Sign in

Illu Illalu Pillalu May 4 Episode: వల్లి తిక్క కుదిర్చిన ప్రేమ, నర్మద-రామరాజు మాటలు- బ్యాగ్ సర్దేసుకుని షాకిచ్చిన సాగర్

Illu Illalu Pillalu May 4 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 4 ఎపిసోడ్ లో ప్రేమ, నర్మదను శ్రీవల్లి ఒక ఆటాడుకుంటుంది. శ్రీవల్లి తిక్క కుదిర్చేందుకు కాకరకాయ జ్యూస్ బలవంతంగా తాగిస్తారు. మరోవైపు రోడ్డు మీద పని చేస్తున్న సాగర్ తో రామరాజు వెటకారంగా మాట్లాడతాడు. సాగర్ ను ప్రసాద్ రెచ్చగొడతాడు.

Published on: May 4, 2026, 07:50:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu May 4 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 4 ఎపిసోడ్ లో.. ఫ్రెండ్ ను డబ్బు అడిగినట్లు ధీరజ్ దగ్గర ప్రేమ నాటకం ఆడుతుంది. ధీరజ్, ప్రేమ కలిసి ఇంటికి వస్తారు. పొద్దున్నే ప్రేమ పావురాలు ఎక్కడికి వెళ్లాయని నర్మద అడుగుతుంది. ఏంటి మీ అక్కకు కూడా చెప్పలేదా? అని ప్రేమను ధీరజ్ అడుగుతాడు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

శ్రీవల్లికి కుళ్లు

ప్రేమ, ధీరజ్, నర్మద నవ్వుకుంటూ మాట్లాడుకుంటుంటే శ్రీవల్లి చూసి తట్టుకోలేకపోతుంది. వీళ్లు ఇంత హ్యాపీగా ఉండకూడదని బెల్ తీసి వల్లి మోగిస్తుంది. పెద్ద వదిన.. అసలే కోతి, ఆపై కళ్లు తాగింది, కొబ్బరి చిప్ప దొరికిందన్నట్లు బెల్ దొరికాక ఆగట్లేదని ధీరజ్ పంచ్ వేస్తాడు. వేడివేడిగా మిరపకాయ బజ్జీలు కావాలని వల్లి అడుగుతుంది.

తోడికోడళ్లతో ఆట

ప్రేమ, నర్మద కలిసి బజ్జీలు వేస్తారు. బజ్జీలు తీసుకొచ్చి వల్లికి ఇస్తారు. అప్పుడే బట్టలు ఉతుకుతానని అంటుంది వల్లి. కానీ నేను బట్టలు ఉతుకుతే మామయ్య మిమ్మల్ని తిడతారని చెప్తుంది. ఎవరు ఉతుకుతారంటూ వల్లి తెగ డ్రామా ఆడుతుంది. నేనే ఉతుకుతానని ప్రేమ ఆ బట్టలు తీసుకుని వెళ్తుంది. నర్మదను ఏమో కాఫీ పెట్టమని ఆడుకుంటుంది వల్లి.

కాకరకాయ జ్యూస్

బట్టలు ఉతికి ప్రేమ, ఇల్లు ఊడ్చి నర్మద అలిసిపోతారు. ఈ బల్లి కడుపు మన చావుకు వచ్చిందని ప్రేమ అంటుంది. పెద్ద వదిన మీతో ఆడుకుంటుందని ధీరజ్ చెప్తాడు. అప్పుడే వల్లి మళ్లీ బెల్ కొడుతుంది. వల్లి తిక్క కుదర్చడానికి కాకరకాయ జ్యూస్ చేస్తారు. హెల్తీ జ్యూస్ అక్క తాగు అని ప్రేమ, నర్మద చెప్తారు.

