Illu Illalu Pillalu May 14 Episode: వల్లి కడుపు డ్రామా బయటపెట్టేలా ప్రేమ, నర్మద ప్లాన్-తమ్ముడిపై సాగర్ ఫైర్-భాగ్యం కుట్ర
Illu Illalu Pillalu May 14 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 14 ఎపిసోడ్ లో శ్రీవల్లి కడుపు డ్రామా అని ప్రేమ, నర్మదకు డౌట్ వస్తుంది. వేరే హాస్పిటల్లో చెకప్ చేయిద్దామని అనుకుంటారు. మరోవైపు తమ్ముడు ధీరజ్ పై సాగర్ ఫైర్ అవుతాడు. నర్మదను ఇంటి నుంచి పంపేలా భాగ్యం ప్లాన్ చేస్తుంది.
Illu Illalu Pillalu May 14 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 14 ఎపిసోడ్ లో.. మందు కలిపిన పాలు తాగి ప్రేమ చేసిన రచ్చ గురించి ధీరజ్ చెప్తాడు. ప్రేమను ప్రేమగా దగ్గరకు లాక్కుంటాడు. గట్టిగా హగ్ చేసుకుంటాడు. అప్పుడే నర్మద వస్తుంది. పొద్దున్నే మొదలెట్టారా అని నర్మద అంటుంది. అప్పుడే ప్రేమను నర్మద పక్కకు తీసుకెళ్తుంది.

నర్మదకు డౌట్
ఆ పాలల్లో మందు కలిపింది సుకన్యనే. వల్లి అక్కను, చందు బావను ఒకటి చేయడం కోసం అలా చేసిందంటా అని నర్మద చెప్తే ప్రేమ షాక్ అవుతుంది. వల్లి అక్క ఆల్రెడీ ప్రెగ్నెంట్ కదా మళ్లీ కలపడం ఎందుకు అని ప్రేమ అడుగుతుంది. సుకన్య మాటలు నమ్మేలా అనిపించడం లేదని నర్మద అంటుంది. ప్రేమ కూడా డౌట్ పడుతుంది.
రిపోర్ట్స్ మాయం
డాక్టర్ ఇచ్చిన స్కానింగ్ రిపోర్ట్ లో వల్లి పేరు, డీటైల్స్ ఏం లేవని ప్రేమ చెప్తుంది. ఆ స్కానింగ్ రిపోర్ట్స్ కోసం ప్రేమ వెతుకుతుంది. కానీ రిపోర్ట్స్ కనిపించవు. రూమ్ లోనే పెట్టాను కానీ కనిపించడం లేదని నర్మదకు ప్రేమ చెప్తుంది. ఇదంతా చూస్తున్న సుక్కు రిపోర్ట్స్ కొట్టేశానని వల్లికి చెప్తుంది.
వల్లిది డ్రామానే
ఇదంతా చూస్తుంటే వల్లి ప్రెగ్నెంట్ కాదేమో, డాక్టర్ తో అబద్ధం చెప్పించిందేమోనని నర్మద అంటుంది. అది విని వల్లి షాక్ అవుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ కు డాక్టర్ మెడిసిన్ ఇస్తారు కదా, మరి వల్లి వదినకు ఇవ్వకపోవడం ఏంటీ? అని ధీరజ్ అడుగుతాడు. కచ్చితంగా ఇది డ్రామానే అని నర్మద, ప్రేమ కన్ఫామ్ చేసుకుంటారు.
వల్లి కడుపు నాటకం అని ఎలా బయటపెడదామని నర్మద అడుగుతుంది. వేరే డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించండని ధీరజ్ చెప్తాడు. రేపు డాక్టర్ దగ్గరకు వెళ్దామని నర్మద, ప్రేమ అనుకుంటారు. ఈ మాటలు విన్న వల్లి తెగ టెన్షన్ పడుతుంది.
