ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 27 ఎపిసోడ్: భర్తపై పొంగిపోయిన ప్రేమ- ధీరజ్ కు తిప్పలు- పోలీసు కేసులో ఇరికించేలా భద్రావతి కుట్ర
ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 27 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 27 ఎపిసోడ్ లో క్యాబ్ డ్రైవింగ్ లో ఉన్న ధీరజ్ పై ప్రేమ తెగ ప్రేమను ఒలకబోస్తుంది. మరోవైపు ధీరజ్ ను పోలీస్ కేసులో ఇరికించేలా భద్రావతి, సేనాపతి కుట్ర పన్నుతారు. ఇక వల్లి వెటకారంగా మాట్లాడితే, ప్రేమ వార్నింగ్ ఇస్తుంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 27 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 27 ఎపిసోడ్ లో.. క్యాబ్ డ్రైవింగ్ లో బిజీగా ఉన్న ధీరజ్ గురించి ఇంట్లో ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ధీరజ్ కు కాల్ చేస్తుంది. ధీరజ్ తో ప్రేమగా మాట్లాడుతుంది ప్రేమ. విసిగించకని కాల్ కట్ చేస్తాడు ధీరజ్.

ధీరజ్ కోసం ఫుడ్
ప్రేమ మళ్లీ కాల్ చేసి తిన్నవా లేదా అని ధీరజ్ ను అడుగుతుంది. ఇంత టైమ్ అయింది, ఇంకా తినలేదా అని ధీరజ్ ఉన్న ఏరియా అడ్రస్ తెలుసుకుంటుంది ప్రేమ. ధీరజ్ కు ఫుడ్ పార్సిల్ పంపిస్తుంది ప్రేమ. జ్యూస్ కూడా ఆర్డర్ పెడుతుంది. కార్లో ఉన్న ప్యాసింజర్లు ధీరజ్ పై అతని భార్యకు చాలా ప్రేమ ఉందని అంటారు. దాని ప్రేమ నా పర్స్ కు వచ్చింది. నేను సంపాదించింది రూ.750 అయితే, ఫుడ్ కు కట్టింది రూ.1000 అని ధీరజ్ చెప్తాడు.
కారు లాక్కోవాలని
మరోవైపు ధీరజ్ కు ఫైనాన్స్ లో కారు ఇచ్చిన దండపాణిని భద్రావతి, సేనాపతి పిలిపిస్తారు. వాడు కారు లాక్కోవాలని, ఇంకా ఎక్కడ లోన్ రాకుండా చేయాలని చెప్తారు. ఈఎంఐ కట్టడం ఒక్క రోజు లేట్ అయినా కారు లాక్కొస్తానని దండపాణి చెప్తాడు. వాడు రామరాజు కొడుకు, సిన్సియారిటీకి మారు పేరు. తప్పకుండా ఈఎంఐ కడతాడని సేనాపతి అంటాడు.
సేనాపతి ప్లాన్
ఇదేం ధర్మ యుద్ధం కాదు. వాడి దగ్గర కారు ఉండొద్దు. వాడు సమస్యలో చిక్కుకుపోవాలని భద్రావతి చెప్తుంది. పోలీస్ కేసు అయితే బెయిల్ కూడా రాకుండా చూడొచ్చని దండపాణి ఐడియా ఇస్తాడు. కార్లో ఏదైనా ప్రభుత్వం నిషేధించిన వస్తువులు దొరికితే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుందని దండపాణి చెప్తాడు. భయంకరమైన ప్లాన్ నా దగ్గర ఉందని సేనాపతి అంటాడు.
భర్త మీద ప్రేమ
ధీరజ్ రాగానే ప్రేమ వెళ్లి హగ్ చేసుకుంటుంది. సంపాదించిన దానికంటే ఖర్చు పెట్టిందే ఎక్కువ అని ప్రేమను కొట్టేందుకు వెనకాల పడతాడు ధీరజ్. ప్రేమ చేతులను వెనక్కి విరిచి పట్టుకుంటాడు. నా మొగుడు ఖాళీ కడుపుతో ఉండకూడదని అనుకోవడం నా తప్పైపోయింది. 24 గంటలు నీ మీదే ధ్యాస. అందుకే లోకువ అయిపోయానని ప్రేమ అలుగుతుంది.
ఐస్ క్రీమ్ తో కూల్
ఈఎంఐ కట్టడం లేటైతే కారు తీసుకెళ్తారు కదా అందుకే కష్టపడుతున్నానని ధీరజ్ చెప్తాడు. ఐస్ క్రీమ్ తో ప్రేమను కూల్ చేస్తాడు ధీరజ్. తన చేత్తో తినిపిస్తాడు. చెంపపై ముద్దు పెడతాడు. ఎస్ఐ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావు కదా, మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తానని ధీరజ్ అంటాడు. ఒకేసారి రెండు బరువులు వద్దని ప్రేమ లోపలికి వెళ్లిపోతుంది.
వల్లి వెటకారం
కట్ చేస్తే రాత్రి అవుతుంది. అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటారు. నేను కడుపుతో ఉన్నాను కాబట్టి ముందుగానే తింటున్నా. లేదంటే అందరికి వడ్డించి తినేదాన్ని. కానీ ప్రేమ ముందుగానే కూర్చుంది. అందరికీ వడ్డించడం కోడలి బాధ్యత అని శ్రీవల్లి వెటకారంగా మాట్లాడుతుంది. నా జోలికి వస్తే మీ అమ్మానాన్నకు నువ్వు ఒక్కదానివి ఉన్నావనే విషయం కూడా మర్చిపోయేలా చేస్తానని ప్రేమ వార్నింగ్ ఇస్తుంది.
నర్మదకు ఆకలి
విశ్వక్ ఫ్రెండ్స్ ను అమ్మ, ప్రేమ, నర్మద చితకబాదారు. ప్రేమ వదిన, నర్మద వదిన ఎంత సాఫ్టో కదా. కానీ ఏదైనా తేడా వస్తే పచ్చడి దంచినట్లు దంచేస్తారని అమూల్య చెప్పడంతో వల్లి సైలెంట్ అవుతుంది. దూరం నుంచి ఇదంతా చూస్తూ నర్మద ఫీల్ అవుతుంది. ఆకలి అవుతుందని వేదవతికి సైగ చేస్తుంది నర్మద.
అప్పుడే సాగర్ వస్తాడు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటీ అని నర్మద కంగారు పడుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


