ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 29 ఎపిసోడ్: గవర్నమెంట్ ఎంప్లాయ్ అని బిల్డప్- భర్తతో బట్టలుతికించిన నర్మద- తెలిసిన భాగ్యం కుట్ర

ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 29 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 29 ఎపిసోడ్ లో నర్మద చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సాగర్ బట్టలు ఉతుకుతాడు. కూతురు మనసు మార్చాలని ప్రసాద్ రావు ప్రయత్నిస్తాడు. దీంతో భాగ్యం కుట్ర నర్మదకు తెలుస్తుంది. 

May 29, 2026, 07:31:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 29 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 29 ఎపిసోడ్ లో.. సాయం చేసే పేరుతో రొమాన్స్ చేయడానికి వచ్చిన ధీరజ్ ను ఆటాడుకుంటుంది ప్రేమ. మరోవైపు సాగర్ ను నర్మద బట్టలు ఉతకమంటుంది. నేను బట్టలు ఉతకడం ఏంటీ? అని సాగర్ షాక్ అవుతాడు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

బట్టలు ఉతికిన సాగర్

ఇప్పుడు మనం వేరు పడ్డాం కాబట్టి మన పనులు మనమే చేసుకోవాలి. నేను ఇల్లు క్లీన్ చేసి, ముగ్గు పెట్టా. నువ్వు బట్టలు ఉతికేయ్ అని నర్మద అంటుంది. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ ను అని సాగర్ బిల్డప్ గా అంటాడు. నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ నే. మరి ఈ పనుల కోసం జాబ్ మానేయాలా? అని నర్మద అడుగుతుంది. దెబ్బకు సాగర్ బట్టలు తీసుకువెళ్లి ఉతుకుతాడు.

ధీరజ్ కౌంటర్

అక్కడే ఉన్న ధీరజ్ బట్టలను ఎలా ఉతకాలో వెటకారంగా చెప్తాడు. సాటి బ్రదర్ అని, ఈ తమ్ముడు సాయం చేస్తుంటే ఎందుకు ఫైర్ అవుతున్నావని ధీరజ్ అడుగుతాడు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావ్. నోరు అదుపులో ఉండాలి. లేదంటే మర్యాదగా ఉండదు అని సాగర్ వార్నింగ్ ఇస్తాడు. మా వేరు కాపురం అన్నయ్యకు ఇంత కష్టం పెట్టావేంటీ దేవుడా? అని ధీరజ్ కౌంటర్లు వేస్తాడు.

మామయ్య కాళ్లు పట్టుకుంటే తప్పా నట్టింట్లో గీత చెరపలేరని అనుకుంటూ నర్మద వస్తుంది. సాగర్ కోపంతో వెళ్లిపోతాడు. ఈ పనులన్నీ చేయలేక మా అన్నయ్య దారిలోకి వస్తాడు వదిన అని ధీరజ్ చెప్తాడు.

నర్మదను మార్చాలని

సీన్ ప్రసాద్ రావు ఇంటికి మారుతుంది. అల్లుడికి సుజాత టిఫిన్ వడ్డిస్తుంది. మీ నాన్న నీకు ఆస్తిలో వాటా రాసిచ్చేంత వరకు నువ్వు తగ్గొద్దు అల్లుడూ అని ప్రసాద్ రావు చెప్తాడు. అప్పుడే నర్మద వస్తుంది. ఎందుకు పిలిచారో చెప్పండని పేరేంట్స్ ను అడుగుతుంది నర్మద. అత్తారింటికి వచ్చి తినే కొత్త అలవాటు కూడా వచ్చిందా? అని సాగర్ ను ప్రశ్నిస్తుంది నర్మద.

రెచ్చగొట్టిన ప్రసాద్ రావు

మీ ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు ఉంటున్నావని నర్మదను ప్రసాద్ రావు అడుగుతాడు. అతని దారి సరైనదే అయితే తప్పకుండా నడుస్తా. కానీ ఇంటిని రెండు ముక్కలు చేసి కన్నవాళ్లను బాధపెడుతున్నాడు. ఆస్తిలో వాటా కావాలని గొడవ పెట్టుకుంటున్నాడని నర్మద చెప్తుంది. అల్లుడు అడిగిన దాంట్లో తప్పేం ఉంది. భార్యగా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావ్. అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదని ప్రసాద్ రావు రెచ్చగొడతాడు.

