Illu Illalu Pillalu May 8 Episode:ఇన్ని ట్విస్ట్‌లా? కడుపు లేదన్న వల్లి-రేయ్ రామరాజు అంటూ భద్రావతి రచ్చ-సుక్కు ఎంట్రీ
Illu Illalu Pillalu May 8 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 8 ఎపిసోడ్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయి. కడుపు లేదని వల్లి అనడంతో అందరూ షాక్ అవుతారు. ఇక సుకన్య ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది. మరోవైపు ప్రేమను లాక్కొచ్చిన భద్రావతి, సేనాపతి కలిసి నగల విషయంలో గొడవ పెడతారు.
Illu Illalu Pillalu May 8 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 8 ఎపిసోడ్ లో.. వల్లి ఇచ్చిన స్కానింగ్ రిపోర్ట్ చూసి కచ్చితంగా అబ్బాయే అని వేదవతి.. లేదు అమ్మాయే పుడుతుందని రామరాజు వాదించుకుంటారు. అప్పుడే శ్రీవల్లి వస్తుంది. డైరెక్ట్ గా వల్లి అక్కనే అడగండని నర్మద అంటుంది. అబ్బాయిని కంటావా? అమ్మాయిని కంటావా? అని వల్లిని వేదవతి అడుగుతుంది.

కడుపే లేదని
అసలు నాకు కడుపే లేదు అత్తయ్య అని శ్రీవల్లి చెప్పగానే అందరూ షాక్ అవుతారు. రామరాజు అయితే కంగారుగా కుర్చీలోనుంచి లేస్తాడు. కడుపులో ఏం లేకపోవడం ఏంటి వల్లి? అని వేదవతి అడుగుతుంది. నా చేతుల్లో ఏం లేదు. అంతా పైవాడి చేతుల్లో ఉంది. ఎవరినిస్తాడో అని వల్లి కవర్ చేస్తుంది.
సుకన్య ఎంట్రీ
అప్పుడే రామరాజు ఇంటి ముందు ఆటో వచ్చి ఆగుతుంది. ట్రంకు పెట్టెతో, ఒంటి నిండా నగలు, కళ్లకు అద్దాలతో ఓ అమ్మాయి దిగుతుంది. ఆమెను చూసి తిరుపతి ఫ్లాట్ అయిపోయి ఓ సాంగ్ వేసుకుంటాడు. ఎవరు? అని తిరుపతి అడుగుతాడు. కన్య.. సుకన్య అని గొప్పగా చెప్తుంది. పతి.. తిరుపతి కావాలంటే నీకు అవుతాను పతి అని తిరుపతి అంటాడు.
ఎవరీ అమ్మాయి?
ఎవర్రా ఈ అమ్మాయి అని అందరూ కొశ్చన్ మార్క్ ముఖాలు వేసుకుని చూస్తారు. అప్పుడే వల్లి ఎట్లున్నవే అని శ్రీవల్లిని సుకన్య హగ్ చేసుకుంటుంది. ఉరుము లేని వానలా ఇలా ఎంట్రీ ఇచ్చావేంటే బాబు అని వల్లి అంటుంది. నీ కడుపు మీద కన్నేయమని అత్త నన్ను పంపించిందని సుకన్య చెప్తుంది. మా అమ్మ వాళ్ల అన్నయ్య వాళ్ల చిన్న కూతురు మామయ్య అని సుక్కు గురించి రామరాజుకు చెప్తుంది వల్లి.
నర్మదకు డౌట్
మీ అమ్మ వాళ్లింటికి వెళ్లాలి కానీ ఇక్కడికి రావడం ఏంటీ అని నర్మద ప్రశ్నిస్తుంది. తను ఇక్కడికి రావడానికి ఏదో కారణం ఉంటుందని తిరుపతి మురిసిపోతాడు. మా వల్లి నెల తప్పింది కదండి. దగ్గరుండి చూసుకోమ్మని భాగ్యం అత్త నన్ను ఇక్కడికి పంపించింది ఆయ్ అని సుక్కు చెప్తుంది. మేముండగా నిన్ను ఎందుకు పంపించిందని వేదవతి అడుగుతుంది.
నలుగురు దగ్గరుండి చూసుకుంటే బాగుంటుందని సుకన్య చెప్తుంది. పిన్ని, బాబాయ్ బ్లెస్సింగ్ చేయండని రామరాజు, వేదవతి కాళ్లపై సుకన్య పడుతుంది. సుకన్య వాలకంపై ధీరజ్, నర్మదకు అనుమానం వస్తుంది.