సాగర్ ఫైర్
మరోవైపు మామ మాటలు గుర్తు చేసుకుంటూ ధీరజ్ పై కోపంతో రగిలిపోతాడు సాగర్. ధీరజ్ రెండు కాఫీ గ్లాస్ లు తీసుకొని వస్తాడు. సాగర్ ఆ గ్లాస్ విసిరేసి ధీరజ్ పై ఫైర్ అవుతాడు. నీ డ్రామాలు ఆపు. రూ.5 లక్షలు ఇచ్చి వెళ్లమన్నావు కదా అని సాగర్ అంటాడు. నిన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపడానికే అలా చేశా. నాకు మా అన్నయ్య కంటే ఏదీ ముఖ్యం కాదని ధీరజ్ చెప్పినా సాగర్ వినడు.
తమ్ముడిని నానామాటలు
నేను గవర్నమెంట్ ఎంప్లాయిని. నువ్వు జస్ట్ క్యాబ్ డ్రైవర్ వి. నా ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నావని సాగర్ నానా మాటలు అంటాడు. నడిపోడా నీ మీద నాకు అసూయ ఏంటి? అన్నయ్య మంచి పొజిషన్ లో ఉంటే నాకంటే సంతోషపడే వాళ్లు ఎవరుంటారు? అని ధీరజ్ ఫీల్ అవుతాడు. నర్మద వదిన దూరమైనప్పుడు బాధపడుతుంటే.. గుడిలో మీ పెళ్లి చేశా. అన్నయ్య బాగుంటే చాలని ఆలోచించానని ధీరజ్ చెప్తాడు.
ఆ రోజు నేను చూసిన తమ్ముడు వేరు, ఇప్పుడు నేను చూస్తున్న తమ్ముడు వేరు. మీ నాన్న నిన్ను మార్చేశాడు. ఈ రెండు మూడు రోజుల్లో రూ.5 లక్షలు కట్టి మరీ వెళ్లిపోతానని సాగర్ సీరియస్ గా చెప్తాడు.
ప్లాన్ ఫెయిల్
సీన్ కట్ చేస్తే ఇడ్లీ బాబాయ్, భాగ్యం రోడ్డు పక్కన టిఫిన్లు అమ్ముతుంటారు. రైస్ మిల్ మన చేతికి వచ్చినట్లే వచ్చి జారిపోయింది. ఇప్పుడు రోడ్డు పక్కన మళ్లీ ఇడ్లీలు అమ్ముకుంటున్నామని భాగ్యంతో ఇడ్లీ బాబాయ్ అంటాడు. భాగ్యం ఫోన్ చేస్తే సుక్కు కట్ చేస్తుంది. అప్పుడే శ్రీవల్లి, సుకన్య వస్తారు. ప్లాన్ ఫెయిల్ అయిందని వల్లి కోపంగా చెప్తుంది.
భాగ్యం కుట్ర
నర్మదకు నా కడుపు మీద డౌటింగ్ వచ్చేసింది. సాయంత్రం వేరే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తానంది. ఈ కడుపు మోసమని తెలిస్తే మా ఆయన నన్ను వదిలేస్తాడు. మీ అందరినీ వాయించేస్తాడని తల్లికి శ్రీవల్లి చెప్తుంది. అసలు ఆ నర్మద ఇంట్లో ఉంటేనే కదా నిన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లడానికి. నర్మదను శాశ్వతంగా ఆ ఇంట్లో నుంచి బయటకు పంపించేలా చేస్తానని భాగ్యం మళ్లీ ఏదో కుట్ర వేస్తుంది.
హ్యాపీ న్యూస్
మరోవైపు హ్యాపీ న్యూస్ అంటూ ధీరజ్ వస్తే వేదవతి మాట్లాడదు. ఎవరు బాబు నువ్వు? నాతో మాట్లాడటానికి, హ్యాపీ విషయాలు షేర్ చేసుకోవడానికి నువ్వు ఎవరంటా? అని వేదవతి అడుగుతుంది. కానీ అమ్మను కూల్ చేసేందుకు ధీరజ్ జోకులు వేస్తాడు. కారు కొనుక్కోవడానికి డబ్బులు దొరక్కా ఇబ్బంది పడుతుంటే నాకు ఎలా ఉంటుందని వేదవతి అంటుంది.
నేను ఆల్రెడీ కారు తీసుకున్నా. కారు వచ్చిన తర్వాత సడెన్ సర్ ప్రైజ్ ఇద్దామని అనుకున్నా అని ధీరజ్ చెప్పడంతో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


