Illu Illalu Pillalu April 3 Episode: కాపురం కూల్చేశారంటూ శ్రీవల్లి ఏడుపు.. చందు అబద్ధం.. కొడుకు మోసం చేశాడ‌న్న రామ‌రాజు

Illu Illalu Pillalu April 3 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఏప్రిల్ 3 ఎపిసోడ్ అలా అలా సాగిపోతుంది. తన కాపురం కూలిపోవడానికి అమ్మానాన్న కారణమంటూ శ్రీవల్లి ఏడ్చేస్తుంది. వల్లిని పుట్టింట్లో వదిలేసినందుకు అమ్మానాన్నకు చందు అబద్ధం చెప్తాడు. ధీరజ్, ప్రేమ కలిసి పూజలో కూర్చుంటారు.

Published on: Apr 3, 2026, 07:56:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద, ప్రేమ కలిసి శ్రీవల్లి బండారం మొత్తం చందు బావకు తెలిసేలా చేస్తారు. కోపంతో ఊగిపోయిన చందు ఏమో శ్రీవల్లిని పుట్టింటికి పంపించేస్తాడు. మరోవైపు రామరాజు ఇంట్లో రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 3 ఎపిసోడ్ లో చూసేయండి.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

శ్రీవల్లి ఏడుపు

నోట్లో నుంచి మాటొచ్చిందంటే సంపేస్తానంటూ అమ్మానాన్నలపై శ్రీవల్లి కోపంతో ఊగిపోతుంది. నా కాపురం నిలువునా కూలిపోయిందని వల్లి ఏడుస్తుంది. నా చదువు విషయంలో అబద్ధాలే కాదు, ఆ బండోడిని ప్రేమించమని అమూల్యకు చెప్పిన విషయాన్ని అన్నింటిని ఆ ప్రేమ, నర్మద మా ఆయనకు తెలిసేలా బయటపెట్టేశారని జరిగింది మొత్తం వల్లి చెప్తుంది.

కాపురమే లేదు

ఆ ప్రేమ, నర్మద మంచోళ్లు కదే. నీతో ఆడుకోవడానికి ఇలా చేస్తున్నారనుకున్నా. కానీ కాపురం కూలుస్తారా అని భాగ్యం అంటుంది. చేసింది మొత్తం మీరే. అబద్ధాలు చెప్పొద్దని, మోసాలు చేయొద్దని చెప్తూనే ఉన్నా. కానీ నా కాపురం బాగుండాలని మోసాలు చేస్తూనే వచ్చారు. చివరకు నా కాపురమే లేకుండా పోయింది. నా భవిష్యత్ చీకటి అయిపోయిందని శ్రీవల్లి ఏడుస్తుంది.

భర్త వదిలేశాడని

ఆ భద్రావతి వాళ్లకు, మా మామయ్యకు పడదని చెప్పా. కానీ వాళ్లతో చేతులు కలిపి రూ.10 లక్షలు తీసుకున్నారు. మీ చేతులతో మీరే నా కాపురాన్ని కూల్చేశారు. నన్ను ప్రాణంగా చూసుకునే నా భర్త వద్దని వదిలేశాడు. నా కాపురాన్ని మీరే కూల్చేశారు. మా ఆయన వదిలేస్తే నేను బతకలేనని వల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

పెద్ద కొడుకు, కోడలు

మరోవైపు రామరాజు ఇంట్లో రాములోరి కల్యాణానికి అంతా సిద్ధమవుతోంది. నా పెద్ద కొడుకు చందు, మా ఇంటి మహాలక్ష్మి వల్లి మాతో పాటు పూజలో కూర్చుని సీతారాముల కల్యాణం జరిపిస్తారని రామరాజు అంటాడు. నీ పెద్ద కొడుకు, కోడలు ఇక్కడ లేరు కదా అల్లుడు అని వేదవతి అమ్మ అంటుంది.

