Illu Illalu Pillalu April 6 Episode: చీపురుతో అమ్మానాన్నను బాదేసిన శ్రీవల్లి.. చందు తాగొచ్చి అసలు నిజం చెప్పేశాడా?
Illu Illalu Pillalu April 6 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 6 ఎపిసోడ్ లో ఓ వైపు ప్రేమ, ధీరజ్ ల మధ్య గొడవ కొనసాగుతూనే ఉంటుంది. ప్రేమ ఎంత ప్రేమగా మాట్లాడిన ధీరజ్ పట్టించుకోడు. మరోవైపు అమ్మానాన్నపై శ్రీవల్లి మండిపడుతుంది. ఇంకోవైపు పూటుగా తాగి వచ్చిన చందు.. తండ్రికి నిజం చెప్పాలనుకుంటాడు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఏప్రిల్ 6 ఎపిసోడ్ లో.. తనను తప్పుగా అర్థం చేసుకుంటున్నావంటూ ధీరజ్ తో చెప్తూ ప్రేమ ఏడుస్తుంది. అమూల్య విషయంలో తాను ఏ తప్పు చేయలేదని అంటుంది. నా మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉందని చెప్తుంది. కానీ ధీరజ్ మాత్రం కరగడు.

ఐలవ్యూ ధీరజ్
నీ కంటే ముందే నా ప్రేమ మొదలైంది. నువ్వు ప్రపోజ్ చేసిన తర్వాత నా ప్రేమను చెప్పాలని ఎంతో ఆరాటపడ్డా. కానీ అదే సమయంలో ఈ గొడవ జరిగింది. అందుకే ప్రేమకు ప్రతిరూపమైన ఈ పావురాలను గిఫ్ట్ గా ఇచ్చి, ఐ లవ్యూ ధీరజ్ అని చెప్పడానికి వచ్చానని ప్రేమ అంటుంది. కానీ ధీరజ్ ఆ గిఫ్ట్ ను విసిరి కొడతాడు.
ప్రేమకు గాయం
పావురాల గొప్పతనం నీకు తెలుసా? వీటిని ముట్టుకునే అర్హత కూడా నీకు లేదని ప్రేమపై ధీరజ్ కోప్పడతాడు. కింద పడ్డ ముక్కలను ఏరుతుంటే ప్రేమ చేతికి గాయమవుతుంది. కట్టు కట్టాలని ఉందని, కానీ నువ్వు చేసిన నమ్మక ద్రోహం నన్ను బండరాయిలా మార్చేసిందని ధీరజ్ అనుకుంటాడు.
ఆగిపోయిన నర్మద
అప్పుడే నర్మద వస్తుంది. ప్రేమ వేలికి కట్టు కడుతుంది. ధీరజ్ నువ్వు మనిషిలా ప్రవర్తిస్తున్నావా? నీ భార్యకు దెబ్బ తగిలి రక్తం వస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? అని నర్మద సీరియస్ అవుతుంది. అసలు అమూల్య విషయంలో జరిగింది ఏంటో అని చెప్పేయబోతున్న నర్మద.. చందు బావ చెప్పిన మాట గుర్తుకు వచ్చి ఆగిపోతుంది.
చీపురుకట్టతో శ్రీవల్లి
మరోవైపు ‘అమ్మాయి ఆంధ్ర మిర్చి’ అంటూ ప్లేట్ లో బజ్జీలు పట్టుకుని భాగ్యం, ఇడ్లీ బాబాయ్ సాంగ్ వేసుకుంటారు. ఒకరికొకరు ప్రేమగా బజ్జీలు తినిపించుకుంటారు. అది చూసి శ్రీవల్లి రగిలిపోతుంది. చీపురుకట్ట పట్టుకుని రంగంలోకి దిగుతుంది. అది చూసి భాగ్యం, ఇడ్లీ బాబాయ్ హడలెత్తిపోతారు. కన్నకూతురు కాపురం కూలిపోయిందనే బాధ లేకుండా సరసాలు ఆడుతున్నారా అని అమ్మానాన్నను చీపురుకట్టతో శ్రీవల్లి కొడుతుంది.
భాగ్యం ప్లాన్
ప్రేమ, నర్మద కాళ్లు పట్టుకుని అత్తింటికి వెళ్లాలనుకున్నా కానీ మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టేసావని తల్లిపై వల్లి మండిపడుతుంది. 10 రోజుల్లో ఆ ఇంట్లో నిన్ను తీసుకెళ్తి పెట్టానని చెప్పా కదా. నీ జీవితం బుక్కిపాలవుతుందంటే ఈ భాగ్యం వదులుతుందా? రేపే నిన్ను అత్తారింట్లో అడుగుపెట్టించి భర్తకు దగ్గర చేస్తా. ఆ నాటు మిర్చి, పొట్టిది వచ్చి బతిమిలాడేలా చేస్తానని భాగ్యం అంటుంది.
తాగేసి వచ్చిన చందు
సీన్ చందు దగ్గరకు షిఫ్ట్ అవుతుంది. పూటుగా తాగేసి తూళుతూ వెళ్తున్న చందు.. నాన్నకు నిజాలన్నీ చెప్పేస్తానని అనుకుంటాడు. తాగి వచ్చిన చందును చూసి నర్మద, ప్రేమ షాక్ అవుతారు. వల్లి అక్క చేసిన మోసాన్ని చందు బావ తట్టుకోలేకపోతున్నాడు. ఏదో ఒకటి చేసి వల్లి అక్కను తీసుకొద్దామని నర్మద, ప్రేమ అనుకుంటారు.
వల్లి ఏం చేసిందంటే?
ధీరజ్, సాగర్ కలిసి చందును పట్టుకోవాలని అనుకుంటారు. చందు మాత్రం నాన్న అని అరుస్తాడు. ఎవరు ఎంత చెప్పినా చందు వినడు. ఇప్పుడే మాట్లాడాలంటూ అరుస్తాడు. అప్పుడే రామరాజు బయటకు వస్తాడు. పెద్దోడా నువ్వు తాగేసి వచ్చావా? నువ్వు తాగేసి వచ్చావని తెలిస్తే నీ భార్య ఎంతలా బాధపడుతుందో తెలుసా? అని రామరాజు అంటాడు.
నేను తాగి రావడానికి కారణం అదే. దానివల్లే నేను తాగా. అసలు ఏం చేసిందో తెలుసా? మీ మనసు చాలా సెన్సిటివ్. మీరు నమ్మినవాళ్లు మోసం చేస్తే తట్టుకోలేరు. అందుకే వల్లి చేసింది తెలిస్తే మీరు తట్టుకోలేరని చందు చెప్తాడు. మధ్యలో నర్మద, వల్లి వచ్చి విషయాన్ని డైవర్ట్ చేయాలని చూస్తారు. చందును ధీరజ్ లోపలికి తీసుకెళ్లాలని అనుకుంటాడు.
అప్పుడే సాగర్ చప్పట్లు కొడుతూ సెంటిమెంట్ డ్రామా జరుగుతుందంటాడు. రామరాజు గారికి పెద్ద కొడుకుపై ప్రేమ ఎక్కువైపోయి కళ్లు పూర్తిగా మూసుకుపోయాయి. ఒకవేళ నేనే తాగి వస్తే తాగి నా ముందుకే వస్తావా? గౌరవం తగలపెట్టేస్తావా? అని దేశద్రోహం చేసినట్లు నన్ను కొట్టి గెంటేసేవాళ్లని సాగర్ అనడంతో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


