Illu Illalu Pillalu April 23 Episode: నిజం చెప్పిన లారీ డ్రైవర్.. ధీరజ్, నర్మద, ప్రేమ ఉగ్రరూపం.. తల్లి కాబోతున్న వల్లి

Illu Illalu Pillalu April 23 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ టుడే ఏప్రిల్ 23 ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్ చేసుకుంటుంది. చందుకు యాక్సిడెంట్ చేయించారని తెలిసి.. వల్లి, భాగ్యం,  ఇడ్లీ బాబాయ్ చెంపలను ధీరజ్, నర్మద, ప్రేమ వాయిస్తారు. కళ్లు తిరిగి పడిపోయిన వల్లి ప్రగ్నెంట్ అని తెలుస్తుంది.

Published on: Apr 23, 2026, 07:33:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu April 23 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ ను ధీరజ్, నర్మద పట్టుకుంటారు. దీంతో భాగ్యం, శ్రీవల్లి వణికిపోతారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 23 ఎపిసోడ్ లో చూసేయండి.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

భాగ్యం పేరు చెప్పిన డ్రైవర్

చంపేస్తానని ధీరజ్ భయపెట్టడంతో లారీ డ్రైవర్ నిజం చెప్పేస్తాడు. సేనాపతి పేరు దాచిపెట్టి, భాగ్యం పేరును ఆ డ్రైవర్ చెప్తాడు. దీంతో నర్మద, ధీరజ్ షాక్ అవుతాడు. చందు వాళ్ల అత్తామామనే యాక్సిడెంట్ చేయమని చెప్పారని చెప్పిన డ్రైవర్ తప్పించుకొని పారిపోతాడు.

తల్లిపై ఫైర్

బావ ప్రాణాలు తీయాలని చూసిన తర్వాత వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని నర్మద అంటుంది. నర్మద చెప్పడంతో ప్రేమకు ధీరజ్ కాల్ చేసి రమ్మంటాడు. మరోవైపు భాగ్యం, శ్రీవల్లి, ఇడ్లీ బాబాయ్ తెగ టెన్షన్ పడతారు. ఆ డ్రైవర్ మన పేర్లు కూడా చెప్పేసి ఉంటాడని శ్రీవల్లి కంగారు పడుతుంది. ఏదో ఒకటి చేద్దామని భాగ్యం అంటుంది. నీ అబద్ధాలతో, కుట్రలతో నా బతుకును నాశనం చేసింది సరిపోలేదా అని తల్లిపై వల్లి ఫైర్ అవుతుంది.

వల్లి ఏడుపు

నర్మద, ప్రేమ కలిసి కుట్ర చేసి నిన్ను ఇక్కడికి పంపించారు. లేకపోతే ఆ ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని మహారాణిలా ఉండేదానివని భాగ్యం అంటుంది. ఈ మాటలతో తల్లిపై వల్లి మండిపడుతుంది. నన్ను అత్తారింట్లో అడుగుపెట్టకుండా చేశావని వల్లి ఏడుస్తుంది. ముందు ఈ ఊర్లో నుంచి జంప్ అవుదామని ఇడ్లీ బాబాయ్ బ్యాగ్ లు పట్టుకుని వస్తాడు.

భాగ్యానికి చెంప దెబ్బ

నర్మద, ప్రేమ, ధీరజ్ ఆవేశంతో ఊగిపోతూ వస్తారు. ఈ జన్మలో నిన్ను క్షమించమని వల్లితో నర్మద అంటుంది. భాగ్యాన్ని చెంపపై కొడుతుంది. ఏకంగా చందు బావ ప్రాణాలు తీయాలని చూస్తారా? అని నర్మద ఫైర్ అవుతుంది. అది నిజంగా యాక్సిడెంట్ కాదమ్మాయి. ఉత్తుత్తి డమ్మీ యాక్సిడెంట్ అని భాగ్యం అనగానే నర్మద మరొకటి పీకుతుంది.

