Anshu Reddy: టీవీ షోతో సీరియల్‌లో ఛాన్స్.. ఇల్లు ఇల్లాలు పిల్లలు హీరోయిన్ అన్షు గురించి తెలుసా? డ్యాన్స్‌తోనూ అదుర్స్
Anshu Reddy: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అన్షు రెడ్డి తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంటోంది. ఈ సీరియల్ తన నటనతో అలరిస్తోంది. హీరోయిన్ గా రాణిస్తోంది. అయితే అన్షు గురించి తెలియని విషయాలను ఇక్కడ చూసేయండి.
తెలుగులో టాప్ సీరియల్స్ లో ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ ఒకటి. ఈ సీరియల్ తెలుగు ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ లోని హీరోయిన్లలో అన్షు రెడ్డి ఒకరు. ఈ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద క్యారెక్టర్ ప్లే చేస్తున్న అన్షు గురించి మీకు తెలియని విషయాలు ఇక్కడున్నాయి.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ హీరోయిన్ అన్షు రెడ్డి తెలుగమ్మాయే. ఆమెది తెలంగాణలోని సిద్ధిపేట్. అందంతో పాటు అభినయంతోనూ సీరియల్స్ లో మెప్పిస్తూ ఇప్పుడు లక్షలాది మంది అభిమానులను అన్షు సొంతం చేసుకుంది.
టీవీ షోతో
అన్షు రెడ్డికి సీరియల్ లో యాక్ట్ చేసే ఛాన్స్ అనుకోకుండా వచ్చింది. కాలేజీలో ఉన్నప్పుడు ఈటీవీలో వచ్చే స్టార్ మహిళ షోకు ఓ ఆడియన్ గా అన్షు వెళ్లింది. అక్కడ అన్షును చూసిన ఈటీవీ మేనేజ్ మెంట్ ఆడిషన్స్ కు పిలిచింది. అలా ‘భార్యామణి’ అనే సీరియల్ కు అన్షు ఎంపికైంది.
ఈ సీరియల్స్
2014లో భార్యామణి సీరియల్ తో అన్షు తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత గోకులంలో సీత, ఇద్దరు అమ్మాయిలు, సూర్యవంశం, కథలో రాజకుమారి తదితర సీరియల్స్ లో నటించింది. అన్షు తమిళంలోనూ సీరియల్స్ చేసింది. ఇప్పుడు స్టార్ మాలో వస్తున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తో అదరగొడుతోంది.
డ్యాన్సర్ కూడా
అన్షు కేవలం నటి మాత్రమే కాదు మంచి డ్యాన్సర్ కూడా. ఈటీవీలో వచ్చిన ఢీ20 అనే డ్యాన్స్ రియాలిటీ షోలో అన్షు పార్టిసిపేట్ చేసింది. ఇందులో తన డ్యాన్స్ తో మెస్మరైజ్ చేసింది. సోషల్ మీడియాలోనూ డ్యాన్స్ రీల్స్ పోస్టు చేస్తూ ఉంటుంది.
బెస్ట్ ఫ్రెండ్
అన్షు బెస్ట్ ఫ్రెండ్ శ్రీప్రియ. వీళ్లద్దరు కలిసి తరచుగా వెకేషన్లకు వెళ్తుంటారు. కలిసి సోషల్ మీడియాలో రీల్స్, పోస్టులు పెడుతుంటారు. అన్షు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టాలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య 1 మిలియన్ కు దగ్గరగా ఉంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు
ఇక స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రామరాజు ఫ్యామిలీ కథతో సాగుతోంది. ఇందులో రామరాజు అనే లీడ్ క్యారెక్టర్లో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ నటిస్తున్నాడు. ఇందులో రామరాజు రెండో కోడలు నర్మదగా అన్షు యాక్ట్ చేస్తోంది. ఈ సీరియల్ ఇప్పుడు మంచి రేటింగ్ తో సాగిపోతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


