ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 22 ఎపిసోడ్: వేదవతి ట్విస్ట్, తండ్రిపై కేసు పెడతానన్న నర్మద- సాగర్ వేరు కాపురం- నట్టింట్లో గీత

Illu Illalu Pillalu Serial May 22nd Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మే 22వ ఎపిసోడ్‌లో సాగర్ వెళ్లిపోకుండా వేదవతి ట్విస్ట్ ఇస్తుంది. కానీ, సాగర్ ఇంట్లో ఉండను అంటే వేరు కాపురం పెట్టమని శ్రీవల్లి ఐడియా ఇస్తుంది. దాంతో రామరాజు నట్టింట్లో గీత గీస్తుంది. సేనాపతి వాళ్లు టపాసులతో పండుగ చేసుకుంటారు.

Published on: May 22, 2026, 08:47:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో మామ చెప్పడంతో సాగర్ రామరాజును ఆస్తిలో వాటా అడుగుతాడు. రామరాజు చిల్లిగవ్వ కూడా ఇవ్వనంటాడు. ఆస్తిలో పిల్లలకు కూడా హక్కు ఉంటుంది కదా. లేకుంటే కోర్టుకు వెళ్తామని సాగర్ మామ ప్రసాద్ రావు అంటాడు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మే 22వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మే 22వ ఎపిసోడ్

నలుగురిలో స్వార్థపు తండ్రిగా

నీ అంతట నువ్వు పంచిస్తే నీకు గౌరవంగా ఉంటుంది. అదే కోర్టు ఆర్డర్ వేసినప్పుడు పంచితే నలుగురిలో స్వార్థపు తండ్రివి అన్న ముద్ర పడుతుందని ప్రసాద్ రావు అంటాడు. నీ బెదిరింపులకు ఈ రామరాజు బెదరడు. ఏం చేసుకుంటావో చేసుకో అని రామరాజు అంటాడు. మీరు ఆస్తి పంచకపోతే పోలీస్ స్టేషన్‌లా చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని లాయర్ అంటాడు. బయటకు వెళ్లమని రామరాజు అంటాడు.

ఈ పెద్దమనిషి వినడు కానీ కోర్టుకు వెళ్లి నోటీసులు పంపిద్దాం పదా అని సాగర్ అంటాడు. రేయ్ నడిపోడా ఏంట్రా. కన్నతండ్రిపై కేసు పెడతావా అని వేదవతి అంటే.. మర్యాదగా మాట వినకుంటే ఏం చేస్తామని సాగర్ అంటాడు. నోరు మూయిరా. మీరు ఆస్తి పంచుకుని వెళ్లిపోతే ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంది. దాని బాగోగులు ఎవరు చూసుకుంటారని వేదవతి అడుగుతుంది.

అమూల్య పెళ్లి అయ్యేదాకా అందరు నోరు మూసుకుని ఉండండి. దాని పెళ్లి అయ్యాక మీరు అడగడం కాదు నా అంతట నేనే అందరికి వాటాలు ఇప్పిస్తాను. అప్పటివరకు ఆస్తి పంపకాల గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదని వేదవతి తెగేసి చెప్పి ట్విస్ట్ ఇస్తుంది. ఏమయ్యా ప్రసాద్ రావు గారు విన్నారుగా వెళ్లండి అని వేదవతి అంటుంది. ఇలా ఆస్తి పంపకాల గురించి అడిగితే మీరు కాదు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారని నేనే కేసు పెడతానని తండ్రిని బెదిరిస్తుంది నర్మద.

తండ్రి మీద నర్మద కేసు

అంటే ఇన్‌డైరెక్ట్‌గా తండ్రి మీద కేసు పెడతానని వార్నింగ్ ఇస్తుంది నర్మద. దాంతో తండ్రి ప్రసాద్ రావు షాక్ అవుతాడు. సాగర్ నువ్వు గుమ్మం దాటితే చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. అందుకే ఆస్తిలో నీ వాట పంచి ఇచ్చాకే ఈ గుమ్మం నుంచి అడుగు పెట్టు అని ప్రసాద్ రావు అంటాడు. అంతవరకు ఈ ఇంట్లో ఉండటం నా వల్ల కాదంటాడు సాగర్. దాంతో సుకన్య శ్రీవల్లికి సైగ చేస్తుంది. అయితే, ఇదే ఇంట్లో నువ్వు నర్మద వేరు కాపురం ఉండండి అని శ్రీవల్లి అంటుంది.

