ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 15 ఎపిసోడ్: ధీరజ్ కొత్త కారు- బెయిల్ పై విశ్వ ఎంట్రీ- ధీరజ్, అమూల్యపై పగ తీర్చుకుంటానంటూ
ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 15 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 15 ఎపిసోడ్ లో ధీరజ్ కొత్త కారు డెలివరీ అవుతుంది. కారును చూసి వేదవతి మురిసిపోతుంది. అదే సమయంంలో విశ్వ బెయిల్ పై ఇంటికి వస్తాడు. భద్రావతి ఎగిరెగిరి పడుతుంది. వాళ్లకు ధీరజ్ దిమ్మతిరిగే కౌంటర్లు ఇస్తాడు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 15 ఎపిసోడ్ లో.. కొత్త కారు కొన్న ధీరజ్ అందరినీ సర్ ప్రైజ్ చేస్తాడు. కారును చూసి ధీరజ్ మురిసిపోతాడు. కారు చాలా బాగుందని వేదవతి, రామరాజు హ్యాపీగా ఫీల్ అవుతారు. గుడికి వెళ్దామని వేదవతి అంటే.. అమ్మనే పూజ చేయమంటాడు ధీరజ్.

సుక్కు బిల్డప్
డౌన్ పేమెంట్ కట్టకుండా నేరుగా ఈఎంఐలోనే కారు తీసుకున్నా. ఈఎంఐ కాస్త ఎక్కువ కట్టాలి. ఎక్కువ కష్టపడాలని రామరాజుకు చెప్తాడు ధీరజ్. సుక్కు ఏమో కారు ముందుకు వచ్చి వ్లాగ్ చేస్తుంది. సుక్కు అడుగుపెట్టిన వేళా విశేషం మా చిన్న బ్రో కారు కొన్నాడని సుక్కు బిల్డప్ ఇస్తుంది. కారుకు వేదవతి పూజ చేస్తుంది.
ఫీల్ అయిన ప్రేమ
ధీరజ్ కొనడం వెనుక నేనున్నాను కాబట్టి, పైగా వాడికి నేనంటే బోలెడు ప్రేమ కాబట్టి ఫస్ట్ కార్లో నన్నే ఎక్కించుకుని తీసుకెళ్తాడని నర్మదతో ప్రేమ చెప్తుంది. కానీ ధీరజ్ మాత్రం అమ్మానాన్నను ఫస్ట్ కార్లో కూర్చోమనడంతో ప్రేమ ఫీల్ అవుతుంది. చిన్నోడా కారు చాలా బాగుందరి అని వేదవతి తెగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎంతైనా అమ్మానాన్న ఫస్ట్ కదా ఫీల్ అవ్వకు అని ప్రేమకు నర్మద చెప్తుంది.
వేదవతి సెటైర్లు
చిన్నోడా కారు భలే ఉందిరా అని వేదవతి చెప్తుంది. కార్లో వెళ్తూ అందరికీ తన చిన్న కొడుకు కొత్త కారు కొన్నాడని, ట్రావెల్స్ పెడుతున్నాడని వేదవతి చెప్తుంది. నా చిన్న కొడుకు పనికి రాకుండా పోతాడని కొంతమంది అన్నారని రామరాజును ఉద్దేశించి వేదవతి సెటైర్లు వేస్తుంది. నేను కూడా పొంగిపోతున్నానని రామరాజు చెప్తాడు.
బెయిల్ మీద విశ్వ
ధీరజ్ కారు తిరిగి ఇంటికి వెళ్తుంది. అప్పుడే బ్యాండ్ మేళం ఇంటి ముందుకు వస్తుంది. విశ్వను తీసుకొని భద్రావతి, సేనాపతి ఎంట్రీ ఇస్తారు. అది చూసి అమూల్యతో సహా రామరాజు ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. నా మేనళ్లుడిని అరెస్టు చేయించి జైలుకు పంపించామని, జీవితంలో బెయిల్ రాదని చక్కలు గుద్దుకుని తొడలు కొట్టారు కదా అని భద్రావతి గట్టిగా మాట్లాడుతుంది.