జ్యూస్ చేదుగా ఉంది. కాకరకాయ జ్యూస్ ఇస్తారా? మామయ్యకు చెప్తానని వల్లి అంటుంది. కాకరకాయ జ్యూస్ మీకు, కడుపులో బిడ్డకు మంచిదని ధీరజ్ చెప్తాడు. అప్పుడే అత్తయ్యను నర్మద పిలుస్తుంది. బజ్జీలు, కాఫీ అంటూ కడుపులో అడ్డమైన చెత్త వేసింది. కానీ ఆరోగ్యకరమైన కాకరకాయ జ్యూస్ మాత్రం తాగడం లేదని చెప్తుంది. అత్త, కోడళ్లు కలిసి ఆ జ్యూస్ బలవంతంగా తాగిస్తారు.

సాగర్ వర్క్

మరోవైపు సైట్ లో పనిలో ఉన్న సాగర్ దగ్గరకు ప్రసాద్ రావు వెళ్తాడు. మామకు సాగర్ సారీ చెప్తాడు. సారీల వల్ల ఒరిగేదేమీ లేదు. ఆస్తి పంపకాల విషయంలో మీ నాన్న ఆలోచన కరిగిందా లేదా? అని ప్రసాద్ రావు అడుగుతాడు. అలా జరగలేదు. మా నాన్న ఆస్తిని తన కష్టార్జితం అనుకుంటున్నాడని సాగర్ చెప్తాడు.

అప్పుడే బండి మీద రామరాజు, తిరుపతి వస్తారు. రైస్ మిల్ కు వెళ్తే మూటలు మోసే కూలీలాగా చూస్తారు. అందుకే ఎంచక్కా ఏసీ రూమ్ లో జాబ్ చేస్తానని ఎవరో మామయ్య చేయి పట్టుకుని వెళ్లాడు. తిరుపతి.. ఇక్కడ ఏసీ ఉందా? చెయిర్ ఉందా? మరి ఇలా ఎర్రటి ఎండలో పని చేస్తుంటే ఏమంటార్రా అని సాగర్ కు రామరాజు చురకలు అంటిస్తాడు.

నీ మాటతీరు సరికాదు రామరాజు. కొడుకు జాబ్ చేస్తుంటే ఏ తండ్రి అయినా గర్వంతో పొంగిపోతాడు. కానీ మీరు మాత్రం కన్న కొడుకును రోడ్డు మీద అవమానిస్తున్నారని ప్రసాద్ రావు అంటాడు. నీతో కలిసి దొంగతనంగా జాబ్ కొనుక్కున్నాడు. దానికంటే అవమానం ఏమీ ఉండదని రామరాజు వెళ్లిపోతాడు.

రెచ్చగొట్టిన ప్రసాద్

ఇదే ఛాన్స్ అనుకుని సాగర్ ను ప్రసాద్ రావు మరింత రెచ్చగొడతాడు. ఆ ఇంట్లో ఉండటం ఎందుకు? బయటకు వచ్చి గౌరవంగా ఉండేయొచ్చు కదా అని అంటాడు. నువ్వు ఆ ఇంట్లో నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే నీకు అంత గౌరవం దొరకుతుందని ప్రసాద్ రావు చెప్తాడు.

బ్యాగ్ సర్దేసిన సాగర్

రాత్రి అందరూ భోజనం చేస్తుంటే, సాగర్ మాత్రం బ్యాగ్ లో బట్టలు సర్దుతాడు. పుట్టగొడుగుల కూర అంటే చాలా ఇష్టమని వల్లి అంటుంది. కానీ కడుపుతో ఉన్నవాళ్లు పుట్టగొడుగుల కూర తినొద్దని వేదవతి చెప్తుంది. కారం కూడా తినొద్దని అంటుంది. అమ్మ చెప్పినట్లు వినమని భార్యకు చందు కూడా చెప్తాడు. వేదవతి ఏమో నడిపోడా అని పిలుస్తూనే ఉంటుంది.

సాగర్ బ్యాగ్ తో బయటకు వస్తాడు. ఆ బ్యాగ్ ఏంటీ? అని వేదవతి అడుగుతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నామని సాగర్ షాక్ ఇస్తాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More