Illu Illalu Pillalu May 12 Episode: సాగర్‌ను వేరు కాపురం పెట్టమన్న మామ- సుకన్య మందు కలిపిన పాలు తాగిన చందు, నర్మద, ప్రేమ
Illu Illalu Pillalu Serial May 12th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మే 12వ ఎపిసోడ్‌లో ధీరజ్ గురించి చెడుగా చెప్పి సాగర్ మనసులో విషం నింపుతాడు మామ ప్రసాద్ రావు. సాగర్‌ను వేరు కాపురం పెట్టమంటాడు. శ్రీవల్లికి నిజంగా కడుపు వచ్చేలా చందుతో టెంప్ట్ చేయించడానికి పాలల్లో మందు కలుపుతుంది సుకన్య.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్‌కు అసూయ, స్వార్థం ఉన్నాయని, అందుకే ఐదు లక్షలు కట్టి ఇంట్లోంచి వెళ్లమన్నాడంటే అన్నయ్య బాధకంటే ఎక్కువగా డబ్బులకే విలువ ఇచ్చాడనిగా అర్థం అని సాగర్‌ను రెచ్చగొడతాడు మామ ప్రసాద్ రావు.

10 లక్షలు వెనుకేసుకునేవాడివి
రైస్ మిల్లు కోసం ఎంతో చేశావ్ ఎవరైనా గుర్తించారా. అందులో పని చేయకుండా పెద్దోడిలా బయట జాబ్ చేసి ఉంటే తక్కువలో తక్కువ రూ. 10 లక్షలు వెనుకేసుకునేవాడివి. ఇన్నేళ్లు మీ నాన్న అనుకున్నాను. ఇప్పుడు మీ తమ్ముడు కూడా శత్రువులా తయారయ్యాడు. ఈ డబ్బుల కోసం రేపు నిన్ను కొట్టిన ఆశ్చర్యపడక్కర్లేదు. చరిత్రలో అన్నదమ్ముల మధ్య యుద్ధాలు కూడా డబ్బు కోసమే జరిగాయని మామ అంటాడు.
నువ్వు ఎదగడం మీ నాన్నే కాదు. మీ తమ్ముడు, అన్నయ్య కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. నువ్వు వేరే కాపురం పెట్టు. కావాలంటే ఆ ఐదు లక్షలు నేను సర్దుతాను అని మామ ప్రసాద్ రావు సాగర్ మనసులో విషం నింపుతాడు. సరే అన్నట్లుగా తల ఊపుతాడు సాగర్. మరోవైపు సుకన్య పాలు కాస్తుంది. శ్రీవల్లి ఫస్ట్ నైట్ కోసం ఈ పాలు అని, నిజంగానే నెల తప్పేలా చేస్తానని ఓ మందు చూపిస్తుంది సుకన్య.
అది చాలా పవర్‌ఫుల్ అని ఆ మందును పాలల్లో కలుపుతుంది సుకన్య. ఈ పాలు చందుతో తాగించేసేయ్. నీ దగ్గరికి మీ ఆయన రాకుండా ఉండలేడు అని సుకన్య అంటుంది. నిజంగా జరుగుద్దంటావా అని వల్లి అంటే.. ఇగో నన్ను అనుమానించు కానీ ఈ పౌడర్‌ను అనుమానించకు అని సుకన్య అంటుంది. అంతలో వేదవతి వచ్చి ఏం పౌడర్ అని అడుగుతుంది. బాదం పౌడర్ అని సుకన్య అబద్ధం చెబుతుంది.
మొగుళ్లతో సాంగ్‌లు
బావకు వేడి వేడి బాదంపాలు అంటే ఇష్టమని శ్రీవల్లి చెబుతుంది. చందు ఒక్కడికే కాదు ఇంట్లో అందరికి బాదం పాలు అంటే ఇష్టమే అని ఆ పౌడర్ అడుగుతుంది వేదవతి. సుకన్య వద్దన్న వేదవతి లాక్కుని పౌడర్ మొత్తం పాలల్లో కలుపుతుంది. అందులో మరికొన్ని పాలు పోస్తుంది. శ్రీవల్లి, సుకన్య కంగారుపడిపోతుంటారు. గ్లాసుల్లో ఆ పాలన్ని పోసి కోడళ్లను పిలిచి ఇస్తుంది వేదవతి. ప్రేమ, నర్మద కూడా పాలు తీసుకెళ్తారు.
