Sign in

Illu Illalu Pillalu April 25 Episode: భాగ్యానికి చెంపదెబ్బ.. వల్లికి వార్నింగ్.. అదరగొట్టిన వేదవతి.. ప్రేమ మొక్కు

Illu Illalu Pillalu April 25 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 25 ఎపిసోడ్ లో రామరాజుకు చందు నిజం చెప్పకుండా వేదవతి అడ్డుకుంటుంది. భాగ్యం ఇంట్లో జరిగిన ఫ్లాష్ బ్యాక్ ను కూడా చెప్తుంది. భాగ్యాన్ని వేదవతి చెంపపై కొడుతుంది. ఇంత జరిగినా భాగ్యం బుద్ధి మారదు. మళ్లీ వల్లికి నూరిపోస్తుంది.

Published on: Apr 25, 2026, 08:00:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu April 25 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో వేదవతి రీ ఎంట్రీతో కథ మళ్లీ రసవత్తరంగా మారింది. పెద్ద కోడలు గురించి నిజాలు తెలిసినా ఆమెను ఇంటికి అత్త తీసుకొని వస్తుంది. నర్మద, ప్రేమ దిష్టి తీసి మరీ శ్రీవల్లికి వెల్ కమ్ చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 25 ఎపిసోడ్ లో చూసేయండి.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

నిజం చెప్పాలని చందు

కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండేలా, పెద్ద కోడలు పండంటి బిడ్డకు జన్మనిచ్చేలా చూడమని ఆ రాముడిని రామరాజు కోరుకుంటాడు. అప్పుడే చందు వచ్చి రామరాజుకు నిజం చెప్పాలనుకుంటాడు. కానీ వేదవతి వచ్చి చందును పక్కకు తీసుకెళ్తుంది. వల్లి గురించి నాన్నకు నిజం చెప్పాలమ్మా అని చందు అంటాడు.

షాకిచ్చిన వేదవతి

నాకు అన్నీ తెలుసని వేదవతి అనడంతో చందు షాక్ అవుతాడు. అమూల్య విషయంలో వల్లి ఏం చేసిందో అంతా నాకు తెలుసు. నీ భార్య గురించి తెలిసిన రోజే నాన్నకు నిజం ఎందుకు చెప్పలేదని చందును అమ్మ అడుగుతుంది. పెద్ద కోడలు మోసం చేసిందంటే నాన్న తట్టుకోగలరా? అని చందు అంటాడు. మరి ఇప్పుడు చెప్తే తట్టుకోగలడా? అని వేదవతి అడుగుతుంది.

మాకూ తెలుసని

కొన్ని సార్లు నిజాల కంటే మనుషులు, బంధాలు ముఖ్యం. ఇప్పుడు వల్లి కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించమని వేదవతి చెప్తుంటే ధీరజ్ వస్తాడు. నాన్నకు నిజం చెప్పడం కంటే కూడా నీ కాపురాన్ని సరిదిద్దుకుంటే బాగుంటుందని ధీరజ్ అంటాడు. చిన్నోడా ఇవన్నీ నీకెలా తెలుసని వేదవతి ఆశ్చర్యపోతుంది. నాక్కూడా తెలుసు అత్తయ్య అని ప్రేమ, వెనకాలే నర్మద వస్తారు.

ఇవన్నీ తెలిసి నాకెందుకు చెప్పలేదని వేదవతి అడుగుతుంది. వల్లి అన్ని ఇబ్బందులు పెట్టినా మీరు క్షమించారంటే గ్రేట్ అని తన కోడళ్లను వేదవతి పొగిడేస్తుంది. మరోవైపు వల్లికి భయం చెప్పి మరీ తీసుకొచ్చానని భాగ్యం ఇంట్లో జరిగిన ఫ్లాష్ బ్యాక్ గురించి వేదవతి చెప్తుంది.

భాగ్యానికి చెంపదెబ్బ

భాగ్యం ఇంటికి వెళ్లిన వేదవతి రఫ్పాడిస్తుంది. భాగ్యం చెంపపై కొడుతుంది. ఏ తల్లి అయినా కూతురి జీవితం బాగుండాలని కోరుకుంటుంది. కూతురు పొరపాటు చేస్తే తల్లి సరిదిద్దుతుంది. కానీ కూతురి కాపురం చెడిపోయేలా సలహాలు ఇస్తావా? అత్తారింటి నాశనం కోసం కుట్రలు చేస్తావా? అని వేదవతి మండిపడుతుంది.

