ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 21 ఎపిసోడ్: రామరాజును తోసేసి ఆస్తిలో వాటా పంచమన్న సాగర్- కోర్టుకు వెళ్తామని లాయర్‌తో వచ్చిన మామ
Illu Illalu Pillalu Serial May 21st Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మే 21వ ఎపిసోడ్‌లో సాగర్ వెళ్లిపోతుంటే ఇంట్లోవాళ్లు అడ్డుకుంటారు. ప్రసాద్ రావు లాయర్‌తో వచ్చి ఆస్తిలో వాటా పంచమంటాడు. దాంతో ప్రసాద్ రావును కొట్టి పీక పట్టుకుంటాడు రామరాజు. తండ్రిని తోసేసిన సాగర్ కూడా తన వాటా పంచమంటాడు.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో సాయంత్రం కల్లా నా కూతురు, అల్లుడికి రామరాజు కుటుంబంతో బంధం తెంచకపోతే నా పేరు ప్రసాదరావే కాదు అని సాగర్ మామ అంటాడు. అదంతా భాగ్యం చెప్పడంతో శ్రీవల్లి, సుకన్య సంతోషిస్తారు.

నువ్వు కొంపలు కూల్చే కంత్రీ ఖిలాడీవి
నువ్వు కొంపలు కూల్చే కంత్రీ ఖిలాడీవి అని మరోసారి నిరూపించావే అమ్మా అని శ్రీవల్లి అంటుంది. శకుని కంటే పెద్దదానివి అయ్యేదానివని, నర్మద పీడ వదిలిపోయిందని, ఇక ప్రశాంతంగా ఉండొచ్చని శ్రీవల్లి అంటుంది. ప్రశాంతంగా ఉండటం కాదే కుల్లి కుల్లి ఏడుస్తావ్. సాగర్, నర్మద ఇద్దరిది గవర్నమెంట్ జాబ్, నెలకు లక్షలకు లక్షలు వస్తాయి. హ్యాపీగా హోటల్ నుంచి తెప్పించుకుంటూ తింటారు. అదంతా చూసి కడుపు మంటతో ఏడుస్తావుగా అని సుకన్య అంటుంది.
అవును అని శ్రీవల్లి అంటుంది. అదే నర్మద ఇక్కడుంటే అప్పుడప్పుడు పుల్లలు పెట్టి నీ కడుపు మంట చల్లార్చుకోవచ్చుగా అని సుకన్య అంటుంది. నీ కాపురానికి అతిపెద్ద విలన్ పోయిందని, ఫుల్ హ్యాపీస్‌తో ఉండు అని తల్లి అంటుంది. సాగర్, నర్మద బ్యాగ్‌లు సర్దుకుని వెళ్లిపోతుంటే వేదావతి వాళ్లు అడ్డుకుంటారు. ధీరజ్, ప్రేమ వస్తారు. ఐదు లక్షలు మీ నాన్నకు ఇచ్చేశాను. వెళ్లి లెక్కపెట్టుకో అని ధీరజ్‌తో అంటాడు సాగర్.
నువ్వు ఇంట్లోంచి వెళ్లకూడదని అలా అన్నానురా. లేకుంటే నిజంగా ఎందుకు అంటాను అని ధీరజ్ అంటాడు. ఈ దొంగప్రేమలు నటించకండిరా అని సాగర్ అంటాడు. ధీరజ్ అడ్డుకుంటే అడ్డు తప్పుకోమ్మని, నటించింది చాలని సాగర్ అంటాడు. అదంతా చూసి శ్రీవల్లి, భాగ్యం చూసి నవ్వుకుంటారు. తల్లిలా తన బాధను తగ్గించావని, నువ్వు దూరమైతే తల్లి దూరమైనంత బాధగా ఉంటుందని నర్మదతో ప్రేమ అంటుంది.
