Illu Illalu Pillalu April 10 Episode: భార్యపై ధీరజ్ ప్రేమ.. యాక్సిడెంట్ కూపీ లాగుతున్న భద్రావతి.. సేనాపతికి షాక్!
Illu Illalu Pillalu April 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఏప్రిల్ 10 ఎపిసోడ్ లో ప్రేమను తమ ఇంట్లోకి రమ్మని భద్రావతి పిలుస్తుంది. కానీ నా భార్యకు నేనున్నానని ధీరజ్ వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు యాక్సిడెంట్ పై భద్రావతి కూపీ లాగడంతో సేనాపతి టెన్షన్ పడతాడు. ప్రేమకు ధీరజ్ అన్నం తినిపిస్తాడు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమకు యాక్సిడెంట్ అవుతుంది. అయితే ఆ యాక్సిడెంట్ కు సొంత తండ్రి సేనాపతి కారణం అవుతాడు. దీంతో ప్రేమను క్షమింమన్న సేనాపతి, యాక్సిడెంట్ అసలు నిజం చెప్పేస్తాడా? అన్నది ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 10 ఎపిసోడ్ లో చూద్దాం.

సేనాపతి అబద్ధం
వాడెవడో యాక్సిడెంట్ చేస్తే మీరెందుకు క్షమాపణ చెప్తున్నారని తండ్రిని ప్రేమ ప్రశ్నిస్తుంది. నిన్ను జాగ్రత్తగా చూసుకోలేకపోయాను కదమ్మా అందుకే అని సేనాపతి అబద్ధం చెప్తాడు. ప్రేమ నీకు ఏమైనా అయి ఉంటే మేం బతికేవాళ్లమా అని తల్లి రేవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఇంటికి రమ్మని
నీకు ఏమైందో తెలియక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతికామని భద్రావతి అంటుంది. పదా మన ఇంటికి వెళ్దామని ప్రేమను పట్టుకుంటుంది. నిన్ను చూసుకోవడానికి ప్రస్తుతం వేదవతి కూడా లేదని జానకి అంటుంది. నీ మీద మాకున్న ప్రేమ ఈ లోకంలో ఎవరికీ ఉండదు ప్రేమ, రా అని భద్రావతి పిలుస్తుంది.
ధీరజ్ కౌంటర్
ఆ ఇంట్లో దిక్కులేకుండా పడి ఉంటావా? నిన్ను చూసుకోవడానికి ఎవరు ఉన్నారు చెప్పు అని ప్రేమను భద్రావతి అడుగుతుంది. నేను అని ధీరజ్ ట్విస్ట్ ఇస్తాడు. నా పెళ్లాన్ని చూసుకోవడానికి నేనున్నానని అంటాడు. నా పెళ్లం పొగరుబోతు మేనత్త ఏమన్నావ్? నా పెళ్లాన్ని నీ కంటే ఎక్కువ ప్రేమగా ఎవరూ చూసుకోలేరా? నేనున్నాను. ఆకాశమంతా ప్రేమను నా పెళ్లాం మీద చూపించడానికి నేనున్నానని ప్రేమను దగ్గరకు తీసుకుంటాడు ధీరజ్.
ఇలాంటి వంకలు పెట్టుకుని నా భార్యను ఆ ఇంటికి రమ్మని నక్కజిత్తులు చూపిస్తే తోక కత్తిరిస్తానని భద్రావతికి ధీరజ్ వార్నింగ్ ఇస్తాడు. తను మా ఇంటి కోడలు. కష్టం వచ్చినప్పుడు మీ ఇంటికి పంపిస్తామని అనుకోండి. కష్టంలోనూ, సుఖంలోనూ కోడలిని కన్నబిడ్డలా చూసుకుంటామని రామరాజు కూడా చెప్తాడు.
భాగ్యం ప్లాన్
సీన్ భాగ్యం ఇంటికి మారుతుంది. భాగ్యం, ఇడ్లీ బాబాయ్ కలిసి క్యారేజీ సర్దుతారు. ప్రేమకు జరిగిన యాక్సిడెంట్ అవకాశాన్ని నువ్వు బ్రహ్మాస్త్రంగా వాడుకుని మీ అత్తారింట్లోకి అడుగుపెట్టాలని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది. నా చెల్లికి యాక్సిడెంట్ జరిగిందని తెలిసి వచ్చేశా. అందుకే చేపల పులుసు తెచ్చానని చెప్పు. సేవలు చేస్తానని చెప్పమని భాగ్యం అంటుంది.
