Sign in

Illu Illalu Pillalu April 15 Episode: రగిలిపోయిన రామరాజు..సాగర్ తెచ్చిన బట్టలను తగలబెట్టిన తండ్రి..ఎదురు తిరిగిన కొడుకు

Illu Illalu Pillalu April 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఏప్రిల్ 15 ఎపిసోడ్ లో తప్పు తెలుసుకున్న ధీరజ్.. ప్రేమను క్షమించమని అడుగుతాడు. మరోవైపు కొత్త బట్టలతో ఇంటికి వచ్చిన సాగర్ పై రామరాజు ఫైర్ అవుతాడు. ఆ బట్టలను తగలబెడతాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని సాగర్ నిర్ణయించుకుంటాడు.

Published on: Apr 15, 2026, 07:57:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu April 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో తమ్ముడు ధీరజ్ కు చందు నిజం చెప్పేస్తాడు. అమూల్య విషయంలో ప్రేమ ఎలాంటి తప్పు చేయలేదని ధీరజ్ తెలుసుకుంటాడు. మరోవైపు సాగర్ కు ఇచ్చిన అప్పు విషయంలో రామరాజును సేట్ బెదిరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 15 ఎపిసోడ్ లో చూద్దాం.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

ఫీల్ అయిన ధీరజ్

నిజం తెలుసుకున్న ధీరజ్ ప్రేమపై ప్రేమ ఒలకబోస్తాడు. ప్రేమను వెనుకాల నుంచి హగ్ చేసుకుంటాడు. ప్రేమ నాతో మాట్లాడవా? నువ్వు ఎంత మంచిదానివో నాకు తెలుసు. మా కుటుంబం మీద మీకున్న పగ, నా చెల్లెలి మీద నాకున్న ప్రేమ నీ మాటలు నమ్మే పరిస్థితిని ఇవ్వలేదు. నిన్ను అపార్థం చేసుకున్నా. నా మాటలతో హింసించా, కోపంతో ద్వేషించా. క్షమించరాని తప్పు చేశానని ధీరజ్ ఫీల్ అవుతాడు.

ప్రేమ కన్నీళ్లు

ఈ విషయంలో నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నావని ప్రేమను ధీరజ్ అడుగుతాడు. తప్పు చేయలేదని చెప్పాలంటే మీ పెద్ద వదిన దోషి అని చెప్పాలి. అలా చెప్పి వాళ్ల కాపురాన్ని కూల్చాలా అని ప్రేమ అడుగుతుంది. ఒకరు దోషి అని చెప్పిన తర్వాత నువ్వు నన్ను నమ్మితే నామీద నీకున్న నమ్మకానికి అర్థం ఏముంది? నువ్వు అర్థం చేసుకుని, నా పక్కన నిలబడతావని నమ్మా. కానీ నువ్వే ద్వేషిస్తుంటే ఎలా చెప్పుకోగలనని ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

క్షమించమన్న ధీరజ్

మూర్ఖుడిలా బిహేవ్ చేశా. అవసరమైతే కొట్టి చెప్పాలి కానీ వదిలేస్తావా? ఇన్ని అవమానాలు ఎందుకు పడ్డావ్? అని ధీరజ్ అడుగుతాడు. నిన్ను ప్రేమించా. ఎలా వదిలి వెళ్లిపోతానని ప్రేమ చెప్తుంది. గయ్యాళి గంగమ్మ నన్ను క్షమిస్తావా? అని ధీరజ్ అడుగుతాడు. నీకు బాధతో కన్నీళ్లు రానివ్వనని ప్రేమను దగ్గరకు తీసుకుంటాడు.