లాయర్‌తో వచ్చాను
బావకు నువ్వైనా నచ్చజెప్పు అని ప్రేమ అంటుంది. పెద్ద యుద్ధమే చేశాను, కానీ, ఓడిపోయాను. ఇప్పుడు గుమ్మం దాటడం తప్పా ఏం చేయలేను అని నర్మద అంటుంది. అంతలో ప్రసాద్ రావు వచ్చి నీ కొడుకుని వట్టి చేతులతో తరిమేద్దామనుకున్నావా. నీ కొడుకుకి ఆస్తిలో వాటా ఇవ్వకుండా పంపించేస్తున్నావా. నా అల్లుడికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఉరుకుంటానా. అందుకే లాయర్‌తో సహా వచ్చాను, మర్యాదగా నా అల్లుడికి ఎంత ఆస్తి రాసివ్వు అని ప్రసాద్ రావు అంటాడు.
అసలు నీ వల్లేరా నా కొడుకు ఇలా అయింది. వాడిలో విషం నింపావురా అని ప్రసాద్ రావును రామరాజు కొడతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. నువ్వు డబ్బు మనిషివి, న్యాయంగా నా అల్లుడికి ఆస్తి రావాలని అడిగితే నన్నే కొడతావా అని రామరాజు కాలర్ పట్టుకుంటాడు ప్రసాద్ రావు. ఇద్దరు గొడవ పడితే అంతా కలిసి పక్కకు లాగుతారు. ఇంట్లోంచి వెళ్లకుంటే చస్తావని రామరాజు బెదిరించిన ప్రసాద్ రావు వినడు.
నా అల్లుడికి ఆస్తి పంచే వరకు నేను వెళ్లను అని భీష్మించుకుంటాడు ప్రసాద్ రావు. అసలు నా ఆస్తి పంచమనడానికి నువ్వు ఎవడ్రా అని రామరాజు నిలదీస్తాడు. అయినా ప్రసాద్ రావు వినడు. ఇంకోసారి ఆస్తి మాట వస్తే చంపేస్తానని ప్రసాద్ రావు గొంతు పట్టుకుంటాడు రామరాజు. వదలండి, మా మావయ్యనే చంపేస్తానని అంటావా అని సాగర్ అంటే.. కొడుకును కూడా లాగిపెట్టి కొడతాడు రామరాజు.
రామరాజును తోసేసిన సాగర్
సిగ్గు లేదారా. మన కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తుంటే నన్ను అంటావా అని రామరాజు అంటాడు. ఆస్తి పంచమంటే కుటుంబం ముక్కలు చేయడం అంటావా అని ప్రసాద్ రావు అంటాడు. దాంతో ఇంకా కోపంగా ప్రసాద్ రావును కొట్టేందుకు వెళ్తాడు రామరాజు. కానీ, సాగర్ ఉండి రామరాజు గుండెలపై చేతులు వేసి తోసేస్తాడు. ఆ బాధతో వెనక్కి అలాగే కుప్పకూలిపోతాడు రామరాజు. అంతా అవాక్కవుతారు.
ఇంట్లో అంతా సంతోషంగా ఉన్న రోజులు గుర్తు చేసుకుంటాడు రామరాజు. సాగర్ నీకు అసలు బుద్ధుందా, ఏం చేస్తున్నావ్, మావయ్య గారిని తోసేస్తావా. మనిషిలా ప్రవర్తిస్తున్నావా అని నర్మద అంటుంది. అతను మీ నాన్న షర్ట్ పట్టుకున్నాడు, అందరిముందు బయటకు వెళ్లమన్నాడు అని ప్రసాద్ రావు అంటాడు. అసలు ఇదంతా జరిగిందే నీ వల్ల కదా నాన్న అని నర్మద తండ్రిని నిందిస్తుంది.
మా కుటుంబ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవడమే తప్పు. అలాంటిది ఆస్తి అడుగుతావా. అసలు నువ్వు ఎవరు ఆస్తి అడగడానికి. నడు నాన్న మర్యాదగా బయటకు నడు నాన్న అని నర్మద అంటే.. ఎందుకు నడవాలి. మావయ్య మాట్లాడిన దాంట్లో తప్పేముందని సాగర్ అంటాడు. కొడుకు దూరమైపోతున్నాడని వాళ్లు బాధపడుతుంటే మా నాన్నను సమర్ధిస్తావేంటీ అని నర్మద అంటాడు. ఐదు లక్షలు కట్టమన్నప్పుడు రాని బాధ ఆస్తి అడిగితే ఎందుకొస్తుందని సాగర్ అంటాడు.