భాగ్యం కుట్ర

ఈ గొడవలకు ఒక రకంగా మీరే కారణం నాన్న. అత్తామామలు నన్ను కన్నబిడ్డలా చూసుకుంటున్నారని నర్మద చెప్తుంది. మా నాన్న మాటలు గుడ్డిగా నమ్మినంత కాలం నువ్వు బాగుపడలేవని భర్తతో అంటుంది నర్మద. మీ అమ్మాయికి కాస్త చెప్పి పంపండని సాగర్ వెళ్లిపోతాడు. ఇప్పుడు అందరూ వేరు కాపురాలు పెడుతున్నారు. నీకు, అల్లుడికి గవర్నమెంట్ జాబ్. ఎంచక్కా మీ ఆస్తి మీరు తీసుకుని బయటకు వెళ్లండని నర్మదకు పేరెంట్స్ చెప్తారు.

కూతురు కోసం స్వార్థంగా ఆలోచించే తండ్రినే. నువ్వు, నీ భర్త హుందాగా బతకడం కోసం నేను చెప్పింది వినాలి. ఆ రోజు భాగ్యం వాళ్లు వచ్చి కళ్లు తెరిపించారు. అందుకే ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా గెంటేయాలని అనుకున్న రామరాజుకు చెక్ పెట్టానని ప్రసాద్ రావు అంటాడు. భాగ్యం వాళ్లు ఏం చెప్పారని నర్మద అడుగుతుంది. కానీ అది అనవసరమని ప్రసాద్ రావు కొట్టిపారేస్తాడు.

చంపాలనుకుంటున్నావ్

ఇటు రామరాజు ఇంట్లో శ్రీవల్లి దిగాలుగా కూర్చుని ఉంటుంది. నా అందాన్ని చూసి నువ్వు కుళ్లుకుంటున్నావ్ సుక్కు. ఇన్ని ట్యాబ్లెట్లు మింగేలా చేసి నన్ను చంపాలనుకుంటున్నావ్ కదా అని వల్లి అడుగుతుంది. నీ శత్రువులను నమ్మించడం కోసమే ఈ ట్యాబ్లెట్లు అని సుక్కు చెప్తుంది. వీటిని మూడు పూటలా తీసి బయటకు విసిరేయాలని సుక్కు అంటుంది.

ప్రేమ డౌట్

అప్పుడే ప్రేమ వస్తుంది. సుక్కు చేతిలోనే ట్యాబ్లెట్స్ ఉండిపోతాయి. కిటికీలో నుంచి ఏదో విసిరేయాలని అంటున్నారని సుక్కుపై ప్రేమకు డౌట్ వస్తుంది. చేయి బయటకు తీయమని ప్రేమ అడుగుతుంది. ప్రేమను వేరేవైపు చూసేలా చేసి ఆ ట్యాబ్లెట్స్ ను సుక్కు నోట్లో వేస్తుంది వల్లి. నోరు తెరవమని ప్రేమ అంటుంది. వల్లి తలపై ఒక్కటి కొట్టేసరికి సుక్కు ట్యాబ్లెట్స్ మింగేస్తుంది.

భాగ్యంపై ఫైర్

మరోవైపు భాగ్యం ముందు ఇడ్లీ బాబాయ్ గెంతులేస్తాడు. ఆ ఇంటిని రెండు ముక్కలు చేసి నర్మదను భలే దెబ్బ కొట్టావని ఇడ్లీ అంటాడు. అప్పుడే నర్మద, ధీరజ్, ప్రేమ కోపంతో అక్కడికి వస్తారు. నువ్వు అసలు మనిషివేనా? మీ బుద్ధి కుక్క తోక కంటే వంకరని నిరూపిస్తూనే ఉన్నారు. మిమ్మల్ని కొట్టినా సిగ్గు పడటం లేదని ధీరజ్, నర్మద, ప్రేమ ఫైర్ అవుతారు.

మీ నిజ స్వరూపం గురించి మామయ్యకు చెప్పకుండా వల్లి అక్కను ఇంటికి తీసుకెళ్లాం. కానీ మరో కుట్ర చేస్తావా? అని నర్మద ప్రశ్నిస్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More