ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 30 ఎపిసోడ్: డ్రగ్స్ కేసులో ధీరజ్-ఎస్సైతో భద్రావతి ప్లాన్- నర్మదకు పుట్టింటి సారె తెచ్చిన తండ్రి
Illu Illalu Pillalu Serial May 30th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మే 30వ ఎపిసోడ్‌లో ఇల్లు ముక్కలు కావడానికి కారణం మీరేనని భాగ్యంను నిలదీస్తారు ధీరజ్, నర్మద. దాంతో తప్పించుకునేందుకు భాగ్యంను కొడతాడు ఇడ్లీ బాబాయ్. ధీరజ్‌ను డ్రగ్స్ కేసులో ఇరికించేలా ఎస్సైతో ప్లాన్ చేస్తారు భద్రవాతి, సేనాపతి.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో భాగ్యం కుట్ర తెలిసి నర్మద తిడుతుంది. అసలు ఏ కుట్ర గురించి అంటున్నారు, ఏ విషయం తెలిసిందో చెప్పమని ఇడ్లీ బాబాయ్ అంటాడు. దాంతో ధీరజ్ ఒక్కటి లాగిపెడతాడు. చెప్పాలని లేకుంటే చెప్పకు. కానీ ఇలా కొడతావా అని ఇడ్లీ బాబాయ్ అంటే మరోటి కొడతాడు ధీరజ్.

అంతా చేసింది ప్రసాద్ రావు కదా
మా అన్నయ్య మా నుంచి విడిపోయేలా చేసింది మీరే కదా. మా ఇల్లు ముక్కలు చేశారని ధీరజ్ అంటాడు. అయ్యో రామ అదంతా చేసింది నర్మద వాళ్ల నాన్న ప్రసాద్ రావు కదా. లాయర్‌ను తీసుకొచ్చి గొడవ చేసింది ఆయనే కదా అని భాగ్యం అంటుంది. ఆపుతావా. మీరు వెళ్లి మా నాన్నకు లేనిపోనివి నూరిపోయడం వల్లే అలా చేశారు. మీరు పెట్టిన మంట వల్లే ఇల్లు రెండుగా ముక్కలైందని నర్మద కోపంగా అంటుంది.
క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని భాగ్యంతో ఇడ్లీ బాబాయ్ అంటాడు. మీ నాన్నతోనే మాట్లాడనేలేదు. మీ ఇల్లే మాకు తెలియదు. మేము పూర్తిగా మారిపోయామని భాగ్యం కవర్ చేస్తుంది. దాంతో ఇడ్లీ బాబాయ్‌ను మరోటి లాగిపెట్టి కొట్టిన ధీరజ్ మీరెళ్లి ప్రసాద్ రావు మామకు చెప్పడం వల్లే అలా జరిగిందని మాకు తెలుసు. మీరు ఏ ఉద్దేశంతో అలా చేశారో చెప్పండని అడుగుతాడు.
మీరు చేసిన తప్పు నుంచి బయటపడేందుకు ఇలాంటివి చేస్తారు. దేనికోసం ఇలా చేశారో చెప్పండని నర్మద నిలదీస్తుంది. ఇలా అడిగితే చెప్పదు అని ప్రేమ కర్ర తీసుకుని వస్తుంది. ప్రేమను ఆగమన్నా ఇడ్లీ బాబాయ్ భర్తను నేనుండగా నువ్వు కొడతావా. నేనే నిజం చెప్పిస్తాను అని భాగ్యంను చితకబాదుతాడు ఇడ్లీ బాబాయ్. నీ పాపంలో నాకు సగం ఉంది కొట్టు అని భార్యతో తాను కొట్టించుకుంటాడు ఇడ్లీ బాబాయ్.
ఇడ్లీ బాబాయ్ ఎమోషనల్ డ్రామా
తర్వాత భాగ్యంను మళ్లీ కొడతాడు ఇడ్లీ బాబాయ్. ఇన్ని దెబ్బలు కొట్టిన నోరు విప్పలేదంటే తనకేం తెలియదు. ఇంకో దెబ్బ కొడితే తను చనిపోతుందని ఇడ్లీ బాబాయ్ ఎమోషనల్ డ్రామ ఆడుతాడు. మా వదిన కడుపుతో ఉందని, తనకు ఈ విషయం తెలిస్తే బాధపడుతుందని మిమ్మల్ని వదిలేస్తున్నామని ధీరజ్ అంటాడు. వల్లి అక్క కడుపు విషయంలో కూడా నాకు అనుమానం ఉంది. అందులో తేడా ఉందని తెలిస్తే అప్పుడు ఉంటది అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది నర్మద.