మరింత రెచ్చగొట్టిన ప్రసాద్ రావు
దాంతో వేదవతి కోప్పడుతుంది. ఆస్తి రాసివ్వడానికి అంతలా ఎందుకు బాధపడుతున్నారని ప్రసాద్ రావు అంటాడు. ఇదంతా సంపాదించింది పిల్లల కోసమే. అలాంటి ఆయనకు పిల్లలకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు అని వేదవతి అంటుంది. మీ అమ్మ కూడా ఎంత తెలివిగా మాట్లాడుతుందో చూశావా. రూపాయి జీతం లేకుండా పనిచేసిన నిన్నే 5 లక్షలు కట్టేదాక విడిచిపెట్టలేదు. అలాంటి భవిష్యత్తులో నీకు ఆస్తి ఇస్తారంటావా అని సాగర్‌ను మరింత రెచ్చగొడతాడు ప్రసాద్ రావు.
మా నాన్న మీద చేయి వేసినవాడిని చంపేస్తాను, బుద్ధి చెప్పకుండా ఊరుకోను. అయినా నిన్ను ఏమనట్లేదు ఎందుకో తెలిసా ఈ కుటుంబం ముక్కలు కాకూడదని. మా అన్నయ్య దూరం కాకుండా ఉండేందుకు. అది అర్థం చేసుకుని మర్యాదగా బయటకు వెళ్లండని ధీరజ్ అంటాడు. ఇంట్లో అందరూ ఒక్కటై నిన్ను ఒక్కడిని చేశారు. అసలు నీకు ఆస్తిలో చిల్లిగవ్వ అయినా ఇస్తారంటావా అని ప్రసాద్ రావు అంటాడు.
దాంతో చందు కోప్పడుతాడు. మరింత రెచ్చగొడతారేంటని అడుగుతాడు. ఆయన రెచ్చగొట్టలేదు. నిజం చెబుతున్నాడు. నేను గొడ్డులా కష్టపడితే ఐదు లక్షలు తీసుకున్నందుకు ఇంటికి కన్నం వేశారన్నాడు ఈ పెద్దమనిషి. అలాంటిది ఆస్తిలో వాటా ఇస్తారా. అందుకే ఇప్పుడే ఈ క్షణమే నా వాటా నాకు రాసి ఇవ్వండి అని సాగర్ అంటాడు. ఇంకోసారి నాన్న గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని సాగర్ కాలర్ పట్టుకుంటాడు ధీరజ్.
కోర్టుకు వెళ్తామన్న సాగర్ మామ
చిన్నోడా ఆగు అని రామరాజు ఆపుతాడు. వనజ నుంచి 20 లక్షలు కొట్టేయడం దగ్గరి నుంచి రైస్ మిల్లులో ఐదు లక్షలు దొంగతనం చేయడం వరకు, ప్రభుత్వ ఉద్యోగానికి డబ్బులు పెట్డడం, భార్య నగలు అమ్మడం, నీ మామతో మాటలు అనిపించడం అన్ని భరిస్తూనే వచ్చానురా. ఎప్పటికప్పుడు నీ తప్పు తెలుసుకుంటావని చూశా. కానీ, ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు చెబుతున్నా విను ఇది నా కష్టంతో కట్టుకున్న ఇల్లు. నా ఆస్తిలో నీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వనురా అని రామరాజు తెగేసి చెబుతాడు.
ఎవడికి చెప్పుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో. వెళ్లురా ఇక్కడి నుంచి అని రామరాజు అంటాడు. నువ్వు ఇలా అడ్డం తిరుగుతావని తెలిసే లాయర్‌ను తీసుకొచ్చాను. ఆస్తిలో కొడుకుకు వాటా రావాల్సిందే. లేకుంటే కోర్టుకు వెళ్తాం అని సాగర్ మామ ప్రసాద్ రావు అంటాడు. ఏంటీ బెదిరిస్తున్నావా అని రామరాజు అంటే.. జరగబోయేది చెబుతున్నా అని ప్రసాద్ రావు అంటాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