వల్లిని కొట్టిన ప్రేమ

చిన్న చిన్న దెబ్బలు తగిలేలా చేసి, మొగుడుకు సేవ చేసే వంకతో మా అమ్మాయిని అత్తారింటికి పంపించాలని అనుకున్నామని భాగ్యం అంటుంది. ఈ మాటలతో నర్మద మరింత రెచ్చిపోతుంది. నీకైనా బుద్ధి లేదా? తాళి కట్టిన భర్తకు యాక్సిడెంట్ అంటే ఎలా ఒప్పుకొన్నావని వల్లిని నర్మద అడుగుతుంది. నేను వద్దన్నాను, కానీ నా కాపురం నిలబడుతుందంటే ఆశపడ్డానని వల్లి అంటుండగానే ప్రేమ వచ్చి చెంపపై లాగిపెట్టి కొడుతుంది.

నర్మద, ప్రేమ సీరియస్

ఒకవేళ చందు బావ ప్రాణాలు పోయి ఉంటే, నీ తాళే నీకు దూరమయ్యేది. ఆ మాత్రం బుద్ధి లేదా నీకు అని ప్రేమ అంటుంది. ఇడ్లీ బాబాయ్ రెండు చెంపలను ధీరజ్ వాయిస్తాడు. నువ్వు బుద్ధిగా ఉండాలనే చందు బావకు నిజం చెప్పాం. మేం నిన్ను తోడబుట్టిన అక్కలా అనుకున్నాం. అందుకే మామయ్యకు చెప్పలేదు. చందు బావతో మాట్లాడి నిన్ను ఇంటికి రప్పించేలా దాదాపు ఒప్పించాం. కానీ ఇప్పుడు ఆ ఇంట్లోకి అడుగుపెట్టనివ్వమని నర్మద, ప్రేమ అంటారు.

కాళ్లు పట్టుకున్నా

జీవితంలో ఇంకెప్పుడూ తప్పు చేయను. ఈ ఒక్కసారి క్షమించండని వల్లి ప్రాధేయపడుతుంది. నిన్ను నమ్మడమంటే పామును పక్కలో పెట్టుకోవడమేనని ప్రేమ అంటుంది. మీ నిజ స్వరూపం గురించి ఇప్పుడే మామయ్యకు చెప్తామని నర్మద షాక్ ఇస్తుంది. నువ్వు ఇక్కడే మీ వాళ్లతో ఉండిపో అని ప్రేమ అంటుంది. కాపురాన్ని కూల్చొద్దంటూ నర్మద, ప్రేమ కాళ్లు పట్టుకుంటుంది వల్లి.

హాస్పిటల్ కు

వల్లిని తోసేసి నర్మద, ప్రేమ, ధీరజ్ వెళ్లిపోతారు. వల్లి కళ్లు తిరిగి పడిపోతుంది. మళ్లీ కొత్త డ్రామాలు స్టార్ట్ చేశారా అని ధీరజ్ అంటాడు. నిజంగానే పడిపోయిందని భాగ్యం ఏడుస్తుంది. వల్లిని హాస్పిటల్ కు తీసుకెళ్తారు. మీ వల్లే నా కూతురికి ఇలాంటి పరిస్థితి తలెత్తిందని నర్మద, ప్రేమపై భాగ్యం కోప్పడుతుంది. అప్పుడే చందు వస్తాడు.

వల్లి ప్రెగ్నెంట్

వీళ్లు ఎంతటి మోసగాళ్లో తెలిసినా కళ్లు తిరిగి పడిపోయిందని అంటే ఎందుకు గుడ్డిగా నమ్మారు. ఇదో కొత్త డ్రామా అని చందు అంటాడు. డ్రామా కాదు మా అమ్మాయి నిజంగానే కళ్లు తిరిగి పడిపోయిందని భాగ్యం ఏడుస్తుంది. అప్పుడే డాక్టర్ వచ్చి వల్లి ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఈ మాట విని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. లోపలికి వెళ్లి వల్లితో మాట్లాడతారు.

కంగ్రాట్స్ అక్క అని నర్మద, ప్రేమ చెప్తారు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More