Illu Illalu Pillalu April 17 Episode:నర్మదపై రామరాజు సీరియస్-భాగ్యం ఇంటికి ఫ్యామిలీ-కుల్ కుల్ వైద్యం-భాగ్యానికి బడితెపూజ

Illu Illalu Pillalu April 17 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 17 ఎపిసోడ్ లో నర్మదపై రామరాజు సీరియస్ అవుతాడు. ఇంటి పనులు చూసుకునేందుకు అమూల్యను కాలేజీకి సెలవు పెట్టమంటాడు. భాగ్యాన్ని చూసేందుకు వాళ్ల ఇంటికి వెళ్తారు. కాళ్లకు దెబ్బతగిలాయని నటిస్తున్న భాగ్యానికి బడితెపూజ చేస్తారు. 

Published on: Apr 17, 2026, 07:45:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu April 17 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఇప్పుడు శాడ్ ఫేజ్ నడుస్తోంది. గొడవతో రామరాజు, సాగర్.. ప్రేమను టార్చర్ పెట్టినందుకు ధీరజ్.. వల్లి మోసంతో చందు.. ఇలా అందరూ బాధలోనే ఉన్నారు. మరి ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

రామరాజు కోపం

మామయ్య కాఫీ అని నర్మద ఇస్తే రామరాజు తీసుకోడు. అక్కడ పెట్టమంటాడు. రాత్రి జరిగిన దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నారా? అని కోడలు అడిగితే, లేదని రామరాజు చెప్తాడు. అమ్మ వచ్చేంతవరకూ ఇంటి, వంట పనులు చేసేందుకు అమూల్యను కాలేజీకి సెలవు పెట్టమని రామరాజు చెప్తాడు.

నర్మదపై సీరియస్

అమూల్యను కాలేజీకి వెళ్లనివ్వండి. నేను ఆఫీస్ కు సెలవు పెడతానని నర్మద అంటుంది. కానీ రామరాజు ఒప్పుకోడు. ఇంట్లో పనులన్నీ అమూల్య చూసుకుంటుంది. నువ్వు నీ పని చూసుకో అని రామరాజు కాస్త సీరియస్ గానే అనడంతో నర్మద ఫీల్ అవుతుంది. ఇప్పుడు వల్లీ ఉంటే అన్ని పనులు చేసేదని తిరుపతి అంటాడు.

వల్లిని తీసుకురమ్మని

వల్లిని పుట్టింటి నుంచి తీసుకురమ్మని చందుకు రామరాజు చెప్తాడు. అసలు విషయం తెలిసిన చందు, నర్మద, అమూల్య షాక్ అవుతారు. వల్లిని ఇంకొన్నాళ్లు అక్కడే ఉండనివ్వండని చందు అంటాడు. నీ మాటల్లో, ప్రవర్తనలో తేడా ఉంది. ఏంటి సమస్య? నీకు, నీ భార్యకు ఏదైనా గొడవ జరిగిందా? అని రామరాజు అడుగుతాడు. ధీరజ్ మధ్యలో మాట్లాడి కవర్ చేస్తాడు.

వల్లి వాళ్ల అమ్మను పరామర్శించడానికైనా వెళ్లమంటే చందు పని ఉందని అక్కడినుంచి వెళ్లిపోతాడు. మనం వెళ్దామని ధీరజ్ కు రామరాజు చెప్తాడు.

భాగ్యం మరో ప్లాన్

సీన్ భాగ్యం ఇంటికి మారుతుంది. శ్రీవల్లి కాలు, చేయి ఇరగ్గొట్టి కట్టు కడతానని భాగ్యం అంటే వల్లి అగ్గిమీద గుగ్గిలం అవుతుంది. ఈ స్కీమ్ నిన్ను మీ అత్తారింటికి పంపించడానికే. దీన్నే కార్యేషు భర్త కాన్సెప్టింగ్ అంటారని భాగ్యం చెప్తుంది. మొన్న కార్యేషు దాసి అనే ఐడియాతో దెబ్బతిన్నామని వల్లి సీరియస్ అవుతుంది.

ప్రేమ కాలుకు దెబ్బ తగలగానే ధీరజ్ కళ్లలో పెట్టుకుని చూసుకుంటున్నాడు కదా. అలాగే నీకు కాలు, చేయి విరిగిందని అల్లుడికి కాల్ చేసి చెప్తాం. దెబ్బకు మీ మామ, మీ ఆయన పరుగెత్తుకుంటూ వస్తారని భాగ్యం చెప్తే శ్రీవల్లి వినదు. కాల్ చేయగానే కార్లో వస్తారని భాగ్యం అనగానే.. రామరాజు ఫ్యామిలీ కార్లో నుంచి దిగుతుంది.

