Illu Illalu Pillalu: తల్లి కాబోతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రేమ.. వీడియోతో అనౌన్స్ చేసిన లావణ్య.. సీరియల్‌కు గుడ్‌బై?
Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమగా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న లావణ్య భరద్వాజ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆమె తల్లి కాబోతుంది. అదే సమయంలో సీరియల్ కు తను గుడ్ బై చెప్తుందనే మాటలు వినిపిస్తున్నాయి.
Illu Illalu Pillalu: తెలుగు నాట పాపులర్ అయిన సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో దూసుకెళ్తోంది. ఇందులో లావణ్య భరద్వాజ్ ఓ హీరోయిన్ గా నటించింది. ప్రేమ అనే క్యారెక్టర్ తో అలరిస్తోంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమగా తెలుగు ప్రేక్షకులను లావణ్య ఎంటర్ టైన్ చేస్తోంది.

గుడ్ న్యూస్ చెప్పిన ప్రేమ
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమ క్యారెక్టర్ ప్లే చేస్తున్న లావణ్య భరద్వాజ్ గుడ్ న్యూస్ చెప్పింది. తల్లి కాబోతున్నాననే విషయాన్ని వీడియో ద్వారా వెల్లడించింది. తన భర్త శశి హెగ్డేతో కలిసి ఈ గుడ్ న్యూస్ ను లావణ్య షేర్ చేసుకుంది.
సినిమాటిక్ లెవల్లో
సినిమాటిక్ లెవల్ వీడియోతో తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని లావణ్య వెల్లడించింది. ఆ వీడియోలో లావణ్య చీరకట్టులో ఓ గుడికి వెళ్తుంది. కళ్లు తిరిగి పడిపోబోతుంది. అప్పుడే ఆమె భర్త తన చేతిని పట్టుకుంటాడు. ఇద్దరు కలిసి దేవుడికి పూజ చేయిస్తారు. పూజారి కొట్టి ఇచ్చిన కొబ్బరి కాయ తొట్లెలాగా పలగడంతో లావణ్య, శశి నవ్వుకుంటారు.
లావణ్య, శశి నడుచుకుంటూ వెళ్తుంటే, వాళ్ల వెనకాల చిన్ని పాదాలు దర్శనమిస్తాయి. ‘‘చిన్నారితో మా ప్రేమ కథ కొనసాగుతూనే ఉంటుంది’’ అనే క్యాప్షన్ వస్తుంది. లావణ్య తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఈ క్యూట్ వీడియో వైరల్ గా మారింది.
అభినందనలు
తాను ప్రెగ్నెంట్ అని లావణ్య వెల్లడించడంతో ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కామెంట్లలో అందరూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో మరో హీరోయిన్ గా నటిస్తున్న అన్షు రెడ్డి.. ‘‘లిటిల్ వన్ కోసం వెయిట్ చేస్తున్నా’’ అని కామెంట్ చేసింది.
సీరియల్ కు గుడ్ బై?
ప్రెగ్నెన్సీ నేపథ్యంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కు లావణ్య గుడ్ బై చెప్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సీరియల్ లో ప్రేమగా తన చలాకీ నటనతో, ఎమోషన్ తో లావణ్య ఆకట్టుకుంటుంది. రామరాజు చిన్న కోడలిగా ఈ సీరియల్ లో ఆమె నటిస్తోంది. మొన్నటివరకూ సీరియల్ లో ప్రేమను ఆమె భర్త ధీరజ్ అసహ్యించుకునేవాడు. కానీ నిజం తెలుసుకుని ఇప్పుడు ప్రేమిస్తున్నాడు.
ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేసిన లావణ్య ఈ సీరియల్ లో ఎక్కువ రోజులు కనిపించకపోవచ్చు. సీరియల్ కథకు తగ్గట్లు పాత్రలు నటించాలి. మరి బేబీ బంప్ తో లావణ్యను చూపిస్తారా? లేదా? అన్నదే ప్రశ్న. లావణ్య స్థానంలో నిన్ను కోరి సీరియల్ హీరోయిన్ అక్షిత దేశ్ పాండేను తీసుకుంటారనే ప్రచారం కూడా సాగుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


