Actress: 21 ఏళ్లు పెద్దోడైన నటుడితో బ్రేకప్- లైఫ్‌లో తనకే ఎంతోమంది పార్టనర్స్ ఉన్నారన్న నటి-పంచడానికి చాలా ప్రేమ ఉందంటూ!

Shahana Goswami About Open Relationships: బాలీవుడ్ నటి షహానా గోస్వామి తన వ్యక్తిగత జీవితం, ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాంప్రదాయ బంధాలు తనకు సెట్ కావని, ప్రస్తుతం తాను ఒకరితో కాకుండా ఓపెన్ రిలేషన్‌షిప్‌‌లో ఉన్నానని, జీవితంలో దాపరికాలకు తావులేదన్నారు. దీంతో షహానా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: May 28, 2026, 10:25:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Shahana Goswami About Open Relationships: సినిమా ఇండస్ట్రీలో నటీనటుల వ్యక్తిగత జీవితాలు, వారి ప్రేమ వ్యవహారాలపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. కొందరు తమ బంధాలను సీక్రెట్‌గా ఉంచడానికి ఇష్టపడితే, మరికొందరు మాత్రం ఎలాంటి దాపరికాలు లేకుండా ఓపెన్‌గా మాట్లాడేస్తుంటారు.

21 ఏళ్లు పెద్దోడైన నటుడితో బ్రేకప్- లైఫ్‌లో తనకే ఎంతోమంది పార్టనర్స్ ఉన్నారన్న నటి-పంచడానికి చాలా ప్రేమ ఉందంటూ!
21 ఏళ్లు పెద్దోడైన నటుడితో బ్రేకప్- లైఫ్‌లో తనకే ఎంతోమంది పార్టనర్స్ ఉన్నారన్న నటి-పంచడానికి చాలా ప్రేమ ఉందంటూ!

రిలేషన్‌షిప్ స్టేటస్‌పై సంచలన నిజాలు

'రాక్ ఆన్', 'హీరోయిన్', 'జ్విగాటో' వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న షహానా గోస్వామి తాజాగా తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై సంచలన నిజాలు పంచుకున్నారు. సమాజం నిర్ణయించిన సాంప్రదాయ ప్రేమ సూత్రాలు తనకు అస్సలు సరిపోవని ఆమె కుండబద్దలు కొట్టారు. ప్రముఖ హోస్ట్ సిద్ధార్థ్ కన్నన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న షహానా గోస్వామి తన డేటింగ్ జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఆ ఫార్ములా నాకు నచ్చలేదు

ఒకప్పుడు మోడల్, పాపులర్ నటుడు మిలింద్ సోమన్‌తో నడిపిన ప్రేమాయణం గురించి షహానా ఈ సందర్భంగా మాట్లాడారు. తన 20 ఏళ్ల వయసులో 43 ఏళ్ల మిలింద్‌తో (23 ఏళ్లు పెద్ద) ప్రేమలో పడ్డానని, ఆరేళ్ల పాటు కేవలం లెటర్స్, మెసేజ్‌ల ద్వారానే తాము మాట్లాడుకునేవాళ్లమని చెప్పారు. ఆ తర్వాత ముంబైకి వచ్చాక ఇద్దరం డేటింగ్ ప్రారంభించినా, 2013లో విడిపోవాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు.

ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ, ఆ సమయంలో పరిస్థితులు కలిసి రాలేదన్నారు. ఈ బ్రేకప్ తర్వాతే తనకు సాంప్రదాయ 'రిలేషన్‌షిప్ ఫార్ములా'పై నమ్మకం పోయిందని, బంధాలలో ఒకరి స్వేచ్ఛను మరొకరు గౌరవించుకోవడం ముఖ్యమని గ్రహించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత రెస్టారెంట్ వ్యాపారి మౌరో గజ్జీతో పరిచయం అయ్యాక, బంధాలకు ఎలాంటి లేబుల్స్ తగిలించకుండా కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టానని చెప్పారు షహానా.

నా జీవితంలో 'ప్రైమరీ పార్ట్‌నర్' అంటూ ఎవరూ లేరు

ప్రస్తుతం తన లైఫ్‌లో ఒకే ఒక్క ముఖ్యమైన భాగస్వామి (Primary Partner) అంటూ ఎవరూ లేరని షహానా వెల్లడించారు. "ఓపెన్ రిలేషన్‌షిప్ అంటే భాగస్వామితో ఎంతో నిజాయితీగా, ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయడం. నా జీవితంలో చాలా మందితో సుదీర్ఘమైన అనుబంధాలు ఉన్నాయి. కానీ ఏదీ క్యాజువల్ కాదు" అని షహానా గోస్వామి తెలిపారు.

"నాకు స్నేహితులు ఎలాగో, ఈ బంధాలు కూడా అంతే. కొంతమందితో కేవలం స్నేహం ఉంటుంది, మరికొందరితో శారీరక బంధం కూడా ఉండొచ్చు. దాన్ని ఒకే వైపు నెట్టాల్సిన అవసరం లేదు. నా దగ్గర పంచడానికి చాలా ప్రేమ ఉంది, దాన్ని ఒక్కరికే ఎందుకు పరిమితం చేయాలి?" అని షహానా గోస్వామి ప్రశ్నించారు. "నా జీవితంలో దాచడానికి ఏమీ లేదు. నేను ఇతరులతో సాన్నిహిత్యంగా ఉంటున్నాననే విషయం నా పార్ట్‌నర్స్‌కు కూడా ముందే తెలుసు" అని షహానా పేర్కొన్నారు.

కెరీర్ విషయానికొస్తే..

కాగా, షహానా గోస్వామి చివరిగా 2024లో జీ5 (ZEE5) ఓటీటీలో విడుదలైన 'డిస్పాచ్' అనే క్రైమ్ డ్రామా సినిమాలో కనిపించారు. కాను బెహల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పాయ్‌తో కలిసి షహానా స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

ఈ సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ప్రస్తుతం షహానా తన తదుపరి ప్రాజెక్ట్‌లను ప్రకటించాల్సి ఉంది. ఏదేమైనా, సాధారణంగా సెలబ్రిటీలు బయటకు చెప్పడానికి జంకే ఓపెన్ రిలేషన్‌షిప్స్ గురించి షహానా ఇంత బోల్డ్‌గా మాట్లాడటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More