బట్టలతో సాగర్

మరోవైపు సేట్ మాటలతో రగిలిపోతున్న రామరాజు.. షాపింగ్ బ్యాగ్ లతో వచ్చిన సాగర్ ను చూసి మండిపోతాడు. ఫస్ట్ శాలరీతో అందరికీ బట్టలు కొనుక్కొని వస్తాడు సాగర్. శారీ కూడా నీ అంత అందంగా ఉంటుందని నర్మదకు చీరను ఇస్తాడు. అందరికీ బట్టలు ఇచ్చిన తర్వాత నాన్నకు కూడా ఇచ్చేందుకు సాగర్ వెళ్తాడు.

రామరాజు సీరియస్

ఫస్ట్ శాలరీ వచ్చింది నాన్న, అందరికీ గుర్తుగా బట్టలు తెచ్చా. నీకు పంచె, షర్ట్ తీసుకొచ్చాను. హ్యాపీగా తీసుకుంటే అంతకంటే సంతోషం ఉండదు నాన్న అని సాగర్ అంటాడు. కానీ రామరాజు తీసుకోడు. నీ భార్య నగలు తాకట్టు పెట్టి రూ.20 లక్షలు తీసుకున్న షాప్ అతను వచ్చి నడివీధిలో నన్ను అడిగాడని రామరాజు సీరియస్ అవుతాడు.

డబ్బులు కొట్టేస్తావా?

నెల దాటినా సరే నువ్వు ఇంకా వడ్డీ కట్టకుండా తప్పించుకుంటున్నావని రామరాజు అంటాడు. ఆ వడ్డీ కడతానని సాగర్ చెప్తాడు. ఎలా కడతావ్? నీకొచ్చే జీతం ఎంత? అతనికి కట్టాల్సిన వడ్డీ ఎంత? రూ.20 లక్షలు నీ జీవితంలో నువ్వు కట్టగలవా? ఆఫీస్ లో డబ్బులు కొట్టేస్తావా? అని రామరాజు ఫైర్ అవుతాడు. ఎందుకు నాన్న బాధపెడతారని సాగర్ అంటాడు.

ఎదురు తిరిగిన సాగర్

సాగర్ మీదకు రామరాజు చేయి ఎత్తుతాడు. నువ్వు నా పరువు తీయడమే పనిగా పెట్టుకున్నావ్. ఆ వనజ వాళ్ల దగ్గర, ఇచ్చిన పార్టీ దగ్గర, సేట్ దగ్గర పరువు లేకుండా చేస్తున్నావని రామరాజు కోప్పడతాడు. ఎంతసేపు పరువు కోసమే ఆలోచన తప్పా, కన్నబిడ్డలను సంతోషంగా ఉంచడం మీకు తెలియదని సాగర్ ఎదురు తిరుగుతాడు.

పాపపు సొమ్ముతో కొన్న వస్తువులు కూడా నా ఇంట్లో ఉండటానికి వీల్లేదని అందరి చేతుల్లో నుంచి బట్టలు లాక్కొని రామరాజు తగలబెడతాడు. అది చూసి భాగ్యం, ఇడ్లీ బాబాయ్, శ్రీవల్లి తెగ సంతోషపడతారు.

ఇంట్లో నుంచి వెళ్లిపోదామని

గదిలోకి వెళ్లిన సాగర్ తన బట్టలను బ్యాగ్ లో సర్దుకుంటాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోదామని నర్మదతో అంటాడు. బతికినంత కాలం నన్ను అవమానిస్తూనే ఉంటాడని సాగర్ అంటాడు. ఆగమని అన్నందుకు నర్మదపై సాగర్ చేయి ఎత్తుతాడు. నోర్మూసుకుని నడువు అని నర్మదతో అంటాడు.

నీ కోసం ఎక్కడికైనా వస్తా. కానీ జాబ్ మానేయమని నర్మద షాక్ ఇస్తుంది. నన్ను ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపాలని చూస్తున్నావా అని సాగర్ అడుగుతాడు. నర్మద వాళ్ల ఆయన డబ్బులతో జాబ్ కొనుక్కున్నాడని కొలీగ్స్ అంటుంటే చీప్ గా ఉందని నర్మద అంటుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More