ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 2 ఎపిసోడ్: ధీరజ్ ఫస్ట్ నైట్ ట్విస్ట్-భద్రావతి డ్రగ్స్ కుట్రలో చిక్కుకోబోతున్నాడా? వల్లి నాటకం

Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే జూన్ 2 ఎపిసోడ్ లో ఇడ్లీ బాబాయ్ ను రైస్ మిల్ క్యాషియర్ చేసేందుకు భాగ్యం మరో కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. ధీరజ్ ను పోలీస్ కేసులో ఇరికించేందుకు భద్రావతి స్కెచ్ వేస్తుంది. ప్రేమను ఎస్సై కోచింగ్ కు ఒప్పించేందుకు ధీరజ్ ఫస్ట్ నైట్ కు రెడీ అవుతాడు.

Published on: Jun 2, 2026, 07:49:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 2 ఎపిసోడ్ లో.. లుంగీ కట్టుకుని, చేతికి మల్లెపూలు పెట్టుకుని ఫస్ట్ నైట్ కు రెడీ అవుతాడు ధీరజ్. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంటుంది. దీంతో ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

భాగ్యం, ఇడ్లీ రొమాన్స్

భాగ్యం, ఇడ్లీ బాబాయ్ తమ నొప్పులకు ఒకరికొకరు ఆయింట్మెంట్ పూసుకుంటారు. గట్టిగా దెబ్బలు తగిలాయని ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకుంటారు. అదే సమయంలో శ్రీవల్లి, సుక్కు ఎంట్రీ ఇస్తారు.

కొత్తగా పెళ్లైన జంటలాగా మీ అమ్మానాన్న రొమాన్స్ చూసి తరించమని శ్రీవల్లితో సుక్కు అంటుంది. ఏంటి సడెన్ గా వచ్చారని భాగ్యం అడుగుతుంది. మీ రొమాన్స్ కు అడ్డుపడ్డాన అని వల్లి వెటకారంగా అంటుంది. సరసమా బొందా? తగిలిన దెబ్బలకు ఆయింట్మెంట్ పూసుకుంటున్నామని దెబ్బలను చూపిస్తారు భాగ్యం, ఇడ్లీ బాబాయ్.

వల్లి టెన్షన్

నర్మద, ప్రేమ, ధీరజ్ వచ్చిన విషయాన్ని వల్లికి పేరెంట్స్ చెప్తారు. ఆ విషయం తెలిసి సుక్కు, వల్లి షాక్ అవుతారు. మన శత్రు వర్గానికి ఈ విషయాలు లీకింగ్ అయిపోయాయా? అని వల్లి టెన్షన్ పడుతుంది. నువ్వు కడుపుతో ఉన్నావని మమ్మల్ని వదిలేశారని భాగ్యం చెప్తుంది. ఈ కడుపు నాటకం అని తెలిస్తే నన్ను చంపేస్తారు కదా అని వల్లి భయపడుతుంది.

భాగ్యం కన్నింగ్ ప్లాన్

నర్మద అక్కడ పాతుకుపోయేలా చేశావ్. గీత గీయకుండా ఉంటే నర్మద వెళ్లిపోయేది కదా అని సుక్కును కొడుతుంది భాగ్యం. నర్మద బయటకు వెళ్లినా వల్లిని వదలదని సుక్కు చెప్తుంది. వల్లిని టెన్షన్ పడకుండా ఉండమని భాగ్యం అంటుంది.

ఇక నర్మదకు ప్రసాద్ రావు పెద్ద పెద్ద బీరువాలతో సారె పెట్టాడని, తనకు కూడా పెట్టమని అడగడానికి వచ్చానని వల్లి చెప్తుంది. కానీ మిమ్మల్ని చూస్తుంటే నా కాపురమే కూలిపోయేలా ఉందని వల్లి కంగారు పడుతుంది. మీ నాన్నను రైస్ మిల్ క్యాషియర్ కుర్చీలో పాతుకుపోయేలా చేయాలని మరో కన్నింగ్ ప్లాన్ ను వల్లికి చెప్తుంది భాగ్యం.

