ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 23 ఎపిసోడ్: గీత దాటిన ప్రేమ, శ్రీవల్లి ఫిటింగ్- నర్మదను రాక్షసి అన్న ధీరజ్- సాగర్‌కు భార్య షాక్

Illu Illalu Pillalu Serial May 23rd Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మే 23వ ఎపిసోడ్‌లో ఇల్లు రెండు ముక్కలు అయినందుకు రామరాజు కన్నీళ్లతో కుమిలిపోతాడు. మరుసటి రోజు ఉదయం వేదవతి, నర్మద గొడవ పడతారు. ప్రేమ గీత దాటి నర్మదను హత్తుకుంటుంది. అది చూసిన శ్రీవల్లి పెద్ద ఫిట్టింగ్ పెడుతుంది.

Published on: May 23, 2026, 08:49:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో రామరాజు కుటుంబం రెండుగా చీలిపోయినందుకు శ్రీవల్లి తెగ సంబరపడిపోతుంది. తను చేసిన పనికి పాలాభిషేకం వంటివి చేయొద్దని సుకన్య అంటుంది. దాంతో సుకన్య చేయి విరుస్తుంది భాగ్యం. నేను నర్మదను బయటకు పంపించేందుకు ప్లాన్ వేస్తే ఇది చెడగొట్టిందని భాగ్యం అంటుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మే 23వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మే 23వ ఎపిసోడ్

నర్మద కంట్లోంచి కన్నీళ్లే

నువ్వు పాత పద్ధతిలో ప్లానింగ్ చేస్తున్నావ్. మేము యూత్ కాబట్టి ట్రెండింగ్ తగినట్లు ప్లాన్ చేస్తాం. ఇప్పుడు నర్మదను వేరు కాపురం పెట్టించడం కూడా అలాంటి ప్లానింగే. ఇకనుంచి నర్మదకు కంట్లోంచి కన్నీళ్లు తప్పా నోట్లోంచి మాట కూడా బయటకు రాదు అని శ్రీవల్లి అంటుంది.

తర్వాత రాత్రి ఇంట్లో గీసిన గీతను చూసి కుమిలిపోతాడు రామరాజు. కిందపడిన బొమ్మలను చూస్తూ బాధపడుతాడు. వాటిని చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తాడు రామరాజు. అంతలో వేదవతి వచ్చి అడుగుతుంది. బాధను తట్టుకోలేకపోతున్నానని రామరాజు అంటాడు. ఈ బొమ్మల్లాగే నా కుటుంబం కూడా చెల్లాచెదురు అవుతుందని భయంగా ఉందని, ఆ గీత నా ఇంటినే కాదు నా గుండెను కూడా ముక్కలు చేసిందని రామరాజు అంటాడు.

నేను బతికి ఉండగానే నా కొడుకు నన్ను చంపేస్తాడని అనుకోలేదని బాధపడుతాడు రామరాజు. అవన్ని పాలపొంగులండి. త్వరలోనే కోపాలు పోతాయని వేదవతి ఓదారుస్తుంది. మీ అక్క వాళ్లు అన్నట్లుగా నేను ఎక్కడ అనాథగా చస్తానేమో అని భయంగా ఉందని రామరాజు అంటుంటే.. నోరు మూస్తుంది వేదవతి. మీరు చేసిన కష్టం పిల్లలకు తెలియదా. ఆ భగవంతుడు మన కష్టాలను దూరం చేస్తాడని వేదవతి అంటుంది.

చీకటి కమ్ముకున్న గుడిలా

జరిగిన దాని గురించి ప్రేమ, ధీరజ్ మాట్లాడుకుంటారు. సంతోషంగా ఉన్న ఈ ఇల్లు చీకటి కమ్ముకున్న గుడిలా అయిపోయిందిరా అని ప్రేమ అంటుంది. ఆ గీతనే కాదు మనుషుల మధ్య ఏర్పడిన అగాధలను దూరం చేస్తాను. అందరు కలిసేలా చేస్తానని ధీరజ్ అంటాడు. మరోవైపు అది అసాధ్యం, ఈ ఇంట్లో ఆ పెద్ద మనిషితో కలిసి ఉండటం చచ్చిన జరగదు అని సాగర్ అంటుంటాడు.

చెంప పగులగొట్టాలన్నంత కోపం వస్తుంది. కానీ, తాళి కట్టిన మొగుడు అని ఒక్క కారణంతో ఆగుతున్నాను. నీ మూర్ఖత్వానికి అంతలా కోపం వస్తుందని నర్మద అంటుంది. ఈ ఇంటితో ఎలాంటి బంధం అవసరం లేదని, దూరంగా సంతోషంగా బతుకుతానని సాగర్ అంటాడు. నువ్వు సంతోషం నుంచి నరకంలోకి అడుగు పెట్టాలని చూస్తున్నావ్, అంత మంచి వాళ్లకు నువ్వెలా పుట్టావ్ సాగర్ అని నర్మద అంటుంది.

