ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 26 ఎపిసోడ్:వికెట్లతో విశ్వక్ బ్యాచ్‌ను చితక్కొట్టిన అత్తాకోడళ్లు-వల్లి డ్రామా-రామరాజు వార్నింగ్

ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 26 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 26 ఎపిసోడ్ లో అమూల్యను ఏడిపిస్తున్న విశ్వక్ బ్యాచ్ ను వేదవతి, ప్రేమ, నర్మద చితక్కొడతారు. ధీరజ్ పై భద్రావతి రగిలిపోతుంటుంది. మరోవైపు వల్లిని హాస్పిటల్ తీసుకెళ్దామని ప్రేమ, నర్మద అంటారు. వీళ్లపై రామరాజు సీరియస్ అవుతాడు. 

Published on: May 26, 2026, 08:10:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 26 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 26 ఎపిసోడ్ లో.. తన ఫ్రెండ్స్ తో ఏడిపించినా కూడా అమూల్య కాలేజీకి రావడం చూసి విశ్వక్ షాక్ అవుతాడు. దానిలో ధైర్యం చాలా ఉందని అర్థమవుతుంది. ఆ ధైర్యాన్ని చంపేయండి. వేరే రేంజ్ లో దాన్ని హింసించండని ఫ్రెండ్స్ కు చెప్పి పంపిస్తాడు విశ్వక్.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

బాదేసిన అత్తాకోడళ్లు

విశ్వక్ ఫ్రెండ్స్ వెళ్లి అమూల్యతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారు. రూమ్ ఎక్కడ బుక్ చేయమంటావ్ అంటూ అసభ్యంగా మాట్లాడతారు. నేను మీకు బుక్ చేస్తారా ఐసీయూలో అని ధీరజ్ కోపంతో ఎంట్రీ ఇస్తాడు. మిమ్మల్ని ఆడ లేడీస్ తో కొట్టిస్తానని ధీరజ్ విజిల్ వేస్తాడు. కొబ్బరి బోండం తాగుతూ కళ్లద్దాలతో ప్రేమ, నర్మద, వేదవతి స్టైల్ గా ఎంట్రీ ఇస్తారు. వికెట్లతో విశ్వక్ బ్యాచ్ ను చితక్కొడతారు.

విశ్వక్ ను కొట్టిన ధీరజ్

మరోవైపు పారిపోతున్న విశ్వను ధీరజ్ పట్టుకుని కొడతాడు. విశ్వక్ తప్పించుకొని పారిపోతాడు. పోకిరీ గ్యాంగ్ ను వేదవతి, ప్రేమ, నర్మద కలిసి బాదేస్తారు. ఇక ప్రాబ్లెం సాల్వ్, హ్యాపీగా కాలేజీకి వెళ్లొచ్చని అమూల్యకు ధీరజ్ చెప్తాడు. చిన్న కొడుకును వేదవతి తెగ పొగిడేస్తుంది.

విశ్వక్ అబద్ధం

సీన్ భద్రావతి ఇంటికి మారుతుంది. ధీరజ్ నన్ను అన్యాయంగా కొట్టాడని విశ్వక్ తెగ నటించేస్తాడు. ముందు వీడు ఏం చేశాడో అడుగు? ఆ ధీరజ్ అన్యాయంగా ఎవరి జోలికి వెళ్లడని శారదాంబ అంటుంది. నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ కూర్చుంటే ధీరజ్ వచ్చి కొట్టాడని విశ్వక్ అబద్ధం చెప్తాడు. ధీరజ్ కూడా నా మనవడే. వాడు తప్పు చేయడని శారదాంబ గట్టిగానే చెప్తుంది.

భద్రావతి సీరియస్

ధీరజ్ చాలా ఎక్కువ చేస్తున్నాడక్కా. వాడిని ఏదో ఒకటి చేయాలక్కా అని సేనాపతి ఊగిపోతాడు. వాడికి కారు ఎలా వచ్చిందో కనుక్కోమన్నా కదా అని భద్రావతి అడుగుతుంది. ఫైనాన్స్ ఇచ్చిన దండపాణి మనకు చాలా కావాల్సినవాడని సేనాపతి చెప్తాడు. అక్కడి నుంచి నరుక్కొస్తే వాడి కుటుంబం మొత్తం నడిరోడ్డుపై ఉంటుందని భద్రావతి సీరియస్ గా చెప్తుంది.