దాంతో అంతా షాక్ అవుతారు. బుద్ధిలేకుండా సలహా ఇస్తున్నావా అని వేదవతి తిడుతుంది. ఒకే ఇంట్లో తండ్రికొడుకులను వేరు చేయాలని చూస్తున్నావా అని నర్మద అంటుంది. ఇదే ఊరిలో వేరే ఇంట్లో ఉంటే మావయ్య పరువు గోదారిలో కొట్టుకుపోదు. అదే ఇదే ఇంట్లో గీత గీసుకుని ఉంటే నలుగురికి తెలియదు కదా. ఏమంటారు మావయ్య అని అమాయకంగా అడుగుతుంది శ్రీవల్లి. ఏదోటి చేయండని చెప్పేసి రామరాజు వెళ్లిపోతాడు.

గీత గీయడానికి మావయ్య ఒప్పుకున్నాడని సుకన్యకు చెబుతుంది వల్లి. దాంతో రామరాజు ఇంట్లో పెయింట్‌తో గీత గీస్తుంది వల్లి. అలా రామరాజు కుటుంబం రెండుగా చీలుతుంది. రామరాజు, వేదవతి కుమిలిపోతారు. ప్రసాద్ రావు సంతోషిస్తాడు. మరోవైపు భద్రావతి వాళ్లు టపాసులు పేలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. రామరాజు పేసు మాడిపోయిందేంట్రా అని నవ్వుతుంటారు భద్రావతి, సేనాపతి.

దెప్పిపొడిచిన సేనాపతి

ఏరా నట్టింట్లో గీత గీశారట కదా. ఇల్లు రెండు ముక్కలైందట కదా. మీ ఇంట్లో గొడవలు జరుగుతుంటే మేము పండగ చేసుకోకుండా ఎలా ఉంటామని అని భద్రావతి నవ్వుతుంది. అక్క ఈ పనోడికి శత్రువులు ఎక్కడో లేరు. వాడి కొడుకుల రూపంలో ముసుగులు వేసుకుని ఉన్నారు. ఏ కొడుకులను చూసి ఎగిరెగిరి పడ్డాడో ఆ కొడుకులే గుండెల్లో పొడుస్తున్నారు అని సేనాపతి అంటాడు. రామరాజును దెప్పిపొడుస్తారు.

ఇప్పుడే ఏముందిరా. ముందుంది నీకు ముసళ్ల పండగ. మిగిలిన నీ కొడుకులు కూడా ఇలాగే చేస్తారని, దిక్కులేనివాడిగా చస్తావని, అనాథలా నీ చావు ఉంటుందని అంటారు. దాంతో ధీరజ్ కోపంగా వెళ్తే వేదవతి ఆపుతుంది. ఇలాంటి నీచులు నా అన్నయ్య, అక్క అని బాధేస్తుందని వేదవతి అంటుంది. మరి ఇంటికి తీసుకొచ్చి పెంచినవాడు ఇదే ఇంటి అమ్మాయిని లేపుకెళ్లినవాడిని ఏమంటారని భద్రావతి అంటుంది.

ప్రేమ, ధీరజ్ గురించి అంటుంది భద్రావతి. ఇంకోసారి వీడు మోసం చేసి తీసుకెళ్లాడని అనకు. అసలు జరిగింది తెలిస్తే అని ప్రేమ అంటే.. ధీరజ్ ఆపుతాడు. కోపం, పగ వంటి పొరలు తీసి చూస్తే నిజాలు కనపడతాయని ప్రేమ అంటుంది. రామరాజు కుటుంబం గురించి గొప్పగా చెబుతుంది. నాకే నీతులు చెబుతున్నావా నువ్వు అని భద్రావతి తిడుతుంది. బొమ్మల కొలువు లాంటి నీ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. అది చూసి చచ్చేందుకు సిద్ధంగా ఉండమని వెళ్లిపోతుంది భద్రావతి.

ఇంకో మంట అంటుకుంది

రామరాజు అవమానంతో సాగర్‌ను చూస్తూ వెళ్లిపోతాడు. ఆ ప్రసాద్ రావు మంట పెడితే ఇక్కడ ఇంకో మంట అంటుకుందని భాగ్యం అంటుంది. తర్వాత సుకన్నయ చేయి విరుస్తుంది భాగ్యం. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More