Illu Illalu Pillalu April 7 Episode: అన్నదమ్ముల గొడవతో టెన్షన్- వెళ్లిపోదామన్న సాగర్- చందు యాక్సిడెంట్‌కు భాగ్యం ప్లాన్

Illu Illalu Pillalu April 7 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఏప్రిల్ 7 ఎపిసోడ్ లో మీ నాన్న అంటూ వేరు చేసి మాట్లాడటంతో సాగర్ పై ధీరజ్ కోప్పడతాడు. అన్నదమ్ములు గొడవ పడతారు. మరోవైపు అల్లుడికి యాక్సిడెంట్ చేయించాలని భాగ్యం ప్లాన్ వేస్తుంది.

Published on: Apr 7, 2026, 07:33:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 7 ఎపిసోడ్ లో రామరాజుకు చందు నిజం చెప్పేస్తాడా? లేదంటే నర్మద, ప్రేమలు అతణ్ని అడ్డుకుంటారా? అన్నది చూద్దాం. ఫుల్ గా తాగేసి ఇంటికి వచ్చిన చందు గట్టిగట్టిగా అరుస్తాడు. శ్రీవల్లి మోసం చేసిందంటాడు. మరోవైపు సాగర్ ఏమో రామరాజుపై ఫైర్ అవుతాడు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

తండ్రిపై సాగర్ కోపం

వాస్తవం మాట్లాడుతున్నా. మీ పెద్ద కొడుకు స్థానంలో నేను తాగి వచ్చుంటే నా చెంప మీద కొట్టి బయటకు నెట్టేసేవాళ్లు. పెద్ద కొడుకు తాగి వస్తే మీ కంటికి కనిపించడం లేదు. పైగా బాధతో తాగి వచ్చాడని మీరు తెగ బాధ పడుతున్నారని తండ్రితో సాగర్ అంటాడు. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావని సాగర్ ను ధీరజ్ ఆపేందుకు ట్రై చేస్తాడు.

ధీరజ్ వార్నింగ్

నేను చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష వేస్తాడు. కొడుకుల విషయంలో ఆయనకు పక్షపాతం ఉన్నట్లా కాదా అని సాగర్ ప్రశ్నిస్తాడు. మొదటిసారి వేరు చేసి మాట్లాడుతున్నావ్? పక్షపాతం అంటూ మాట్లాడతావేంటీ? అని ధీరజ్ అంటాడు. మీ నాన్నను అంటే కోపం వచ్చిందా? పూజలో కూర్చుంటా అంటే మీ నాన్న లేవబోయాడని సాగర్ ఫైర్ అవుతాడు. ఇంకోసారి మీ నాన్న అంటే బాగుండదని ధీరజ్ వార్నింగ్ ఇస్తాడు.

అన్నదమ్ముల గొడవ

సాగర్, ధీరజ్ గొడవ పడతారు. రామరాజు వచ్చి తిరుపతి చెంప పగలగొడతాడు. నా పెద్ద కొడుకు నిజాయతీగా ఉంటాడు. అందుకే తాగినా నా ముందుకు వచ్చాడు. కానీ వీడిలా ఎవరికో డబ్బులు ఇచ్చి దొడ్డిదారిన ఉద్యోగం తెచ్చుకోలేదని రామరాజు మళ్లీ అదే మాట అంటాడు. సిగ్గు లేకుండా భార్య నగలు కుదవ పెట్టేవాడు కాదు అంటూ సీరియస్ అవుతాడు.

ఇంట్లో నుంచి వెళ్లిపోదామని

సాగర్ కోపంతో వెళ్లిపోతాడు. చందును లోపలికి తీసుకెళ్తారు. మీ నాన్నతో అలాగేనా మాట్లాడేదని సాగర్ ను నర్మద అడుగుతుంది. కానీ తన తండ్రిది పక్షపాతమేనని సాగర్ పదే పదే చెప్తాడు. మీరందరూ ఏం చేసినా తప్పు కాదంటాడు. నేను చెప్పేది అర్థం చేసుకోకుండా ఎందుకు పాత విషయాలు బయటకు తీస్తున్నావని నర్మద అడుగుతుంది.

ఫంక్షన్లో అందరి ముందు చెంపపై కొట్టాడు. పూజలో నుంచి లేవబోయాడు. అది అవమానించడం కాదా? కానీ నీకు కోపం రాదని నర్మదతో సాగర్ అంటాడు. మా అమ్మ రాగానే మనం ఇంట్లో నుంచి వెళ్లిపోదామని సాగర్ చెప్తాడు.

బాధలో ఫ్యామిలీ

మరోవైపు పగిలిపోయిన పావురాల బొమ్మను చూస్తూ ప్రేమ కన్నీళ్లు పెడుతుంది. చందు బావకు ఇచ్చిన మాట కోసం నిజం చెప్పలేకపోతున్నాని అనుకుంటుంది. ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో బాధతో కుమిలిపోతుంటారు.

యాక్సిడెంట్ ప్లాన్

పొద్దునే శ్రీవల్లి, ఇడ్లీ బాబాయ్ ను తీసుకుని భాగ్యం బయటకు వస్తుంది. అల్లుడికి యాక్సిడెంట్ చేయాలని ఓ వ్యక్తితో భాగ్యం డీల్ మాట్లాడుతుంది. యాక్సిడెంట్ చేయాలి హై, డబ్బులు ఎంత అవుతుంది హై అని రాని హిందీలో భాగ్యం మాట్లాడుతుంది. భాగ్యం చందు ఫొటో ఇవ్వడం చూసి తల్లిపై శ్రీవల్లి మండిపడుతుంది.

చిన్న చిన్న దెబ్బలు

మీ ఆయనకు చిన్న చిన్న దెబ్బలు తగిలితే సేవలు చేయడానికి భార్య అవసరం. అప్పుడు నిన్ను ఆ ఇంట్లోకి పంపిస్తా. అప్పుడు ప్రేమ, నర్మద కాదు కదా ఎవరూ నిన్ను ఆపలేరని తన ప్లాన్ ను భాగ్యం వివరిస్తుంది. చిన్న చిన్న దెబ్బలు తగలాలి హై అని చెప్పి భాగ్యం వెళ్లిపోతుంది.

ప్రేమ, నర్మద ఫీల్

సీన్ రామరాజు ఇంటికి మారుతుంది. కిచెన్ లో వంట చేస్తూ ప్రేమగా ఉండే అన్నదమ్ములు ఇప్పుడు శత్రువులుగా మారారని నర్మద, ప్రేమ బాధపడతారు. మరోవైపు బావతో తిరుపతి కామెడీ చేస్తాడు. వయసు మీద పడ్డవాళ్లు పింఛన్ కోసం అప్లై చేసేందుకు ఈ రోజే ఆఖరి తేదీ అని పేపర్ లో చూస్తూ రామరాజు చదువుతాడు.

వల్లీ కాఫీ తీసుకురా అని రామరాజు అనడంతో తిరుపతి నవ్వేస్తాడు. వల్లి పుట్టింటికి వెళ్లిందని తెలిసినా కాఫీ అడిగావ్ అంటాడు. అమూల్యతో కాఫీ పంపిస్తారు. కాఫీ అద్భుతంగా ఉందని రామరాజు, ధీరజ్ అంటారు. ఈ కాఫీ ప్రేమ వదిన పెట్టిందని అమూల్య చెప్పడంతో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More