మధ్యలో శ్రీవల్లి మాట్లాడితే తనపై వేదవతి చేయి ఎత్తుతుంది. మీ అక్క భద్రావతి వాళ్లు మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. అమూల్య, విశ్వకు పెళ్లి అయ్యేలా సాయం చేయమన్నారు. అందుకే భయపడి అలా చేశామని భాగ్యం షాకింగ్ విషయం చెప్తుంది. తన తప్పేమీ లేదంటూ అత్త కాళ్లపై పడి వల్లి బతిమిలాడుతుంది. ఇక నుంచి ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలని వల్లికి వేదవతి వార్నింగ్ ఇస్తుంది.

మారని భాగ్యం

సీన్ కట్ చేస్తే వల్లి పూర్తిగా మారిపోయిందని చందుకు చెప్తుంటుంది వేదవతి. మరోవైపు అత్తారింటికి వచ్చేశానని వల్లి, భాగ్యం, ఇడ్లీ బాబాయ్ తెగ డ్యాన్స్ చేసేస్తున్నారు. ప్రేమ, నర్మదలను తొక్కేయాలంటా అంటూ భాగ్యం పాడుతుంది. ఇడ్లీ బాబాయ్ ఏమో భాగ్యంపై కౌంటర్ వేస్తాడు. ఇంట్లో బుద్ధిగా, తోడి కోడళ్లతో ప్రేమగా ఉండాలని వల్లి చెప్తుంది.

నువ్వు అణిగిమణిగి ఉన్నావంటే ప్రేమ, నర్మద నీతో ఆడుకుంటారు. మంచితనం ముసుగులో వాళ్లతో ఆడుకోవాలని కూతురికి మళ్లీ దిక్కుమాలిన సలహాలు ఇస్తుంది భాగ్యం. అప్పుడే నర్మద, ప్రేమ వచ్చి భాగ్యానికి కౌంటర్ వేస్తారు. దౌర్భాగ్యం పిన్నిది కుక్కతోక బుద్ధి ప్రేమ. నాలుగైదు తగిలిద్దామని నర్మద అంటుంది. భాగ్యం గొడవకు రెడీ అయిపోతుంది. కొట్టండి చూద్దాం అని రెచ్చగొడుతుంది.

యాక్సిడెంట్ గురించి

అమ్మ బుద్ధి లేకుండా వాగుతుంది. వదిలేయండి చెల్లాయిలు. మనం అన్నీ మర్చిపోయి స్నేహితుల్లా ఉందామని వల్లి అడుగుతుంది. నువ్వు మా నాన్నకు దేవతవి. నీకు పెద్ద కోడలు స్థానం ఇచ్చాం. నువ్వు తల్లివి కాబోతున్నావు. ఇంట్లో నీపై ఉన్న ప్రేమను పోగొట్టుకోకు అని ధీరజ్ హితబోధ చేస్తాడు. చందు బావ యాక్సిడెంట్ గురించి అత్తయ్యకు, చందు బావకు చెప్పలేదు. చెప్తే కడుపుతో ఉన్నా కూడా ఇంటికి రానిచ్చేవాళ్లు కాదని నర్మద, ప్రేమ అంటారు.

ప్రేమ మొక్కు

ప్రేమ, ధీరజ్ గుడికి వెళ్తారు. ఇంత ఇబ్బంది పడుతూ రావడం అవసరమా అని ధీరజ్ అడుగుతాడు. నేను మొక్కుకున్నా అని ప్రేమ సిగ్గుపడుతుంది. మన మధ్య అపార్థాలు తొలగిపోతే 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నానని ప్రేమ చెప్తుంది. ధీరజ్ తో ప్రేమగా మాట్లాడుతుంది.

ఈ కాలుతో ప్రదక్షిణలు ఎలా చేస్తావ్? నడవడానికే ఇబ్బంది పడుతున్నావ్. కాలు బాగైన తర్వాత చేద్దువు కానీ అని ధీరజ్ చెప్పినా ప్రేమ వినదు. దేవుడే దారి చూపిస్తాడని చెప్పిన ప్రేమ కాలు జారి పడిపోతుంటే ధీరజ్ పట్టుకుంటాడు. ప్రేమను ఎత్తుకుని ప్రదక్షిణలు చేయిస్తాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More