Illu Illalu Pillalu April 16 Episode: సాగర్ పంతం-అమ్మ వచ్చేంతవరకే-నర్మదకు షాక్-వల్లిని చచ్చిపొమ్మన్న చందు-తండ్రిపై అటాక్

Illu Illalu Pillalu April 16 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 16 ఎపిసోడ్ లో నర్మద ఎంత చెప్పినా సాగర్ వినడు. అమ్మ రాగానే ఇంట్లో నుంచి వెళ్లిపోదామంటాడు. మరోవైపు శ్రీవల్లి, భాగ్యం, ఇడ్లీ బాబాయ్ తెగ సంబరపడిపోతుంటారు. అయితే చందు చచ్చిపో అనడంతో అమ్మానాన్నను చంపేందుకు వల్లి ప్రయత్నిస్తుంది.

Apr 16, 2026, 07:50:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu April 16 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో తండ్రి రామరాజు, కొడుకు సాగర్ మధ్య మాటల యుద్ధంతో టెన్షన్ పెరిగింది. ఫస్ట్ శాలరీతో సాగర్ తెచ్చిన బట్టలను రామరాజు కాల్చేస్తాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోదామని నర్మదకు సాగర్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 16 ఎపిసోడ్ లో చూద్దాం.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

సాగర్ వర్సెస్ నర్మద

నేను అవమానాలను ఎదుర్కొంటున్న, అందుకే జాబ్ మానేయ్. కష్టపడి పచ్చడి మెతుకులు పెట్టినా ఆనందంగా తింటా. జాబ్ వదిలేస్తానని చెప్పు ఇప్పుడే నీతో బయటకు వచ్చేస్తానని సాగర్ తో నర్మద అంటుంది. జాబ్ వదిలేయడం జరగని పని అని సాగర్ అంటే, ఇంట్లో నుంచి నేను రావడం కూడా జరగని పని అని నర్మద తెగేసి చెప్తుంది.

అమ్మ రాగానే

మనం ఇంట్లో నుంచి వెళ్లిపోతే మీ అమ్మానాన్న ఎంత బాధపడతారో ఆలోచించావా? ఊరి నుంచి మీ అమ్మ ఏడుస్తూ రావాలా? కాస్త బుద్ధి పెట్టి ఆలోచించమని సాగర్ కు నర్మద గట్టిగానే చెప్తుంది. అమ్మ వచ్చిన మరుక్షణమే ఆమెకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సాగర్ షాక్ ఇస్తాడు. నువ్వు కూడా నాతో పాటు గుమ్మం దాటడానికి రెడీగా ఉండమని నర్మదకు చెప్తాడు.

వల్లీ డ్యాన్స్

మరోవైపు తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు శ్రీవల్లి, భాగ్యం, ఇడ్లీ బాబాయ్ తెగ డ్యాన్స్ చేసేస్తారు. నర్మద నాతోనే సవాలు చేస్తుందా? ఇప్పుడు చీపురు పుల్లలా పక్కన పడేశా. ఇంట్లో నుంచి నర్మద వెళ్లిపోయేలా ఆరిపోని కార్చిచ్చు పెట్టానని భాగ్యం అంటుంది. నీకు కాపురాలు కూల్చడంలో తలపండిపోయిందని తెలీదు అని పెళ్లాన్ని ఇడ్లీ బాబాయ్ తెగ పొగిడేస్తాడు. ఆ నర్మద కాపురంలో నిప్పులు పోసినందుకు చాలా సంతోషంగా ఉందని శ్రీవల్లి కూడా సంబరపడిపోతుంది.

నర్మద, ప్రేమను దెబ్బకొట్టి వాళ్లతోనే నీకు హారతి ఇప్పిస్తానని వల్లితో భాగ్యం అంటుంది. ఈ రెండు మూడు రోజుల్లో నిన్ను అత్తారింట్లో అడుగుపెట్టేలా చేస్తాను. అప్పటి వరకూ నేను నిద్రపోనని భాగ్యం శపథం చేస్తుంది. ఏవండీ, ఆవిడ గారు మీరు నిద్ర పోకపోతే గ్లామర్ దెబ్బతింటుందని ఇడ్లీ బాబాయ్ అమాయకంగా అంటాడు.