వల్లి షాక్

మరోవైపు ఇంట్లో గీత గీసింది నేనే అంటూ సుక్కుతో కలిసి శ్రీవల్లి గెంతులు వేస్తుంది. అప్పుడే ప్రేమ, నర్మద రావడంతో ఈ పాపిష్టి చేతులతో గీత గీశానని వల్లి డ్రామా స్టార్ట్ చేస్తుంది. నువ్వసలు నిజంగా ప్రెగ్నెంట్ వేనా? అని ప్రేమ అడగడంతో వల్లి షాక్ అవుతుంది. కడుపుతో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ నువ్వు మాత్రం కల్లు తాగిన కోతిలా గెంతులేస్తున్నావని నర్మద అనుమానంతో అడుగుతుంది.

హాస్పిటల్ కు వెళ్దామని

కడుపులో బిడ్డ యాక్టివ్ గా ఉండాలంటే ఎక్సర్ సైజ్ లు చేయాలని డాక్టరమ్మా చెప్పిందని సుక్కు కవర్ చేస్తుంది. ఇలా పిచ్చిపట్టినట్లు ఎగరడం ఎక్సర్ సైజ్ కాదని ప్రేమ అంటుంది. డాక్టర్ కంటే ఎక్కువ తెలుసా? అని సుక్కు అడగడంతో ఇప్పుడు హాస్పిటల్ కు వెళ్దాం పదా బల్లక్కాయ్ అని నర్మద, ప్రేమ అనడంతో వల్లి షాక్ అవుతుంది.

వన్ సెకండ్ అని సుక్కు లోపలికి వెళ్లి ట్యాబ్లెట్స్ తో బయటకు వస్తుంది. ఆల్రెడీ హాస్పిటల్ కు తీసుకెళ్లా. ట్యాబ్లెట్స్ రాసి ఇచ్చారని సుక్కు చెప్తుంది. మరి ఆ విషయం వల్లి చెప్పాలి కదా, కానీ ఎందుకు సైలెంట్ గా ఉందని నర్మద అడుగుతుంది. సుక్కు ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. ఈ ట్యాబ్లెట్స్ ఏంటి ఇన్ని ఉన్నాయి? పదండి హాస్పిటల్ కు వెళ్దాం అని వల్లిని ప్రేమ, నర్మద లాక్కొని వెళ్తారు.

వల్లి డ్రామా

అప్పుడే రామరాజును చూసిన వల్లి కళ్లు తిరిగి పడిపోయినట్లు డ్రామా చేస్తుంది. రామరాజు కంగారుగా వస్తాడు. వల్లి కడుపుతో ఉందని తెలిసినా ఈ ఇద్దరు ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారని సుక్కు చెప్తుంది. ముఖంపై నీళ్లు చల్లితే వల్లి లేస్తుంది. అసలే టెన్షన్ లో ఉన్న వల్లిని వీళ్లు ఇంకా బాధపెడుతున్నారని సుక్కు చెప్తుంది.

కడుపుతో ఉన్నవాళ్లకు ఇన్ని ట్యాబ్లెట్స్ రాయరు కదా. అందుకే మంచి హాస్పిటల్ కు తీసుకెళ్లాలని అనుకున్నామని ప్రేమ, నర్మద చెప్తారు. కోడలిని ఎలా చూసుకోవాలో అత్తమామకు తెలియదా? మీరేమైనా ఇద్దరు ముగ్గురు పిల్లలను కన్నారా? అని రామరాజును రెచ్చగొట్టేలా సుక్కు మాట్లాడుతుంది.

నర్మదపై ఫైర్

గీత బయట ఉన్న నీకు మా ఇంటి విషయాలు అనవసరం. మీ నాన్న రావడం వల్లే గొడవ జరిగింది. నీకు తెలియకుండా ఉంటుందా? అని నర్మదపై రామరాజు ఫైర్ అవుతాడు. వల్లిని ఇంకోసారి ఇబ్బంది పెడితే బాగోదని కోడళ్లకు రామరాజు వార్నింగ్ ఇస్తాడు.

కట్ చేస్తే ధీరజ్ ను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ప్రేమ. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More