ధీరజ్ కౌంటర్
లక్షలు పడేసి నా మేనళ్లుడిని బెయిల్ మీద తీసుకొచ్చాం. రేపు కోట్లు కూడా కుమ్మరించైనా సరే కేసు కొట్టి వేయిస్తానని భద్రావతి అంటుంది. నా పెళ్లాం మేనత్త, గాలికి ఎగిరిన పేపర్ లా ఎగిరిపడింది చాలు. మాటలను తగ్గించు. లేదనుకో నీ మేనళ్లుడితో పాటు నువ్వు, నీ తమ్ముడు నిమిషాల్లో పోలీస్ స్టేషన్లో ఉంటారు. భద్రావతి నువ్వు అరిచి ఆవేశంతో హార్ట్ ఎటాక్ తెచ్చుకున్నావంటే నా పెళ్లాం ఏడుస్తుంది. నా పెళ్లాం ఏడుస్తుంటే నేను చూడలేనని ధీరజ్ కౌంటర్లు వేస్తాడు.
పోలీసులకు చెప్పాననుకో
సేనాపతి మామ్స్ నీ బుర్రలో ఏం లేదు. నీ కొడుకు వచ్చింది బెయిల్ మీద మాత్రమే. ఇంటికి రాగానే మా మీద గొడవకు వచ్చారని పోలీసులకు ఫోన్ చేశాననుకో మీ ముగ్గురిని జైలుకు పంపిస్తారు. అప్పుడు ముగ్గురూ చెమ్మచెక్క అని ఆడుకోవాల్సిందే. ఇప్పుడు చెప్పండి వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. నోర్మూసుకుని ఇంట్లోకా లేకపోతే అత్తారింటికా అని ధీరజ్ హీరో లెవల్ లో పంచ్ లు వేస్తాడు.
విశ్వకు వార్నింగ్
హే జంబలకిడి జారు మిఠాయ్ బెయిల్ మీద వచ్చిన విషయాన్ని గుర్తు పెట్టుకుని ఇంట్లో మూలకు కూర్చో లేదంటే తోక కత్తిరిస్తా అని విశ్వకు ధీరజ్ వార్నింగ్ ఇస్తాడు. దీంతో విశ్వ పైపైకి వస్తాడు. విశ్వను రేవతి, శారదాంబ ఆపుతారు. పెళ్లాం నగలు తాకట్టుపెట్టుకుని బతికే వాడని ధీరజ్ ను అని భద్రావతి లోపలికి వెళ్లిపోతుంది.
రివేంజ్ కోసం
రేవతి హారతి ఇస్తుంటే విసిరికొట్టి విశ్వ కోపంతో ఇంట్లోకి వెళ్తాడు. నేను జైలు నుంచి తిరిగొచ్చే టైమ్ కు వాళ్ల కన్నీళ్లను బహుమతిగా ఇస్తారనుకున్నా. కానీ వాళ్ల కుటుంబం సంతోషంగా ఉంది. ధీరజ్ ఎలా రెచ్చిపోతున్నాడో చూశారు కదా అని ఆవేశంతో విశ్వ ఊగిపోతాడు. ధీరజ్ భవిష్యత్ ను, అమూల్య బతుకును నాశనం చేయడం తప్పా నాకు వేరే పని లేదని విశ్వ అంటాడు.
రామరాజు కుటుంబం సంతోషంగా ఉండటం నచ్చలేదు. ధీరజ్ మాటతీరు, వాడి కారు అస్సలు నచ్చలేదు. ధీరజ్ కారు ఎలా కొన్నాడో కనుక్కో. వాడి కారుతోనే వాడికి షాకివ్వాలని సేనాపతికి భద్రావతి చెప్తుంది.
దిగాలుగా ప్రేమ
సీన్ కట్ చేస్తే ఏదో మనసు పడ్డాను కానీ అనే సాంగ్ ను ఫోన్లో వింటూ ప్రేమ ఫీల్ అవుతూ కూర్చుని ఉంటుంది. అప్పుడే వచ్చిన నర్మద ఆ సాంగ్ ను స్టాప్ చేస్తుంది. నా జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుందని ఆ రైటర్ ముందుగానే పాటను రాసి ఉంటాడని ప్రేమ దిగాలుగా చెప్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


