ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 19 ఎపిసోడ్: తండ్రిపై డబ్బులు విసిరికొట్టిన సాగర్- చెంప చెళ్లుమనిపించిన వేదవతి-భాగ్యం ట్విస్ట్

ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 19 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 19 ఎపిసోడ్ లో శ్రీవల్లికి చెకప్ చేయించేందుకు నర్మద తీసుకెళ్తుంటే భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ఎంట్రీ ఇస్తారు. ఆవేశంతో వచ్చిన సాగర్ తన తండ్రి మీదకు రూ.5 లక్షలు విసిరికొడతాడు.

Published on: May 19, 2026, 07:39:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 19 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 19 ఎపిసోడ్ లో.. మరో హాస్పిటల్ లో శ్రీవల్లికి చెకప్ చేయించాలని నర్మద షాక్ ఇస్తుంది. వేదవతి, రామరాజు కూడా అదే మాట చెప్పేసరికి శ్రీవల్లి ఒప్పుకొంటుంది. రెడీ అవుతానని లోపలికి వెళ్తుంది. బొమ్మల కొలువులా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని రామరాజు వేదవతితో అంటాడు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

రోడ్డు పక్కన కారుతో

మరోవైపు క్యాబ్ యాప్ లో వెహికల్ రిజిస్టర్ కావడానికి 48 గంటలు పడుతుంది. ట్రావెల్ గ్రూప్ లో కారు ఉందని మెసేజ్ చేశా. చూద్దాం ఎవరైనా వస్తారేమోనని రోడ్డు పక్కన కారు పెట్టుకుని ధీరజ్, ప్రేమ వెయిట్ చేస్తుంటారు. అప్పుడే చేతిలో కవర్లతో భర్త భాస్కర్ ను ఎండలో నడిపిస్తుంది కామాక్షి.. ధీరజ్ ను చూస్తుంది.

డ్రాప్ చేయమన్న కామాక్షి

ఏరా చిన్నోడా, కారు కొన్నావంటా కదా. నన్ను పిలిచి పూజ చేయించుకోవచ్చు కదా. కొత్త కారు కొన్నప్పుడు అక్కకు పట్టు చీర కొనాలి తెలియదా అని ధీరజ్ ను కామాక్షి అడుగుతుంది. మొన్న మంట పెట్టారు కదా అని ప్రేమ దెబ్బిపొడిచేలా అంటుంది. మీ బావకు మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. సరుకులు మోయలేకపోతున్నారు. మమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టరా అని ధీరజ్ ను కామాక్షి అడుగుతుంది.

కారు కొనుక్కున్నది ట్రావెల్స్ లో పెట్టడానికి అక్కను, చెల్లిని దించడానికి కాదని ధీరజ్ అంటాడు. కానీ ప్రేమ మాత్రం ధీరజ్ ను తిట్టి కామాక్షి, భాస్కర్ ను కార్లో ఎక్కమంటుంది.

శ్రీవల్లి టెన్షన్

సీన్ కట్ చేస్తే శ్రీవల్లి తల పట్టుకుని ఆలోచిస్తుంటుంది. సుక్కుపై మండిపడుతుంది. ఆ నర్మద నన్ను హాస్పిటల్ కు తీసుకెళ్తానంటుంది. నా కడుపు అబద్ధమని తెలిస్తే నా పరిస్థితి ఏంటే? మా అమ్మకు ఫోన్ కూడా కలవడం లేదని వల్లి టెన్షన్ పడుతుంది. అప్పుడే నర్మద వచ్చి వల్లి అక్కా అని పిలుస్తుంది. చీర కట్టుకుంటున్న చెల్లాయ్ అని వల్లి చెప్తుంది. నర్మద గట్టిగా పిలిచేసరికి వల్లి బయటకు వస్తుంది.

రూ.5 వేలు

మరోవైపు కామాక్షి, భాస్కర్ ను కార్లో ఇంటి దగ్గర దించుతారు. కార్లో వచ్చినందుకు డబ్బులు ఇవ్వాలని ప్రేమ అడుగుతుంది. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తే డబ్బులు కడతాం కదా, ఇది అంతేనని ప్రేమ అంటుంది. రక్తం పంచుకుని పుట్టిన అక్కను ఏ తమ్ముడైనా డబ్బులు అడుగుతాడా? అని కామాక్షి అడుగుతుంది. ఏ అక్క అయినా తమ్ముడు కారు కొనుక్కుంటానంటే ష్యూరిటీ సంతకాలు పెట్టమన్నందుకు బీభత్సం చేస్తుందా అని ప్రేమ కౌంటర్ వేస్తుంది.

భాస్కర్ చేతుల్లో నుంచి రూ.5 వేలు తీసుకుంటుంది ప్రేమ. తమ్ముడి కారు ఎక్కి బోణీ చేసిన అక్క ఆ మాత్రం ఇవ్వలేదా? అని ప్రేమ, ధీరజ్ వెళ్లిపోతారు.

భాగ్యం ఎంట్రీ

వల్లిని నర్మద హాస్పిటల్ తీసుకెళ్తుంటే అమ్మడు అంటూ భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ఎంట్రీ ఇస్తారు. దీంతో వల్లి రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. ఆడపిల్లకు మొదటి కాన్పు పుట్టింటోళ్లు చేయాలి అంటారు కదా. మా అమ్మడిని హాస్పిటల్ కు మేమే తీసుకెళ్తామని భాగ్యం ట్విస్ట్ ఇస్తుంది. కానీ నర్మద వదలదు. ఏదో దిక్కుమాలిన హాస్పిటల్లో చూపిస్తారని, మేమే తీసుకెళ్తామని నర్మద అంటుంది. వేదవతి కూడా అదే మాట చెప్తుంది.

డబ్బులు విసిరికొట్టిన సాగర్

అప్పుడే రామరాజు గారు అంటూ సాగర్ ఆవేశంతో ఊగిపోతూ వస్తాడు. కన్నతండ్రిని పేరు పెట్టి పిలుస్తావేంట్రా అని వేదవతి అడుగుతుంది. రామరాజు బయటకు వస్తాడు. తండ్రి మీద రూ.5 లక్షలను విసిరి కొడతాడు సాగర్. దీంతో సాగర్ చెంప చెళ్లుమనిపిస్తుంది వేదవతి. మీ నాన్న మీదే డబ్బులు విసిరికొట్టేంత పెద్దోడివి అయిపోయావా? అని అడుగుతుంది.

తండ్రికి ఈగో

నిన్ను ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపడం కోసమే డబ్బులు కట్టమన్నారని వేదవతి చెప్తుంది. కన్నకొడుకు కలిసి ఉండాలనే ప్రేమ ఆయనకు ఉంటే నన్ను హింసించడు. ఆయనకు ఈగో. రైస్ మిల్ లో పనిచేయకుండా జాబ్ చేస్తున్నానని తట్టుకోలేకపోతున్నాడు. మీ ఆయన దేవుడు అని చెప్పడం ఆపుతావా అమ్మా అని సాగర్ అంటాడు.

నర్మద చేయి పట్టుకుని

నాన్న దేవుడు అని చందు కూడా అంటాడు. నువ్వు ఆయన ముద్దుల కొడుకువి. నాకు దేవుడు కాదు శత్రువులా పొడుచుకు తింటున్నారని సాగర్ అంటాడు. మనుషులను ప్రశాంతంగా బతకనివ్వవా? అని నర్మద గట్టిగానే అడుగుతుంది. డబ్బులిచ్చి ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానని చెప్తున్నా. నోర్మూసుకుని పదా అని నర్మద చేయి పట్టుకుంటాడు సాగర్. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More