Illu Illalu Pillalu May 1 Episode: భర్త కోసం ప్రేమ షాకింగ్ నిర్ణయం-వేదవతి ముగ్గు గోల-శ్రీవల్లి ప్లాన్-బెల్‌తో రామ‌రాజు

Illu Illalu Pillalu May 1 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 1 ఎపిసోడ్ లో ధీరజ్ కు తానే కారు కొనిస్తానని ప్రేమ చెప్తుంది. సాగర్ కోపంతో ఆఫీస్ కు వెళ్లిపోతాడు. తనను పట్టించుకోవడం లేదని శ్రీవల్లి ప్లాన్ వేసి మరీ అత్తా, తోడి కోడళ్లతో ఆటాడుకుంటుంది.

Published on: May 1, 2026, 07:52:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu May 1 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు ఇంట్లో ఆస్తి చిచ్చు రగులుతుంది. వాటా అడగడంలో తప్పు లేదని సాగర్ రెచ్చిపోతాడు. మరోవైపు శ్రీవల్లి కడుపులో బిడ్డ లేదని చెప్పాలనుకున్న ఇడ్లీ బాబాయ్ ను భాగ్యం అడ్డుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 1 ఎపిసోడ్ లో చూద్దాం.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (JIOHOTSTAR)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (JIOHOTSTAR)

ప్రేమ సారీ

జరిగిన గొడవ తలుచుకుంటూ ధీరజ్ ఫీల్ అవుతాడు. నా మీద చాలా కోపంగా ఉంది కదా. నీ బాధ నాకు తెలుస్తుంది. కారణం నేనే. సారీ అని ప్రేమ చెప్తుంది. నేనే మిస్టేక్ చేశా. అనవసరంగా ష్యూరిటీ సంతకం పెట్టమని బావను తీసుకెళ్లానని ధీరజ్ అంటాడు. మీ బావనే నేనే అడిగా కదా, ఇదంతా జరగడానికి కారణం నేనే కదా అని ప్రేమ అంటుంది.

నేనే కారు కొనిస్తా

నగలు తీసుకోమన్నా తీసుకోవడం లేదు. డౌన్ పేమెంట్ కు డబ్బులు లేవు. అందుకే మీ బావను అడిగా. నా భర్తకు జరిగిన అవమానాన్ని మర్చిపోను. అవమానించిన వాళ్ల ముందే సగ్వరంగా తల ఎత్తుకునేలా చేస్తా. రేపే డబ్బులు కట్టి, కారు తీసుకుంటున్నావ్. నేనే డబ్బులు తీసుకొస్తానని ప్రేమ షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది.

సాగర్ పై నర్మద సీరియస్

నీ మైండ్ లోకి ఆస్తి పంపకాల విషయం ఎలా వచ్చింది బుద్ధి లేకుండా అని సాగర్ పై నర్మద కోప్పడుతుంది. ఈ ఆలోచన వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అని అడుగుతుంది. చెప్పించుకునే స్థితిలో లేనని, టిఫిన్ బాక్స్ తీసుకోకుండా సాగర్ కోపంగా వెళ్లిపోతాడు. కుటుంబం ముక్కలు అవుతుందేమోనని ప్రేమతో చెప్తూ నర్మద భయపడుతుంది.

ముగ్గుతో వేదవతి కామెడీ

బయట వేదవతి వేసిన ముగ్గును చూస్తూ తిరుపతి కామెడీ చేస్తాడు. వీడియోలో చూసి వేశా. అంటా అన్నానంటావ్ కానీ నేను వేస్తే ఇంత దరిద్రంగా వచ్చిందేంటీ? అని వేదవతి అమాయకంగా అంటుంది. రాత్రి అంత పెద్ద గొడవ జరిగింది కదా. సర్దుమణిగేలా చేయాలనే ఆలోచన ఉందా? ఇక్కడేమో ముగ్గులు వేస్తున్నారా? అని అత్తపై నర్మద, ప్రేమ మండిపడతారు.

నీతి బోధ

సీ మై గవర్నమెంట్ కోడలు, మేన కోడలు సమస్య వస్తే శాంతంగా పరిష్కరించుకోవాలి. టెన్షన్ పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు అని వేదవతి నీతి బోధ చేస్తుంది. గవర్నమెంట్ కోడలా.. నా కొడుకు కోపాన్ని నేను పోగొడతాను కానీ ముగ్గురం కలిసి ఈ ముగ్గును పట్టుపడదామని వేదవతి చెప్తుంది. ప్రేమ, నర్మద, వేదవతి కలిసి ముగ్గు వేస్తారు.

వల్లికి కుళ్లు

ఇదంతా శ్రీవల్లి చూసి కుళ్లుకుంటుంది. నేను కడుపుతో ఉన్నా నన్ను పట్టించుకోవడం లేదని లోపలికి వెళ్లిపోతుంది. కిచెన్ లోకి వెళ్లి కుకర్ ను కింద పాడేస్తుంది. ఆ సౌండ్ విని రామరాజు లోపలికి వస్తాడు. నేను కడుపుతో ఉన్నా కదా, బోలెడంత ఆకలి వేస్తుంది కదా ఏదైనా వండుకుని తిందామని లోపలికి వచ్చానని శ్రీవల్లి ప్లాన్ ప్రకారం చెప్తుంది.

రామరాజు ఫైర్

బుజ్జమ్మ, నర్మద, ప్రేమ అని రామరాజు గట్టిగా అరుస్తాడు. కడుపుతో ఉన్న కోడలిని పట్టించుకోరా అని సీరియస్ అవుతాడు. నీకు ఆకలేస్తే నన్ను పిలవొచ్చు కదా అని వేదవతి అడుగుతుంది. మీ ముగ్గురిని పిలిచాను కానీ ముగ్గు వేస్తూ, కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీస్ లో ఉన్నారు. అందుకే పిలిచినా వినిపించలేదని శ్రీవల్లి అబద్ధం చెప్తుంది.

బెల్ కొట్టగానే

పెద్ద కోడలికి బెల్ ఇస్తాడు రామరాజు. ఇది నొక్కగానే ఎవరో ఒకరు నీ దగ్గరకు వస్తారని రామరాజు చెప్తాడు. జాగ్రత్తగా చూసుకోండని ముగ్గురికి వార్నింగ్ ఇస్తాడు. చేతిలో బెల్ ఉంది కదా అని శ్రీవల్లి ఆడుకుంటుంది. దోశలు, ఇడ్లీలు, వడలు, జ్యూస్ అంటూ అన్నీ అడుగుతుంది. తిని రెస్ట్ తీసుకుంటానని వల్లి లోపలికి వెళ్లిపోతుంది.

ప్రేమగా ప్రేమ

మరోవైపు ధీరజ్ మైండ్ ను డైవర్ట్ చేయాలని ప్రేమ అనుకుంటుంది. నీ చేతులతో నా తల తుడవమని అడుగుతుంది. నేను ఎందుకు తుడుస్తాను? అని ధీరజ్ అంటే.. నేను మా పుట్టింటికి వెళ్లిపోతానని ప్రేమ అలుగుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More