Illu Illalu Pillalu May 11 Episode: కొత్త సమస్యలో ధీరజ్- వల్లికి నిజంగా కడుపు వచ్చే ప్లాన్- సాగర్‌ను రెచ్చగొట్టిన మామ
Illu Illalu Pillalu Serial May 11th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మే 11వ ఎపిసోడ్‌లో డౌన్ పేమెంట్ లేకుండా ఐఎమ్ఐలో ధీరజ్ కారు తీసుకుంటాడు. ప్రేమ హెచ్చరించిన వినడు. శ్రీవల్లిపై తన భర్తకు ప్రేమ పుట్టి నిజంగా కడుపు వచ్చేలా చేస్తానని సుకన్య ప్లాన్ చేస్తుంది. సాగర్ మనసులో విషం నింపుతాడు మామ.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్ దగ్గరికి వేదవతి వెళ్లి మాట్లాడుతుంది. తను హర్ట్ అయ్యానని, అలిగిందని చెబుతుంది. నీ రెండు చెంపలు వాయించాలని ఉంది. కారుకు డబ్బులు నాన్న దగ్గర తీసుకోమంటే ఎందుకు తీసుకోవట్లేదు. నువ్వు ట్రావెల్ బిజినెస్ పెట్టి ఎదగాలనే అనుకుంటున్నావ్ కదా. దానికి నాన్న దగ్గర తీసుకుంటే ఏంటని వేదవతి అడుగుతుంది.

బాధ్యతగా ఉండాలని
అప్పుడే నర్మద, సాగర్ వస్తారు. రామరాజు కూడా వాళ్ల మాటలు వింటాడు. ఎక్కడో డబ్బు కోసం ప్రయత్నించే బదులు ఇంట్లోనే తీసుకోవచ్చుగా అని నర్మద అంటుంది. నేను నా కష్టంతో లైఫ్‌లో ఎదగాలని అనుకుంటున్నాను. నాన్న దగ్గర ఒక్క రూపాయి తీసుకోవాలని లేదని ధీరజ్ అంటాడు. చెంపలు పగలగొడతాను. బయట అడగటానికి లేని నామోషి, తండ్రి దగ్గర తీసుకోడానికి ఏంట్రా అని వేదవతి అంటుంది.
నాకు బాధ్యత లేదని, తిండి దండగ అని అనేవారు. నాకు నా కష్టంతో లైఫ్‌లో ఎదిగి బాధ్యతగా ఉండగలను అని నాన్నకు చూపించాలని అనుకుంటున్నాను. అయినా నాన్న కరెక్ట్‌గానే అన్నారుగా. నేను కోపంతో ఇది చేయట్లేదు. నా మనసుకు నచ్చని పని చేయమని ఫోర్స్ చేయకు. ఆ తింగరిది నా ప్రేమతో నగలు తాకట్టు పెట్టింది అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు రామరాజు వింటాడు. రామరాజును వేదవతి చూస్తుంది.
భర్తకు కష్టమొస్తే ఏ భార్య ఊరుకోలేదు. మీ అన్నయ్య కోసం నేను నగలు తాకట్టు పెట్టి 20 లక్షలు తీసుకొచ్చాను అని నర్మద అంటుంది. ఈ విషయంలో నువ్వు అదృష్టవంతుడివిరా చిన్నోడ. నీ ప్లేసులో నేనుంటే మీ నాన్న బయటకు నడువురా అనేవాడు అని సాగర్ అంటాడు. రేయ్ మీ నాన్న ఉన్నాడురా అని వేదవతి అంటుంది. బుద్ధి లేకుండా ఎందుకు అలా మాట్లాడతావని నర్మదా అంటుంది.
కొడుకులా కాదు శత్రువులా
నిజమేగా అంది. ఆయన నన్ను కొడుకులా కాకుండా శత్రువులా చూస్తున్నాడుగా అని సాగర్ వెళ్లిపోతాడు. నడిపోడు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని వేదవతి రామరాజుతో అంటుంది. వాడే కాదు వీడు కూడా అర్థం చేసుకోవట్లేదు. వీడికి నా ప్రేమ అర్థం కావట్లేదు. వాడికి నా బాధ అర్థం కావట్లేదు. ఏమైనా నా కొడుకులు బాగుండాలనేదే నా తాపత్రయం. అది నా కొడుకులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో అని వెళ్లిపోతాడు రామరాజు.
చూశావారా మీ నాన్న ఎంత బాధపడుతున్నాడో అని వేదవతి అంటుంది. ఇంతలో ధీరజ్‌కు కాల్ రావడంతో సంతోషిస్తాడు. ఏమైంది, మొహం వెలిగిపోతుందని నర్మద అంటే.. గుడ్ న్యూస్. అది వెళ్లి వచ్చి చెబుతా అని ధీరజ్ వెళ్లిపోతాడు. మరోవైపు సుకన్యకు రామరాజు బామ్మర్ది తిరుపతి ఇల్లంతా చూపిస్తాడు. కిచెన్, డైనింగ్ హాల్ చూపిస్తూ హోమ్ టూర్ చేస్తాడు తిరుపతి. రెస్ట్ రూమ్ గురించి సుకన్య అడిగితే.. అది కట్టించలేదని తిరుపతి అంటాడు.