భద్రావతి గొడవ
ఆ సమయంలోనే ప్రేమను లాక్కొచ్చిన భద్రావతి, సేనాపతి కలిసి రేయ్ రామరాజు రారా బయటకు అని గట్టిగా అరుస్తారు. అందరూ బయటకు వస్తారు. భద్రావతి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మా ఇంటికి వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నావని రామరాజు అడుగుతాడు. మీ చిన్న కొడుకు నా కోడలిని నగలు తాకట్టు పెట్టమని బ్యాంకుకు పంపించాడని భద్రావతి చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.
ఏం తెలియదన్న ధీరజ్
చిన్నోడా ఏంట్రా ఇది, నగలు తాకట్టు పెట్టమని ప్రేమను బ్యాంకుకు పంపడం ఏంటని రామరాజు అడుగుతాడు. నగల విషయం గురించి నాకేమీ తెలియదు నాన్న అని ధీరజ్ చెప్తాడు. తండ్రికొడుకులు కలిసి అమాయకుల్లా ఏం జీవిస్తున్నారు? నా మేనకోడలు నగలు తాకట్టు పెట్టేందుకు వెళ్లిన విషయం నీకు తెలియదా? ఏరా నీకు తెలియకుండానే నీ రెండో కోడలు ఆ రోజు నగలు తాకట్టు పెట్టిందా? ఈ రోజు తెలియకుండానే చిన్న కోడలు వెళ్లిందా? అని భద్రావతి నానామాటలు అంటుంది.
దరిద్రపు పెంపకం
దీన్ని బట్టే అర్థమవుతుంది మీ దరిద్రపు దిక్కుమాలిన పెంపకం అని భద్రావతి అంటుంది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు భద్రావతి. మా పిల్లలను వేలు చూపించే అర్హత నీకు లేదు. ఇంకోసారి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదని వేదవతి వార్నింగ్ ఇస్తుంది. నీ బతుకే చెత్త బతుకు అనుకున్నా, నీ కొడుకుల బతుకు కూడా అలాగే ఏడ్చిందని రామరాజును సేనాపతి అంటాడు. సేనాపతి ఇంకో మాట తప్పుగా మాట్లాడితే ఇక్కడికిక్కడే నరికేస్తానని ధీరజ్ ఫైర్ అవుతాడు.
ఆ నగల గురించి ధీరజ్ కు తెలియదని ప్రేమ చెప్తుంది. నా భర్తకు అండగా నిలబడటం కోసం నేనే బ్యాంకుకు వెళ్లా. నగలు తీసుకోమ్మంటే వద్దని చెప్పాడు. నగలు మీకు ఇచ్చేయమని చాలా సార్లు చెప్పాడు. ఒక్క మాట అనే ముందు పూర్తిగా తెలుసుకోండని ప్రేమ చెప్తుంది. నగల మీద ఆశ లేదని నమ్మించడం కోసమే అలా చెప్పాడని భద్రావతి అంటుంది.
వాళ్లు ఏమైనా చేసుకుంటారు
అవి నా మనవరాలి కోసం చేయించిన నగలు. దానిపై నా మనవడికి పూర్తి హక్కు ఉంటుంది. తాకట్టు పెట్టుకుంటారా లేదా అమ్ముకుంటారా? అది వాళ్ల ఇష్టం. వాటి కోసం గొడవ పెట్టుకోవడం ఏంటీ? బుద్ధి లేకుండా అని శారదాంబ గట్టిగా చెప్తుంది. ప్రేమను కళ్లలో పెట్టి చూసుకునే భర్త దొరికాడు. కన్న కూతురిలా చూసుకునే కుటుంబం ఉందని రేవతి కూడా చెప్తుంది.
ఆస్తి కోసమే వాడు ట్రాప్ చేశాడు. నగల కోసమే మేనకోడలిని లేపుకొని వెళ్లాడు. నగలమ్ముకుని బతకాలనుకుంటున్నాడని భద్రావతి అంటుంది. ధీరజ్ గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే మేనత్త అని కూడా చూడను. అసలు మా పెళ్లి ఎలా జరిగిందో మీకు తెలుసా? ఆ రోజు నేను చావాలో, బతకాలో అర్థం కాని అని ప్రేమ చెప్తుంటే ధీరజ్ ఆపాలని చూస్తాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