ఇంతల చితకబాదుతావా అని భాగ్యం అంటే.. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వల్లికి కడుపు లేదన్న విషయం బయటకపడకుండా ఉండాలని ఇడ్లీ బాబాయ్ అంటాడు. మరోవైపు ధీరజ్ ఫొటో చూస్తూ వీడినే మనం ఇరికించాల్సింది అని మరో రౌడీకి ఇస్తాడు. వాడికి బెయిల్ కూడా రానంతలా, జీవితాంతం జైలులో ఉండేలా చేయాలని పోలీసుతో భద్రావతి, సేనాపతి చెబుతారు.
నేను మాదక ద్రవ్యాలు సప్లై చేస్తున్నాడనే కేసులో ఇరికిస్తాను. దాంతో ఈ జన్మలో బెయిల్ రాదు అని ఎస్సై అంటాడు. రేపు ఇదే టైమ్‌కు వాడిని అడ్డంగా బుక్ చేస్తాను అని రౌడీ అంటాడు. నా మేనల్లుడిని జైలుకు పంపిస్తావా. అందుకు ప్రతికారంగా నిన్ను జైల్లో మగ్గిపోయేలా చేస్తున్నాను అని భద్రావతి అంటుంది. సేనాపతి నవ్వుతూ చూస్తాడు. మరోవైపు ప్రేమ భుజాలపై చేయి వేసి ధీరజ్ రొమాంటిక్‌గా చూస్తుంటాడు.
ఎస్సై కోచింగ్‌లో జాయిన్ చేయడానికి
నీకు ఇష్టమైంది ఏంటీ అని అడుగుతాడు ధీరజ్. ఇదంతా దేనికో చెప్పు అని ప్రేమ అంటుంది. ఎస్సై కోచింగ్‌లో జాయిన్ చేస్తానే అని ధీరజ్ అంటాడు. నేను జాబ్ చేయొద్దని, ఎస్సైకి ట్రై చేయొద్దని మావయ్య అన్నారుగా. మనం చేసేదానివల్ల మావయ్య బాధపడకూడదు. నాకు ఎస్సై జాబ్ వద్దు. ఏది వద్దు. మొగుడికి సేవలు చేసుకుంటూ ఉంటాను అని ప్రేమ అంటుంది.
అలాగా, సరే మొగుడి తలకు ఆయిల్ పెట్టమని ధీరజ్ అంటాడు. సరేనని తలకు ఆయిల్ పెడుతుంది ప్రేమ. మరోసారి ఎస్సై జాబ్ ట్రైనింగ్ గురించి అడిగితే.. ప్రేమ కూడా చేయనని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే ధీరజ్ తలను పక్కకు తిప్పుతుంది ప్రేమ. దాంతో ధీరజ్ మెడ పట్టేస్తుంది. గిలగిల కొట్టుకుంటాడు ధీరజ్. తర్వాత ధీరజ్ మెడ సెట్ చేస్తుంది. నిన్ను కోచింగ్‌కు పంపించే మ్యాజిక్ తెలుసు. అది రాత్రి చూపిస్తా వెళ్లు అని ధీరజ్ అంటాడు.
మరోవైపు ఇంట్లో గీత పక్కన కూర్చుని సాగర్‌తో జరిగిన గొడవను తల్చుకుంటాడు రామరాజు. అది చూసి వేదవతి పైకి లేవమని అంటుంది. ఈ గీత నా గుండె మధ్యలో గీసినట్లుందని రామరాజు అంటాడు. నడిపోడు వాళ్ల మామ మాయలో ఉన్నాడండి. త్వరలోనే ఆ మాయలోనుంచి బయటకు వస్తాడు. వాడే ఈ గీత చెరిపేస్తాడని వేదవతి అంటుంది. అంతలో ఫర్నిచర్‌తో ప్రసాద్ రావు వస్తాడు.
నర్మదకు పుట్టింటి సారె
ఊరిలో నుంచి వెళ్లిపోతున్నారా అని ధీరజ్ అంటాడు. నర్మద వేరు కాపురం పెట్టింది కదా. అందుకోసం పుట్టింటి సారెగా ఈ ఫర్నిచర్ తీసుకొచ్చారు అని శ్రీవల్లి చెబుతుంది. ఈ ఇంట్లో తెలివైనదానివి నువ్వేనమ్మా అని ప్రసాద్ రావు అంటాడు. దాంతో వల్లి మురిసిపోతుంది. మీకు వయసు పెరుగుతుంది కానీ బుద్ధి, జ్ఞానం పెరగట్లేదని తండ్రితో నర్మద అంటుంది.
కన్నకూతురుకు ఎలాంటి కష్టం కలగకుండా ఉండాలని కన్నపేగు చెబుతూనే ఉంటుంది కదా అని ప్రసాద్ రావు అంటాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


