Illu Illalu Pillalu April 11 Episode: చందు యాక్సిడెంట్‌పై ప్రేమ డౌట్, ధీరజ్ ఎంక్వైరీ- తిరిగి తన్నిన భాగ్యం బ్రహ్మాస్త్రం
Illu Illalu Pillalu Serial April 11th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏప్రిల్ 11వ ఎపిసోడ్‌లో హాస్పిటల్‌లో ప్రేమ కోసం ధీరజ్ ఏడ్చాడని చెప్పి నర్మదా ఇరికిస్తుంది. చందు బావకు కావాలనే యాక్సిడెంట్ చేయించారేమో అని ప్రేమ డౌట్ పడుతుంది. దాంతో మరుసటి రోజు ధీరజ్ ఎంక్వైరీ చేస్తాడు.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమకు ప్రేమగా అన్నం తినిపిస్తాడు ధీరజ్. ప్రేమ మురిసిపోతుంది. కష్టాల్లో నిన్ను మీ ఇంటికి పంపించామని మీవాళ్లు కాకుల్లా కేకలు పెడతారని చూసుకుంటా అని చెప్పా. దానికి మురిసిపోకు అని ధీరజ్ అంటాడు. అలాగే, అంటాడు కానీ నీపై ధీరజ్‌కు చాలా ప్రేమ ఉందని నర్మద చెబుతుంది.

ప్రేమకోసం అంతలా ఏడ్చావ్
అదేం లేదు అని ధీరజ్ అంటే.. మరి హాస్పిటల్‌లో ప్రేమకోసం ఎందుకు అంతలా ఏడ్చావ్ అని నర్మద మరిది ధీరజ్‌ను ఇరికిస్తుంది. నీకు ఏమవుతుందో అని అందరిలానే ఏడ్చా, అంతకుమించి ఏం లేదని ధీరజ్ అంటాడు. అదే మగాడు చూపించే నిజమైన ప్రేమ అని నర్మద అంటుంది. తర్వాత యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ అది యాక్సిడెంట్‌లా అనిపించట్లేదు అక్కా. ఎవరో కావాలనే చేశారనిపిస్తుందని ప్రేమ డౌట్ పడుతుంది.
మరోవైపు క్యారెజ్ వంకతో అత్తారింట్లో పాతుకుపోతా అని శ్రీవల్లి సంతోషంగా గెంతుతూ వస్తుంది. మావయ్యను మాయ సేత్తే అయిపోతుందని శ్రీవల్లి అనుకుంటుంది. బ్రేకులు ఫెయిల్ అయితే డ్రైవర్ వేరే వైపుకు తిప్పొచ్చు. చందు బావ ఉన్నవైపే ఎందుకు వస్తుందని, పైగా చందు బావ పక్కకే ఉన్నారని ప్రేమ అంటుంది. అన్యయ్యను కావాలనే యాక్సిడెంట్ చేయాలని చూశారని అంటున్నావా అని ధీరజ్ అంటాడు.
అప్పుడే వచ్చి విన్న శ్రీవల్లి ఏంటీ తెలిసిపోయిందా అని షాక్ అయి క్యారేజ్ కింద పడేస్తుంది. ఇంతలో అందరూ వచ్చేస్తారు. ఏంటీ తెలిసిపోయిందా అంటున్నావ్ అని నర్మద అంటే.. యాక్సిడెంట్ గురించి తెలిసిందని కవర్ చేస్తుంది వల్లి. చందుపై ప్రేమ ఒలకబోస్తుంది. డ్రామా ఆపమని చందు అంటాడు. తర్వాత ప్రేమపై కూడా బాగా ప్రేమ ఒలకబోస్తుంది. తల్లిలా దగ్గరుండి ప్రేమను చూసుకంటాను అంటుంది.
