ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 16 ఎపిసోడ్: చీరలో గ్లామర్‌గా ప్రేమ- ధీరజ్ స్పెషల్ సర్‌ప్రైజ్- పొలాల మధ్య భార్యాభర్తల రొమాన్స్
Illu Illalu Pillalu Serial May 16th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మే 16వ ఎపిసోడ్‌లో ధీరజ్ తనను కారులో ముందుగా ఎక్కించుకోలేదని ప్రేమ ఫీల్ అవుతుంటుంది. నర్మద వెళ్లి సర్ది చెప్పుతుంది. ధీరజ్ వచ్చి బయటకు వెళ్లాలంటే గ్లామర్‌గా రెడీ అయి వస్తుంది ప్రేమ. పంట పొలాల మధ్య రొమాంటిక్‌గా గడుపుతారు.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమ బాధపడుతూ ఉంటే నర్మద వెళ్లి పలకరిస్తుంది. ధీరజ్ కారు కొనేందుకు నేను రక్తాలు చిందించాను. అలాంటిది కారు కొన్నాక ముందు ఎవరిని ఎక్కించుకోవాలి. నన్ను కారులో తిప్పడం కాకుండా నన్ను పట్టించుకోలేదు అని నర్మద అంటుంది.

అందమైన చేత్తే కాఫీ
ఎవరికైనా అమ్మే ఎక్కువ కదా. లేకుంటే ఏదైనా స్పెషల్‌గా ప్లానే చేశాడేమో అని నర్మద అంటుంది. అంతలోనే ధీరజ్ వచ్చి నీ అందమైన చేత్తో కాఫీ పెట్టమని అడుగుతాడు. వంటింట్లోకి మీ అమ్మతో కారులో వెళ్లి పెట్టించుకో అని ప్రేమ సెటైర్లు వేస్తుంది. మనం బయటకు వెళ్లాలే అని ధీరజ్ అంటే కోపంగా వెళ్లిపోతుంది ప్రేమ. తను చాలా ఫీల్ అవుతుంది వెళ్లమని ప్రేమ బాధ గురించి చెబుతుంది నర్మద.
యెల్లో కలర్ చీరలో
ధీరజ్ వెళ్తాడు. ప్రేమ ఫోన్ నర్మద దగ్గరే ఉండిపోతుంది. ప్రేమ దగ్గరికి వెళ్లి కారులో బయటకు వెళ్దామని ధీరజ్ అంటే.. ప్రేమ వినదు. ధీరజ్‌ను బయటకు గెంటేసి డోర్ లాక్ చేసి పడుకుంటుంది ప్రేమ. ప్రేమ నవ్వుకుంటుంది. ఇది ఏదో ప్లాన్ చేసినట్లుందనుకున్న ధీరజ్ వెళ్లి రెడీ అయి వస్తాడు. అంతలో ప్రేమ కూడా యెల్లో కలర్ చీరలో చాలా అందంగా, గ్లామర్‌గా రెడీ అయి వస్తుంది. ప్రేమ అందాన్ని చూసి ధీరజ్ ఫిదా అవుతాడు. నా రాక్షసి అందాల రాక్షసి అయిపోయిందని ధీరజ్ అంటాడు.
రొమాంటిక్ నైట్
నా ఫ్రెండ్ బర్త్ డే ఫంక్షన్ ఉంది. అక్కడికి వెళ్తున్నా అని ప్రేమ అంటే.. సరే అలాగే వెళ్లమని కావాలని అంటాడు ధీరజ్. దాంతో ప్రేమ అలుగుతుంది. తిరిగి వచ్చిన ధీరజ్ ప్రేమను ఎత్తుకెళ్లిపోతాడు. అలా ఎత్తుకుని కారులో కూర్చోబెడతాడు. పంట పొలల మధ్య రొమాంటిక్ స్పెషల్ డిన్నర్ నైట్‌కు ప్రేమను తీసుకెళ్లి పెద్ద సర్‌ప్రైజ్ ఇస్తాడు ధీరజ్. అదంతా చూసి ప్రేమ చాలా సంతోషిస్తుంది.
చచ్చేంత ఆకలేస్తుంది
మన జీవితంలో కొత్త ఆరంభం ఇదని ధీరజ్ అంటాడు. నువ్వు ముందుగా ఎక్కించుకోలేదని ఎంత ఏడ్చానో తెలుసా. అన్నం కూడా తినలేదు. ఇప్పుడు చచ్చేంత ఆకలేస్తుందని ప్రేమ అంటే.. తల్లి, తండ్రి గురించి గొప్పగా తన ప్రేమను చెబుతాడు ధీరజ్. నాకు తెలుసురా. మీ అమ్మనాన్న తర్వాత అయిన నన్ను ఎక్కించుకోవాలిగా అని అలుగుతుంది ప్రేమ. కారులో కాదు స్పెషల్‌గా సర్‌ప్రైజ్ చేయాలని ఇలా చేశాను అని ధీరజ్ అంటాడు.
కేక్ కటింగ్
తర్వాత ఇద్దరు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను చాటుకుంటారు. ఒకరికోసం మరొకరు పడ్డ కష్టాన్ని కూడా చెప్పుకుంటారు. నేను ఎన్ని జన్మలు ఎత్తిన నీ అంత బాగా చూసుకునేవాన్ని భర్తగా పొందలేనురా అని ప్రేమ అంటుంది. ప్రేమ, ధీరజ్ ఇద్దరూ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటారు. తర్వాత ధీమ అని రాసి ఉన్న కేక్‌ను కట్ చేస్తారు. తర్వాత ఫ్లవర్ బొకే ఇచ్చి మోకాళ్లమీద కూర్చుని ప్రేమకు రొమాంటిక్‌గా ఐ లవ్యూ చెబుతాడు ధీరజ్.
పొలాల మధ్య రొమాన్స్
ప్రేమ కూడా లవ్యూ చెప్పి ధీరజ్‌ను హగ్ చేసుకుంటుంది. తర్వాత ప్రేమ చీర కొంగు లాగి దగ్గరికి వెళ్లి హత్తుకుంటాడు. కారుపై పడుకున్న ప్రేమపై రొమాంటిక్‌గా పడిపోతాడు ధీరజ్. అలా పంట పొలాల మధ్య భార్యాభర్తలు ధీరజ్, ప్రేమ ఇద్దరు రొమాన్స్ చేస్తూ గడుపుతారు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