నర్మద బాధ

సీన్ కట్ చేస్తే సాగర్ మాటలను తలుచుకుని నర్మద బాధ పడుతుంటుంది. ప్లీజ్ అక్కా, బాధపడకని ప్రేమ వచ్చి ఓదార్చుతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోదామని సాగర్ పెద్ద గొడవ చేశాడు. అత్తయ్య వచ్చిన మరుక్షణమే వెళ్లిపోవాల్సిందేనని సాగర్ పంతంతో ఉన్నాడని నర్మద ఫీల్ అవుతుంది. అలాంటి పరిస్థితి వస్తే మేం ఊరుకుంటామా అని ప్రేమ అంటుంది.

శ్రీవల్లి కాల్

మరోవైపు బావ మెసేజ్ చూసి కూడా సైలెంట్ గా ఉన్నాడంటే నన్ను పూర్తిగా మర్చిపోయాడేమో. వదిలేస్తాడేమో. బావ లేకపోతే నేను బతకలేను. మా అమ్మను నమ్ముకుంటే లాభం లేదు. నేనే బావతో మెల్లగా అల్లుకుపోతానని చందుకు శ్రీవల్లి కాల్ చేస్తుంది. నిద్రమత్తులో చందు కాల్ లిఫ్ట్ చేస్తాడు. వల్లి గొంతు వినగానే ఉలిక్కిపడి లేస్తాడు.

చచ్చిపో అంటూ

ఎందుకు ఫోన్ చేశావని చందు అడుగుతాడు. నిన్ను చూడకుండా, మాట్లాడకుండా ఉండలేను బా. నిన్ను వెంటనే చూడానిపిస్తుంది బా అని ఫోన్లోనే వల్లి ముద్దులు పెడుతుంది. కోపం ఉంటే కొట్టు, తిట్టు బా. నన్ను దూరం పెట్టకు అని వల్లి అడుగుతుంది. అయితే చచ్చిపో అని చందు కాల్ కట్ చేస్తాడు. ఫోన్ స్విచ్ఛాప్ చేస్తాడు.

అమ్మానాన్న మీదకు

వల్లి చాకు తీసుకుని పడుకున్న అమ్మానాన్న దగ్గరకు వస్తుంది. తండ్రిని పొడవాలని అనుకుంటుంది. కానీ ఇడ్లీ బాబాయ్ అది చూసి పక్కకు తప్పుకొంటాడు. మా ఆయనకు ఫోన్ చేసి తను లేకపోతే చచ్చిపోతా బా అంటే చచ్చిపో అని అన్నాడు. అబద్ధాలు, మోసాలతో పెళ్లి చేసింది మీరే. మిమ్మల్నే చంపేస్తానని వల్లి ఊగిపోతుంది. ఇప్పుడే మా ఆయన దగ్గరకు పంపించేయమని అరిచేస్తుంది.

రేపు నిన్ను అత్తారింటికి పంపించే ప్లాన్ ఉందని భాగ్యం చెప్పేసరికి వల్లి కాస్త కూల్ అవుతుంది. భాగ్యం పడుకుంటుంది. కానీ ఇడ్లీ బాబాయ్ వణుకుతూ కూర్చుంటాడు. పొద్దున ప్రేమ ఫొన్లో చూస్తూ పగలబడి నవ్వుతుంటే జడ వేసేందుకు ధీరజ్ నానా తంటాలు పడతాడు. ధీరజ్ జడ వేస్తుంటే ప్రేమ తెగ మురిసిపోతుంది.

దెయ్యంలా ప్రేమ

భార్యకు ధీరజ్ మేకప్ కూడా వేస్తాడు. అద్దంలో చూసుకుని ప్రేమ భయపడిపోతుంది. ప్రేమను పిచ్చిదానిలా ధీరజ్ రెడీ చేస్తాడు. మన టాలెంట్ చూసి షాక్ తో నోట మాట రావడం లేదా అని ప్రేమను అడుగుతాడు ధీరజ్. దెయ్యంలా రెడీ చేశావేంట్రా అని ధీరజ్ ను కొట్టేందుకు ప్రేమ పరుగెడుతుంది. ఈ క్రమంలో ఒకరికొకరు పట్టుకుని సాంగ్ వేసుకుంటారు.

తిరుపతి తింగరితనంపై అమూల్య కౌంటర్లు వేస్తుంది. కానీ రామరాజు మాత్రం సీరియస్ గానే ఉంటాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More