Illu Illalu Pillalu May 7 Episode: తల్లిని బాదేసిన వల్లి-నిజంగానే నెల తప్పమన్న భాగ్యం-స్కానింగ్ రిపోర్ట్-ప్రేమకు షాక్

Illu Illalu Pillalu May 7 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 7 ఎపిసోడ్ లో వల్లి కాళ్ల మీద పడటంతో డాక్టర్ వేరే వాళ్ల స్కానింగ్ రిపోర్ట్ ఇస్తుంది. ప్రెగ్నెన్సీ అబద్ధం చెప్పిన భాగ్యాన్ని వల్లి బాదేస్తుంది. నిజంగానే నెల తప్పమంటుంది. బ్యాంకులో నుంచి ప్రేమను భద్రావతి, సేనాపతి లాక్కొస్తారు.

Published on: May 7, 2026, 07:44:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu May 7 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో తన ప్రెగ్నెన్సీ అబద్ధమని శ్రీవల్లికి తెలియడంతో కథ మలుపు తిరుగుతుంది. బాధతో గుండెలు పగిలేలా వల్లి ఏడుస్తుంది. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని డాక్టర్ ను రిక్వెస్ట్ చేస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 7 ఎపిసోడ్ లో చూద్దాం.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

వేరే వాళ్ల రిపోర్ట్

మా అమ్మ అబద్ధాలకు నా జీవితం నాశనం అయ్యేలా ఉంది. మీరే నా కాపురాన్ని నిలబెట్టలాని డాక్టర్ కాళ్లపై శ్రీవల్లి పడుతుంది. దీంతో వేరే వాళ్ల స్కానింగ్ రిపోర్ట్ ను వల్లికి డాక్టర్ ఇస్తుంది. ఈ రిపోర్ట్ నీదే అని చెప్పుకో. కానీ ఇదే లాస్ట్ హెల్ప్. ఇంకోసారి నువ్వు కానీ మీ అమ్మ కానీ నా దగ్గరకు వస్తే అస్సలు బాగోదని డాక్టర్ వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది. బయట రిపోర్ట్ చూసి నర్మద, ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.

ప్రేమ టెన్షన్

మా అక్క తల్లికాబోతుందంటే చెల్లెలుగా మాకెంతో హ్యాపీ అని నర్మద, ప్రేమ అంటారు. నేను అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లొస్తానని నర్మద, ప్రేమను వెళ్లమంటుంది వల్లి. రోడ్డు మీద నర్మద, ప్రేమ నడుచుకుంటూ వెళ్తారు. అర్జెంట్ గా బ్యాంక్ కు వెళ్లాలి, కానీ అక్కకు ఏం చెప్పాలని ప్రేమ ఆలోచిస్తుంది. బ్యాంక్ లో నగలు తాకట్టు పెట్టిన విషయం అక్కకు చెప్తే బెటరా? లేదు కారు వచ్చాకే చెప్తానని ప్రేమ అనుకుంటుంది.

నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్లాలని ప్రేమ చెప్తుంది. నేను కూడా వస్తానని నర్మద అంటుంది. కానీ వల్లి అక్క విషయంలో అత్త టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వు ఇంటికే వెళ్లాలని ప్రేమ చెప్పేసరికి నర్మద వెళ్లిపోతుంది. కానీ ప్రేమ టెన్షన్ పడుతుందని నర్మదకు డౌట్ వస్తుంది.

భాగ్యం, ఇడ్లీ సరసాలు

సీన్ కట్ చేస్తే భాగ్యం, ఇడ్లీ బాబాయ్ సరసాలు ఆడతారు. ఇడ్లీ బాబాయ్ వేళ్లకు చిలకలు (పాన్) చుట్టుకుని భాగ్యానికి తినిపిస్తాడు. భాగ్యం కూడా ఇడ్లీకి తినిపిస్తాడు. నువ్వు తినిపించేసరికి వేయి వీణలు మోగాయని ఇడ్లీ బాబాయ్ మైమరిచిపోతాడు. అమ్మడికి కడుపని చెప్పి ఆ ఇంట్లోకి పంపించా, నిన్ను కూడా రైస్ మిల్ కు ఎలాగోలా పంపిస్తా. రైస్ మిల్ మన గుప్పిట్లో పెట్టుకోవాలని భాగ్యం అంటుంది.

