ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 28 ఎపిసోడ్: నన్ను చంపేదాకా ప్రశాంతంగా ఉండరా?..తల్లిని ఏడిపించిన సాగర్.. ఊహించని షాకిచ్చిన నర్మద
ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 28 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 28 ఎపిసోడ్ లో నర్మద డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి ఫుల్ గా లాగించేస్తుంది. ఇలాగే ఉంటానని చెప్తుంది. కొడుకు ఆకలి చూడలేక అన్నం తీసుకొచ్చిన వేదవతిని సాగర్ నానామాటలు అంటాడు. తల్లి ప్రేమ డ్రామా అని అమ్మను ఏడిపిస్తాడు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 28 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 28 ఎపిసోడ్ లో.. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని సాగర్ రాగానే నర్మద అడుగుతుంది. ఖాళీ చేతులతో వచ్చావేంటీ? ఫుడ్ ఎక్కడ? నువ్వు తింటే సరిపోతుందా? ఇంట్లో ఉన్న పెళ్లాం సంగతి పట్టించుకోవా? అని గ్యాప్ ఇవ్వకుండా నర్మద అడిగేస్తుంది.

నర్మద కోపం
నేను బయటేం తింటాను? నువ్వేం వండలేదా? అని నర్మదనే తిరిగి అడుగుతాడు సాగర్. మనం వేరే కాపురం పెట్టాం. నువ్వు ఏం సరుకులు తెచ్చావని వండి పెట్టడానికి? ఇలాగేనా భార్యను చూసుకునేది? పెళ్లాం తినడానికి ఏదైనా ఉందో లేదో తెలీదు అని నర్మద మండిపడుతుంది. ఫుడ్ ఆర్డర్ పెడతానని సాగర్ అంటే, అవసరం లేదని నర్మద లోపలికి వెళ్లిపోతుంది.
లాగించేసిన కోడలు
విసుగ్గా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చిన నర్మద ప్లేట్ ఇవ్వమని అడుగుతుంది. అన్నం, కూరలను పెట్టమని స్పెషల్ గా చెప్పాలా? అని అత్తను గద్దిస్తుంది. ప్లేట్ తీసుకుని ఆవురావురుమని నర్మద తింటుంది. వంకాయ కర్రీ అదిరిపోయిందని అంటుంది. డైనింగ్ టేబుల్ మీద ఉన్న రామరాజు సైలెంట్ గా ఉంటాడు. పచ్చడి, ఫ్రై అంటూ ధీరజ్, ప్రేమ కలిసి నర్మదకు వడ్డిస్తారు.
అందరూ కావాలని
భోజనం కంప్లీట్ చేస్తుంది నర్మద. మామయ్య.. మీకు, మీ కొడుక్కి గొడవలు ఉండొచ్చు కానీ నాకు కాదు. నేను ఇలాగే ఉంటా. నాకు అందరూ కావాలని రామరాజుతో నర్మద చెప్తుంది. వద్దని తెంచేసుకుని వెళ్లింది నీ మొగుడే కానీ మేం కాదమ్మా అని రామరాజు అంటాడు. ఇదంతా దూరం నుంచి సాగర్ చూస్తుంటాడు. నర్మద నువ్వు ఏం చేశావ్? అని సాగర్ అడుగుతాడు.
వేరు కాపురం అన్నాయ్.. అమ్మ చేతి వంట మిస్ అయ్యావని ఫీల్ అవుతున్నావా? నాన్న కాళ్ల మీద పడి క్షమించమని అడుగు. అప్పుడు అందరం కలిసి తినొచ్చని ధీరజ్ అంటాడు. క్షమాపణ అడగడం నా గొంతులో ప్రాణం ఉండగా జరగదని సాగర్ లోపలికి వెళ్లిపోతాడు.
అమ్మపై సాగర్ కోపం
సీన్ కట్ చేస్తే సాగర్ కోసం వేదవతి భోజనం ప్లేట్ తీసుకొని వస్తుంది. ఆకలికి ఓర్చుకోలేక పోతున్నావ్ కదా తినమని అడుగుతుంది. ఏంటమ్మా ఈ డ్రామాలు అని సాగర్ తల్లిని బాధపెడతాడు. ఈ అమ్మ ప్రేమ నీకు డ్రామాలా కనిపిస్తుందా? నా కొడుకు పస్తులున్నాడని ఈ కన్న పేగు తల్లడిల్లడం నీకు నాటకంలా అనిపిస్తుందా? అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
నన్ను చంపేదాకా
ఇదే ప్రేమ ఇంతకుముందు ఏమైందమ్మా? నడిపోడా అన్నం తినురా అని ఈ ప్లేట్ ఎందుకు ఇవ్వలేదని సాగర్ అడుగుతాడు. అక్కడ మీ నాన్న ఉన్నాడని వేదవతి చెప్తుంది. నాన్నకు భయపడుతూ, దొంగచాటుగా నాపై చూపించే ప్రేమ అవసరం లేదు. నువ్వు మీ ఆయన వైపే ఉండు. మీ ఆయన లాగే నన్ను ద్వేషిస్తూ ఉండు. నేను మిమ్మల్ని వదిలేశా. నువ్వు, మీ ఆయన కలిసి నన్ను చంపేదాకా ప్రశాంతంగా ఉండేలా లేరని సాగర్ కఠినంగా మాట్లాడతాడు.
వేదవతి కన్నీళ్లు
వేదవతి లోపలికి వెళ్లి ఏడుస్తూ బెడ్ పై కూర్చుంటుంది. కడుపు నిండిందా? నీ కొడుకు మాటలకు కడుపు నిండిందా? అన్నం పెట్టి కొడుకు కడుపు నింపుదామని వెళ్లావ్. కానీ వాడు మాటలతో నీ మనసు నిండా బాధ నింపి పంపించాడని రామరాజు అంటాడు. నా ప్రేమ డ్రామా అని వాడు అనగానే ప్రాణం పోయినట్లు అయిందని వేదవతి వెక్కి వెక్కి ఏడుస్తుంది.
ప్రేమతో రొమాన్స్
ఉదయం ప్రేమ బట్టలు ఉతుకుతుంది. అది చూసి ధీరజ్ ఆడుకుందామని అనుకుంటాడు. నువ్వు బట్టలు ఉతుకుతున్నావా ప్రేమ? నేను ఉండగా నువ్వు కష్టపడటం ఏంటీ? అని అడుగుతాడు. భార్యకు సాయం చేసే వంకతో దగ్గరకు లాక్కుంటాడు. ప్రేమ ముద్దు పెట్టాలని చూస్తే ధీరజ్ నెట్టేస్తాడు. అమాయకుడిని డిస్టబ్ చేయడం కరెక్ట్ కాదంటాడు. కానీ ప్రేమను మళ్లీ లాక్కుంటాడు.
ప్రేమకు ముద్దు పెట్టేందుకు ముఖాన్ని దగ్గరకు తీసుకెళ్లి, మళ్లీ దూరం నెట్టేస్తాడు. పసి మనసులో లేని పోని ఆలోచనలు రేపుతున్నావని అంటాడు. నువ్వు సాయం చేసేందుకు రాలేదు, రొమాన్స్ చేయడానికి వచ్చావని ధీరజ్ ను కొట్టేందుకు ప్రేమ వెనకాల పడుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