మరోవైపు ధీరజ్ ను ఇరికించేందుకు భద్రావతి స్కెచ్ వేస్తుంది. మామిడి పండ్ల బాక్స్ లో డ్రగ్స్ పెట్టి, ఆ బాక్స్ లను ధీరజ్ కార్లో పెట్టేలా భద్రావతి కుట్ర పన్నుతుంది.

ధీరజ్ ఫస్ట్ నైట్

సీన్ ధీరజ్, ప్రేమ గదికి మారుతుంది. లుంగీ కట్టుకుని, చేతికి మల్లెపూలు చుట్టుకొని ధీరజ్ గదిలోకి వస్తాడు. ఆ రోజు కోసం ఇలాగే కదా రెడీ అయింది అని ధీరజ్ సిగ్గుపడతాడు. ఏ రోజురా అని ప్రేమ అడుగుతుంది. ఈ మల్లెపూలు పెట్టుకో, ఈ హల్వా తిను.. ఆ తర్వాత అని ధీరజ్ తెగ మెలికలు తిరుగుతాడు. ఈ రోజు మనకు ఫస్ట్ నైట్ బేబీ అని ప్రేమను దగ్గరకు లాక్కుంటాడు.

ఎస్సై కోచింగ్

అలా ప్రేమను బెడ్ మీద పడుకోబెట్టి పైకి వెళ్తాడు ధీరజ్. ఎస్సై కోచింగ్ కు ఒప్పుకొంటావా? లేదా ఫస్ట్ నైట్ కు ఒప్పుకొంటావా? అని ప్రేమను అడిగి ట్విస్ట్ ఇస్తాడు. అప్పుడే నర్మదను పిలుస్తారు. వీడు ఫస్ట్ నైట్ అని ఏడిపిస్తున్నాడు అక్క అని ప్రేమ చెప్తుంది. స్వాతి ముత్యాన్ని పట్టుకుని ఇలాంటి నిందలు వేయడానికి మాటలు ఎలా వస్తున్నాయో అని ధీరజ్ అమాయకంగా నటిస్తాడు.

ఒప్పుకొన్న ప్రేమ

చేతికి మల్లెపూలు చుట్టుకొని ఎస్సై కోచింగ్ కు వెళ్తావా? ఫస్ట్ నైట్ కు రెడీనా? అని అడిగాడని నర్మదకు ప్రేమ చెప్తుంది. ధీరజ్ అమాయకంగా కనిపిస్తున్నాడని నర్మద నవ్వేస్తుంది. ఈ రాక్షసి దెయ్యం పట్టినదానిలా నన్ను నిద్రపోనివ్వడం లేదని ధీరజ్ ప్లేటు ఫిరాయిస్తాడు. కోచింగ్ ఎప్పుడైనా వెళ్లొచ్చు, ఫస్ట్ నైట్ కు ఒప్పేసుకో అని ప్రేమకు చెప్పి నర్మద వెళ్లిపోతుంది.

ప్రేమ జడలో ధీరజ్ మల్లెపూలు పెడతాడు. హల్వా తినిపిస్తాడు. పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది నీ డ్రీమ్ కదా. అది నెరవేర్చడం నా బాధ్యత. ప్లీజ్ ఒప్పుకో అని ప్రేమను రిక్వెస్ట్ చేస్తాడు ధీరజ్. కోచింగ్ వెళ్లడానికి ప్రేమ ఒప్పుకొంటుంది.

వల్లి డ్రామా

పొద్దున సుక్కు, వల్లి కలిసి ఓ ప్లాన్ వేస్తారు. చందు రాగానే వల్లి డ్రామా స్టార్ట్ చేస్తుంది. నాన్న నాన్న అంటూ ఏడ్చేస్తుంది. ఏమైందని చందు అడుగుతాడు. మా నాన్న ఇడ్లీ అమ్ముతుంటే వడ దెబ్బ కొట్టిందంట బా అని వల్లి డ్రామాను కంటిన్యూ చేస్తుంది. మా నాన్నకు గుండెపోటు కూడా ఉంది. ఎండకు కష్టపడితే పుటుక్కుమనొచ్చని వల్లి ఏడుస్తుంది. అప్పుడే టిఫిన్ పొట్లాలతో ధీరజ్ వస్తాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More