నీ పేరు తిరుపతి కాదు తింగరోడు అని పెట్టుకో. నేను అడిగింది వాష్ రూమ్ అని సుకన్య అంటుంది. తిరుపతి చూపిస్తాడు. థ్యాంక్యూ అంకుల్ అని పరువు తీసి వెళ్లిపోతుంది సుకన్య. ఆ ఇంట్లో సుకన్యను మన ఏజెంట్‌గా పెట్టాం అని సుక్కుకు కాల్ చేస్తుంది భాగ్యం. ఏజెంట్ సుకన్య రిపోర్టింగ్ అంటూ మాట్లాడుతుంది సుకన్య. వల్లి కడుపు గురించి డౌట్ రాలేదు కానీ, ప్రేమ నగల గురించి పెద్ద గొడవ అయిందని సుకన్య చెప్పి కాల్ వెంటనే కట్ చేస్తుంది.
నిజంగా కడుపు వచ్చే ప్లాన్
ఎదురింటి వాళ్లతోనే గొడవ అయింటుందని శ్రీవల్లికి కాల్ చేస్తుంది భాగ్యం. ప్రేమ నగల గొడవ గురించి అడుగుతుంది భాగ్యం. శ్రీవల్లి జరిగింది చెబుతుంది. ఫైనల్‌గా ఏం జరిగిందని భాగ్యం అడిగితే.. ఇంతలో సుకన్య సుకన్య వచ్చి నేను చెప్పిందే జరిగిందని కాల్ కట్ చేస్తుంది. శ్రీవల్లి దగ్గరికి భర్త చందు వచ్చేలా, నెల తిరిగేలోపు నెల తప్పే ప్లాన్ తన దగ్గర ఉందని సుకన్య చెబుతుంది. అంటే శ్రీవల్లికి నిజంగా కడుపు వచ్చే ప్లాన్ అని సుకన్య చెబుతుంది. మరోవైపు కారు ఈఎమ్ఐలో ఇచ్చే వ్యక్తి దగ్గరికి ధీరజ్, ప్రేమ వెళ్తారు.
అతను ఫోన్‌లో మాట్లాడే విధానం చూసి ఇదంతా వద్దని, సమస్యల్లో పడతామని నా మనసు చెబుతోందని హెచ్చరిస్తుంది ప్రేమ. కారు కావాలని, డౌన్ పేమెంట్ లేకుండా నెల నెల ఈఎమ్ఐలో మాత్రమే కట్టే స్కీమ్ ఏదో మీ దగ్గర ఉందటగా అలాంటిదే కావాలని ధీరజ్ అడుగుతాడు. ఎంతలో కావాలని అతను అడిగితే.. 10 లక్షల్లో కావాలని ధీరజ్ చెబుతాడు. డౌన్ పేమెంట్ లేదు కాబట్టి, ఈఎమ్ఐ, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది, నా రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయని, చెప్పిన టైమ్‌కి కట్టాలని, ఒక్క రోజు కూడా లేట్ చేయకూడదని అతను చెబుతాడు.
ప్రేమ వద్దంటుంది. ఏం కాదని లేట్ చేయనని ధీరజ్ చెబుతాడు. ఇప్పుడు ఇలాగే చెప్పి అప్పుడు ఒక్కరోజు, రెండు రోజులు అని లేట్ చేయొద్దు. ఎక్కడున్నా మా వాళ్లు నిన్ను ఎత్తుకొస్తారు. నువ్వు ఎక్కడున్నవో కూడా ఎవరికి తెలియదు అని అతను చెబుతాడు. ఇవన్నీ లైఫ్‌ను రిస్క్‌లో పెట్టుకునే కండిషన్స్ అని ప్రేమ అంటుంది. అలాంటి పరిస్థితి తీసుకురానని, ఒక్కరోజు ముందే ఈఐఎమ్ కట్టేస్తానని ధీరజ్ అంటాడు.
కొత్త సమస్యలో ధీరజ్
పేపర్స్ ఇచ్చి కండిషన్స్ చదువుకుని సంతకం చేయమంటాడు అతను. ధీరజ్ సంతకం చేసి ఇస్తాడు. రేపు మీ అడ్రస్‌కి కారు డెలివరి అవుతుందని అతను చెబుతాడు. మనం సమస్యలను కొని తెచ్చుకుంటున్నామేమో అని ప్రేమ అంటుంది. నువ్వుండగా ఏ సమస్య రాదని, కారు కొంటున్నందుకు సెలబ్రేట్ చేసుకోవాలని ధీరజ్ అంటాడు. మరోవైపు మావయ్య ప్రసాద్ రావును కలుస్తాడు సాగర్.
ఐదు లక్షల గొడవ గురించి మాట్లాడుతూ సాగర్‌కు ఎక్కిస్తాడు ప్రసాద్ రావు. ఐదు లక్షల కోసం అంత చేశాడా. మీరు రామలక్ష్మణులు అన్నావని ప్రసాద్ రావు అంటాడు. చిన్నోడికి నేనంటే చాలా ప్రేమ. కానీ, ఎందుకు అలా మాట్లాడాడో అర్థం కావట్లేదని సాగర్ అంటాడు. అసూయ, కుళ్లు. నువ్వు గవర్నమెంట్ జాబర్‌వి. తనకంటే గొప్ప స్థానంలో ఉండటం వల్ల మీ తమ్ముడు ఓర్చుకోలేకపోతున్నాడని సాగర్ మనసులో విషం నింపుతాడు ప్రసాద్ రావు.
మా చిన్నోడు అలాంటివాడు కాదు. అసూయ పడడు అని సాగర్ చెబుతాడు. నిజంగా మీ తమ్ముడికి స్వార్థం లేకుంటే నీ బాధను అతను అర్థం చేసుకోవాలి. మీ నాన్న నిన్ను అడుగడుగునా అవమానించడంతోనే నువ్వు ఇంట్లోంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నావుగా అని సాగర్‌ను రెచ్చగొడతాడు మామ ప్రసాద్ రావు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