చందు అబద్ధం

ఇంట్లో వాళ్లు లేరా? ఏమైందని నర్మద, ప్రేమను రామరాజు, వేదవతి అడుగుతారు. అప్పుడే చందు వస్తాడు. వల్లి ఇంట్లో లేదు నాన్న. నేనే తనను వాళ్ల పుట్టింట్లో వదిలేసి వచ్చానని చందు చెప్తాడు. ఎందుకు వదిలేసి వచ్చావని రామరాజు, వేదవతి అడుగుతారు. వల్లి వాళ్ల అమ్మ కాలు జారి పడిపోయిందని చందు అబద్ధం చెప్తాడు. నా భార్య ఎలాగో లేదు కదా నేను రైస్ మిల్ వెళ్తున్నానని చందు బయటకు వస్తాడు.

నా మీద ఒట్టేనని

నర్మద, ప్రేమ వెళ్లి చందుతో మాట్లాడతారు. వల్లి అక్కకు బుద్ధి చెప్పాలని అనుకున్నాం. అంతే కానీ ఇంట్లో నుంచి పంపించేయాలని కాదు బావ అని నర్మద, ప్రేమ అంటారు. నా భార్య గురించి నాకు చెప్పారు. తను దేవత అని నాన్న అనుకుంటున్నారు. తన గురించి తెలిస్తే నాన్న తట్టుకోలేరు. నేనే సరైన నిర్ణయం తీసుకున్నా. వల్లి గురించి ఇంట్లో వాళ్లకు తెలిస్తే నా మీద ఒట్టేనని చందు వెళ్లిపోతాడు.

వల్లి చేసిన మోసానికి చందు కుమిలిపోతాడు. పెళ్లి సీన్లు గుర్తు చేసుకుంటూ బాధపడతాడు. ఇంత మోసం చేస్తావా వల్లీ అని చందు ఫీల్ అవుతాడు.

సాగర్ సీరియస్

మరోవైపు నడిపోడా, నర్మదను పూజలో కూర్చోమని వేదవతి చెప్తుంది. కానీ వాడు ఈ పూజలో కూర్చుంటే నేను పూజ చేయనని రామరాజు అంటాడు. బుజ్జమ్మ ఎంత చెప్పినా రామరాజు వినడు. వాడు ఆ ఉద్యోగం మానేసేంతవరకూ వాడితో మాట్లాడనని రామరాజు అంటాడు. నేనే ఆయనతో కలిసి పూజ చేయనని సాగర్ లేస్తాడు. ఆయన ఎంతలా అవమానిస్తున్నా భరిస్తూనే ఉన్నా. నాకు ఆత్మాభిమానం ఉండదా? అని సాగర్ సీరియస్ అవుతాడు.

ధీరజ్ నో

దొంగదారిలో ఉద్యోగం కొనుక్కుని, ఆ పాపపు సొమ్ముతో బతకాలనుకోవడం మోసమని రామరాజు మరోసారి అంటాడు. వేదవతి తల్లి, పెద్దమ్మ చెప్పినా రామరాజు వినడు. ధీరజ్ మీ దంపతులు వచ్చి పూజలో కూర్చోండని వేదవతి పిలుస్తుంది. కానీ ప్రేమ పక్కన కూర్చోవడానికి ధీరజ్ ఒప్పుకోడు. అమూల్య విషయంలో తను చేసింది భరించలేకపోతున్నానని ధీరజ్ అంటాడు.

ధీరజ్ ను పక్కకు తీసుకెళ్లి వేదవతి మాట్లాడుతుంది. ప్రేమ కారణంగా మన ఫ్యామిలీ ఇలా ఉంది. అమూల్య విషయంలో ప్రేమ తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదు. అమ్మ మాట నమ్ము అని ధీరజ్ ను తీసుకొచ్చి ప్రేమ పక్కన వేదవతి కూర్చోబెడుతుంది. ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాములోరి కల్యాణం పూర్తవడంతో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More