శ్రీవల్లి టెన్షన్
తల్లిని కూడా తనతో రమ్మంటుంది వల్లి. ఇది సోలోగా చేయాల్సిన పర్ఫార్మెన్స్. పైగా నా కాలుకు దెబ్బ తగిలిందని చెప్పారు. అందుకే నేను వస్తే డౌటింగ్ వచ్చేస్తది. సెంటిమెంట్ తో అల్లుకుపో అని కూతురికి చెప్తుంది భాగ్యం. అప్పుడు ఎవరు కూడా నిన్ను అక్కడి నుంచి పంపించలేరని అంటుంది. యాక్టింగ్ చేయాల్సింది నేను కదా నాకు టెన్షన్ గా ఉందని వల్లి చెప్తుంది. క్యారేజీ తీసుకుని వెళ్తుంది.
ప్రేమను వదులుకోలేమని
రాత్రి రామరాజు ఇంటి వైపు చూస్తూ భద్రావతి బాధపడుతుంది. అది చూసి సేనాపతి వస్తాడు. సేనా, ప్రేమను ఎంత అల్లారుముద్దుగా పెంచాం రా. దానికి కూడా మన ప్రేమ కనిపించడం లేదని భద్రావతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. దానికి చిన్నత్త వేదవతి బుద్ధులు వచ్చాయని సేనాపతి అంటాడు. వేదవతిని వదిలేసుకున్నాం, కానీ ప్రేమను ఎలా వదులుకుంటామని భద్రావతి అంటుంది.
సేనాపతి కంగారు
ఆ యాక్సిడెంట్ చేసిందెవరో తెలుసుకున్నావా అని భద్రావతి అడగడంతో సేనాపతి కంగారు పడతాడు. యాక్సిడెంట్ అనుకోకుండా జరిగిందని, డ్రైవర్ పరారీలో ఉన్నాడని సేనాపతి అబద్ధం చెప్తాడు. వాడు యాక్సిడెంట్ చేసింది భద్రావతి మేనకోడలిని. అంత తేలికగా ఎలా వదిలేస్తానని భద్రావతి సీరియస్ అవుతుంది.
డ్రెస్ ఛేంజ్ చేస్తానని
మరోవైపు ప్రేమ నొప్పితో బాధపడుతుంటే ధీరజ్ చూస్తాడు. కప్ బోర్డులోని డ్రెస్ తీసుకుని వెళ్లి, డ్రెస్ ఛేంజ్ చేస్తా.. రా అంటాడు. డ్రెస్ ఛేంజ్ చేయడం నాకు హెల్ప్ చేయడమా అని ప్రేమ కోప్పడుతుంది. నాకు సేవలు చేయాలనే సాకుతో మనసులోని ఆలోచనలు బయటకు తీస్తున్నావని, అడ్వాంటేజీ గా తీసుకుంటున్నావని ధీరజ్ తో ప్రేమ ఆడుకుంటుంది.
ధీరజ్ తినిపించాలని
వేరే ఆలోచనలు ఏవీ లేవని ధీరజ్ చెప్పడంతో ప్రేమ ఒప్పుకుంటుంది. నర్మద ఫుడ్ తీసుకొచ్చి తినిపిస్తానంటుంది. అక్కా అని ప్రేమ గట్టిగా అరుస్తుంది. మా ఆయనకు మా వాళ్ల దగ్గర చెడ్డపేరు తీసుకు వద్దామని చూస్తున్నావా అని ప్రేమ అంటుంది. నా పెళ్లానికి ఎవరి సాయం అక్కర్లేదని అన్నాడు కదా. సేవల్లో భాగంగా మా ఆయన స్వయంగా తన చేతులతో నాకు తినిపించాలి కదా అని ప్రేమ తెలివిగా అంటుంది.
రా, వచ్చి తినిపించమని ధీరజ్ ను ప్రేమ పిలుస్తుంది. కానీ ధీరజ్ ఒప్పుకోడు. డ్రెస్ ఛేేంజ్ చేసినప్పుడు లేదు కానీ ఇప్పుడు తినిపించమంటే వచ్చిందా అని ప్రేమ ఆడుకుంటుంది. ప్రేమ తిను అని ధీరజ్ తినిపిస్తాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