భాగ్యం యాక్టింగ్

నీ కాలు విరిగిందని అల్లుడికి అబద్ధం చెప్పావ్ కదా అని భాగ్యానికి ఇడ్లీ బాబాయ్ గుర్తు చేస్తాడు. రామరాజు కాళ్లకు వల్లి దండం పెడుతుంది. రామరాజు, ధీరజ్, ప్రేమ, నర్మద లోపలికి వెళ్తారు. నొప్పి ఉన్నట్లు భాగ్యం తెగ యాక్టింగ్ చేసేస్తుంది. వదిన గురించి మీకు పూర్తిగా తెలీదు నాన్న అని వల్లిని ఇరికించేలా ధీరజ్ మాట్లాడతాడు.

ఆపిల్స్ తినొద్దని

ఏం షాక్ ఇవ్వడానికి వచ్చారో ఏంటో? అని వల్లి అనుకుంటుంది. అక్కాయ్ అన్ని విషయాలు ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ముందు పిన్ని సంగతి చూద్దామని ప్రేమ, నర్మద అంటారు. రామరాజు ఆపిల్స్ ఇస్తాడు. కాలు విరిగిన వాళ్లు ఆపిల్స్ తింటే కాటికి వెళ్తారని ధీరజ్ చెప్తాడు. అత్తయ్య మీరు ఆపిల్ తినడం లేదని నాన్న ఫీల్ అవుతున్నారు. ఒకటి తింటారా అని వెటకారంగా ధీరజ్ అంటాడు.

కాలు సెట్ చేస్తామని

వద్దు బాబు, నాకు అసలే బరువు బాధ్యతలు ఉన్నాయని భాగ్యం అంటుంది. కొంపలు కూల్చడమా అని ధీరజ్ షాక్ ఇస్తాడు. అదే నాన్న పిల్లల జీవితాలను చక్కదిద్దడమే కదా అని ధీరజ్ మాట మారుస్తాడు. ఇప్పుడు కాలు ఎలా ఉందని రామరాజు అడుగుతాడు. ఫుల్ డౌటింగ్స్ గా ఉందన్నాయ్ అని భాగ్యం చెప్తుంది. మేం మీ కాలును సెట్ చేస్తామని ధీరజ్, ప్రేమ, నర్మద అంటారు.

రెండు కాళ్లకు

ఏ కాలుకు దెబ్బతగిలిందని రామరాజు అడిగితే.. ఒకరేమో కుడి కాలని, మరొకరేమో ఎడమ కాలని భాగ్యం, వల్లి, ఇడ్లీ బాబాయ్ చెప్తారు. రెండు కాళ్లకు తగిలిందని భాగ్యం కవర్ చేస్తుంది. చెల్లమ్మకు తగ్గిపోయిందేమో ఒకసారి పలకరించి, వల్లిని ఇంటికి తీసుకెళ్దామని వచ్చామని రామరాజు చెప్పడంతో వల్లి షాక్ అవుతుంది. పర్వాలేదు మామయ్య నేను వస్తానని వల్లి అంటుంది. భాగ్యం కూడా అదే మాట చెప్తుంది.

కుల్ కుల్ వైద్యం

కన్నతల్లిని ఇలాంటి పరిస్థితిలో వదిలేసి వస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. మీ అమ్మకు పూర్తిగా తగ్గాకే రా అని రామరాజు వెళ్లిపోతాడు. నాటు వైైద్యం చిట్కా చెప్తానిన ధీరజ్ ఓ కర్ర తీసుకుని వస్తాడు. దీన్ని కేరళలో కుల్ కుల్ వైద్యం అంటారు. పాన్ ఇండియా వైద్యం ఎక్కడైనా పని చేస్తుందని ధీరజ్ కర్ర పట్టుకుని చెప్తాడు.

విరిగిన కాలుపై కర్రపై దెబ్బకొడితే నొప్పి ఉండదు. కాలు విరగలేదనుకో నొప్పి ఉంటుందని ధీరజ్ అంటాడు. నర్మద చేతికి ధీరజ్ కర్ర ఇస్తాడు. భాగ్యం కాళ్లపై నర్మద కొడుతుంది. నొప్పి లేదని భాగ్యం నవ్వుతుంది. నర్మద బాదుతూనే ఉంటే భాగ్యం కవర్ చేస్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More