Illu Illalu Pillalu Today Episode: పుట్టింటికి వేదవతి- నర్మద ప్రేమల కాళ్లు పట్టుకున్న శ్రీవల్లి-భాగ్యం 10 రోజుల ఛాలెంజ్!

Illu Illalu Pillalu Serial April 4th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏప్రిల్ 4వ ఎపిసోడ్‌లో తన ఇంటికి వేదవతిని పంపించమని రామరాజును కోరుతుంది తల్లి. దానికి రామరాజు ఒప్పుకుంటాడు. గుడిలో నర్మద, ప్రేమను కలిసి తనను క్షమించమని కాళ్లు పట్టుకుంటుంది. కానీ, వల్లి తల్లి 10 రోజుల ఛాలెంజ్ చేస్తుంది.

Apr 4, 2026, 08:44:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో వేదవతిని చూస్తే తన తల్లిని చూసినట్లు ఉంటుందని ఇంటికి వచ్చిన వేదవతి అమ్మ అంటుంది. ఈ చివరి రోజుల్లో దీంతో కలిసి ఉందామని వచ్చాను. కానీ, ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇది ఆ ఇంటి గడప తొక్కదని, రామరాజు ఓ కోరిక కోరుతాను. తీరుస్తావా. ఒక్క వారం రోజులు వేదవతిని మా ఇంటికి పంపిస్తావా అని ఆమె అడుగుతుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏప్రిల్ 4 ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏప్రిల్ 4 ఎపిసోడ్

పెద్దమ్మ ఊరికి వేదవతి

వేదవతి ఇప్పుడెందుకు అమ్మ అని అంటుంది. ధీరజ్, ప్రేమ, నర్మద వెళ్లిరమ్మని అంటారు. రామరాజు కూడా ఒప్పుకుంటాడు. బట్టలు సర్దుకో అని వేదవతి తల్లి చెబుతుంది. అలా తల్లితోపాటు పుట్టింటికి వేదవతి వెళ్తుంది. రామరాజును బాగా చూసుకోమని చెబుతుంది వేదవతి. తర్వాత గుడిలో శ్రీవల్లిని ప్రేమ, నర్మద కలుస్తారు. ఎందుకు పిలిచావో చెప్పమని నర్మదా అంటుంది. నా బండారం మీరు బయటపెట్టారు, మీ లొసుగులు నేను కాపాడాను. కాబట్టి, మీరంతా కలిసి నన్ను ఇంటికి తీసుకెళ్లండని శ్రీవల్లి అంటుంది.

ఇప్పటికీ తనది తప్పు కాదంటుంది, పదా అని ప్రేమ అంటుంది. దాంతో శ్రీవల్లి వేడుకుంటుంది. శ్రీవల్లి చేసిన తప్పులన్నీ ప్రేమ చెబుతుంది. అన్నింటికి ఊరుకుంటే నువ్వు మాత్రం మా కాపురంలో ఎసరు పెట్టాలని చేశావ్. ఇక నిన్ను క్షమించేది లేదంటుంది ప్రేమ. నా కాపురం నిలబెట్టండి సెల్లాయిలు అని క్షమించమని కన్నీళ్లతో అంటుంది శ్రీవల్లి. మా ఆయన్ను వదిలేస్తే నాకు సావే గతి అని నర్మదా, ప్రేమ కాళ్లు పట్టుకుంటుంది శ్రీవల్లి.

అమ్మడు వాళ్ల కాళ్ల పట్టుకుంటావేంటీ బుద్ధి లేకుండా. నువ్వు ఈ భాగ్యం కూతురువి, ఇది భరించలేని అవమానం అని ఆపుతుంది భాగ్యం. మీ గురించి ఏమనుకుంటున్నారే. కాపురం నిలబెట్టండి అంటే కాళ్లు పట్టించుకుంటారా. మీరేంటే నా కూతురుని తీసుకెళ్లేది నేనే నా కూతురు ఆ ఇంట అడుగుపెట్టేలా చేస్తాను అని భాగ్యం అంటుంది. హేయ్ అరవకు కాకిలా అరుస్తున్నావ్, నీ తప్పుల వల్లే నీ కూతురు కాపురం ఇలా అయిందని అంటుంది నర్మదా.

కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు

ఇప్పటిదాకా శ్రీవల్లి వేడుకుంటే పోనిలే చందుతో మాట్లాడి ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాం. కానీ, నీలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేకపోవడానికిపైగా మమ్మల్నే అంటావా. ఇప్పుడు చెబుతున్నాం విను నీ కూతురును ఆ ఇంట్లోకి అడుగుపెట్టనివ్వం అని నర్మద అంటుంది. దాంతో తల్లిని తిట్టి చెల్లెళ్లను బతిమిలాడుతుంది శ్రీవల్లి. క్షమాపణలు చెబుతుంది. బుద్ధిలేకుండా వాళ్ల ముందు దిగజారుతావేంటే అని తిడుతుంది భాగ్యం.

నువ్వు వాళ్ల కాళ్ల మీద వేడుకోవడం అవసరం లేదు. నేను నిన్ను ఆ ఇంట్లో అడుగుపెట్టేలా చేస్తాను అన్నాగా. మీరు జన్మలో నా కూతురుని అడుగుపెట్టనివ్వమని అన్నారుగా. పదే పది రోజుల్లో తిరిగి నా కూతురును ఆ ఇంట్లో అడుగుపెట్టించకపోతే నా పేరు భాగ్యం.. భాగ్యలక్ష్మే కాదు అని ఛాలెంజ్ చేస్తుంది. ఇంతదూరం వచ్చింది కాబట్టి మేము కూడా చెబుతున్నాం. నీ కూతురుని ఎలా తీసుకొస్తావో మేము కూడా చూస్తాం అని నర్మద అంటుంది.

శ్రీవల్లి అరవంగా బలవంతంగా తీసుకెళ్తుంది తల్లి భాగ్యం. తర్వాత తనతో పూజలో కలిసి ధీరజ్ కూర్చోవడంపై మురిసిపోతుంది ప్రేమ. ధీరజ్ దగ్గరికి వెళ్లి చేయికి హగ్ చేసుకుని ప్రేమగా ఎమోషనల్ అవుతుంది. వదులు అని ధీరజ్ అంటే.. నీకోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చానురా అని ప్రేమ అంటుంది. వదులు అని గట్టిగా అరుస్తాడు ధీరజ్. నీ మీద నాకు ఉంది అదే అని కోప్పడుతాడు. ఇంకా కోపం ఉందంటావేంట్రా అని ప్రేమ అంటుంది.

ప్రేమపై ధీరజ్ అరుపులు

అమ్మ చెప్పిందని మనసు చంపుకుని పూజలో కూర్చొన్నా. నిన్ను క్షమించి కాదు. నా చెల్లెలి విషయంలో నువ్వు చేసిన నమ్మకద్రోహాన్ని మర్చిపోలేను. నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు నీ మీద నాకు కోపం పోదు అని ధీరజ్ గట్టిగా చెబుతాడు. ఎందుకురా నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నావ్ అని ప్రేమ అడుగుతుంది.

నేను నా లైఫ్‌లో చేసిన రెండు తప్పులు ఏంటో తెలుసా. నీ మెడలో తాళి కట్టడం, నా గుండెలో నీ మీద ప్రేమ నింపుకోవడం. ఈ రెండు తప్పులు నన్ను వెక్కిరిస్తూనే ఉంటాయని ధీరజ్ అంటాడు. నాతో ప్రేమగా ఉన్నట్లు నటించి మా కుటుంబానికి ద్రోహం చేయాలని చూశావ్. మీ అన్నకి నా చెల్లికి ప్రేమ రాయబారం నడిపి నా చెల్లి జీవితంతో ఆడుకోవాలని చూశావ్ అని నిందిస్తాడు ధీరజ్.

నువ్వు పొరపాటు పడుతున్నావురా. అమూల్య విషయంలో నాకు ఏ పాపం తెలియదు. నా కుటుంబానికి నేను ఏ ద్రోహం చేయనురా. నీ మీద ప్రేమ ఉన్నట్లు నటించలేదురా అని ఏడుస్తూ చెబుతుంది ప్రేమ. ఆపుతావా నీ డ్రామాలు అని గట్టిగా అరుస్తాడు ధీరజ్. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More