ధీరజ్ మరింత రెచ్చగొడతాడు. అవసరమైతే బయట తింటానని సాగర్ అంటాడు. ఆకలేస్తుందని అనుకుంటూ సాగర్ లోపలికి వెళ్లిపోతాడు.

భద్రావతి ప్లాన్

సీన్ కట్ చేస్తే ధీరజ్ ను కేసులో ఇరికించడానికి భద్రావతి మనుషులు, పోలీసులు రెడీగా ఉంటారు. అప్పుడే కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసేందుకు ప్రేమను తీసుకెళ్తానని ధీరజ్ అంటాడు. కానీ ప్రేమ వద్దంటుంది. సరేే లోపలికి పదా, నువ్వు ఫస్ట్ నైట్ కు రెడీ అవ్వు అని ధీరజ్ చెప్తాడు. కోచింగ్ సెంటరా? శోభనమా? డిసైడ్ అవ్వు అని ధీరజ్ సీరియస్ గా చెప్తాడు. సరే, రూమ్ లోకి పదా అని ప్రేమ ట్విస్ట్ ఇస్తుంది.

మాట ఇచ్చావ్ పదా అని ప్రేమను బలవంతంగా కార్లో కూర్చోబెడతాడు. ఇదంతా భద్రావతి, సేనాపతి చూస్తారు. అక్క కార్లో ప్రేమ కూడా వెళ్తుంది, ప్రేమకు ఏదైనా ప్రాబ్లెం అవుతుందేమోనని సేనాపతి కంగారు పడతాడు. ప్రేమకు ఏం కాదని భద్రావతి చెప్తుంది. కారు స్టార్ట్ కాగానే తన మనిషికి కాల్ చేస్తుంది భద్రావతి. ఈ రోజు ఆ రామరాజు చిన్న కొడుకు జీవితం ఫినిష్ అని సేనాపతితో భద్రావతి చెప్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More