Illu Illalu Pillalu April 8 Episode: చందును చంపేయమన్న సేనాపతి- తన కూతురుకే రివర్స్ అయిన పగ- ప్రేమకే లారీ యాక్సిడెంట్!

Illu Illalu Pillalu Serial April 8th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏప్రిల్ 8వ ఎపిసోడ్‌లో వల్లి గురించి రామరాజు అడిగితే చందు సీరియస్ అవుతాడు. చందుపై భాగ్యం డమ్మీ యాక్సిడెంట్ ప్లాన్ గురించి సేనాపతికి తెలుస్తుంది. కానీ, చందును నిజంగానే చంపేయామని సుపారీ ఇస్తాడు. ప్రేమను లారీ ఢీ కొడుతుంది.

Published on: Apr 8, 2026, 08:31:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో అమూల్య కాఫీ చాలా బాగా పెట్టిందని మెచ్చుకుంటాడు ధీరజ్. అది ప్రేమ చేసిందని అమూల్య చెప్పడంతో ఇంత చెత్త కాఫీ ఎప్పుడు చూళ్లేదని ఊంచేస్తాడు ధీరజ్. కాఫీ బాగుందని అంతా అంటారు. సాగర్ వచ్చి తండ్రి మీద కోపంతో కాఫీ తాగకుండా వెళ్లిపోతాడు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏప్రిల్ 8 ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏప్రిల్ 8 ఎపిసోడ్

ఇల్లు బోసిపోయిందిరా

చందును పిలిచిన రామరాజు వల్లిని ఎప్పుడు తీసుకొస్తావ్. తను లేకుంటే ఇల్లు బోసిపోయిందిరా, వల్లి ఇంటి మహాలక్ష్మీరా, వెంటనే వెళ్లి వల్లిని తీసుకురా అని చెబుతాడు. ఏంటీ నాన్న మాట్లాడితే వల్లి వల్లి అంటారు. తను లేకపోతే కొంపలు మునుగుతాయా అని కోప్పడుతాడు చందు. ఏంట్రా వల్లి పేరు ఎత్తగానే ఎప్పుడు లేనిది ఇంతలా మండిపోతున్నావ్. ఏమైందిరా అని రామరాజు అడుగుతాడు.

ఎందుకంటే.. అన్న చందు ప్రేమ సైగలతో ఆగిపోతాడు. తల్లికి ఆరోగ్యం బాగాలేదని వెళ్లిందిగా. వస్తుందిలే నాన్న అని చందు వెళ్లిపోతాడు. ఏమైందిరా అని రామరాజు కంగారుపడుతుంటే ఏం లేదు నాన్న ఇంట్లో పనులన్నీ వల్లి వదిన ఒక్కతే చేయాలా. మిగిలినవాళ్లు లేరా అని అన్నయ్య కోపం అని ధీరజ్ కవర్ చేస్తాడు. ఇక నుంచి ఇంటి పనులన్నీ ప్రేమను చేయమని ఆర్డర్ వేస్తాడు ధీరజ్.

మరోవైపు సేనాపతి దగ్గర పనిచేసే డ్రైవర్ లోడ్ దించడానికి బదులు వేరే పని ఉందని, వెళ్తానంటాడు. ఏదో డమ్మీ యాక్సిడెంట్ చేయాలి, మీరు ఐదు వందలు ఇస్తారు, వాళ్లు ఐదు వేలు ఇస్తారని అంటున్నాడని సేనాపతి వర్కర్ అంటాడు. నిన్ను పనిలో పెట్టుకుంది మాకోసమా, నీ పెత్తనాలకా, నిన్ను పంపిన తుగ్లక్‌కు ఫోన్ చేయమని సేనాపతి చెబుతాడు. ఫోన్ తీస్తుంటే అతని పాకెట్‌లోనుంచి చందు ఫొటో కింద పడుతుంది.

చందును చంపేయమన్న సేనాపతి

అది చూసిన సేనాపతి ఈ ఫొటో నీకు ఎక్కడిది అని అడుగుతాడు. దాంతో వ కూతురు శ్రీవల్లి భర్త చందుపై భాగ్యం వేసిన డమ్మీ యాక్సిడెంట్ ప్లాన్ గురించి మొత్తం చెబుతాడు రౌడీ. డమ్మీ లేదు మమ్మీ లేదు వాడిని నిజంగానే గుద్దేయ్. నేను రూ. 50 వేలు ఇస్తాను, ఈ విషయం బయటకు రావొద్దు. లారీ స్పీడ్ 100కు తగ్గొద్దు. వాడిని చంపేసి వెళ్లిపో. తర్వాత నేను చూసుకుంటానంటాడు సేనాపతి. దాంతో సరేనని రౌడీ డ్రైవర్ వెళ్తాడు.

రేయ్ రామరాజు మమ్మల్ని ఎంత బాధపెట్టార్రా. దానికి పదింతలు అనుభవించేందుకు సిద్ధంగా ఉండండి అని సేనాపతి అనుకుంటాడు. మరోవైపు ధీరజ్ దగ్గర తన కాఫీ గురించి తనే పొగుడుకుంటుంది. కుక్కపిల్ల తాగినట్లు ఏంటా సౌండ్, నోరు మూసుకుని తాగు అని తిడతాడు ధీరజ్. అయినా ప్రేమ వినదు. అలాగే చేస్తుంది. తర్వాత అది ధీరజ్ తాగిన కాఫీ అని, అందుకే చాలా స్వీట్‌గా ఉందని అంటుంది.