తల్లిని కొట్టిన వల్లి

అప్పుడే శ్రీవల్లి వస్తుంది. భాగ్యంపై కోపంతో వల్లి ఊగిపోతుంది. ఇప్పుడు నాకు ఎన్నో నెల అని వల్లి అడిగితే, మూడో నెల అని భాగ్యం అబద్ధాలు చెప్తూనే ఉంటుంది. కవల పిల్లలు పుట్టొచ్చని భాగ్యం అనగానే వల్లి లాగిపెట్టి కొడుతుంది. నువ్వసలు నా కన్నతల్లివేనా? కడుపుతో ఉన్నావని కన్నకూతురికి అబద్ధం చెప్పి మోసం చేస్తావా? అని వల్లి అనగానే భాగ్యం షాక్ అవుతుంది.

కన్నపేగు ఆనందం గుండెకు తాకుతుంది. ఆడపిల్ల తల్లి కావడమంటే అమ్మ అనే పిలుపుతో పురుడు పోసుకోవడం. అలాంటి విషయంలో మోసం చేయడం కంటే పాపం ఇంకోటి ఉండదు. నన్ను ఇట్టా పిచ్చిదాన్ని చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందని భాగ్యం ఫీల్ అవుతుంది. నీ కాపురం నిలబెట్టడం కోసం ఇంతకంటే ఏం చేయాలో తెలియలేదు అమ్మడూ అని భాగ్యం దీనంగా మాట్లాడుతుంది.

బాదేసిన వల్లి

కాపురాన్ని కూల్చేశావు. అమూల్య విషయం జరిగిన దానికే మా ఆయన నన్ను పుట్టింట్లో వదిలేశాడు. నెల తప్పానని మోసం చేశానని తెలిస్తే ఈ జన్మలో నా ముఖం చూస్తాడా అని వల్లి బాధపడుతుంది. ఏదో ఒకటి చేసి నీ కాపురాన్ని నిలబెడతానని భాగ్యం అంటుంది. వల్లి కర్ర తీసుకొని తల్లిని బాదేస్తుంది. ఇంకా ఎన్ని మోసాలు చేస్తావని కొడుతుంది.

నిజంగానే నెల తప్పితే

సమస్య వచ్చినప్పుడు కంగారు పడొద్దు. నువ్వు నెల తప్పావని డాక్టర్ తో నేను చెప్పిన అబద్ధం మూడో కంటికి తెలియదు. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ అబద్ధాన్ని నిజం చేశావనుకో ప్రాబ్లెం తీరిపోతుంది. నువ్వు నిజంగానే నెల తప్పావనుకో అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు కదా. అందుకని నువ్వు మీ ఆయన్ని ఆకట్టుకొని నెల తప్పే ప్లానింగ్ చేసుకోమ్మని వల్లికి భాగ్యం చెప్తుంది.

ప్రేమకు షాక్

సీన్ బ్యాంకుకు మారుతుంది. ప్రేమ బ్యాంకుకు వెళ్తుంది. అప్పటికే భద్రావతి, సేనాపతి అక్కడికి వస్తారు. అమౌంట్ ఫాస్ట్ గా ఇప్పించండని ప్రేమ అడుగుతుంది. అప్పుడే భద్రావతి, సేనాపతి లోపలికి వచ్చి ప్రేమకు షాకిస్తారు. బంగారం ఎందుకు తాకట్టు పెడుతున్నావని ప్రేమను గట్టిగా అడుగుతారు. నాకే డబ్బులు అవసరమై గోల్డ్ తాకట్టు పెడుతున్నానని ప్రేమ అబద్ధం చెప్తుంది.

రూ.2 లక్షల అవసరం ఏమొచ్చిందని భద్రావతి అడుగుతుంది. నీకు ఏం అవసరం వచ్చిందో అన్ని నాకు తెలుసని భద్రావతి చెప్తుంది. భద్రావతి, సేనాపతి కలిసి ప్రేమను లాక్కొని వెళ్తారు. మరోవైపు వల్లి ఇచ్చిన స్కానింగ్ రిపోర్ట్ ను రామరాజు తెగ పరీక్షిస్తాడు. అబ్బాయో అమ్మాయో అర్థం గాక టెన్షన్ పడుతున్నానంటాడు. అప్పుడే వేదవతి ఆ రిపోర్ట్ తీసుకుని చూస్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More