Illu Illalu Pillalu April 24 Episode: బుజ్జ‌మ్మ వ‌చ్చేసిందోచ్‌.. వ‌ల్లి కుట్ర‌లు బయటపెట్టిన వేదవతి.. షాక్‌లో ఫ్యామిలీ!

Illu Illalu Pillalu April 24 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఏప్రిల్ 24 ఎపిసోడ్ లో తల్లి కాబోతున్నానని వల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ నాన్నకు నిజం చెప్పేస్తానని చందు షాక్ ఇస్తాడు. అప్పుడే వల్లితో కలిసి వేదవతి ఎంట్రీ ఇస్తుంది. దీని వెనుక నర్మద ప్లాన్ ఉంటుంది. 

Published on: Apr 24, 2026, 07:39:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu April 24 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో చందుకు యాక్సిడెంట్ చేయించాలని శ్రీవల్లి తల్లి ప్లాన్ చేసిందని తెలుస్తుంది. భాగ్యం ఫ్యామలీని నర్మద, ప్రేమ, ధీరజ్ కలిసి వాయిస్తారు. అదే సమయంలో వల్లి ప్రెగ్నెంట్ అని తెలియడంతో కథ మలుపు తిరుగుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 24 ఎపిసోడ్ లో చూద్దాం.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

బా అని ప్రేమగా

శ్రీవల్లి ప్రెగ్నెంట్ అని తెలిసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. చందును వల్లి దగ్గరకు పిలుచుకుంటుంది. బా నేను తల్లిని కాబోతున్నా. మనం అమ్మానాలను కాబోతున్నామని చందు చేతిని తీసుకుని తన పొట్టపై పెట్టుకుంటుంది. నా కడుపులో మన బుజ్జి బేబీ ఉందంట బా. ఇది మన జీవితాల్లో గొప్ప ఆనందం. నువ్వు ఏం మాట్లాడట్లేదేంటి బా అని శ్రీవల్లి అడుగుతుంది.

చందు బాధ

ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఓ వైపు నేను నాన్నను కాబోతున్నానన్న ఆనందం. మరోవైపు మా నాన్నను మోసం చేశావనే బాధ అని చందు అంటాడు. మేం చేసింది తప్పే అని భాగ్యం, ఇడ్లీ బాబాయ్ కలిసి చందు కాళ్లు పట్టుకుంటారు. జరిగిందేదో జరిగిపోయింది. మిమ్మల్ని దూరం చేయాలని మేం అనుకోలేదు. వల్లి అక్కతో పాటు మన కుటుంబం అంతా సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది. వల్లి అక్కను ఇంటికి తీసుకెళ్దామని చందుకు ధీరజ్, ప్రేమ, నర్మద చెప్తారు.

వీళ్ల మోసాలు, పాపాల గురించి నాన్నకు చెప్తానని చందు షాక్ ఇస్తాడు. ఎవరెంత చెప్పినా చందు వినడు. నాన్నకు చెప్పి తీరుతా. నాన్న ఏం చేయమంటే అదే చేస్తానని చందు వెళ్లిపోతాడు. వల్లి ఏడుస్తుంది.

రామరాజు సందడి

ఇంట్లో రామరాజు తెగ సందడి చేసేస్తాడు. టపాసులు కాల్చాలంటాడు. ఇల్లు డెకరేషన్ చేయించాలని చెప్తాడు. వల్లి గురించి చెప్పేందుకు చందు ట్రై చేస్తాడు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. వల్లి నెల తప్పింది. తను తల్లి, నువ్వు తండ్రి కాబోతున్నారు. మీరు నన్ను తాతను చేస్తున్నారని తెగ సంబరపడిపోతూ రామరాజు అంటాడు.

వేదవతి ఎంట్రీ

వల్లి గురించి అసలు విషయం చెప్పాలని చందు అంటాడు. కోడలిని తీసుకు రాకుండా ఎందుకు వచ్చారని రామరాజు ప్రశ్నిస్తాడు. అప్పుడే నేను చెప్తానని వేదవతి ఎంట్రీ ఇస్తుంది. కార్లో వల్లిని తీసుకొని వస్తుంది. వెనకాలే భాగ్యం, ఆనంద్ రావు కూడా వస్తారు. కడుపుతో ఉన్న వల్లిని ఇంటికి తీసుకొద్దామంటే పెద్దోడు ఎందుకు వద్దంటున్నాడో నేను చెప్తానని వేదవతి అంటుంది.

వల్లి కుట్రలు

నెల తప్పి పుట్టింట్లో ఉన్న కోడలిని పసుపు కుంకమలు ఇచ్చి అత్తగారు తీసుకురావాలి. అందుకే అమ్మ లేకుండా వల్లిని తీసుకురావొద్దని పెద్దోడు మీకు చెప్పబోతున్నాడని వేదవతి చెప్తుంది. అంతేనా అని రామరాజు అడిగితే.. కాదండీ వల్లి వాళ్లమ్మతో కలిసి మన కుటుంబానికి ఎసరు పెట్టడానికి చాలా కుట్రలు చేసింది. అందుకే వల్లి మన ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదని పెద్దోడు తెగేసి చెప్పబోతున్నాడని వేదవతి షాక్ ఇస్తుంది. వెంటనే సరదాగా చెప్పానని కవర్ చేస్తుంది.

భాగ్యం బిల్డప్

శ్రీరామ శ్రీరామ శ్రీరామ అంటే అన్నానంటారు కానీ ముందు కోడలిని ఇంట్లోకి తీసుకెళ్దామని వేదవతి మళ్లీ సందడి మొదలుపెడుతుంది. నర్మద, ప్రేమ కలిసి దిష్టి తీసి వల్లిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. నా కూతురిని అత్తారింట్లో అడుగుపెట్టనని సవాలు చేసిన సీమ టపాకాయ్, పొట్టి మిరపకాయ్ కలిసి ఇప్పుడు దిష్టి తీశారని నర్మద, ప్రేమ ముందు భాగ్యం బిల్డప్ కొడుతుంది. దౌర్భాగ్యం అత్త అని ధీరజ్ రాగానే భాగ్యం ఇంట్లోకి వెళ్లిపోతుంది.

నర్మద ప్లాన్

వల్లి అక్క ప్రెగ్నెంట్ అనే విషయం అత్తకు ఎలా తెలిసింది? కరెక్ట్ అదే టైమ్ కు అత్త ఎలా వచ్చిందో అర్థం కావట్లేదని ప్రేమ అడుగుతుంది. అప్పుడే జరిగిన విషయాన్ని ప్రేమకు చెప్తారు. వేదవతికి నర్మద కాల్ చేసి వల్లి తల్లి కాబోతున్న సంగతితో పాటు జరిగిన విషయాలు అన్నింటినీ చెప్పిందని ప్రేమకు తెలుస్తుంది.

నువ్వు గ్రేట్ అక్క అని నర్మదను ప్రేమ పొగిడేస్తుంది. ఇది మన కుటుంబం. సమస్యల కారణంగా విడిపోకూడదని నర్మద చెప్పడంతో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More