నీ మాటల్లోనే కాదురా, నీ పెదవుల్లో కూడా ఏదో స్వీట్‌నెస్ ఉందని ధీరజ్‌ను అంటుంది ప్రేమ. సిగ్గు లేకుండా ఎంగిలి కాఫీ తాగి ఇంకా మాట్లాడుతున్నావ్ అని ధీరజ్ కోప్పడుతాడు. నా భర్త కాఫీ తాగితే నీకేంట్రా. నువ్వు తాగు నీకు తెలుస్తుంది అని ధీరజ్ పెదాల ముందు కాఫీ పెడుతుంది. కానీ, ధీరజ్ పక్కకు నెట్టేస్తాడు. కాఫీతో నీ కోపం పోవాలని చూస్తే ఇంకా కోపం పెంచుకుంటావేంట్రా, నా ప్రేమ కాకాలు పట్టినట్లు ఉందా అని ప్రేమ అంటుంది.

దిగజారి ప్రవర్తిస్తున్నావ్

అంతేకాదు నువ్వు మరి దిగజారి ప్రవర్తిస్తున్నట్లు అనిపిస్తుందని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమ బాధపడుతుంది. మనిద్దరం ఒకే రూమ్‌లో ఉంటున్న రూమ్ మేట్స్, అంతకుమించి ఇంకో రిలేషన్ లేదు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఆడకు అని వార్నింగ్ ఇస్తాడు ధీరజ్. నన్ను కాలేజ్‌లో డ్రాప్ చేస్తావా అని ప్రేమ అడిగితే.. ధీరజ్ ఒప్పుకోకుండా వెళ్లిపోతాడు. ధీరజ్ పట్టించుకోకుండా వెళ్లిపోవడాన్ని చందు చూస్తాడు.

వాడు నీ మంచితనం అర్థం చేసుకున్నరోజు పశ్చాత్తాపపడతాడు. నేను నిన్ను కాలేజ్‌లో డ్రాప్ చేస్తాను పదా అని చందు ప్రేమను తన బైక్‌పై తీసుకెళ్తాడు. మరోవైపు యాక్సిడెంట్‌లో భాగంగా భాగ్యం భర్త రోడ్‌పై మేకులు వేస్తాడు. అదే రోడ్‌లో ప్రేమతో చందు వస్తాడు. ఎదురుగా లారీ కూడా వస్తుంది. నా భర్తకు ఏం కాకూడదు. చిన్నగా కాలు బెణకాలి అంతే అని దేవుడిని మొక్కుకుంటుంది శ్రీవల్లి. కూతురు పక్కనే భాగ్యం దంపతులు సరసాలు ఆడుతారు.

దాంతో శ్రీవల్లి కోప్పడుతుంది. అల్లుడు గారికి ఏం కాదని భాగ్యం హామీ ఇస్తుంది. లారీని పక్కకు ఆపి ఉంటాడు డ్రైవర్. చందుతో ప్రేమ కూడా ఉందని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. బైక్ టైర్‌కు మేకులు గుచ్చుకోవడంతో పంచర్ అవుతుంది. నేను ధీరజ్‌కు ఫోన్ చేస్తే కచ్చితంగా వస్తాడు అని కాల్ చేస్తాడు చందు. జరిగింది చెబుతాడు. ధీరజ్ రానని అంటాడు. శివాలయం రోడ్‌లో ఉన్నాం, త్వరగా రమ్మని చందు అంటాడు.

ప్రేమకు యాక్సిడెంట్

ధీరజ్ సరేనని బయలుదేరుతాడు. ఫొటోలో చందును చూసి వీడే అని రౌడీ లారీని స్టార్ట్ చేస్తాడు.లారీ కదిలిందని, ఇద్దరిని కొట్టేస్తాడేమో, కాల్ చేసి వద్దని చెప్పే అని శ్రీవల్లి అంటుంది. భాగ్యం డ్రైవర్‌కు కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు. ప్రేమను పక్కన కూర్చోమ్మని చందు చెబుతాడు. దాంతో ప్రేమ పక్కకు వెళ్లి షాప్‌లో వాటర్ బాటిల్ కొంటుంది. చందు రోడ్డుపై ఫోన్ మాట్లాడుతుంటాడు. డ్రైవర్ ఏంటే అంత స్పీడ్‌గా వస్తున్నాడని శ్రీవల్లి కంగారుపడుతుంది.

వాడు ఇలాంటివి చాలా చేశాడని తల్లి చెబుతుంది. చందు వైపు లారీ రావడం ప్రేమ చూస్తుంది. బావ అని ప్రేమ పిలిచిన వినపడదు. దాంతో చందును పక్కకు తప్పిస్తుంది ప్రేమ. కానీ, లారీ ప్రేమను గుద్దేసినట్లు చూపిస్తారు. అమ్మా అంటూ ప్రేమ అరుస్తుంది.

రివర్స్ అయిన పగ

అప్పుడే వచ్చిన ధీరజ్ ప్రేమ అంటూ పరుగెత్తుతాడు. శ్రీవల్లి, భాగ్యం షాక్ అవుతారు. చందును చంపమని చెప్పిన సేనాపతి ప్లాన్, పగ తన కూతురుకే రివర్స్ అవుతుంది. దాంతో తన కూతురును చంపేందుకు తనే సుపారీ ఇచ్చినట్లుగా సేనాపతికి చందు యాక్సిడెంట్ ప్లాన్, తీర్చుకోవాలనుకున్న పగ రివర్స్ అవుతుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More