శ్రీవల్లి ప్లాన్ ఫెయిల్
ఇక చాలు నువ్వెళ్లు అని చందు అంటాడు. వల్లి వెళ్లనంటుంది. వెళ్లను అంటే వెళ్లమంటావేంట్రా అని రామరాజు అంటాడు. తను ఇక్కడ ఉండే వాళ్ల అమ్మను ఎవరు చూసుకుంటారు అని చందు అంటాడు. అది కరెక్టే కదా. మీ అమ్మకు ఎలా ఉందని రామరాజు అడిగితే.. తనకేమైంది గుండ్రాయిలా ఉందని శ్రీవల్లి నోరు జారుతుంది. దాంతో అంతా షాక్ అయి చూస్తారు. మీ అమ్మ కాలు విరిగింది కదా. అలా అంటావేంటీ అని రామరాజు నిలదీస్తాడు.
దెబ్బ తగిలింది కాలుకు కదా. మనిషి మాత్రం గుండ్రాయిలా ఉందన్నాను అని శ్రీవల్లి కవర్ చేస్తుంది. నాకంటే ఎక్కువగా మీ అమ్మను చూసుకోవడం ఇంపార్టెంట్ అని ప్రేమ అంటుంది. తను ఎలాగైనా చూసుకుంటుంది. ఇక్కడే ఉంటాను అని మారం చేస్తుంది శ్రీవల్లి. నర్మదా కూడా తల్లిని చూసుకోవాలి కదా అని అంటుంది. అయినా వల్లి వినదు. చందు కూడా వెళ్లమని తిడతాడు. రామరాజు కూడా వెళ్లమని అంటాడు.
రాత్రి అయింది కాబట్టి చందును దిగబెట్టి రమ్మని రామరాజు చెబుతాడు. దాంతో తను వచ్చిన ప్లాన్ ఫెయిల్ అయిందని శ్రీవల్లి అనుకుంటుంది. ఈ నర్మద ఇక్కడ ఉండగా నీ ఆటలు, మీ అమ్మ కుట్రలు సాగవని చెప్పు అని పంచ్‌లు వేస్తుంది. ప్రేమ కూడా కౌంటర్ ఇస్తుంది. శ్రీవల్లి ఇద్దరిని చూస్తూ కోపంగా వెళ్లిపోతుంది. మరోవైపు చేపల ముక్కలు వేయమని, అందుకోసమే చూస్తున్నా ఆరాటంగా అంటాడు భాగ్యం భర్త.
తిరిగి తన్నిన బ్రహ్మాస్త్రం
ముక్కలు లేవని, మొత్తం వల్లితో పంపించినట్లు చెబుతుంది భాగ్యం. ఇంతలో వల్లి వచ్చి చేపల కూర క్యారేజ్ కోపంగా కింద పడేస్తుంది. అక్కడ జరిగింది అంతా చెబుతుంది. ఇదేంటీ అమ్మడు తిరుగులేని బ్రహ్మాస్త్రం వస్తే ఇలా తిరిగి తన్నింది అని భాగ్యం షాక్ అవుతుంది. ప్రేమ, నర్మదలు పులి పిల్లల్లా నా మీద ఎగిరిపడుతున్నారు. నువ్వు వాళ్లతో ఛాలెంజింగ్‌లు చేయడం వల్లే, అత్తారింట్లో నేను పడటం కష్టమనిపిస్తోంది అని శ్రీవల్లి అంటుంది.
మరుసటి రోజు ఉదయం లారీ నెంబర్ ఫ్రెండ్‌కు పంపి డీటేల్స్ కావాలని అడుగుతాడు. అలా ఎంక్వైరీ చేయిస్తున్న ధీరజ్‌ను గట్టిగా అరుస్తూ పిలుస్తుంది ప్రేమ. పక్కన ఉన్న ప్లేట్ ఇవ్వమని అడుగుతుంది. కాసేపు వాదించుకున్నాకా ధీరజే ప్లేట్ ఇస్తాడు. నాకు చేయి నొప్పి తినలేనురా, యాక్సిడెంట్‌లో భుజం పట్టేసింది అని ప్రేమ అంటుంది.
నొప్పి ఉన్నట్లు డ్రామాలు ఆడుతుంది ప్రేమ. దాంతో ప్రేమకు ధీరజ్ టిఫిన్ తినిపిస్తాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