అమూల్య పెళ్లి కాగానే ఆస్తి తీసుకుని ఈ ఇంట్లోంచి వెళ్లిపోతున్నాం. అందుకు సిద్ధంగా ఉండు అని సాగర్ తెగేసి చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు విశ్వక్ మందు తాగుతూ సంతోషంగా ఉంటాడు. అమూల్య ఈరోజు కాలేజ్‌లో ఇచ్చిన ట్రీట్‌మెంట్ ఎలా ఉంది. దిమ్మతిరిగింది కదా, కాలేజీలో జరిగిన అవమానానికి బయటకు రాలేవు, కాలేజీకి వెళ్లలేవు. నీ బతుకు మీద కొట్టి నీ జీవితాన్ని నాశనం చేయకుంటే నా పేరు విశ్వనే కాదు అని అనుకుంటాడు.

కొడుకును మార్చేసిన నర్మద

ఈ విషయం ఇంట్లో చెబితే ఆ విశ్వగాన్ని చంపిన చంపుతారు అని అమూల్య భయపడుతుంది. మరుసటి రోజు ఉదయం గీతకు అటు ఇటు వేదవతి, నర్మద మాట్లాడుకుంటారు. రామరాజు, సాగర్ మొండితనం గురించి మాట్లాడుకుంటారు. నా కొడుకును నువ్వే మార్చేశావని నర్మదను అంటుంది వేదవతి. అత్తా కోడలు వేదవతి, నర్మద గొడవ పెట్టుకుంటారు. ధీరజ్ వచ్చి యుద్ధానికి శాంతి పలకండని అంటాడు.

తర్వాత ప్రేమ గీత దాటి వచ్చి నర్మదను హగ్ చేసుకుంటుంది. వాళ్లకు ధీరజ్ కాఫీ ఇస్తాడు. నర్మద, ప్రేమ, ధీరజ్, వేదవతి సంతోషంగా మాట్లాడుకోవడం శ్రీవల్లి చూస్తుంది. ప్రేమ గీత దాటింది చూసి పెట్రోల్ పోసి అంటిస్తానని అంటుంది. ప్రేమ అని గట్టిగా అరుస్తుంది శ్రీవల్లి. గీత దాటిందని, నర్మదతో మాట్లాడింది సాగర్ చూస్తే మావయ్య మీదకు బుసలు కొడతారు అని శ్రీవల్లి అంటుంది.

నీ చిన్నకోడలు గీత దాటి వస్తే ఏం చేస్తున్నావని తండ్రిని సాగర్ నిలదీస్తే పరువు ఇంకా పోదు అని శ్రీవల్లి ఫిటింగ్ పెడుతుంది. అదంతా రామరాజు వెంటాడు. చిన్న విషయాన్ని పెద్దగా చూస్తున్నావని వేదవతి తిడుతుంది. బుజ్జమ్మ ఏంటీ చిన్న విషయం. వాడు నిన్ననే చెప్పాడుగా. వాళ్లవైపు ఎవరు వెళ్లద్దని అన్నాడుగా. ఇప్పుడు వెళితే మనకు సిగ్గు లేదనడా. మీరు చేసిన తప్పుకు నేను మాటలు పడాలా. చూడు ప్రేమ ఇంకోసారి అటు వెళ్తే అస్సలు బాగోదు చెపుతున్నాను. రేయ్ నీ పెళ్లానికి చెప్పు అని రామరాజు అంటాడు.

శ్రీవల్లి ప్లాన్ సక్సెస్

ధీరజ్ రమ్మని సైగ చేయడంతో ప్రేమ గీత దాటి ఇటువైపు వస్తుంది. తనే కాదు ఎవరు కూడా గీత దాటి వెళ్తే నోటితో సమాధానం చెప్పను. ఇంకోలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు రామరాజు. దాంతో ప్లాన్ సక్సెస్ అయిందని శ్రీవల్లి, సుకన్య హైఫై ఇచ్చుకుని సంతోషిస్తారు. అది నర్మద చూస్తుంది. వల్లి ఇదంతా మీరు కావాలనే చేస్తున్నారు నాకు డౌట్‌గా ఉంది. అది కన్ఫర్మ్ కావాలి అప్పుడు నీ సంగతి చెబుతా అని నర్మద వార్నింగ్ ఇస్తుంది.

జాగ్రత్త వదినా. నర్మద వదిన ఎంత మంచిదో అంత రాక్షసి. తేడా వస్తే తాట తీస్తుందని, పరిస్థితి అంత వరకు తెచ్చుకోకే జాగ్రత్త అని ధీరజ్ వల్లికి కౌంటర్ ఇస్తాడు. దాంతో సుకన్య, శ్రీవల్లి భయపడిపోతారు. భయంతో కాదు అన్నట్లుగా సైగ చేస్తుంది శ్రీవల్లి. తర్వాత సాగర్ పిలుస్తే నర్మద వెళ్తుంది.

టిఫిన్ ఏం చేశావని సాగర్ అడిగితే.. జీడిపప్పు ఉప్మా అని టిఫిన్ బాక్సా ఇస్తుంది నర్మద. వావ్ అని సాగర్ ఓపెన్ చేస్తే టిఫిన్ బాక్స్ ఖాళీగా ఉంటుంది. అది చూసి సాగర్ షాక్ అవుతాడు. అలా సాగర్‌కు భార్య నర్మద షాక్ ఇస్తుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More