వేదవతి కూడా తీసుకెళ్తుంది. అదంతా చూసిన సుకన్య ఎవరి మొగుళ్లతో వాళ్లు సాంగ్‌లు, సింగింగ్‌లు చేస్తారు. దానికెందుకు భయం, నువ్వెళ్లి పాలు తాగించు వెళ్లు అని శ్రీవల్లితో అంటుంది. వేదవతి పాలు తీసుకెళ్తుండగా.. తిరుపతి తీసుకుని తాగుతాడు. ఈరోజు ఈ పాలు ఏంటీ ఇంత టేస్ట్‌గా ఉన్నాయని మొత్తం తాగుతాడు తిరుపతి. సుకన్య కోసం వెతుకుతుంటాడు. ధీరజ్‌కు ప్రేమ పాలు ఇస్తుంది.
ఇందాకే మజ్జిగ తాగాను. నువ్వే తాగు అని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమే ఆ పాలు తాగుతుంది. మరోవైపు సాగర్‌కు పాలు ఇచ్చి తాగమంటాడు. సాగర్ తాగనంటాడు. దాంతో నర్మదే ఆ పాలు తాగుతుంది. ఇంకోవైపు చందు కోసం శ్రీవల్లి పాలు తీసుకెళ్లి ఇస్తుంది. చందు ఒక్కటే ఆ పాలు తాగుతాడు. శ్రీ వల్లి, సుకన్య అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుంది. సుకన్య కోసం తిరుపతి అరుస్తూ వెతుకుతాడు.
వీడితో జాగ్రత్తగా ఉండాలి
వీడు కూడా తాగేసినట్లున్నాడు. అమ్మో వీడితో జాగ్రత్తగా ఉండాలని భయపడుతుంది సుకన్య. పాలు తాగిన ప్రేమ వెళ్లి ధీరజ్ పక్కన పడుకుని కాలు వేస్తుంది. ఏం కావాలే అని ధీరజ్ అంటే.. నువ్వే కావాలని మత్తుగా అంటుంది ప్రేమ. ఏంటే మాటలు తూలుతున్నావ్. మందు ఏమైనా తాగావా అని ధీరజ్ అంటాడు. ధీరజ్‌పై ఒక్కోసారి ఏర్పడిన ప్రేమను చెబుతుంది ప్రేమ. ధీరజ్‌ను లాక్కుని ముద్దు పెడుతుంది ప్రేమ.
మరోవైపు సాగర్ మీద నర్మద పడిపోతుంది. సాగర్‌ను ఒక్కటి కొట్టి పెళ్లాన్ని సరిగా పట్టించుకోవట్లేదని మరోటి కొడుతుంది నర్మద. ప్రేమగా నాతో మాట్లాడుతున్నావా అని కాలర్ పట్టుకుని నిలదీస్తుంది నర్మద. అనవసర విషయాల్లో తలదూర్చి మనమధ్య దూరం పెంచుతున్నావురా అని సాగర్‌ను హగ్ చేసుకుని ఏడుస్తుంది నర్మద. తర్వాత సాగర్‌కు ముద్దు పెడుతుంది.
శ్రీవల్లి దగ్గరికి చందు ప్రేమగా వచ్చి భుజంపై చేయి వేస్తాడు. శ్రీవల్లి మురిసిపోతుంది. చందు ముద్దు పెట్టుకోబోతుంటే ఇప్పుడే వచ్చేస్తాను అని బయటకు వెళ్తుంది శ్రీవల్లి. సుకన్యను వెతుక్కుంటూ శ్రీవల్లి వెళ్తుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


